Tuesday, March 3, 2015

కనుల పండువ గా ఉన్న మాలిక !

కనుల పండువ గా ఉన్న మాలిక !


ఆ మధ్య మాలిక కూడా జాటర్ ధమాల్ అయిపోయిందేమో అనుకున్నా ! ప్చ్ తెలుగు బ్లాగర్లకి హారం పోవడం తో కామెంట్ల 'మింట్ల' కొరత ఖచ్చితం గా వచ్చిందని అనుకున్న తరుణం లో మాలిక ఓ మోస్తరు వత్తాసు ఇచ్చింది . ఆ పై బ్లాగిల్లు శ్రీ నివాస్ గారు తమ బ్లాగింటి ముంగిటి ని తీర్చి దిద్ది జాటర్ ధమాల్ పరిస్థితి నించి తెలుగు బ్లాగు లోకాన్ని బయటకు లాగేరు .

మళ్ళీ 'పిచలె మహీనే' మే (హిందీ లో చదవవలె) మాలిక అటక ఎక్కింది ! మహిళ ల కోసం మాలిక ప్రత్యేక సంచిక తెస్తోంది అన్న వార్తా, ఆ పై మాలిక అగ్రిగేటర్ బంద్ అయి పోయి మూల కూర్చోడం జరగడం జూసి ఆ హా మహిళా బ్లాగర్లు ఏమి పవర్ ఫుల్ అని హాశ్చర్య పోయా !

మహిళా ప్రత్యెక సంచిక ఇంపాక్టు కాదు - అగ్రిగేటర్ ప్రాబ్లెం మాత్రమె అని శ్రీ మాన్ 'మా లక్కు పేట రౌడీ గారు జేప్పేరు - నొక్కి వక్కాణించేరు ! త్వరలో నే మాలిక జాటర్ మళ్ళీ పుంజు కుంటుందని జేప్పేరు !!

అట్లా గే ఇప్పుడు మళ్ళీ మాలిక కనుల పండువ గా కామెంట్ల మింటు ల తో, విసుర్ల తో, ఖబుర్ల తో కళ కళ లాడి పోతోంది !

అగ్రిగేటర్ మాలిక జిందా బాద్ !

మా , లక్కు, పేట రౌడీ అనబడు , భరద్వాజ గారికి జేజే లతో

చీర్సు సహిత
జిలేబి
జాటర్ నో ధమాల్ !!

 

20 comments:

  1. నిజమండి. బ్లాగుపోస్టులు, వ్యాఖ్యలు "మాలిక" లోకి కాస్త త్వర త్వరగా పికప్ అవుతుంటాయి కాబట్టి కొంచెం సౌకర్యంగా వుంటుంది కదా! అందుకని "మాలిక" తిరిగి పట్టాలెక్కినందుకు సంతోషం. Good job Mr.Bharadwaja.

    ఇహ "జల్లెడ" లో "తాజా వ్యాఖ్యలు" 2014 అక్టోబర్ దగ్గర ఆగిపోయింది. "జల్లెడ" వారు దాన్ని సంస్కరిస్తే బాగుంటుంది.

    ReplyDelete
  2. Please thank our star Sreenu Vattipalli (Ekalingam) for fixing the problem. Another team member Ravi Piriya is working on the next version. Hopefully, we would be able to include more features.

    ReplyDelete

  3. విన్న కోట వారు,

    ఖచ్చితం గా పట్టా లెక్కినట్టే ! తమ తమ బిజీ షెడ్యూల్ ల లో కూడా తెలుగు మీదున్న మమ 'కారం' తో అగ్రిగేటర్ ని మళ్ళీ ముస్తాబు చేసేరు ! రౌడీ గారి టీం అందరికీ శుభాకాంక్షలు !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  4. భరద్వాజ్ గారు,
    తప్ప కుండా ! మీ టీమ్ మొత్తానికి క్రెడిట్ !

    By the way in your story of "Normalizing Story Points In a Scaled Agile Environment" how does the normalization help the project ? Does the score of B is any different to before or after normalization?

    జేకే !
    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Sorry .. somehow I missed this.

      Purists always oppose normalization, but in a scaled agile environment when the metrics are compiled at program level, normalization brings uniformity across all the teams.

      For instance, if the team reports a slippage of 10 story points, if they are not normalized we would not know (without some secondary analysis) how serious that issue is.

      Delete
  5. The original problem of wordpress blogs still continuing. Still it is to be resolved.

    ReplyDelete

  6. లక్కు పేట రౌడీ గారు,

    'కాలక్షేపం' ఖబుర్లు శర్మ గారి విన్నపాలు వినవలె !!

    జిలేబి

    ReplyDelete
  7. వర్డ్ ప్రెస్ బ్లాగుల ఇబ్బందులతో పాటు, మరొక సవరణ కూడా చేస్తే బాగుంటుందని "మాలిక" టీం వారికి విన్నపం - అదేమిటంటే, వ్యాఖ్యల పేజ్ లో ప్రతి వ్యాఖ్యని పూర్తి నిడివి చూపించే బదులు మొదటి రెండు మూడు లైన్లు మాత్రమే చూపిస్తే మరిన్ని వ్యాఖ్యలకి చోటు దొరుకుతుంది. "మాలిక" టీం వారు ఈ సూచనని పరిశీలించగలిగితే బాగుంటుంది.

    ReplyDelete
  8. జిలేబీ గారూ, అదేమిటీ ఇందాక ఓ అరగంట క్రితం మీ బ్లాగులో ఈ పోస్టు కి వచ్చిన వ్యాఖ్యలకి సీరియల్ నెంబర్లు కనిపించాయే. ఇదేదో కన్నుల పండుగ గా బాగుందని మెచ్చుకోలు వ్యాఖ్యొకటి తయారు చేశాను. తీరా వ్యాఖ్యని ప్రచురిద్దామని మీ బ్లాగులోకి మళ్ళా వచ్చేసరికి సీరియల్ నెంబర్లు మాయమైపోయి పేజ్ ఎప్పటి లాగే కనిపిస్తోంది. ఏమిటో మాయ!

    ReplyDelete
  9. "మాలిక" లో మళ్ళీ స్తంభన ఏర్పడినట్లుందే?

    ReplyDelete
  10. SSSSSSSSSSSS అంటే శర్మగారు బుస కొడుతున్నట్లా? అయినచో ఎవరి మీద, ఎందులకు?

    ReplyDelete
    Replies
    1. బుసకాదండి బాబూ! అలా వెళిపోయిందంతే....పేదవాని కోపము పెదవికి చేటు..... :)

      Delete
  11. మాలిక వారికి మా మీద దయ రాలేదు. Word press బ్లాగుల కామెంట్లు కనపట్టమే లేదు...ఇంతేనా?

    ReplyDelete
    Replies
    1. I have informed Maalika admin about this issue. Hope it gets resolved soon.

      Delete
    2. మాలికవారు ఈ విషయం పరిశీలిస్తున్నారు. త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

      Delete
    3. status quo continuing sir, sorry to report. No change and word press blog's comments are not visible in Maalika.

      Delete
    4. ఆనందమానందమాయెనే! మా వర్డ్ ప్రెస్ బ్లాగులకి మాలిక వారు మోక్షం ఇచ్చేసేరు, మా బ్లాగుల కామెంట్లు మాలికలో కనపడుతున్నాయోఛ్!!!

      Delete
    5. అవునండీ. ఆనంద మానంద మాయెనే!

      Delete