Saturday, May 31, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? భాగం ఆరు



అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? భాగం ఆరు - అమృత బిందు ఉపనిషత్

మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోహో

అన్న ఈ ఉపనిషత్తు లోని ఒక్క వాక్యం తో నే ఈ అమృత బిందు ఉపనిషత్ సారాంశం మొత్తం చెప్పెయ్య వచ్చు !

చిన్నదైన ఉపనిషత్ . సారం అనంతం . అథర్వ వేదం దీనికి మూలం .

రెండు విధములైన మనస్సు . కామం తో కూడి నది కామ వివర్జితమైనది .

నిరస్త విషయా సంగం సంనిరుద్ధం మనో హృది అంటాడు కవి

విషయ వాసనలను వదిలి పెట్టి మనస్సుని హృదయం లో స్థాపితం చేయి అంటాడు .

హృదయం వైపు మళ్లించిన మనస్సు అందులోనే నిబిడీకృతం అయితే ఇక ధ్యాన పరాకాష్ట
చెందినట్టె మరి అనుకుంటా .

(నాసదీయ సూక్తం లో --> హృది ప్రతీష్యా కవయో మనీషా అన్న ఒక వాక్యం వస్తుంది .
హృదయ్యాని శోధించి వాళ్ళు కనుక్కున్నది అన్న అర్థం లో -)

ఆ మనస్సుని హృదయం వైపు మళ్లిస్తే మన పని అయి పోయినట్టే ఇక ! ఇదే ధ్యానం ఇదే జ్ఞానం
మిగిలిన వన్నీ తర్క వితర్కములు ! (న్యాయశ్చ విస్తరః !)

"నిష్కల , నిర్వికల్ప , నిరంజన ,నిర్వికల్పమనంత , హేతు దృష్టాంత వర్జిత అప్రమేయ అనాది బ్రహ్మ !

తత్ బ్రహ్మ నీవే నని తెలుసుకో !

ఇక జాగ్రత్, స్వప్న సుషుప్తి అన్న మూడు కాలం లో ను ఉన్నది ఒకే ఆత్మా అని చెబ్తుంది ఈ ఉపనిషత్

ఏక ఏవ ఆత్మా మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు
స్థాన త్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే !

ఈ త్రివిధావాస్థల కావల వెళ్ళిన వాడికి ఇక పునర్జన్మ లేదు !

గవమనేక వర్ణానాం క్షీరస్య ఆపి ఏక వర్ణ తా !

గోవులు పలు రంగులలో ఉన్నా  (గ్రంథములు అనేకములైనా ) పాలు ఒక రంగే ! (జ్ఞానం ఒక్కటే !)

ఏక ఏవహి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః !
 
 
 
 
శుభోదయం
జిలేబి 
(జిలేబి అనేక రూపాణాం తద్వస్త్యపి ఏకమేవయోహో ) !

1 comment:

  1. గోవులు పలు రంగులలో ఉన్నా (గ్రంథములు అనేకములైనా ) పాలు ఒక రంగే ! (జ్ఞానం ఒక్కటే !)

    ReplyDelete