Monday, November 10, 2014

నా ఆత్మ కథ రాస్తున్నా!!!


ఏమోయ్ జిలేబి మరీ సీరియస్సు గా బర బర టైపాడిస్తూ ఉన్నావ్ అయ్యరు గారు పృచ్చ !


నా ఆత్మ కథ రాస్తున్నా చెప్పా మా అయ్యరు గారితో

అంటే ఏమిటీ ? బ్లాగు లోకం నించి విరమణా  ? అయ్యరు గారు మరో పృచ్చ !

అదేమిటండి ! మా మంచి బ్లాగు లోకం ! ఏదో అని వెలగ బెడుతున్న 'జనారణ్య'  ఉద్యోగం తో బాటు 'బాతాఖానీ', పని లేక , కాలక్షేపం కబుర్లు అప్పుడప్పడు రాసేసు కుంటూ ఏదో నా మానాన నేను బతికేస్తూ ఉంటె , మీరేమో ఉద్యోగానికి రాజీ నామా అంటారు  అడిగా మా అయ్యరు గారిని .

ఈ మధ్య ఈ వాక్యం 'ఆత్మ' కథ అన్న మాట వింటూంటే , వెంటనే రిటైర్ మెంటు గుర్తు కోచ్చేస్తోంది అదేమిటో మరి !
జేప్పేరు అయ్యరు గారు .

నా ఆత్మ కథ రాస్తున్నా అని ఎవరైనా 'టెండర్' పెడితే, టెండూల్కర్ గుర్తు కోచ్చేస్తున్నాడు !

ఈ మధ్య సానియా మీర్జా ఆత్మ కథ రాస్తున్నా అంటే , ప్చ్ పాపం ఈ అమ్మాయి కి రిటైర్ మెంట్ ఏజ్ వచ్చేస్తోంది అన్న మాట అనుకున్నా !!

ఆ మధ్య వరుస బెట్టి గవర్న మెంటు లో ఉన్న వాళ్ళు రిటైర్ అయ్యి, 'మీ' మేడం' గార్ని 'ఏకి' పెట్టేరు !

మళ్ళీ నువ్వూ రిటైర్ అయి ఎవరెవర్ని 'ఏకు' తావో ' .... అయ్యరు గారు సాగించేరు !


వామ్మో వామ్మో, రిటైర్ మెంటు అయ్యే ఉద్దేశ్యాలు నాకు లేవండి !

ఈ టపా వెనక్కి లాగేసు కుంటున్నా ! నా ఆత్మ కథ రాయడం లేదు !!

ఆకతాయి
జిలేబి

4 comments:

  1. సానియా మిర్జా ఆత్మకధ కూడా ఎవరో కొందర్ని ఏకిపారేయడానికేనేమో అని నాకు అనిపిస్తుంది.

    చీర్స్ టు గుంటుర్‌సిటి

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. మీరు కూడా మీ ఆత్మకథను వ్రాస్తే బాగుంటుంది. అంటే వ్రాయమని నా ఉద్దేశం అన్నమాట. ఇందులో నా స్వార్థం ఏమిటంటే, ఎక్కడో అక్కడ శ్యామలీయం ప్రసక్తి కూడా తీసుకొస్తారూ అప్పుడు నా పేరు నిఝంగానే అచ్చులో వస్తుందీ అని.

    మరేమో తీరా మీరు ఈ టపా నెత్తిన 'నా ఆత్మ కథ రాస్తున్నా' అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసినా, టపాసారాశం అల్లా ఆ పని విరమించుకున్నారని చెబుతోంది అందుకని డిజప్పాయింట్‍మెంట్ అన్నమాట.

    పోనీలెండి, ముందుముందు మనసు మారి రాయకపోతారా అని అనుమానం కూడా ఉందనుకోండి.

    ఒకవేళ మీరు వ్రాయకపోయినా నేనే నా ఆత్మకథ వ్రాయవచ్చును. అప్పుడు మీ పేరు ఉటంకించబడును లెండి. ఐతే ఒకానొక అనుమానం ఏమిటంటే చదివే వాడెవడన్నా ఉంటాడా అని! సచిన్ గారి ఆత్మకథకి ఐతే ఇప్పటికే లక్షలాది ప్రతులకు ఆర్డర్లు వచ్చేసాయట. నా బోటిగాడు వ్రాస్తే అది చేతిచమురుభాగోతమే అన్నదే నా అనుమానం.

    చిన్నప్పుడు కవిత్వం బదులు క్రికెట్టే సాధన చేసి ఉందును కాని అప్పుడు మాస్కూల్లో తెలుగుమాష్టర్లే కాని క్రికెట్టుమాష్టర్లు లేనేలేరు. చూసారా ఎంత నష్టపోతున్నామో క్రికెట్టు నేర్చుకోక!

    టపటపా కొట్టే వాడికే కీర్తి కాని టపాలు కొట్టే వాడికేదమ్మా కీర్తి. అందుకే ఆత్మకథ ఒకటా అని నిరాశ అన్నమాట.

    హెడ్డింగ మా చెడ్ద క్యాచీగా ఉంటే ఏమన్నా పనౌతుందంటారా? 'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగీ' అని పుస్తకం కొడితే అది భూగోళం చుట్టేస్తోందింకా. ఇహ అలాంటివి ఒకటో రెండో కనిపిస్తున్నాయి 'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏన్ అన్నోన్' అనొకటీ. 'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏన్ ఇడియట్' అనొకటీ. చెరో పేరుతోనూ వ్రాసేద్దాం అంటే నేను రెడీ. ఎందుకైనా మంచిది బ్లాగుకే పరిమితం చేదాం ప్రస్తుతానికి. ఏమంటారు?

    ReplyDelete
  4. అదేంటో...మీరు ఆత్మకధ రాస్తున్నా అని అంతే నాకు మాత్రం ఇంకోలా అనిపించింది :-)
    ఏదో ఒకటి రాసేద్దురూ

    ReplyDelete