Saturday, November 15, 2014

ఫ్లాష్ ఫ్లాష్ !మాలిక లో నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదు ! భోరు మన్న జిలేబి !


ఫ్లాష్ ఫ్లాష్ !మాలిక లో నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదు !
భోరు మన్న జిలేబి !

ఏమోయ్ జిలేబి మరీ అట్లా ముక్కు చీదేస్తున్నావ్ ! అయ్యరు గారు పృచ్చ !

జిలేబి ముక్కు చీదేస్తూ, భోరు మంది ! కళ్ళ లో కన్నీళ్లు కారి పోతున్నాయి

ఇదిగో జిలేబి చెప్పి ఏడువు ! నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అస్సలు తెలీకుండా నేనేమి సహాయం చేసేది అయ్యరు గారు విసురు కున్నారు , కసురు కున్నారు

నా కామెంట్లు , నా కామెంట్లు .... మరో మారు ముక్కు చీదింది జిలేబి

అయ్యరు గారి గుండె గల్లంతయ్యింది ! ఈ జిలేబి కామెంటు పక్షి ! దీని కామెంట్లు ఏమయ్యాయో అనుకునేరు !

జిలేబి స్వాంతనం గా పలికేరు అయ్యరు వారు - నీ కామెంట్ల కేమయ్యింది జిలేబి అడిగేరు బుజ్జాయిస్తో .


నా బ్లాగు కామెంట్లు మాలిక లో , వ్యాఖ్యల క్రింద కనిపించడం లేదండి !! జిలేబి కన్నీరు మున్నీరైంది !

నీ టపాలు మాలికలో వస్తున్నాయా ?? అయ్యరు గారి పృచ్చ !

అవునండి !

హమ్మయ్య కొంతలో కొంత మేలు ! సో ఓన్లీ కామెంట్లు అంతే గదా ఓస్ ! చెప్పేరు అయ్యరు వారు

వాట్ ! ఓన్లీ కామెంట్స్ అంటారా ! కామెంటే కదా మనకి భోజనం! అట్లాంటి కామెంట్లు మాలిక లో రాక పోతే నా కెంత
'క్లిక్కులు' తక్కువై పోయేయి !! మళ్ళీ ముక్కు చీదింది జిలేబి

జిలేబి - ఈ మాలిక నువ్వు బ్లాగు మొదలెట్టి నప్పటి కన్నా ముందే ఉన్నది ! అప్పట్నించి అంటే ఓ మోస్తరు నాలుగు సంవత్సరాలు ఈ విషయం తెలీకుండా హ్యాపీ గా ఉండి పోయేవు ! ఇప్పుడు ఎట్లా నీకు తెలిసింది ?

విన్న కోట వారు జేప్పేరు ! మాలిక లో నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదని జెప్పింది జిలేబి .

అయ్యరు గారు ప్రార్థించేరు !

"పంచ దశ లోకంలో ఉన్న పరమ మాలిక!
వినుము ఈ బ్లాగు బందీ జిలేబి విన్నపము !
తన బ్లాగు కామెంట్లు మాలికలో వచ్చేటట్టు జేయుము ! --> ఆమెన్''!


విన్నపాలు వినవలెను వింత వింతలూ !!

జిలేబి
(దురదస్య దురదః జిలేబి నామ్యా దురద గొంటాకుహ )!

7 comments:

  1. జిలేబిలో తీపి ఎక్కువై ఏ చీమలో ఎత్తుకుపోయుంటాయి.

    ReplyDelete
    Replies

    1. భలే వారండీ చౌధరీ గారు,

      చీమలెత్తుకు పోయినా అది మరి మాలికలో కనబడాలి కదా మరి !!

      జిలేబి

      Delete
  2. జిలేబి బ్లాగు కామెంట్లు కనిపించకపోవడమా? అన్యాయం. దీన్ని నేను ఖండిస్తున్నాను.
    (అన్నట్టు నా బ్లాగుకి వచ్చే ఒకటీ, అరా కామెంట్లు కూడ మాలికలో కనపడలేదు.)

    ReplyDelete
    Replies

    1. హమ్మయ్య, బోనగిరి గారు,

      గుండె దిటవు పడే! ఇది నా ఒక్క ప్రాబ్లెం మాత్రం కాదు అని తెలిసి నందులకు !

      మాలిక వారు మరి నిదుర లేచారో లేదో మరి !!

      జిలేబి

      Delete
    2. అయ్యో! ఇప్పుడు కూడలి, మాలికలలో నా టపాలు కూడ కనపడడం లేదు. వాళ్ళకి మెయిల్ ఇచ్చినా సమాధానం లేదు.

      Delete
  3. మీక్కూడా కామెంట్ల కండూతి (కీర్తి కండూతి లాగా) ఉన్నదన్నమాట!

    ReplyDelete
    Replies

    1. శ్రీనాథ్ గారు,

      'మీక్కూడా' అంటూ దీర్ఘం ఏమిటండి ! అసలు జిలేబి కి కామెంట్లే ఆహారం! భోక్తారం యజ్ఞ 'టపా' సా అని శ్రీ కృష్ణ పరమాత్ములు గీత లో జిలేబి ని ఉద్దేశించి చెప్పేరు కూడాను !!

      టపా శాలువ కి కామెంటు కండువా సరిజోడు !

      జిలేబి

      Delete