Wednesday, February 25, 2015

మానస 'రోవర్' !

మానస   'రోవర్' !
 
మానస సరోవరం లో
మునిగి తేలుతా మనుకుంటే
మానస 'రోవర్'
అయ్యింది !!
 
మా ,నస, రోవర్ !
 
 
 
శుభోదయం
జిలేబి

1 comment:

  1. Sundaram
    on 07:29 వద్ద మార్చి 1, 2015 said: మార్చు
    0 0 Rate This
    శొంఠి వేంకటరమణ గారు….ప్రముఖ వాగ్గేయకారుడు”త్యాగరాజు” గారి సంగీత గురువుగారు.
    వెంకయ్యగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ వ్యవసాయం చేస్తూండేవారు
    వేంకటరమణగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ…ఉపాధ్యాయవృత్తిచేస్తూ …ఇతరులకు “సాయం చేస్తూ” ఉండేవారు (తూగోజి లో రాయవరం దగ్గర “శొంఠి వారి పాలెం” )
    వేంకట్రామయ్య గారు……తండ్రిగారు “మిగిల్చిన ఆస్థి!!!” ని వాడుకుంటూ…గుమాస్తా గిరీ చేసేవారు, వారి తమ్ముడు సోమ సుందర శాస్త్రి గారు….తనవాటా తో పాటు అన్నగారి వాటానూ “వ్యాపారంలో ఉం(ముం)చి” దేశం అంతా తిరిగారు….
    ఇలా మా “తాతలు- నేతులు” తాగడంతో……
    రక్తంలో “ట్రైగ్లిసరైడ్స్” ఎక్కువై… చెట్టు కొకరు…పుట్టకొకరుగా….”పొట్టకొరకు” దేశాలు పట్టి….
    చిన్నప్పటి “హెడ్మాస్టర్” గారి పుణ్యమా అని శొంఠి (SONTHI) లో ఘాటు తగ్గి చివరికి ఉత్త సొంటి (SONTI) గా మిగిలాం.
    పైకి కారం(కొంటె) గా ఉన్నా “జిలేబి లో తీపి” అంటే ఎప్పటికీ మక్కువే :)
    అందుకే జిలేబి లా—-బిజిలీ వ్యాఖ్యలూ, వరూధినిలా…నర్మగర్భితసుభాషితాలూ ….ఇలా “అమ్మ” ఎలా పలికినా చదివి ఆనందిస్తున్నాం.
    జిలేబి గారికి
    నమస్కారాలతో
    సుందరం

    Reply ↓

    ReplyDelete