Saturday, January 17, 2015

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం ఏడు

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం ఏడు 
 
అమృత నాద ఉపనిషత్ - కృష్ణ యజుర్వేదం నించి 
 

అష్టాంగ యోగ గురించి విపులం గా విని ఉంటాము .

ఈ అమృత నాద ఉపనిషత్  షట్ అంగ (ఆరు అంగములు ) యోగం గురించి చెబ్తుంది

యోగం యొక్క ఆరు అంగములు - (వీటిలో ఐదు పతంజలి అష్టాంగ యోగ పధ్ధతి లో భాగమైనవి)

ప్రాణాయామ ,ప్రత్యాహార, ధారణ, ధ్యాన , తర్క , సమాధి

 ప్రత్యాహారః తథా ధ్యానం ప్రాణాయామః తథ ధారణ !
తర్కశ్చైవ సమాధిశ్చ షడంగో యోగ ఉచ్యతే !!


యోగ అభ్యాసి ఓంకార రథం ఆరోహించి విష్ణువే సారథి గా బ్రహ్మ  లోక పదాన్వేషి అయి ఉండాలి. గమ్యం చేరాక ఇక ఆ రథం కూడా విడిచి పెట్ట గలిగి ఉండాలి

ఇంద్రియ కృత్య దోషా లను నివారించు కోడానికి ప్రాణాయామ ఉపయోగ పడుతుంది అంటుంది ఈ ఉపనిషత్

యథా పర్వత ధాతూనాం దహ్యంతే ధమనాన్మలాః
తథ ఇంద్రియ కృతా దోషా దహ్యంతే ప్రాణ నిగ్రహాత్ !!


ప్రశాంత త లక్షణం గురించి చెబ్తూ - అంధ వత్ పశ్య రూపాణి అంటుంది ఈ ఉపనిషత్

అంధ వత్ పశ్య రూపాణి శబ్దం బధిరవత్ శృణు
కాష్టవత్ పశ్య తే దేహం ప్రశాంతస్యేతి లక్షణా !!


అట్లాగే సమాధి గురించి చెబ్తూ - ఆగమస్య అవిరోధేన (దేనికి  విరోధం కానిదైన ?) 
సమ అధి అవడం అంటుంది .

ఇట్లా 'థియరీ' మాత్రమె కాకుండా ప్రాక్టికల్ గా ఎట్లా చేయాలో కూడా ఈ ఉపనిషత్ చెప్పడం ఇందులో విశేషం గా కనిపిస్తుంది .

ఇక అభ్యాసం ఎట్లా చేయాలి అని చెబ్తూ - పద్మకం స్వస్తికం భద్రాసన వీటిల్లో ఏదేని ఒక ఆసనాన్ని స్వీకరించి యోగ అభ్యాసం చేయమని చెబ్తుంది . 

నిబద్ధత తో అభ్యాసం గావిస్తే మూడు నెలల్లో జ్ఞానం స్వయం గా వస్తుందని ఉద్ఘాటి స్తుంది

నాలుగో నెల లో పశ్యతే దేవాన్ ఐదో నెలలో తుల్యవిక్రమః అవుతాడు కూడాను .

ఆరవ నెలలో ఇచ్చా కైవల్యం ఖచ్చితం .

స్వయం ఉత్పధ్యతే జ్ఞానం త్రిభిర్మాసై  న సంశయః
చతుర్భిహి పశ్యతే దేవాన్ పంచభిహ్ తుల్య విక్రమః
ఇచ్చయాప్నోతి కైవల్యం షష్టే మాసి న సంశయః


విశేషం గా ఇందులో ప్రాణమునకు ప్రాణమైన ప్రాణం యొక్క ఒక కొలమాన పరిచయం 'త్రింశత్ పర్వాంగుళః ప్రాణః ' అని వస్తుంది .
ఒక అంగుళం లో ముప్పై వ వంతు (త్రింశత్ పర్వాంగుళః)  ప్రాణస్య ప్రాణం కొలమానం?


త్రింశత్ పర్వాంగుళః ప్రాణో యత్ర ప్రాణః ప్రతిష్టితః
ఏష ప్రాణ ఇతి ఖ్యాతో బాహ్య ప్రాణస్య గోచరః
 

అశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ
లక్షశ్చైకోన(లక్షశ్చ ఏకోన ?)  నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః


శతం చైవ సహస్రాణి త్రయోదశ లక్షశ్చ ఏకో =  నిశ్వాసాలు = 1,13,100  .  ఈ లెక్ఖ కి ఆధారం ఏమిటి ?

ప్రాణ , అపాన వాటి రంగుల గురించి ఈ ఉపనిషత్ చెబుతుంది =

ప్రాణ = రక్తవర్ణ మణి ప్రకీర్తితః !
అపాన - ఇంద్ర గోప సమ ప్రభ ! - ఇంద్ర గోప =  ఆరుద్ర పురుగు - పట్టు పురుగు !
(అపాన ప్రాణ మధ్యమం లో ఉంటుంది ?)

సమాన - ప్రాణ అపాన మధ్య లో - గోక్షీర ధవళ ప్రభ లా = తెలుపు రంగులో ?
ఉదాన - ఆపాండుర - (పాండు వర్ణం? - Slightly pale in color?)
వ్యాన = అర్చి  సమ ప్రభః

(According to Sivanandaonline.org its Archil? -
Vyana resembles the colour of archil - that of ray of light).

Quote from Sivanandaonline.org

THE COLOUR OF PRANAS

Prana is said to be of the colour of blood, red gem or coral.
Apana, which is in the middle, is of the colour of Indragopa
(an insect of white or red colour).
Samana is of the colour between that of
pure milk or crystal or of oily and shining colour,
i.e., of something between both Prana and Apana.
Udana is of Apandura (pale white) colour and that of
Vyana resembles the colour of archil (or that of ray of light).

కొంత పదాల పొందు లతో - అబిజాయత , అభిజాయత అన్న పద జాలపు విరుపు తో ఈ ఉపనిషత్ ముగుస్తుంది !

యస్య ఇదం మండలం  భిత్వా మారుతో యాతి మూర్ధని |
యత్ర తత్ర మ్రియెద్వాపి న స భూయొ అబిజాయతె |
న స భూయొ అభిజాయత |


English Translation - Link
http://www.yogavision.in/articles/a166795f-62b2-4f94-bc7d-507c8efc3993.aspx
Full Sanskrit PDF - Link
http://sanskritdocuments.org/all_pdf/amritanada.pdf


శుభోదయం 
జిలేబి 

22 comments:

 1. It is not that easy to understand, I l try again and again

  ReplyDelete
 2. నిమిషానికి పదునాల్గు శ్వాసలు. ఇలా జరిగితే మానవుని జీవిత కాలం వంద సంవత్సరాలంటున్నారు పెద్దలు. అలాగే స్వాసలు తగ్గి నిమిషానికి రెండే స్వాసలు తీసుకునే తాబేలు వందల సంవత్సరాలు బతుకుతుంది.
  ఈ లెక్కకి ఆధార్ం తెలుసుకోవలసిందే. ఉఛ్వాసలేనిది నిశ్వాసలేదు కదా!

  14 X 60 X 24=20,160 per day for a healthy man.

  Some more details are required.

  ReplyDelete

 3. కష్టే ఫలే వారు,

  లెక్ఖ ఏమన్నా తేలిందాండీ ??

  జిలేబి

  ReplyDelete
 4. లెక్క కుదరటం లేదండి, ఎక్కడో తిరకాసుంది అర్ధం కావటం లేదు.

  ReplyDelete
  Replies
  1. కష్టే ఫలే వారు,

   కొద్ది గా ఊహాగానం చేస్తున్నా .

   ఆశీతిశ్చ అన్నది కొంత తప్పులా కని పిస్తున్నది. మరి కొన్ని సంస్కరణ ల లో - అశీతి షట్ శతం అని కని పిస్తుంది

   అశీతి = ఎనభై
   షట్ శతం = ఆరు వందలు
   సహస్రాణి త్రయోదశ = పదమూడు వేలు
   లక్షశ్చ ఏకోన = ఒక లక్ష

   మొత్తం ఒక లక్ష పద మూడు వేల ఆరు వందల ఎనభై నిశ్వాసాలు .

   నిశ్వాసాలు ఉండాలి అంటే ఉచ్వాసాలు ఉండాలి అన్నేసి మరి

   అంటే 1 13 680 x 2 = 2 27 360

   ఇందులో రెండు = సూర్య చంద్రులు
   ఇరవై ఏడు = నక్షత్రాలు
   మూడు వందల అరవై = జోడియాక్ !

   2 = Sun and Moon
   27 = Nakshatras
   360 = Degrees of Zodiac.

   Not bad I hope!

   cheers
   zilebi

   Delete
  2. జిలేబి గారు,
   నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః
   నిశ్వాస అన్నారు, ఉఛ్వాస లేని నిశ్వాస లేదు కదా! ఈ రెంటినీ కలిపే శ్వాస అనీ అంటారు.ఇక
   14 X 60 X 24=20,160 per day for a healthy man.
   లెక్క కూడా సరయినదేనని నిశ్చయం చేసుకున్నా, పెద్దలనుండి. కాని అనుమానం నిమిషం అన్న దగ్గరా ఉంది. మనం అనుకుంటున్న నిమిషమూ ఈ నిమిషమూ ఒకటేనా? ఇక్కడ అహోరాతర అన్నారు కనక రాత్రి పగలు కదా, ఇరవినాలుగు గంటలలో తేడా లేదనే అనుకుంటా.
   మరో మాట ఈ సమయం దాకా చేస్తే ఇలా ఉంటుందీ అని కదా చెబుతున్నది, అందు చేత నక్షత్రాలు, రాసులు రావనుకుంటాను. ఈ శ్లోకానికి ముందు వెనుక శ్లోకాలలో ఏదయినా సూచన దొరుకుతుందేమో చూడండి.

   113680/20160=5.64 days roughly. I feel some more data is missing.
   కుడి ముక్కు నుంచి గాలి పీల్చడాన్ని ఇడా(ళా) అని లేదా సూర్యనాడి అనీ, ఎడమ ముక్కుతో పీల్చే గాలిని పింగళ లేదా చంద్ర నాడి అనీ అంటారు.
   నేనిలా అనుకున్నా, ప్రయత్నిద్దాం.
   ధన్యవాదాలు.

   Delete
  3. అశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ
   లక్షశ్చైకోన(లక్షశ్చ ఏకోన ?) నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః

   ఈ శ్లోకంలో "అశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ " అన్నది లెక్కవేస్తే అశీతిశ్చ శతం చైవ = 80 x 100 = 8000, సహస్రాణి త్రయోదశ = 13 x 1000 = 13000. ఈ మొత్తం 21,000. ఇది నిమిషానికి పదునాల్గు శ్వాసల చొప్పున రోజుకు 14 X 60 X 24=20,160 అన్నదానికి ఇంచుమించుగా సరిపోతోంది.

   ఇకపోతే శ్లోకంలోని రెండవపాదం "లక్షశ్చైకోన(లక్షశ్చ ఏకోన ?) నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః " తప్పుడు పాఠం కావచ్చును. ముఖ్యంగా లక్షశ్చ అన్నది లక్ష్హ్యశ్చ కావచ్చును. అసలు పాఠం "లక్ష్హ్యశ్చైతేన నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః " కావచ్చును. అప్పుడు శ్లోకార్ధ్గం 21,000 నిశ్వాసములు ఒక అహోరాత్రమునకు ప్రామాణికము అని వస్తుంది కదా.

   Delete
  4. శ్యామలీయం గారు,
   మీరు చెప్పినది ఆమోదయోగ్యంగానే ఉందనుకుంటున్నా. జిలేబిగారి ఉద్దేశమేంటో.
   ధన్యవాదాలు.

   Delete

  5. శ్యామలీయం వారు,

   మీరు చెప్పిందీ సరి పోవచ్చేమో !

   కానీ సంస్కృతం లో ఎనిమిది వేలని అష్టా సహస్రాణి (ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే ఆ పదమూడు వేల తో కలిపి పూర్తి గా త్రయోవింషత్ సహస్రాణి అని యే చెప్పి ఉండవచ్చు !) అని వేరు గా చెప్పవలసి ఉంటుందా ?

   అంతా జిలేబి మయం గా ఉంది

   అట్లాగే దాని పై శ్లోకం లో త్రింశత్ పర్వాంగుళః అన్న పదం కూడా కొంత ఆలోచింప జేసేది కూడాను ! ఇందులో త్రింశత్ పర్వాంగుళః అన్నది నేను అర్థం చేసుకున్నది ఒక అంగుళం లో ముప్పై వ భాగం గా . (పర్వం అంటే భాగం వర్గీ కరణ అన్న అర్థం లో ); కొన్ని అనువాదాల్లో ముప్పై అంగుళాల దూరం లో అన్నట్టు ఉన్నది .

   మొత్తం మీద ఒక లక్ష పదమూడు వెల ఆరు వందల ఎనభై అన్నది అనువాదాల్లో కనిపిస్తుంది ( కాని వివరణ ఎక్కడా అంటే నేను గూగులించినంత దాకా కనిపించ లేదు )

   చూద్దాం ఇంకా ఏదైనా సరి ఐన వివరణ దొరుకు తుందా అని !

   నెనర్లు

   జిలేబి

   Delete
  6. It appears u r busy, any how

   నిశ్వాస 1,13,680 / 1440 minutes = 79 roughly per minute. Are they heart beats? i.e 1,13,680 heart beats per day.

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
 5. 'త్రయోవింషత్ సహస్రాణి' అనవచ్చును కాని, అది అనుష్టుప్పులో ఒక పూర్తిపాదం కావటం లేదు కదా. అందుకే అవసరార్థంగా 'అశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ' అని ఒక పాదం మొత్తం లాగించేసా రనుకుంటాను. 113680 / 86400 = 1.3157 కాబట్టి, ఈ ప్రకారం సెకనుకు ఒకటికన్నా హెచ్చు వేగంతో శ్వాసతీసుకోవటం అన్నది అసంబధ్ధమైన విషయం కాబట్టి అటువంటి లెక్క తప్పే కావలసి ఉంటుంది.

  ReplyDelete

 6. కష్టే ఫలే శర్మ గారు,

  మీరు చెప్పిన విశ్లేషణ బాగుందండోయ్ ! ఇంచు మించు సరి పోతోంది ! అదేనేమో !

  ఈ సంస్కృత కవులకి అది యేమి జాడ్యమో గాని దేనిని నేరుగా చెప్పరు ! అంతా విష్ణు మాయ గా జిలేబి మయం గా 'సూక్తి'స్తారు !

  ఆ నారాయణ సూక్తం లో కూడా చూడండి - అథో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి అంటూ చెబ్తారు !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ప్రతీది కష్టపడకుండా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే గుట్టుక్కున మింగేద్దామనుకున్నారా :) నమలనుకూడా నమలకుండా! అవును లెండి ఇప్పుడన్ని ఫ్రీ కదా!

   Delete
  2. It is clear and being told by many, if u reduce the number of inhale and exhale the longevity will increase.

   Delete
 7. @శ్యామలీయం వారు,

  బాగుందండీ ! మంచి విశ్లేషణ !

  జిలేబి

  ReplyDelete
 8. ఒక తప్పు చేసినట్టు ఉందండి. 1,13,360 అన్నది తప్పనుకున్నపుడు దానిని 20,160 పెట్టి భాగించడం వచ్చినవి నిమిషానికి గుండె శబ్దాలనుకోడమూ తప్పే. శ్యామలీయం వారు మీరేమంటారు. జిలేబి గారి మాటేంటి?శ్లోకాల్లో గుండె శబ్దాల మాట లేదు కదా!

  ReplyDelete
  Replies
  1. అవునండీ. 1,13,360 శ్వాసలన్నదే సందేహాస్పదం ఐనప్పుడు దానిమీద ఆధారపడి లెక్కించటంలో చిక్కులున్నాయి. జిలేబీగారి అన్వయం ప్రకారం రోజుకు 1,13,360 శ్వాసలు వచ్చినపక్షంలో నిముషానికి 78.7222 శ్వాసలు అవుతాయి కాని అది అసంబద్దం కదా. గుండెకొట్టుకొనే వేగం వేరొకరకపు కొలత కాబట్టి దాన్నిక్కడికి తేలేము. పైగా శ్లోకంలో గుండెచప్పుళ్ళ సంగతి లేదన్నది నిజం.

   Delete
  2. ఏదో పిచ్చి ఆలోచనొచ్చి తప్పుదారి పట్టేసినట్టున్నా. జిలేబి తల్లి పలకలేదు.

   Delete
 9. శ్యామలీయం వారు అండ్ కష్టే ఫలే వారు,

  మీ లెక్ఖల్లో మరో టైపాటు పడింది ! 113360 కాదు 113860 ! (అశీతి షట్ శతం చైవ సహస్రాణి త్రయోదశ ) !

  కష్టే ఫలే వారి సందేహం తో ప్రశ్న మళ్ళీ మొదటి కొచ్చింది !

  శ్యామలీయం వారి అశీతిశ్చ శతం విరుపు = 80 x 100 = 8000 ప్లస్ సహస్రాణి త్రయోదశ = 13,000 మొత్తం వెరసి ఇరవై ఒక్క వేలు ఓ మోస్తరు దరిదాపుల్లో తర్కానికి దగ్గరి గా వస్తున్నది !

  ఇక ఈ విషయమై మరో మారు గూగులిస్తూ ఉంటె , ఆంగ్లం లో ఈ ఉపనిషత్ కి మొట్ట మొదటి అనువాదం 1914 లో శ్రీ కె నారాయణ స్వామి అయ్యరు గారి పుస్తకం Thirty Minor Upanishads , archive.org లో దొరికింది (క్రింది లింకు చూడండి)

  ఈ ఆంగ్ల అనువాదం ప్రకారం ఆశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ = 1,13,180 . ! సో మరో కొత్త కోణం ! అట్లాగే ఈ పుస్తకం లో దీనికి వివరణ గా మొత్తం ముఖ్య మైన పంచ ప్రాణా లని లెక్ఖ లో కి తీసుకుంటూ sub praanaas అంటూ మరో ఐదు ప్రాణాల కూడిక లేక్ఖలు వేసేరు ! ఇది మరో కోణం !
  https://archive.org/details/thirtyminorupani00xxxxuoft

  ---
  ne commentator makes it thus :
  Taking 21,600 for each of the five Pranas we get 108,000.
  For the Five 8ub-Praanaas, 5X1036 is 5,180. Hence the total is 1,13,180;
  Another commentator makes it 21,600 alone.
  ---

  పై వాక్యం లో 21600 , నిమిషానికి పదిహేను శ్వాస లని లెక్ఖ లో కి తీసు కుంటే 24 x 60 x 15 = 21600 వస్తుంది .

  అయితే పై లెక్ఖ లో మరో కొత్త 1,036 లెక్ఖ వస్తుంది ! ఈ వెయ్యిన్ని ముప్పై ఆరు కి ఆధారం ఏమిటో తెలీదు !

  అంతా విష్ణు మాయ ! (సంస్కృత జిలేబీయం!)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. It is a fact that breaths are 14 or 15, as we see it also practically. Let us probe the matter further. Hope SyaamalIyaM sir, can help.

   Delete
  2. అది టైపాటే., it is 1,13,860 only
   ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు పంచ ప్రాణాలు. ఇవి వాయువులు శరీరంలో సంచరించేవి. ఇవే కాక నాగ, కూర్మ వగైరా మరో పన్నెండు వాయువులూ మనలో సంచారం చేస్తాయంటారు.
   ఇక శ్వాసలకి గుండె వేగానికి సంబంధం ఉంది, అదెలాగా అనేది ఇందులో లేని మాట నిజం....పెద్దవారు చెప్పిన మాట తప్పు పట్టటం కాదుగాని, ఈ శ్లోకం కొద్దిగా చ్యుతి చెందిందనిపిస్తుంది. అది శ్యామలీయం వారు చెప్పినట్టుగా ఉండి ఉండాలనేదే నా అభిప్రాయం కూడా.
   శ్వాసలు 14/15 లో పెద్ద తేడా లేదు. మహా ప్రాణాలకి ఒక్కొక దానికి నిమిషానికి 14/15 శ్వాసలన్నది ఎబ్బెట్టుగానే అనిపించింది. వివరించండి.

   Delete