Wednesday, June 4, 2014

పెండ్లాం సెండాఫ్ - 'నరసింహ' జిలేబీయం !


పెండ్లాం సెండాఫ్ - 'నరసింహ' జిలేబీయం !

మా (మీ)  మీడియా వాళ్ళు ఈ మధ్య గవర్నర్ గారిని 'ఏమండీ , మీ శ్రీమతి కోసం ఏర్పోర్ట్ వెళ్లి సెండాఫ్ ఇచ్చారు . అదెట్లా మీరు ఏర్పోర్ట్ వెళ్లి సెండాఫ్ ఇస్తారు ?" అని రెట్టిస్తే ,

ఆయన మూడు రెండింతలు 'డమాల్' అయ్యి , 'నా పెండ్లానికే కదా సెండాఫ్ ఇచ్చా ' అన్నారట !

మన మీడియా వాళ్ళు కూడా తక్కువా ? పదవి లో ఉన్న వాడు ఫాయికానా కి వెళ్ళినా వాళ్లకి న్యూస్ మరి !

గవర్నరు గారు గుడి కి వెళితే , వామ్మో వామ్మో గవర్నరు గారు గుళ్ళకి అదేమిటో మరీ వెళుతున్నారు అని రాస్తారు . అందులో ఏదో మరీ ఆ గుళ్ళకి ఆయన ఫేవర్ ఇచ్చేస్తున్నట్టు !!

నత్త బాధలు నత్తవి పీత బాధలు పీతవి అని అట్లా క్రిటికల్ పదవి లో ఉన్న వాళ్ళు తమ బాధ గోడు చెప్పు కోటానికి ఎవరో దొరకరా అని ఆ పెరుమాళ్ళ కి మొరబెట్టు కోడాని కి వెళితే మీడియా వాళ్లకి మసాలా వార్తలకి కొదవా మరి !

నిన్న నే తెలంగాణా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆలి మస్జీదు కెళ్ళార ట పదవి లోకి వస్తూనే ! మీడియా వాళ్ళు ఆయన వెంటపడి న్యూస్ సంపాదించేరు !!

మన నాయకులకి ఫాయి కానా ఇంట్లో నే ఉండి పోవడం ఎంత సౌలభ్య మైన విషయమో చూడండి మరి ! వాళ్లే ఫాయికానా కోసం 'సులభ్' రావలసి వస్తే ఇక మీడియా వాళ్లకి ఎంత ఎంత వార్తలు వచ్చెను మరి !! ??

ఈ మధ్య సులభ్ వాళ్ళు దేశం లో రేపు లకి మూల కారణం ఇంట్లో ఫాయి కానా లు లేక పోవడమే అని టాయిలేట్టు భజాయించి మరీ వక్కాణించారు !

కాబట్టి నేతలారా , ఈ నేపధ్యం లో ఈ విషాన్ని గురుంచి తీవ్రం గా ఆలోచించండి !!


జిలేబి

5 comments:

  1. Replies

    1. శర్మ గారు,

      మూడు బ్రాకెట్ల ఆట మొదలెట్టేరు !!

      జిలేబి

      Delete
  2. ఆయన మూడు రెండింతలు 'డమాల్' అయ్యి , 'నా పెండ్లానికే కదా సెండాఫ్ ఇచ్చా ' అన్నారట !
    >>
    షిండే లాంటి వారికి ఉన్నట్టు పాపం నరసిమ్హన్ గారికి పరపత్నులు లేరేమో :-P)

    ReplyDelete
    Replies


    1. హరి బాబు గారు,

      ఇట్లా ఫేడేల్ మంటే ఎట్లా మీరు !! అర్థం చేసుకోరూ !

      జిలేబి

      Delete
    2. మీరు అన్ని సార్లు డమాల్ దమాల్ అనిపించేసరికి బుర్ర కొంచెం గోల్మాల్ అయ్యి గుర్తుకి రాకూదని వాళ్ళు గుర్తుకొచ్చి...

      Delete