Friday, January 9, 2015

సనాతన ధర్మ ఉద్దీపకుడు క్రీస్తు ప్రభువు !


"బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద  ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది.

ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడి రాక మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది.

ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ దేవరాయల సంతతి తిరోగతి - సుల్తానుల ప్రాబల్యం ఎక్కువవుతున్న కాలం లో - ఆ సమయం లో బ్రిటిష్, వాడు ఇండియా కి రావడం - వాడి తో బాటు వాడి సంస్కృతి, మతం - ఇండియా కి రావడం - ఓ లాంటి చెక్ పాయింట్ అయ్యింది -

ఇస్లాం ఇంకా తీక్షణం గా భారత దేశం లో ప్రాబల్యం కాకుండా ఉండడానికి - వీడే రాకుండా ఉంటె - సుల్తానుల ప్రాబల్యం తో భారత దేశం - ఓ మోస్తరు ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా ప్రస్తుతం ఉండేదేమో? -

ఇది ఊహా చిత్రం కాబట్టి - వాదనలకి చాల తావుంది ఈ చిత్రం లో - మీ అభిప్రాయలు - భిన్న అభిప్రాయాలు - కచ్చితం గా ఈ విషయం పై ఉంటాయీ.

గీత లో శ్రీ కృష్ణ భగవానుడు - యదా యదాహి ధర్మ స్య గ్లానిర్భవతి భారతా- తానూ మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు. అంటే బ్రిటిష్ వాడి రాక దీన్ని సూచిస్తుందా? - క్రీస్తు మతం - ఇండియా కి రావడం - దీన్ని సూచిస్తుందా? -

ఆలోచనలకి మంచి పదును పెట్టె విషయం ఇది.

ఆలోచించి చూడండి- భారతం - సంగమం - వివిధ మతాల సమ్మేళనం -

ఆ నాటి  బు ద్దుడి సమయం నించి చూస్తె భౌద్ధం , జైనం, ఇస్లాం - ఈ నాటి బాబాలు , స్వాములు - గురువులు యోగుల దాక భారత దేశం లో మతం మీద జరిగినంత వెరైటీ ఎక్స్ పెరి మెంట్స్ ఇంకా ఎ దేశంలో కూడా జరిగి ఉండదు. -

ఈ లాంటి సంక్లిష్ట వాతావరణం లో సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- కారణం ఏమంటారు? -

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి  స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు ఉంచుతుంది.

సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది.

మీరేమంటారు?


జిలేబి.

38 comments:

  1. జిలేబీ జిలేబీ లా వుండకుండా
    కదప బాంబుల్ని పేలుస్తే యెట్లా?

    ReplyDelete
    Replies

    1. కడప మా ప్రక్క ఊరు కదండీ హరి బాబు గారు ,

      ఆ మాత్రం పేలక పోతే ఎట్లా మరి !

      చీర్స్
      జిలేబి

      Delete
  2. మీరింత 'ఇది'గా చెప్పాక కాదంటామాండీ.....అయినా క్రీస్తు కూడా హిందువేనటగా!

    ReplyDelete
    Replies

    1. కొండల రావు గారు,

      ఎవ్వరూ హిందువులు కాదు ! అందరూ సనాతనులే ! ఇది మరీ బాగుంది కదూ !

      జిలేబి

      Delete
    2. అవునండీ. అంతా మట్టి మనుషులే. మట్టిలోని తేడాలను బట్టి మనుషులలో తేడాలుంటున్నాయనుకుంటా :)

      Delete
    3. నిజం చెప్పేరు. మనిషి పుట్టిన చోటులోని మట్టి లక్షణాలనుబట్టి గుణాలొస్తాయనుకుంటా :)

      Delete
  3. బహుశా..వృద్ధాప్యంలో వచ్చిన నైరాశ్యం వలన పైత్యం ప్రకోపించి ఏకాగ్రత లోపించడం వలన ..జిలేబీలు రాళ్ళుగా మారుతున్నాయి.. కాస్త ఈ లోకంలోకి రా అక్కాయ్...

    ReplyDelete
    Replies

    1. ఓలేటి వారు,

      మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి పాట గుర్తు కోస్తోందండీ !!

      జిలేబి

      Delete
  4. నాక్కూడా ఇలాంటి ఆలోచనే వచ్చింది... మీరు చెప్పింది అక్షర సత్యం. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా మనది ఒక ఇస్లామిక్ దేశం అయ్యి ఉండేది. వాళ్ళు రావడం వల్ల మన గ్రంధాలు రక్షించ బడ్డాయి. లేకపోతే, ఇక చెప్పేది ఏముంది? తగలెట్టెయ్యడమే లేకపోతే చంపెయ్యడమే.

    ReplyDelete
    Replies

    1. ఎస్పీ జగదీష్ గారు,

      అంతా 'రిచ' లో నించి వచ్చే వె ! వెరీ గ్లాడ్ - మీకూ ఆ వైబ్రేషన్ అందింది అని తెలిసినందులకు !!

      జిలేబి

      Delete
  5. ఒక మహానాయకుడేమో "నిజాం మా గొప్ప ప్రభువు.. అని పొగడుతున్నాడు.. మీరేమో ఆంగ్లేయులు అంతకంటే సానా గొప్పోళ్ళు అని ఉవాచిస్తున్నారు.. మనకి బానిస బతుకే కరెక్టేమో.. ఇప్పటికైనా ఆలస్యం లేదు..పిలవండి నిజాం వారసుల్ని.. విదేశీ తెల్లదొరలని...శభాసో.. స్వాతంత్రసమరయోధులకు..ఇదే ఈతరం వారు అందిచ్చే నిజమైన నివాళి..గౌరవం..ఇదే ఆ చీకటి రోజుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న మన ముందు తరం భారతీయులకు మనం ఇచ్చే కృతజ్ఞత..

    ReplyDelete
    Replies

    1. అబ్బే వోలేటి వారు,

      మరీ ఫీలవకండీ ! కొన్ని వాస్తవాలు కాలం గడిచాకే వాటి ఉపయోగాలు - నిరుపయోగాలు - ప్రయత్నాలు - ఫలితాలు గట్రా బయటికి వస్తాయి !

      సనాతన ధర్మం లోని దురాచారాలు బ్రిటీషు వాడు రాకుండా ఉంటె ఖచ్చితం గా దూరమై ఉండే వా అన్న ప్రశ్న వేసుకోవాలి . అంతే గాని వాడు చేసిందంతా రైట్ అనే వారెవ్వరూ లేరు ! ప్రతి ప్రయత్నం లోను మంచి చెడు ఉన్నాయి ! కాల క్రమేణా మంచి అన్నది చెడు చెడు అని అనుకున్నది మంచి కూడా అయ్యే సందర్భాలు లేక పోలేదు !

      జిలేబి

      Delete
    2. @జిలేబి, ఇన్ని ప్రశ్నలు వేసుకొన్నారు గదా! ఈ ప్రశ్న ఎప్పుడు మీకెప్పుడు రాలేదా? బ్రిటీష్ వాడి పాలన కింద ఉన్నపుడు భారతదేశం లో హిందూ, ఇస్లాం మతాలు రెండు ఉంటే, వాడికి హిందూ మతంలోమాత్రమే దురాచారాలు ఎందుకు కనిపించాయి? మీకు తెలిస్తే చెప్పండి.

      సనాతన ధర్మం లోని దురాచారాలు బ్రిటీషు వాడు రాకుండా ఉంటె ఖచ్చితం గా దూరమై ఉండే వా అన్న ప్రశ్న వేసుకోవాలి.
      ప్రపంచవ్యాప్తంగా వారు చేసిన,చేస్తున్న దురాచారాలు దాచిపెట్టి ,ఇతరులు దురాచారాలు చేసారని డబ్బా కొట్టుకొంటే మీ లాంటివారు ఎలా నమ్ముతారు? ఇంతకీ తెల్లవారి అధికారమతమైన క్రైస్తవం లో రూపుమాపిన దురాచారాలెన్ని?

      Delete
  6. జిలేబీ గారు లేవనెత్తిన ప్రశ్న కుతూహలంతో కూడినది. చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు / పరిణామాలు అలా జరిగుండకపోయుంటే అనే చర్చ ఇతర దేశాల్లోనూ నడిచింది. కొందరు ప్రముఖులు వ్రాసిన వ్యాసాల్ని సంకలనంగా If It Had Happened Otherwise అనే పేరుతో 70, 80 ఏళ్ళ క్రితమే వచ్చింది. ఆసక్తికరమైన వ్యాసం సర్ జి ఎం ట్రెవెల్యాన్ (Sir G M Trevelyan) అనే బ్రిటిష్ చరిత్రకారుడు వ్రాసిన If Napoleon Had Won The Battle Of Waterloo అన్నది. గత శతాబ్దం మొదట్లోనే వ్రాసిన ఈ వ్యాసంలో నెపోలియన్ వాటర్లూ యుద్ధం గెలిచుంటే యూరప్ చరిత్ర ఎలా మలుపు తిరిగుండవచ్చు అనే విషయం మీద వ్రాసినది. ఊహాగానమే గాని చరిత్ర గురించి అవగాహనతో చేసే ఊహాగానం.

    బ్రిటిష్ వారు రాకపోతే భారతదేశం ఎట్లా ఉండేది అనే జిలేబీ గారి సందేహం కూడా ఆ కోవదే. ఏసుక్రీస్తు హిందువా లాంటి తతిమ్మా విషయాల గురించి నాకు తెలియదు గాని జిలేబీ గారి ఈ టపాలో "భారతదేశం .... ప్రస్తుతం ఓ మోస్తరు ఇస్లామిక్ దేశంగా ఉండేదేమో?" అనే పేరా వరకు నేను ఏకీభవిస్తాను. Good post.
    (జిలేబీ గారూ, కాకపోతే మీ టపాలోని ముఖ్యాంశం టపా యొక్క టైటిల్ లో సరిగ్గా ప్రతిఫలించటం లేదనిపిస్తుందని నా అభిప్రాయం)

    ReplyDelete
    Replies
    1. విన్న కోట వారు,

      Good to know that such thought process existing !

      cheers
      zilebi

      Delete
  7. మీరు చెప్పిన బ్రిటిష్ చరిత్రకారుడు సుమారు రెండొందల పేజిలకు పైగా పుస్తకం రాసి ఉంటాడు. ఎన్నో కోణాలు చర్చించి ఉండాడు. పుస్తకం కొని చదివేవారికి చరిత్ర పరిజ్ణానం , అందులో ఆసక్తి ఉంటేనే కొని చదువుతారు. అది కూడా విశల దృక్పథం, దృష్టితో చదువుతారు. నాలుగు పేరాలలో రాసిన ఈ టపాలో చదివే వారికి పెద్ద చరిత్ర పరిజ్ణానం అవసరంలేదు. వివరాలు అవసరం లేదు. ఉహాగానాలు తప్ప. శైలి బాగుంటే చదివేస్తారు. చివరికి ఇది కుడా ఒక పాయింటే అని అనుకొంటారు.మనవారికి ఊహాగానాల మీద ఉన్న నమ్మకం వాస్తవల మీద ఉండదు.జిలేబీ గారు లేవనెత్తిన ప్రశ్న అనవసరమైనది.


    @జిలేబి, ఇప్పటికే భారతదేశ చరిత్రను మార్క్సిస్ట్ చరిత్ర కారులైన రోమిల్లా థాపర్ ,ఇర్పాన్ హబీబ్ మొదలైన ఎమినేంట్ హిస్టరియన్స్ భ్రష్టు పట్టించి, బాగా వక్రీకరించారు.ఇటువంటి ఊహాగానాలు చేస్తే అదే నిజమనుకొనే వారు చాలా మంది ఉంటారు. రచయితకు మంచి శైలి ఉంటే చాలు రాసిందంతా నిజమని నమ్మే వారు ఎంతో మంది ఉంటారు. మీరు కూడా రోమిల్లా థాపర్ అడుగుజాడలో పోవటంలేదు కదా!

    ReplyDelete
  8. Replies
    1. భరద్వాజ్ గారు, ఆలస్యంగానైనా జిలేబి గారికి న్యాయం చేస్తున్నారన్నమాట:)

      Delete
    2. ఆలస్యంగానైనా జిలేబి గారికి న్యాయం చేస్తున్నారన్నమాట:)
      _____________________________________

      Kondalarao garu,

      We were all busy with hectic schedules recently and didnt get to see much action on Maalika unless somebody mailed us. Even many of those mails landed in our spam folders for some reason. So we didnt get to act in time. We still have many technical issues pertaining to Maalika and need to fix them. May be a total revamp should be done soon.

      Delete
    3. Sir,
      Still my word press blog's comment feed is not working.

      Delete
  9. జిలేబి జి, ఊరికి పోతున్నాను. బ్లాగు ఎప్పుడు చూస్తానో తెలియదు. మీకు ఇంకొకక ప్రశ్న, హిందూమతం లో కోస్తాఆంధ్రా మార్క్సిస్ట్ రచయితలు రాసినట్లు హిందూమతంలో అన్ని దురాచారాలు ఉంటే, నేటికి పాకిస్థాన్ లో హిందూమతంలో ఎందుకు ఉన్నట్టు? వీరేవ్వరు అగ్రవర్ణాల వారు కూడా కాదు. అయినా వారు ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమతంలోనే ఎందుకు కొనాసాగలనుకొన్నట్లు? బాగా ఆలోచించి టాపాలు గా రాయండి. వచ్చి చదువుతాను.

    పాకిస్థాన్ హిందువుల గురించి ఈ క్రింది వీడియోలు చూడండి.
    https://www.youtube.com/watch?v=n-TYTrXeAwE
    https://www.youtube.com/watch?v=ey9JGVwhEfo

    మార్క్సిస్ట్ చరిత్రకారులు ప్రభుత్వ సొమ్మును ఎంత తిన్నారో అరుణ్ శౌరి ఆధారాలతో సహా రాశాడు. ఇప్పటివరకు వారినుంచి జవాబేమి లేదు. లెక్కలు అడుగుతవా అని అతనిని ఏవిధంగ తిట్టిపోశారో ఆ విషయాలు చదవండి.
    ICHR's The Eminent Entrepreneurs!
    http://arunshourie.bharatvani.org/print/19980724.htm

    After Selling Himself in the Flesh Market
    http://arunshourie.bharatvani.org/print/19990115.htm

    ReplyDelete
    Replies
    1. Read this article also

      http://pustakam.net/?p=1067

      Delete
  10. శభాష్! వింత వింత ఆలోచనలొస్తున్నయి.

    ReplyDelete
  11. జిలేబీ గారూ అభినందనలండీ - మీ బ్లాగులో వచ్చే వ్యాఖ్యలు "మాలిక" లో కనిపించడం తిరిగి మొదలయినట్లుందే (నా పై కామెంట్ తప్ప Jan 10, 2015 ; 9.21am ��) (బహుశా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయినట్లుంది).

    ReplyDelete
    Replies
    1. వర్డ్ ప్రెస్ బ్లాగుల కామెంట్ల ఫీడ్ పోయినట్టుందండి, ఇప్పటికీ. మా బ్లాగులో కామెంట్లు కనపట్టంలేదు.టపాల ఫీడ్ బాగు చేసేరు నిన్నౌ చెబితే. మాలికవారికి కృతజ్ఞత

      Delete
  12. "సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది"

    గ్రందాధర (book based) మతాలకు కాలక్రమేణా ఎదిగిన (evolved) మతాలకు పొంతు కుదరదు. అవి వీటిని లేదా ఇవి వాటిని ఇమడ్చుకోలేవు.

    ఇకపోతే మీ టపా ముఖ్య విషయానికి వస్తే, బాగా ఆలోచించదగ్గ ప్రశ్న అడిగినందుకు థాంక్స్. సమాధానం తేలిగ్గా దొరికదానికి అది జిలేబీ కాదు!

    కొంచం ఆలోచిస్తే నాకూ ఒక ప్రశ్న తట్టింది. సామ్రాజ్యవాద దాడులకు దక్షిణ అమెరికా & ఆఫ్రికా దేశాలలో అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న మతాలు అంతరించాయి. ఫిలప్పీన్సు మినహా ఆసియా దేశాలలో ఇందుకు విరుద్దంగా దేశీయ మతం కొంత తగ్గినా బాగానే కొనసాగింది. ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నకు సమాధానం దొరికితే మీ సందేహం నివృత్తి కావొచ్చు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. గ్రంధాధార (bokk based)మతాలు నిర్వచించండి.

      Delete
    3. యెహూదీ, క్రైస్తవ, ఇస్లాం మతాలు

      Delete
    4. evolved కూడా మతమే అవుతాయా?

      Delete
  13. భారతదేశంలో ఆరేడువందల సంవత్సరాల ముస్లిముల పరిపాలనలో కేవలం దళితులను తప్ప కనీసం గణనీయమైన బహుజనులను కూడా ఇస్లాం లోనికి మార్చలేక పోయారన్నది సుస్పష్టం. తమ రెండువందల సంవత్సరాల పరిపాలనలఓ కూడా ఆంగ్లేయులు మతమార్పిడి చేయగలిగింది ముస్లిములు మార్చగా మిగిలిన దళితులను మాత్రమే. కనీసం వారు కూడా ఆ పని పూర్తిగా చేయలేక పోయారు.

    ఇక 19వ శతాబ్దం చివరి భాగంలో ప్రపంచం మొత్తం మీదా స్వాతంత్ర్య కాంక్ష బయలుదేరింది. అధికారంలో ముస్లిములు వున్నా, క్రిస్టియనులు వున్నా 1950 ప్రాంతంలో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చితీరేది. ఇటువంటి పరిస్థితిలో ముస్లిములు గనుక వుంటే హిందూమతం అంతరించి వుండేది అన్న ఊహకు సరైన ఆధారం కనపడ్డం లేదు.

    ReplyDelete
  14. ఇలాంటి ప్రశ్నలే చాలా వచాయి..
    ఒకవేళ ఈ దేశంలో గాంధీ అన్న మనిషి పుట్టక పోతే...
    ఘంటశాల అను మహా గాయకుడు ఈ తెలుగు నేలపై పుట్టి ఉండకపోతే...
    అలాగే...కే.సీ.ఆర్ అనే నేత తెలంగాణా లో పుట్టి ఉండకపోతే...


    ఇలాంటి వాటికి ఎలాంటి అర్థం వస్తుందో..మీ పోస్ట్ లో ప్రశ్నకి అదే జవాబు..
    పైన శ్రీకాంతాచారి గారు చెప్పింది కరెక్టు..

    నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టడానికి తప్ప ఇలాంటివి ఈ రోజుల్లో ఎవరికీ అక్కర్లేదు..మత సామరస్యం దెబ్బతినదు..
    జలియన్వాలా కాల్పుల్లో చనిపోయిన వారిలో హిందూ,ముస్లిం,సిక్కు..ఇలా అన్ని మతస్థుల వారు వున్నారు..ఇప్పటికీ అన్ని మతస్థుల వారు ఇరుగు పొరుగునే వుంటున్నారు..సుఖ సంతోషాలు పంచుకుంటున్నారు...వాటిని మన బ్లాగుల ద్వారా చెడగొట్టే ప్రయత్నం చెయ్యకూడదు..

    ReplyDelete
    Replies
    1. voleti గారు చెప్పింది నిజం ..కాని కలిసి మెలిసి ఉండే ఇరుగు పొరుగు ల మధ్య ఇలాంటి బీజాలు నాటుతున్నారు రాజకీయ నాయకులు

      Delete
    2. "నేను పుట్టకపోతే ఎవరిని పెళ్ళాడుదువు?" అందట ఒక ఇల్లాలు భర్తతో. దానికాయన "నువు పుట్టకపోతే నీ అమ్మనే పెళ్ళాడుదును" అన్నాడట. అలాగా అయితే గియితే అనేవి వింత ఆలోచనలేలెండి.

      Delete
  15. ఇదంతా, మీ కామెంట్లు పబ్లిష్ అవుతున్న ఆనందమేనా?

    ReplyDelete
    Replies
    1. బలే అనుమానమొచ్చిందే మీకూ :)

      Delete
  16. జిలేబీల కోసం రొబోలు కూడ వస్తాయా? ఆ వెరిఫికేషన్ కాస్తా తీసేస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు, ఇప్పుడు రోబో లు కూడా జిలేబీల వెంటే పడుతున్నాయట :)

      Delete