Wednesday, June 25, 2014

నల్ల ధనము రంగు ఎట్లా ఉండును ??

నల్ల ధనము రంగు ఎట్లా ఉండును ??

నల్ల పిల్ల అంటాడు అరవ హీరో తెలుగు హీరొయిన్ తో !

అంటే ??

బ్లాకు గర్లు అన్న మాటా ??

మంచి అమ్మాయి అని కదా ఈ అరవం వాళ్ళ అర్థం ??

మరి నల్ల ధనమంటే ?? మంచి ధనమే కదా !!

అదేమిటో ఈ జనాలకి ధనం కావాలి కాని అది నల్ల ఐతే ఏమి తెల్ల ఐతే ఏమి ??

ధనం మూలం ఇదం జగత్తు కాదా ?

ఏవిటో ఈ పిచ్చి మరి !!

స్విస్సు నించి జనాల ధనం వస్తే దేశం బాగు పడుతుందని నమ్మకం !!

రాష్ట్రం కోసం చంద్ర బాబు నాయుడు హైదరాబాదు త్యాగానికి కట్టిన వెల రమారమి పదమూడు పాయింటు రెండు లక్షల కోట్ల రూపాయలు (ఆ పాయింటు రెండు నా కర్థం కాని విషయం - చెబ్తే పదమూడు లక్షల కోట్లు అని చెప్ప వచ్చు - కాదూ కుదరదూ అంటే పదునాలుగు లక్షల కోట్లు అని చెప్ప వచ్చు - కాని అంత ఖచ్చితం గా పదమూడు పాయింటు రెండు లక్షల కొట్లంటే మరీ విడ్డూరం గా లేదూ ??)

మరి ఈ నల్ల ధనం ఏమో పద్నాలుగు వేల కోట్లంటా !! మన నాయుడు గారు చెప్పిన హైదరాబాదు నగరం ఖరీదు లో లక్షలో ఒక వంతాయే !!

అంటే మరి దేశం లో ఈ లక్షలో ఒక వంతు డబ్బు వస్తే దేశ పరిస్థితి మరీ బాగు పడి పోతుందని చెప్పడం సబబే ??

ఏమిటో ఈ చాదస్తం జిలేబి

నల్ల ధనం ఒక రూపాయి అయినా 'నల్ల' ధనమే గదా మరి అంటారా !! అయితే ఇక ఆ పాయింటు కి అసలు తిరుగే లేదాయే మరి !!

చీర్స్
జిలేబి

2 comments:

 1. నల్లధనము రంగు నల్లగా నుండదు
  తెల్లధనము రంగు తెలుపుగాదు
  ధనము రంగు కాదు ధనికుల హృదయాల
  రంగు తెలుపు నలుపు రామచంద్ర

  ReplyDelete
  Replies
  1. తెల్లావు కడుపులో నల్లావు పుట్టదా అన్నట్టు తెల్ల ధనం నుండే నల్ల ధనం పుడుతుందేమో!

   Delete