Wednesday, February 4, 2015

అయ్యరు గారి తో కాఫీ విత్ జిలేబి !

అయ్యరు గారి తో కాఫీ విత్ జిలేబి !

పొద్దుట పెందరాళే లేచి చక్కగా సజాయించు కుని ఒద్దిక గా అయ్యరు గారి కాళ్ళ కి ముక్కోటి మార్లు మొక్కి వంటా వార్పూ కార్యక్రమం లో పడింది జిలేబి !

                                                        ఫోటో కర్టసీ గూగులాయ నమః !

అయ్యరు గారు నిద్ర లేచి 'కాలై కడంగల్' తీర్చుకుని సంధ్య వార్చి చేతిలో హిందూ పేపరు తెరిచిన ఆ క్షణా న జిలేబి నిండు ముత్తైదువ లా ముఖాన యాభై పైసల కుంకుమ్ బొట్టు తో చేతి లో ఘుమ ఘుమ లాడే కాఫీ కప్పుతో , అయ్యరు గారి ముందు ప్రత్యక్షమై 'స్వామీ' కాఫీ' అంది .

అయ్యరు గారు అదిరి పడేరు !

జిలేబి నువ్వేనా ! హాశ్చర్య పోయేరు !

అవును నాధా ! నేనే నేనే నేనే ముమ్మార్లు 'గణీల్' మని నొక్కి వక్కాణించి, జిలేబి, అయ్యరు గారి కాళ్ళకి మరో మారు నమస్కరించి , శ్రీ మహావిష్ణువు సమీపం లో లక్ష్మీ దేవేరి లా అయ్యరు గారి పక్కన ఆశీను రాలైంది .

స్వామీ !

ఏమీ ! ఈ వేళ ఏమైనా సూర్యుడు పడమట పొడిచినాడా జిలేబి ! అయ్యరు గారు మేళ మాడేరు !

స్వామీ ! నేటి నించి నేను మీ పద దాసీ ని . మీ పద పద్మ ముల చెంతనే నా జీవనము మళ్ళీ మరో మారు కాళ్ళకి మొక్కింది జిలేబి .

ఆహా ఏమి నా జీవన సౌభాగ్యము అని అయ్యరు గారు మురిసి , 'దేవీ జిలేబి ! ఏమి ఈ అకాల మార్పు ! పెళ్లి అయిన కొత్తల్లో ఎంత వినయ విధేయ తల తో నన్ను గోలిచినావో గుర్తు కోస్తోంది స్మీ ! అన్నారు అయ్యరు గారి తలని తలపై బొప్పిని తడివి చూసు కుంటూ ! అంతా కాల మహిమ !

స్వామీ ! నేను సతీ అనసూయ సావిత్రి వారల జీవన చరిత్రలను రేతిరి కి రేతిరి 'కాంతా' పాటం గా చదివా ! చెప్పింది జిలేబి మళ్ళీ స్వామీ వారి కాళ్ళకి మొక్క బోతూ !

అయ్యరు గారు అదిరి పడేరు ! ఇట్లా నిమిషానికి పదేసి మార్లు తన కాళ్ళకి ఈవిడ వందనాలర్పించు కుంటూ ఉంటె , తను ఎప్పుడు హిందూ పేపరు చదివేది !

స్వామీ ! ఇక మీదట నేను బ్లాగు లు గట్రా చదవను ! టపాలు వ్రాయను ! కామెంట్లు కొట్టను !" జిలేబి చెప్పింది !

జిలేబి నీలో ఇంత మార్పా ! అయ్యరు గారు నోరు వెళ్ళ బెట్టేరు .

అంతే స్వామీ అంతే! ఇక మీదట ఆ బ్లాగు లు గట్రా మీరే చదవండి మీ స్వరంలో వాటిని వింటూ నేను ఆనంద డోల లోఊయ లూగుతూ అట్లా పతి సేవలో తరి స్తాను ! కళ్ళ నిండు గా భాష్ప ధారా వాహిని అయి చెప్పింది జిలేబి . "అంతే కాదు స్వామీ , వాటి కి  కామెంట్ లు కూడా మీరే నా తరపున వ్రాయాలి "

వాట్ ! ఆ యూజ్ లెస్ బ్లాగులూ , పని లేక వ్రాసే వాళ్ళ బ్లాగు లు, కాలక్షేపం కోసం వ్రాసే కబుర్లు  నేను చదవాలా ! అయ్యరు గారు నిటారు గా అయ్యేరు ! - ఇట్లా నీకు బ్లాగు లు గట్రా నేను చదివితే , నేనెప్పుడు హిందూ పేపరు చదివేది ?

ఇక మీదట మీరు హిందూ పేపరు చదవద్దు స్వామీ నా కోరిక మీద ! మరో మారు కాళ్ళ కి నమస్కరిస్తూ విన్న వించు కున్నది జిలేబి .

అయ్యరు గారు ఈ మారు తటాల్ మని కాళ్ళు లాగేసు కున్నారు ఈ మారు ! ఆ మహా విష్ణువు లక్ష్మీ దేవేని సర్వ వేళ లా అట్లా కాలి దగ్గర ఎట్లా భరిస్తున్నాడో అని సందేహ పడి పోతూ .

అంతే కాదు స్వామీ ! ఇవ్వాల్టి నించి నేనే వంటా వార్పూ కూడా గమనిస్తా !

వాట్ మళ్ళీ అదిరి పడేరు అయ్యరు గారు . పెళ్లి కొత్తల్లో జిలేబి వంట రుచి ని గాంచి, సేవించి ఆస్పతాల్లో గడిపిన రోజులు వారి కళ్ళ ముందు కదులాడింది ! ఈ బాధ కన్నా వేరే ఏదైనా బాధ జీవితం లో ఉంటుందా మరి అనుకునేంత గా వారు బేజారై పడి పోయిన దినాలు కళ్ళ ముందు గిర గిరా తిరిగేయి !

జిలేబి ! నీ పతి ప్రాణములు నీకు వద్దా ! ఈ మారు సీరియస్ గా అడిగేరు అయ్యరు గారు !

అబ్బే, పతి ప్రాణములు ఎక్కడి పోతాయి స్వామీ ! మించి పోతే సతీ సావిత్రి లా ఆ యముడి తో నైనా పోరాడి మళ్ళీ నా కొంగు కి ముడి వేసేసు కోనూ ... రాత్రి చదివిన సావిత్రి కథ జోష్ లో రెండు వంద ల శాతం 'రాంభరోసా' తో  చెప్పింది జిలేబి .

వామ్మో ! ఏడు జన్మల్ బంధం  ఏడడు గుల బంధం అంటే ఇట్లా బందీ అవట మేనా ! అనుకుంటూ అయ్యరు గారు హటాత్తు గా వాలు కుర్చీ నించి లేచి కాషాయ వస్త్రాలు ధరించి హిమాలయం మార్గం పట్టేరు ఆ పాటి పెర్సనల్ స్పేస్ కూడా ఈ 'ఆండోళ్లు' మగాళ్ళ కి ఇవ్వకుంటా ఉంటె ఎట్లా అని ఆలోచిస్తో !

"స్వామీ ! స్వామీ ! పతియే ప్రత్యక్ష దైవం ! నేను మూడు పొద్దులా మీకు కాఫీ విత్ జిలేబి నైవేద్యం గావించి గాని పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనని ఆన చేసేను ! నా బాస ఏమి గాను " అంటూ , గజేంద్ర మోక్షం ఘట్టం లో లక్ష్మీ దేవి లా అయ్యరు వెంట పడింది జిలేబి 'కాటి కి పోయినా నిన్ను నే వదలను స్వామీ' అంటూ !!చీర్స్
జిలేబి

13 comments:

 1. అమ్మా జిలేబి తల్లీ ,

  మీరు రాత్రికి రాత్రి పతివ్రతల కధలు చదివేసి , వాళ్ళలా అయిపోవాలనుకోవటం బాగానే వున్నది గాని , అది సత్యం కావాలంటే మఱి అయ్యరు గారు హిమాలయాలు పడ్తే గదా మీరు పతివ్రతగా నిరూపించబడేది .
  మరో ముఖ్యమైన విషయమేమిటంటే ,
  ఇంతవరకు వంటా వార్పూ మానివేసి , బ్లొగులో టపాలు వ్రాసుకొంటూ , టపాలకి కామెంట్లు వ్రాసుకొంటు వచ్చిన మీరు ఉన్నట్లుండి యిలా రాత్రికి రాత్రే పతివ్రతలా మారిపోవాలనుకోవటం సబబు కాదు , సాధ్యం కానిది .
  మరిపోవాలనుకున్నా , మార్పు రావాలనుకొన్నా , మార్పు తేవాలనుకొన్నా రాత్రికి రాత్రి సాధ్యం కాదని తెలుసుకోవాలి .
  మనమందరము ఎన్నో మారులు చదివాము రోం వజ్ నాట్ బిల్ట్ యిన్ వన్ డే .
  మరో విషయమేమిటంటే అయ్యరు గారు మీరు మీరులా ఉండటానికే అలవాటు పడ్డారు . అటువంటి ఆయన మీద యిలా మీరు దూకేయటం ఏమీ బాగా లేదు .
  నా మాట విని అమ్మా జిలేబి మీరు మీరులా ఉండండి . పతివ్రత అనిపించుకోవాలంటే మేమందరము కలసి మీకు " పతివ్రతా శిరోమణి " అన్న బిరుదుని అయ్యరు గారి చేతనే అనిపిస్తాము .
  అప్పుడు అయ్యరు వారు , మీరు అను నిత్యం మునుపటిలాగ కాలం వెళ్ళబుచ్చవచ్చు .
  కొత్త కొత్త ప్రయోగాలు కొఱివి దయ్యాల లాంటివి . ఎవ్వరికి సుఖాన్ని కలిగించవు .

  ReplyDelete
  Replies
  1. శర్మగారూ మీరు మరీ అన్యాయంగా మాట్లాదుతున్నారేమో!
   ట్రూ రిపెంటెన్స్‌కి ట్వంటీఫోర్ అవర్స్ చాలవాండీ

   Delete
 2. > చేతి లో ఘుమ ఘుమ లాడే కాఫీ కప్పుతో ..... .... అయ్యరు గారి కాళ్ళకి మరో మారు నమస్కరించి ....

  ఎట్టెట్టా. చేతిలో కాఫీకషాయపుకప్పుతోనే అయ్యరు గారి కాళ్ళకి నమస్కరించటం అనే ఫీటు ఎలా చేసేసారబ్బా జీలేబీగారూ.

  కానోపును లెండు. పతివ్రతామతల్లులకు భూమిపై నసాధ్యము గలదే!

  ReplyDelete
  Replies
  1. అది జిలేబిగారి స్పెషల్ కదా...

   Delete
 3. శ్యామలీయం గారు ,

  నమస్కారం . ఈ నడుమ నా దత్తు తండ్రి గారి ఆస్తుల విషయాలలో కొంచెం బిజీగా వేరే చోట వుండటం వలన హైదరాబాద్ లో వుండటం లేదు .

  ఇక త్రూ రిపిటెంట్స్ కి 24 గంటలు సరిపోతుందన్నారు . నిజమే . కాని మన జిలేబి అమ్మగారు , నిజంగా మారాలని కాదు , ఓ వేళ మారుతానంటే అయ్యరు గారి స్పందన చూడాలని .

  అదీ కాకుండా జిలేబి వారు మారవచ్చేమో గాని అయ్యరు వారు మాత్రం మారలేరని నాకనిపిస్తోంది .

  ఎవరో మారుతారని ఎందులకీ తారుమారు ?

  నువ్వు నువ్వు గా జీవించమన్నారు మహానుభావులు .

  అందుకని జిలేబి అమ్మ మొన్నటి వరకు వున్నట్లు జిలేబిలానే వుండాలి , అయ్యరు గారు కూడా అలాగే వుండాలి .

  ReplyDelete
 4. జిలేబీలో ఈ మార్పుని బ్లాగు సోదరులు హర్షిస్తారని ఆశిస్తాను.
  అలాగే జిలేబి విత్ కాఫీ కార్యక్రమానికి (నమస్కారాలు మినహాయించి) ఓ ఆదివారం మమ్మల్ని కూడ ఆహ్వానిస్తారని మరీ మరీ ఆశిస్తున్నాను.

  ReplyDelete
 5. జిలేబీ గారికి ఇంత హఠాత్తుగా "జ్ఞానోదయం" వచ్చేటట్టు చేసిన వారెవరయినా ఆ పుణ్యాత్ములను మెచ్చుకోవాలి!

  ReplyDelete
 6. అమ్మా పిన్నీ..పాపం అయామకుణ్ణి వదిలెయ్ తల్లీ. ఏదో హిందూ పేపర్లో చ(ప్ప)ల్లని వార్తలు చదువుకునే స్వామి తట్టుకోలేని మార్పు ఇది. అప్పటి వంటదెబ్బ మర్నాడే తగ్గి ఉంటే ఇప్పుడు ఈ మార్పు తట్టుకునే నిబ్బరం అబ్బేదేమో. అదే ఇప్పటిదాకా గుర్తుంటే మార్పు తట్టుకోలేదు. రంగనాయకమ్మ లలితాసహస్రానికి బాలానందిని వ్యాఖ్య రాసినా తట్టుకోవచ్చేమో గాని, ఆకస్మిక, అనూహ్య, అనూయమైన మార్పంటే కాస్త కష్టమేమో... బాబాయ్ కంగారు పడకు నేనున్నా. కామెంటి కాపాడే ప్రయాస పడతా.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. రంగనాయకమ్మ లలితాసహస్రానికి బాలానందిని వ్యాఖ్య రాసినా
   ?
   రాసినా రాయొచ్చు.ఉగాది నుంచీ హిందూ పండగల్ని జరపాలని నిశయించుకున్నారట కామిరేడ్లు!వుగాది అంటే పంచాంగ శ్రవణం తప్పని సరి?సీపీయం రాఘవులు గారు కూర్చుంటారో,సీపీఐ నారాయణ గారు కూర్చుంటారో చూడాలి!ఆ వెంటనే శ్రీరామ నవమి వస్తుంది.మురంనా తోనే వడపప్పు పానకం పంచి పెట్టిస్తారు కాబోలు?తర్వాత కృష్ణాష్టమికి కుర్ర కామ్రేడ్లు వుట్లు కొడుతుంటే మురంనా చీరు గర్లుగా "కృష్ణం కలయజ సఖిం" పాడుతుంది.జిలేబీ ఇవ్వన్నీ చూడాలంటే ఈ ప్రయోగాలన్నీ మానేసి బుధ్ధిగా పాత స్టెయిల్లోకి దిగాల్సిందే:-))

   Delete
  3. హరిబాబు గారు. మీ వ్యాఖ్య మీరే తొలగించారని చూసి గభాల్న ఖంగారు పడ్డా. చీల్చి చెండాడి ఉంటారేమోనని. తర్వాతి వ్యాఖ్య చూశా. మీ ఉగాది ఊహ బాగుంది. ఇంతకీ ఆ పంచాగాన్ని రూసీలో చదువుతారా.. లేక చీనీలోనా తెలుపగలరు. పానకం ఎర్రగానే ఉంటుందా.. రంగుమారుద్దా...

   Delete
  4. అచ్చుతప్పులు కనబడి అసలు అర్ధం మారిపోయే ప్రమాదం వుందని సరి చేసి వేశా!యెరుపు నుంచి కాషాయానికి మధ్యలో యే రంగులోనైనా వుండొచ్చు?మరీ శ్రోత్రియ హిందువులు అటుకేసి పోరాదు:-))

   Delete
 7. ఆండు వారి పేరు మీద ఇద్దరు బ్లాగులు నడుపుతున్నారని నాకొచ్చిన అనుమానం.. ఇల్లాలి ముచ్చట్లు అని ఇలాగే ప్రముఖ ఎడిటర్ గారు ఒకానొక పత్రికలో శీర్షిక రాసేవారు..అట్లుంది ఈ జిలేబీయం.. వేరొక బ్లాగులో కవ్విస్తూ కవితలు రాస్తూ ఆకర్షించే బొమ్మలతో విరహాన్ని అందంగా అర్పిస్తున్నారు.. అవునా.. నిజమేనా..

  ReplyDelete