Sunday, March 29, 2015

శ్రీ రామ నవమి శుభాకాంక్షల తో -

శ్రీ రామ నవమి శుభాకాంక్షల తో -

 నీ దయ రాదా ! స్వామీ నీ దయ రాదా అంటూ విన బడుతున్న ఓ పంచ దశ లోక శ్యామల వాసి ఆర్త నాదం తో స్వామి వారు ఉలిక్కి పడేరు !

రామనవమి వస్తోంది !


తన 'భర్త' డే ! సీతమ్మ దిగాలు గా ఉన్న మిస్టర్ పెళ్ళాం గారి ని జూస్తూ బుగ్గ న వేలెట్టు కుని - వీరేనా వీరేనా ఆ అరివీర రావణా సురుణ్ణి సంహరించింది - ఓ భక్తుని ఆర్తనాదా నికి ఇంత ఆదుర్దా పడి పోతున్నాడే నా స్వామి - అనుకున్నది తల్లి . 

'స్వామీ' వారు, మీ బర్త డే ని హ్యాపీ గా సెలెబ్రేట్ చేసు కో కుండా ఇట్లా ఈ పంచ దశ మానవుని ఆర్త నాదానికి బెంబే లెత్తి పోతూన్నారేమిటి ? స్వామీ వారి ని సముదాయించి , 'స్వామీ ! మీరు ఎంత భక్త జన మం దార కులైనా  కూడా, ఇట్లా భక్తుల్ని మీ మీద సదా 'డిపెండ్' అయ్యేలా చేసుకోకూడదుస్మీ ! అమ్మవారు చెప్పింది . 

ఏమి చేయా లంటావోయ్ మిస్సేస్స్ రామం ? అడిగేడు శ్రీ రాముల వారు . 

ఏముంది ? మీరు వాళ్ళ ని 'ఎంపవర్' చెయ్యాలి ' చెప్పింది సీతమ్మ తన డ్వాక్రా మహిళా మీటింగుల ని గుర్తుకు తెచ్చు కుంటూ , మహిళా బ్యాంకు చైర్ పెర్సన్ మాటలు గుర్తు చేసుకుంటూ !

అంటే ? స్వామీ వారు ప్రశ్నా ర్థకం గా జూసేరు !

అంటే స్వామీ , వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పురోగతి ని వాళ్ళు వాళ్ళే చూసు కోవట మన్న మాట ! చెప్పింది సీతమ్మ , "వాళ్ళ కై వాళ్ళే అభివృద్ధి లో కి రావాలి " - స్వామీ వారి మరో జన్మ ఉద్గ్రంథం భగవద్ గీత ని గుర్తుకు తెచ్చు కుంది ఈ మారు - ఉద్దరేత్ ఆత్మ నాత్మానం అనుకుంటూ !

ఓస్ ! అంతే కదా అన బోయి స్వామి వారు సందేహం లో పడేరు !

ఇందులో ఎన్ని 'వాళ్ళు' ఉన్నాయో అర్థం గాక స్వామీ వారు కొంత బుర్ర గోక్కున్నారు !

అవును, మరు జన్మ లో శ్రీ కృష్ణా వ తారం లో అర్జునుని తో తానేం జెప్పాడు ? "అర్జునా ఫలమును ఆశింపక  పని జెయ్య వోయి అని కదా ? అంతకు మించి 'నాహం కర్తా , కర్తా హరిహి ' అనుకోవోయ్ అని కూడా చెప్పినట్టు గుర్తు !.  మరి అందుకే కదా మానవ మాత్రుడు నీ దయ రాదా అంటున్నాడు ? సందేహం లో పడ్డారు స్వామీ వారు . 

చదువరీ, స్వామీ వారే సందేహం లో పడితే , ఇహ మన లాంటి కోన్ కిస్కా హ్యూమన్ లం ఏ పాటి ??

అంతా విష్ణు మాయ !

 

8 comments:

  1. ఔరా శ్యామలీయం మాస్టారి పవరును కనిపెట్టిన జిలేబీ!
    అంతటి భక్తుణ్ణి ఇట్టుల ఆటపట్టించుట తప్పేమో జిలేబీ?

    ReplyDelete
  2. malika is dead again. What to do jilebi ji

    ReplyDelete

  3. మాలిక హెల్త్ మా, లక్కు పేట రౌడీ అండ్ కో వారి చేతుల్లో ఉంది !

    అంతా ఈస్టర్ హాలిడే మూడ్ లో ఉన్నట్టు ఉన్నారు !

    ఏమండీ లక్కు పేట భరద్వాజ రౌడీ గారు,

    మీ దయ రాదా !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  4. బ్లాగుల్ని బలే వదిలేసేరే! మళ్ళీ రావద్దుగాని, కుశలమే కదా! ఏల, ఎలా వదిలేశారో చెబ్దురూ :)

    ReplyDelete
    Replies
    1. అబ్బే బలాదూరు బ్లాగుల్ని వదిలి పెట్టడమా ! తరమా మా తరమా శర్మ గారు !

      పెళ్లి పనుల్లో బిజి బిజి అంతే !!

      చీర్స్
      జిలేబి

      Delete
    2. అభినందనలండీ జిలేబీ గారూ. వధూవరులకు మా ఆశీస్సులు శుభాకాంక్షలూ తెలియజేయండి.

      Delete
  5. పనసపొట్టుకూరతో పప్పన్నానికి పిలుస్తారనుకున్నానే. :)
    నూతన దంపతులకు
    దీర్ఘాయుష్మాన్భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఆశీర్వచనాలు.
    శర్మ

    ReplyDelete