Tuesday, January 6, 2015

ఓవర్ టైం అలోవేన్స్ కోరిన ఏడు కొండల వాడు !

ఓవర్ టైం అలోవేన్స్ కోరిన ఏడు కొండల వాడు !

పాల సముద్రం ! మధ్యలో అలవోక గా కనులు మూసుకుని శ్రీదేవి కాళ్ళు సుతారం గా ఒత్తు తూంటే అట్లా తీరిగ్గా జోగుతున్నాడు మహా విష్ణువు.

డమాల్ మని వైకుంటం తలుపులు తెరుచు కుని విస విస మిస్టర్ పెరుమాళ్ళు మిస్సెస్ అలమేలు మంగా వచ్చేరు !

తన అంశ ఐన వెంకన్న ని జూసి మహావిష్ణువు - రావోయ్ - ఏమి విశేషాలు - వైకుంట ఏకాదశి బాగా జరిగిందా అంటూ కుశల మడి గేడు .

లక్ష్మీ దేవి మంగా తాయారుని ఇంటి లోపలి తీసుకు పోయింది

ఏడు కొండల వాడికి మండి పోయింది . రెండు రోజులుగా జనవరి ఒకటి, వైకుంట ఏకాదశి అంటూ తన్ను ఓవర్ టైం చేయించి దస్కం బాగా దక్కినట్టు పేపర్లో వచ్చిన వార్త చదివి అప్పుడే హాట్ హాట్ గా ఉన్నాడు నామాల సామి.

నాజూగ్గా పాదాలు వత్తు తూంటే కులసాగ్గా జోగుతున్న మహా విష్ణువు ని జూస్తే మరీ మండి పోయింది కలియుగ దైవానికి.  తను రోజుల తరబడి నిల్చొని కలియుగ వరదు డై ప్రపంచాన్ని కాస్తూంటే , ఈ పెద సామి తీరిగ్గా కాళ్లార బెట్టు కుంటూ జోగుతున్నాడు !

వైకుంట ఏకాదశి అంటూ నన్ను మరీ ఓవర్ టైం గావించేసారు . ఇక నేను కలియుగ వరదు డై ఉండను . వేరే ఏదన్నా కాళ్ళు జాపు కుని ఉండే రోల్స్ అండ్ రేస్పాన్సి బిలిటీ నా కివ్వు  - డిమాండ్ చేసాడు వెంకన్న .

గతుక్కు మన్నాడు మహా విష్ణువు ! వెంకన్న ఆ రోల్ చెయ్యక బోతే తానె అతని పని కూడా చేయాలి - ఎట్లా అయినా వరదన్న ని బోల్తా కొట్టించి మళ్ళీ కొండకి పంపేయాలి అనుకుని మహా విష్ణువు నిమ్మళం గా చెప్పేడు -

దానికేమి వరదా ! అట్లా గె చేసేస్తా ! మిజోరం రాష్ట్రం అని ఒకటి ఉన్నది అక్కడికి నిన్ను బదలాయిస్తా ! సాఫీ గా దినాలు సాగిపోతాయి .  ఆంధ్ర దేశం ఇప్పుడు ఎట్లాగూ ఫాస్ట్ మోడ్ లో ఉంది కాబట్టి గట్టి గా నిలబడి పని జేసే ఆసామి ని ఎవర్నైనా జూసి కలియుగ వరదు ని గా పెట్టేస్తా చెప్పేడు స్వామి .

అది సరే, మిజోరం లో నిన్ను పెడితే అలోవేన్సు లు గట్రా వస్తాయి గాని , నీ కుబేరుని బకాయి తీరు తుందం టావా వెంకన్నా ? అడిగేడు మహా విష్ణువు సందేహం గా .

వెంకన్న గతుక్కు మన్నాడు . కుబేరుని బకాయి ఎప్పటి కి చెల్లు అవుతుందో తనకు లెక్కలు తెలియ వాయె ! అందరూ ఏడు కొండల పెరుమాళ్ళ కే ఎరుక అనేస్తారు గాని , ఈ కుబేరుని బకాయి మాత్రం తనకు అర్థం కాని గట్టి పిండం .

కుబేరుని బకాయి మిగులు ఎంతో నాకు తెలియదే మరి  జెప్పాడు వెంకన్న .

ఐతే మిజోరం వద్దులే . పనికి రాదు నీకు చెప్పేడు మహా విష్ణువు .

పోనీ ఇట్లా కాళ్ళ రి గి పోయే లా పని జేస్తున్నా కదా అట్లీస్ట్ ఓవర్ టైం అలోవన్సు అయినా సేన్క్షన్ చేయరాదూ ?? విన్న వించు కున్నాడు పెరుమాళ్ళు .

హమ్మయ్య వెంకన్న మన దారికి వచ్చేడు అనుకుని మహా విష్ణువు సంతోష పడి - దానికేమి లే , ఓవర్ టైం అలోవన్సు నీ కిచ్చేయ మంటా దేవస్థానం వారికి  ఆర్డరు పాస్ జేసెడు స్వామి -

"వెంకన్న కి ఓవర్ టైం అలోవన్సు ఇచ్చి - ఆ దస్కాన్ని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ క్రింద వెంకన్న బకాయి అకౌంట్ విత్ కుబేరా బ్యాంక్ కి జమ చేయ వలసినది గా ఆర్డినేన్సు జారీ చేయ బడినది "


చీర్స్

జిలేబి

14 comments:

 1. కడవలే! కడవలే!! కణ్ణా!!!

  ReplyDelete
  Replies

  1. శర్మ గారు,

   'కణ్ణాయిరం !'

   జిలేబి

   Delete
 2. It hurt my religious sentiments and believes, like that of other hindu feelers , please avoid such satires in future

  ReplyDelete
  Replies

  1. చవేర గారు,

   హమ్మయ్య ! ఫీల్ అయ్యేరన్న మాట !

   జిలేబి

   Delete
 3. మా "మీసాల సుహాసిని" గారు పీకే మత్తులో రాసిన "చెత్త పలుకు" మీరూ చదివారన్న మాట!
  ఆ స్వతైరు మానవుడు తను సమాచారముతో వ్యాపారము చేయుట మాత్రము తప్పు కానే కాదు?

  ReplyDelete
  Replies

  1. హరి బాబు గారు,

   ఈ మీసాల సుహాసిని ఎవరండీ ??

   జిలేబి

   Delete
 4. ఎవరూ తప్పుపట్టుకోకపోతే ఒక మాట చెప్పాలి. వైకుంట కాదు జిలేబీగారూ వైకుంఠ అన్నది సరైన వర్ణక్రమం. ఇలా వ్రాసినందుకు ఉచిత బోడి సలహాగా భావించి మీరు నొచ్చుకున్న పక్షంలో నా క్షమాపణలు కూడా స్వీకరించండి. (Note: ఎవరికీ సలహాగా ఒక ముక్క చెప్పే‌ హక్కు నాకు లేదన్నట్లుగా కాబోలు ఈ రోజున మిత్రులు చెప్పగా తెలుసుకున్నాను. మీరు అపార్థం చేసుకోరన్న నమ్మకం ఉందికాబట్టి ఈ‌ చిన్న సవరణ సూచించే సాహసం చేస్తున్నాను.)

  ReplyDelete
  Replies

  1. శ్యామలీయం గారు ,

   మీరు చెప్పిందే కరెక్టు ! ఈ గూగల్ తెలుగు లిపి లో ఆ ఠ ఎట్లా తెప్పించడమో తెలియక కుంటు పడ్డ 'ట' తో వైకుంటం అయిపొయింది !

   ఇంతకీ ఈ గూగుల్ లో ఆ ఠ తెప్పించటం ఎట్లా గో మరి ??

   జిలేబి

   Delete

  2. శ్యామలీయం వారు,

   సమాధానము కొరకు వైటింగు !

   జిలేబి

   Delete
 5. హిరణ్యకశపుని వారసులు ఇంకా వున్నారని నిరూపించారు..బావుంది..మరిన్ని చేదు జిలేబీలు చుట్టండి... నష్టం ఏమీ లేదు...
  ReplyDelete
  Replies

  1. వోలేటి గారు,

   హిరణ్య కశిపు ని వారసులు లేకుంటే ప్రహ్లాదులెలా పాపులర్ అవుతారు మరి ??

   జిలేబి

   Delete
  2. పాపులర్ అయిన ప్రహ్లాదుని వదిలేసి ..హిరణ్య కశిపుణ్ణీ ఆదర్శంగా తీసుకోకండి మరి..

   Delete

  3. భలే వారండీ వోలేటి వారు,

   హిరణ్య కశిపుడు లేకుండా ఉంటె ప్రహ్లాదు డు వచ్చి ఉండే వాడా మరి ? అట్లాగే మహావిష్ణువు లేకుండా ఉంటె హిరణ్యాక్ష హిరణ్య కశిపులు ఉండే వాళ్ళా మరి ? అట్లాగే ... చైన్ కంటిన్యూస్ ... అంతా విష్ణు మాయ !

   జిలేబి

   Delete
 6. ఔనౌను.. చీకటి లేకపోతే వెలుగు గొప్పదనం తెలిసేదా??
  దొంగలు,ఉగ్రవాదులు లేకపోతే పోలీసులు, సైన్యం వుండరు కదా..
  చెత్త చేసే వుండబట్టే కదా లక్షల మంది రోడ్లూచే వాళ్ళు బతుకున్నారు...
  చాలా బాగా శెలవిస్తున్నారండి...


  ReplyDelete