Friday, June 20, 2014

ఈ మధ్య 'బ్లాగ్గెలకటానికి' అస్సలు బుద్దేయ్యటం లేదండీ మరీను !!

ఈ మధ్య 'బ్లాగ్గెలకటానికి' అస్సలు  బుద్దేయ్యటం లేదండీ మరీను !!

ఏమోయ్ జిలేబి ఈ మధ్య టపాలు గట్రా గెలకటం లేదు ? మా అయ్యరు గారు ప్రశ్నించేరు !

ఆ అన్నా పరాకుగా .

ఏమిటీ మరీ బిజీ అయిపోయావా ? ఇంతకు ముందైతే రోజుకో టపా బర బరా లాగించి పడేసే దానివి మరి ఈ మధ్య ఏమిటి వారానికో టపా కూడా రాయటం లే మరి ?  మళ్ళీ ఎగదోసేరు అయ్యరు గారు !

"
ఈ మధ్య 'బ్లాగ్గెలకటానికి' అస్సలు  బుద్దేయ్యటం లేదండీ మరీను !! " వాపోయా !!

ఏమోయ్ ఎందుకు ?

అదే అస్సలు తెలియటం లేదండీ

ఏమీ మేటరు లేదా ?

ఏమీ 'సరకు' లేదా సత్తా లేదా అన్నట్టు అనిపించి ముక్కు పుటా లెగురేసా !

ఆ మేటరు లేక ఏమిటి ! అస్సలు ఏది రాయాలని కూర్చున్నా 'అబ్బే , మనం ఈ టపా రాసి ప్రయోజనం ఏమిటి ?' అని పిస్తోంటేను !

ప్రయోజనం మాటెందుకు జిలేబి ! రాయాలను కుంటే రాసి 'పడెయ్యాలి'  గాని మళ్ళీ అయ్యరు గారి ప్రోచ్చ !!

అంతే అనుకోండీ ! అయినా ఈ మధ్య ఏమిటో మరీ ఈ నిర్వేదం ' హుస్సూరు మన్నా !

నిర్వేదం ఎందు కోయ్ ?

ఏమని చెప్పుదు ? అస్సలు రాద్దామని కీబోర్డు పై వ్రేళ్ళు తాకిస్తే వ్రేళ్ళు కదిలితే నా మరి ?

అంటే ఏమిటోయ్ ?

ఇంతకు ముందు ఏమీ ఆలోచించే దాన్ని కాదు ! టపా పరుగు లిట్టేది . ఈ మధ్య ఆలోచిస్తా ఉండా అస్సలు టపా ముక్క అంటే ముక్క కూడా ఊడి పడటం లేదాయే !!

ఔరా ! అట్లా అయితే ఆ ఆలోచనలని కట్టి పెట్టి మూట కట్టి 'కూవం' రివర్ లో పడేసి , కుదేసి ఆలోచనలు ఏవీ లేక టపాలు బర బరా గీకేయి ' అయ్యరు గారు సలహా పడేసేరు

అంతే నంటారా ? చదివే వాళ్ళ గురించి ఆలోచించ కూడదా మరి ?

ఆ నీ బ్లాగు చదివే వాళ్ళు కూడా ఉన్నా రంటారా జిలేబి ??

మంచి ప్రశ్నే !!

అస్సలు బ్లాగులకి కాలం తీరి పోయిందా ? ఒరిజినల్ మేటరు కి కరువోచ్చిందా ??

ఏమో మరి బ్లాగు కాలం ఇంకా ఎంత కాలం ఉంటుందో మరి !!


చీర్స్
జిలేబి  

1 comment:

  1. టపాలు వ్రాయకపోతే మానె. కామెంట్లయినా కొట్టండి. మూడొస్తుందేమో!

    ReplyDelete