Friday, February 20, 2015

భక్త అమర్ - జైన్ స్తోత్రం నించి ఒక స్తోత్ర గుళిక !

భక్తామర 
 
భక్త అమర్ - జైన్ స్తోత్రం నించి ఒక స్తోత్ర గుళిక !
 
భక్త అమర్ స్తోత్రం జైన్ ఆచార్య శ్రీ మానతుంగ ( 1100 AD around)  
 
త్వామవ్యయం విభుమచింత్యమసంఖ్యమాద్యం  
బ్రహ్మాణ మీశ్వర మనంతమనంగ కేతుమ్
యోగీశ్వరమ్ విదితయోగ మనేక మేకమ్ 
జ్ఞానస్వరూపమమలమ్ ప్రవదంతి సంతః !
 
 
త్వం అవ్యయం విభుం  అచింత్యం అసంఖ్యం ఆద్యం  
బ్రహ్మాణం ఈశ్వరం అనంతం అనంగకేతుమ్ 
యోగీశ్వరం విదిత యోగం అనేకం ఏకం 
జ్ఞాన స్వరూపం అమలం  (ఇతి) ప్ర వదంతి సంతః !!
 
त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यामाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनगंकेतुम्|
योगीश्वरं विदितयोगनेकमेकं
ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः|24|
 
మొత్తం ఉన్నవి నలభై ఎనిమిది స్తొథ్రాలు. ఇందులో మధ్య నున్న ఇరవై నాలుగవ స్తోత్రం నాకు అనిపించిన హైలైట్ !
 
 
 
శుభోదయం 
జిలేబి 
 

10 comments:

  1. జిలేబీగారూ, బాగుందండి. కాని ఒక చిన్న సందేహమండీ.
    జైనం అనేది నిరీశ్వరమతం కదా? మరి వారు ఎవరిని ఉద్దేశించి స్తోత్రపాఠాలు చేస్తున్నారని ఆశ్చర్యంగా ఉంది. ఒక జైన స్తోత్రంలో‌బ్రహ్మాణం ఈశ్వరం అని అనటం చూస్తే ఇప్పుడు నాకు జైనులూ ఆర్షధోరణిలోకి వచ్చి స్తోత్రాలు విరచించారా అన్న అనుమానం కలుగుతోంది. లెకుంటే జైనులకు ఈశ్వరుడేమిటీ? వారు పరబ్రహ్మం అనే తాత్త్వికభావనను ఆమోదించి ప్రస్తావించటం ఏమిటీ? నాకైతే బోధపడటం లేదు. బహుశః, ఇవన్నీ నా అజ్ఞానభ్రాంతిజనితమైన ప్రశ్నలు కావచ్చును. వీలైతే కొంచెం సందేహనివృత్తి చేసి పుణ్యం కట్టుకోవలసిందిగా నా విజ్ఞప్తి.


    ReplyDelete
    Replies
    1. లేజీబీ యెక్కడో యేదో పట్టింది!
      జిలేబీ ఇక్కడో పుల్ల రగిల్చింది?

      Delete
    2. అయ్య బాబోయ్ శ్యామలీయం వారు,

      యాదృచ్చికం గా ఆ భక్తామర్ చదవడం జరిగింది . అంతకు మించి నాకూ తెలియదు !

      పూర్ణ ప్రజ్ఞా భారతి గారు వివరించేరు ! అదే సబబేమో !

      నా వరకు అనిపించింది ఏమిటంటే , జైన్ సమయానికి (ఐదు వందల బీ సి కి ) ఈ స్తోత్ర మాల రచించిన సమయానికి మధ్య వెయ్యిన్ని ఐదు వందల సంవత్సరాల కాల అవధి ! మధ్య లో ఆది శంకరుల వారూ దేశం లో తమ ముద్ర వేసేరు ! సో, ఈ స్తోత్ర కర్త వారి కాలానికి అనుగుణం గా జైను మతాన్ని పాటించేరేమో మరి !

      హరి బాబు గారు,

      లేజీ బీ పట్టు లు ఉడుము పట్టులు సుమీ ! నెనర్లు !

      జిలేబి

      Delete
  2. శ్యామలీయం గారు ఇది తొలి తీర్థంకరుడైన ఋషభదేవుని స్తుతి. ఆయననే ఆదినాథుడు అంటారు. ఈయన అయోధ్యను పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. నాభి కుమారుడైన ఈ ఋషభుని కుమారుడే భరతుడు. ఆతని పేరిటే మనదేశం భారతదేశమైంది. ఈయన ప్రస్తావన స్కాంద, భాగవత పురాణాల్లో ఉంది. ఈ ఋషభుడు విష్ణు అవతారంగా చెప్పబడ్డాడు. (భాగ. 1-3-13) . ఈయన మానవులకు వ్యవసాయం, వంట, పశుపాలన, కవిత్వం, చిత్రలేఖనం వంటివి నేర్పాడని, 72 శాస్త్రాలకు మూలపురుషుడని జైనులు భావిస్తారు. వివాహ వ్యవస్థను, అంత్యక్రియల వ్యవస్థను ఈయనే ఏర్పరచాడని వారు భావిస్తారు. ఈయన గురించి బౌద్ధ గ్రంథాలలో సైతం ప్రస్తావించబడింది.

    ReplyDelete
  3. మర్చిపోయా.. ఈ స్తోత్రానికి ఆదినాథ స్తోత్రం అని కూడా పేరు.

    ReplyDelete
  4. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని కాలం వరకు హైందవానికి, ఆర్హత ధర్మానికి పెద్ద తేడా లేదు. వేదప్రమాణ్య విషయంలో తప్ప. 24వ తీర్థకరుడైన మహావీరుని కాలం నుంచే అవి వేరువేరైనాయి. మహావీరుడు తనకు ముందున్న తీర్థంకరుల కన్నా భిన్నమైన దర్శనాన్ని చెప్పాడు. అప్పటి నుంచి ఆర్హత ధర్మం జైనమతంగా మారింది. ఇది అంతకుముందున్న ఆర్హత ధర్మం కన్నా చాలా క్లిష్టమైన నియమాలతో కూడుకున్నది.

    ReplyDelete
  5. పూర్ణ ప్రజ్ఞ్జా భారతి గారు,

    నెనరస్య నెనరః !

    జిలేబి

    ReplyDelete
  6. ఆయనెవరో సాయిబు గారే
    ఆ మతానికి తొలి ప్రవక్త శివుడే అంటున్నారు?
    ఈయనేవరో జైనంలో కూడా
    ఆర్షమును బోలిన ఆర్హతను పైకి తీస్తున్నారు?
    *
    హర హర మహాదేవ!
    సర్వం జగన్నాధం!
    లోకాః సమస్తాః హైందవో భవతు?

    ReplyDelete
  7. //ఈయనేవరో జైనంలో కూడా ఆర్షమును బోలిన ఆర్హతను పైకి తీస్తున్నారు? //
    హరిబాబు గారు,
    నా నేతృత్వంలో హిందీ సాహిత్య్ కే వికాస్ మే జైన్ సాహిత్యకారోం కా యోగదాన్ అనే అంశంపైన పిహెచ్.డి. పరిశేోధన జరిగింది. అది చేసింది ఒక జైన పరిశోధకుడు. ఆ క్రమంలో నేను చాలా జైనధార్మిక గ్రంథాలను చదవడం జరిగింది. అలాగే ఆ పరిశోధన సాగిన నాలుగేళ్లలో నేను నాలుగు జైన గ్రంథాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. వాటిని చూసి ఒక జైన ధార్మిక సంస్థ దాదాపు 250 జైనగ్రంధాలను తెలుగులోకి అనువదించే జీవితకాల ప్రాజెక్టు నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టే ఆ సమాధానం చెప్పగలిగాను.
    //లోకాః సమస్తాః హైందవో భవతు?//
    హింసాన్ దూరయతి ఇతి హిందూ అనే నిర్వచనం ప్రకారమైతే ఇది తప్పు కాదని నా అభిప్రాయం. తప్పంటారా?

    ReplyDelete
  8. పూర్ణ ప్రజ్ఞాభారతి గారు,

    హింసాన్ దూరయతి ఇతి హిందూ అనే నిర్వచనం ... సూపెర్ డూపర్ !!

    జిలేబి

    ReplyDelete