Friday, June 6, 2014

నక్షత్ర కన్యల మోహన రాతిరి !

 
అందమైన చందురూని చూసి
నక్షత్రాలు కిసుక్కున నవ్వేయి
చందురూడు సిగ్గు పడి
మేఘాల మాటున నక్కేడు
 
నక్షత్ర కన్యలు దీనం గా
మేఘం వైపు చూసేయి
మేఘరాజు తననే అనుకుంటూ
ఆనందం గా కురిసేడు
 
మబ్బుల మాటు చందురూడు
చప్పున బయట పడి
నక్షత్రాలకి దొరికి పోయేడు
నక్షత్ర కన్యలకి మోహన రాతిరి !!
 
 
శుభోదయం
జిలేబి
నక్షత్ర కన్యల మోహన రాతిరి !

No comments:

Post a Comment