Saturday, February 14, 2015

సన్నాసి బుట్టలో పడ్డాడు !। (వలంటీనోపాఖ్యానం)

సన్నాసి బుట్టలో పడ్డాడు !। (వలంటీనోపాఖ్యానం)
 
కాలా కాలం గా సన్నాసులు బుట్టలో పడటాన్ని కొనియాడే శుభ దినం సందర్భాన ఇవ్వాళ సన్నాసుల  వారి 'హార్నీ' కథా, బుట్ట బొమ్మ కథా తెలుసు కుందాం !

జిలేబీ పెళ్లి రోజు .

బుట్ట లో జిలేబీ ని పెట్టుకుని  వస్తూంటే , బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి నాకు కాబోయే అర్ధాంగీ అని మురిసి పోయిన జంబు నాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారికి అవ్వాళ తెలిసి రాలే, బుట్టలో బొమ్మ పుత్తడి బొమ్మ కాదని, పేరు మాత్రమె జిలేబీ అని, తానె బుట్టలో బోల్తా పడ్డాడనీ నూ.

ఆ పై మూడు రాత్రుళ్ళు (ఈ మూడు రాత్రుళ్ళ ముచ్చట గురించి నేను చెప్పను బాబు మరీ సిగ్గు !) కానించిన తరువాయి శ్రీ అయ్యరు వారు 'జిలేబీ, మాంచి ఫిల్టరు కాఫీ ఒక్కటి పట్టుకు రావోయ్ " అంటే జిలేబీ బిక్క మొగం బెట్టి,
"అయ్యరు గారు,   మీకు వంట బాగా వచ్చనే బామ్మ నాకు చెప్పి నన్ను మిమ్మల్ని కట్టు కొమన్నారు " అని భాష్ప ధారా వాహినీ  మొగం పెడితే, వంశ పారంపర్యం గా వచ్చే అయ్యరు హోటలు వృత్తి ఇంట్లో కూడా వంట గాడేనా, గాదేనా నా గతీ , రాధా, నా జిలేబీ ఇది నీకు తగునా  సుమీ అని మా అయ్యరు వారు ఉసూరు మన్నారు !

ఈ మా పెళ్ళి ఈ సో కాల్డ్ యాదృచ్చికమో, కాక 'తాళీ' బలీయమో జంబూ వారికే తెలియాలి !

ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా  పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని,  దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి  సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.  

అయ్యలారా, అమ్మలారా , ఇవ్వాళ సంక్తు వాలం  'టీన్' జరుపు కొనుడు అబ్బాయి లారా, అమ్మాయి లారా మీకందరికీ ఇదే శుభ కామనలు !

మీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!

తప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!

ఇంతటి తో ఈ సన్యాసి బుట్టలో పడ్డాడు అనబడు ఈ వాలంటీ 'నో' పాఖ్యానం పరి సమాప్తము !

ఇది చదివిన వారికి, వినిన వారికి చదివి వినిపించిన వారికందరికీ ఆ పద్మావతీ అలమేలు మంగా సమేత మా ఏడు కొండల పెరుమాళ్ళు (ఈయన రెండు మారులు బుట్టలో పడినట్టు ఉన్నాడు సుమీ !) సకల మంగళములు కలుగ జేయు గాక!

చీర్స్
ఫక్తు, జిలేబీ డే!

10 comments:

  1. ఇల్లాలి హోదా ఇచ్చిన వాడిని పట్టుకుని "సన్నాసి" అంటారా? హన్నా.

    ReplyDelete
    Replies
    1. 'కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే' అని కాబోలు అన్నారు కవిగారు. ఏకాంతంలో పతినుద్దేశించి ఏకవచనంలో సన్నాసి అన్నా ముద్దుగానే ఉంటుంది కదండీ అదీ 'సం' గతి.

      Delete
    2. ఏకాంతములో సత్య కృష్ణుని తలమీదే తన్నింది కదండీ.....

      Delete
    3. విన్న కోట వారి ప్రశ్న కి శర్మ గారు ఆల్రెడీ సమాధానం ఇచ్చేసేరు కాబట్టి జిలేబి సమాధానం ఇక ఏమీ లేదు ! (శర్మ గారి కన్నా అనుభవజ్ఞులు వేరే వారెవ్వారు మరి !- జేకే !)

      చీర్స్
      జిలేబి

      Delete
  2. జిలేబీ అయ్యోరు.. గత టపాలో (...కాఫీ విత్ జిలెబీ) నా ప్రశ్నకు బదులివ్వకుండా తప్పించుకున్నారు.. మౌనం అంగీకారమా??

    ReplyDelete
    Replies
    1. వోలేటి వారు,

      జిలేబి ఒన్ అండ్ ఓన్లీ జిలేబి ! వేరే ఏ పేరు తో నూ లేదు !

      ఇంతకీ ఆ విరహ కవితలు వారు ఎవరండీ మీరు చెబ్తున్నది ? (ఏ బ్లాగు ?)

      బ్లాగు మొదలు పెట్టిన కొత్త లో వరూధిని అని ఒక బ్లాగరు ఉండే వారు ! ఆ వరూధిని ఈ జిలేబి ఒకరేనా అని చాలా మంది అడిగేరు ! కాదు కాదు అని ఇద్దరమూ వకీలు స్టేట్ మెంట్లు ఇచ్చు కున్నాము !
      వారి పేరు వరూధిని . నా బ్లాగు పేరు వరూధిని యాదృచ్చిక కాకతాళీయ కో ఇన్సిడెన్స్ మాత్రమె సుమా అని వ్రాసు కున్నాము కూడా !! అంతే నాకు తెలిసిన వరకు !

      చీర్స్
      జిలేబి

      Delete
  3. ఇద్దరు చంద్రులూ కలిసింది వలెంతినో దినానే?
    ఒద్దికగా వుంటారా ఇకనైనా చంద్రు లిద్దరూ!

    ReplyDelete
  4. ఇద్దరు చంద్రులూ కలిసింది వలెంతినో దినానే?
    వీరి వీరి జిలేబీ వీరిలో సన్నాసి యెవరూ!

    ReplyDelete
  5. అరటి పండు వొలిచి ఇచ్చినంత స్పష్టంగా సెప్పితిరి.. వేడి వేడి జిలేబీలు చుట్టుతున్నది అయ్యవారు.. సేల్ సేస్తున్నది అమ్మవాండు.. అర్థనారీశ్వర తత్వం..బహు బాగున్నది..ధన్యవాదములు..

    ReplyDelete
  6. వేడి వేడి మిర్చి బజ్జీల్లాంటి విరహ కవితలు అర్పిస్తున్నది మీరు కాదు గాని...మరొక అమ్మణ్ణి/ అయ్యవారు..మీరు కూడా రుచి చూస్తిరి..బహు బాగున్నవని మెచ్చుకొనిరి...

    ReplyDelete