Sunday, October 19, 2014

మంచ్ పర్ విరాజ్ మాన్ .... !!

మంచ్ పర్ విరాజ్ మాన్ .... !!

ఈ పై వాక్యం వింటే నే మీకెవరు గుర్తొస్తారు ?

అట్లాగే మన బ్లాగు లోకం లో కూడా ఇట్లాంటి స్టాండర్డ్ వాక్యాలు టపా రూపేణా కాకుంటే , కామెంటు రూపేణా రాసే వాళ్ళు ఉన్నారు . ఉదాహరణ కి 'చీర్స్' చెప్పందే జిలేబి సైన్ ఔట్ చస్తే చెయ్యదు !! ( ఈ విడ గారు అదేమి భాషో గాని, 'టపాలు' కట్టేస్తూ ఉంటారు ! ఎవరి కి టపా కడుతున్నా రండీ అని ఆ మధ్య ఒక పెద్దావిడ/పెద్దాయన జిలేబి 'కాలు' లాగేరు కూడాను !)

సరే ఇట్లాంటి మరో కొన్ని నేను గమనించి నవి !!

శంకరాభరణం బ్లాగు లో తరచు గా కని పించేది - 'అందరి పూరణలు అలరించు చున్నవి కాకుంటే అందరి పూరణలు అలరింప నున్నవి ( తనే మొదటి కామెంటు దారు డైతే!) అంటూ ప్రతి రోజూ కనిపిస్తుంది !!

ఇక రెండు చుక్కలూ మూడు బ్రాకెట్లు సర్వ సాధారణం ::))) !!

మరో పద జాలం - స్వస్తి !! ఎక్కువగా ఈ 'గోదారి' తీరం వాళ్ళ టపాల లో ఈ 'చివరాఖరు' వాక్యం స్వస్తి ! (అన్జెప్పి మళ్ళీ మరో రోజు టపా కి వీళ్ళు రాయడం మొద లెడ తారని నా ప్రగాఢ విశ్వాసం - వారి టపా శర పరంపర లని జూసి!)

ఇక ప్ర జ బ్లాగు లో నైతే చెప్ప లేనంత వెరైటీ ! ఒక వాక్యం ఇట్లా అట్లా రాస్తే చాలు - వెంట నే రయ్యని ఆ వాక్యాని పట్టేసు  కుని 'ఝాడూ' లాగించే స్తారు కొందరు 'బడు'ద్దాయిలు!(!)

మరి ఈ 'ఆండో ళ్ళ' బ్లాగు ల కైతే మరిన్ని గుభాళింపు లు సొగసులు ఉంటాయి ! అక్కయ్య గారు మీ టపా ఇవ్వాళ నా కన్నులని తెరిపించింది అనో కాకుంటే ,  అమెరికా వాసుల ట్రావేలోగ్ లైతే , ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ అనో కామెంటు ఉండనే ఉంటుంది !

పద్మార్పిత గారి బ్లాగు ల కైతే, మరీను - ఆహా ఒహో అనని రోజే ఉండదు ! ( వీరి బ్లాగు కి మరో 'ఫ్యాను' బ్లాగు కూడా ఉన్నాడని సీక్రేట్ ఏజెంట్ జిలేబి ఉవాచ!) వారి కవితలకి బొమ్మల మేజిక్కు కి 'దాంతో' తలే ఉంగలీ' దబాయించని వారు ఉండనే ఉండరని లోకోక్తి !)


కొన్ని 'కామ్రేడ్' బ్లాగులు ఉంటాయి - వాటికి తెలంగాణా బ్లాగులని ఈ మధ్య కొంత టైటిలు పెట్టేరు ! ఏ మాత్రం అట్లా ఇట్లా తప్పు గా జెప్పినా వెంట నే 'ఉప్పెన' వచ్చేస్తుంది ! తె అన్న పదం కనిపిస్తే చాలు ఎవరక్కడ, ఏమి 'కూస్తూ' ఉన్నా రంటూ వెంట నే రయ్యని 'పటాలం' వచ్చేస్తుంది !

మరి కొన్ని కట్ పేష్టు బ్లాగులు ఉంటాయి ! వీటికి అప్పుడప్పుడు డోసులు పడుతూ ఉంటాయి - ఓయ్, ఇవన్నీ కాపీ టపాలు కదా అని ఎవరో ఒకరు 'సూక్ష్మం' కన బెట్టేస్తూ ఉంటారు ! పాపం ఆ 'కట్ పేష్టు వారికి ఏమి చెయ్యాలో తెలీక బ్లాగు ల్ని మూసేసు కుని వెనుక రహస్యం గా 'పేష్టు' టేష్టు లాగించేస్తో ఉంటారు !

మరి కొందరు 'యోగీశ్వరులు' ఉంటారు ! వారు రాసేదే మనం చదవాలి ! అంతే ! వారి టపా కి కామెంటు కాకుంటే , మన యొక్క అభిప్రాయాలు తెలియ జెప్పా లనుకుంటే ప్చ్ కుదరదు !

ఇట్లా రాసు కుంటూ నేనే 'పోతా' ఉంటె, మీ కంతా పని వేరే ఉండదు !

జిలేబి కి మిగతా వారికి పని అప్ప జెప్పక పోతే నిదుర రాదు !

కాబట్టి ఇక్కడితో దీనికి 'స్వస్తి' పలికి మీరు ఇట్లాంటివి గమనించి ఉంటె ,వాట్ని  ఈ కామెంటు మెతుక లో ఇక్కడ గట్టి గా 'పెష్టే స్తారని' ఆశిస్తో !!

ఇవ్వాళ్టి జిలేబి ఈ టపా పరి సమాప్తం !!చీర్స్
జిలేబి

4 comments:

 1. లెస్సు లెస్స బలికితిరి

  ReplyDelete
  Replies


  1. లెస్సు లెస్సు!! శర్మగారు ! నెనెర్లు !!

   జిలేబి

   Delete
 2. చీర్స్. చీర్స్..

  ReplyDelete
  Replies

  1. రెండు చుక్కలు మూడు బ్రాకెట్ల చీర్స్ బోనగిరి గారు !

   జిలేబి

   Delete