Monday, May 11, 2015

లైఫే బిజీ అయి పోయింది ! నో టైం టు బ్లాగ్ !


లైఫే బిజీ అయి పోయింది ! నో టైం టు బ్లాగ్ !

 
చీర్స్ 
జిలేబి 
 

12 comments:

  1. నేటితో 'పనిలేక.. ' బ్లాగ్ మూతబడింది.

    నా బ్లాగ్రాతల్ని ఆదరించిన మీకు కృతజ్ఞతలు.

    గుడ్ బై!

    ReplyDelete
    Replies
    1. అయ్యొ. కనీసం కామెంట్స ని disable చేసి అయినా ఉంచండి సర్ .
      మీ బ్లాగ్ చాలా బాగుంటుంది .

      Delete
    2. బంగ్లాదేశ్‌లో బ్లాగర్లని హత్య చేస్తున్నారు.
      ఇక్కడ బ్లాగులు ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు.
      ఇలాంటి వాళ్ళని సంకలినులు నిరోధించాలి.

      మీ శ్రీరామనవమి టపా అభ్యంతరకరమైనదే అయినా మీ బ్లాగు మీ ఇష్టం.
      మానసికవైద్యులై ఉండి మీరే భయపడి పారిపోతే ఎలా?
      మీరు నమ్మినా, నమ్మకపోయినా గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కాస్త స్థితప్రజ్ఞత ప్రదర్శించండి.
      నా కామెంట్ నచ్చకపోతే పట్టించుకోకండి.

      Delete
  2. అన్నంత పనీ చేసారన్న మాట. కానీ అలా ముడుచుకుపోకండి డాక్టరు గారూ. మించిపోయిందేమీలేదు, మీ బ్లాగ్ తిరిగి అందరికీ ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఆలోచించండి. మీ బ్లాగ్రాతల్ని (ప్రతి పోస్ట్ కాకపోయినా, కొన్నయినా ; ఆ పర్సెంటేజ్ / మిక్స్ ఎక్కడైనా ఉంటుంది కదా) ఆస్వాదించేవాళ్ళున్నారు.

    ReplyDelete
  3. రమణగారు తమ 'పనిలేక' బ్లాగును మూసి వేయటం చాలా విచారం కలిగించింది. కాని వారెంత చిత్తక్షోభకు గురై అలా చేసారో అన్నది ఆలోచనీయం.

    తరచుగా ఈ మధ్యన కొందరు వెక్కిరింపు ధోరణిలో వ్యాఖ్యలు వ్రాస్తున్నారు. మోడరేషన్ కారణంగా తమ వ్యాఖ్యలు వెలుగు చూసే సందర్భం లేనప్పుడు టపాలు కట్టి మరీ వెక్కిరిస్తున్నారు.

    ఈ రొదగాళ్ళు సాధిస్తున్నదల్లా బ్లాగులోకాన్ని భ్రష్టుపట్టించటమే. వీరిని మనం అరికట్టలేం. అలాగని భరించనూ లేం.

    చేయగలిగిం దేమిటో తెలియటం లేదు.

    ReplyDelete
  4. రమణ గారు బ్లాగు మూయడం దురదృష్టకరం. ఎవరో కొందరు వ్యక్తుల మూలాన తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారికి మనవి.

    ReplyDelete
  5. అదేమి విచిత్రమో గాని ఇట్లాంటి టపా లు పెడితే అందరూ మూకుమ్మడి గా ఏకీభవించేసు కుంటారు !

    అదే రమణ గారు టపా లు వ్రాస్తే మాత్రం వామ్మో వామ్మో అంటూ గుండెలు బాదు కుంటూ టాట్ బూట్ అంటూ 'తాట వదిలించే స్తారు !

    బ్లాగర్లు కామెంట్ల గురించి ఎక్కువగా పట్టించు కో కూడదు. అట్లాగే కామెంట్ల కోసం టపాలు వ్రాయ కూడదు. బ్లాగ్ అన్నదానికి మా గూగుల్ వారిచ్చిన నిర్వచనం లాగ్ . మన ఆలోచనలని పదిల పరచుకునే దానికి ఒక మార్గం.

    ఇక, పని లేక బ్లాగు రమణ గారికి ఒక విన్నపం.

    తమిళ నాడు లో రచయిత ని నోరు మూయిస్తే శ్రేష్టమైన టపా (అదిన్నూ ఏ రచయిత కాని, మీడియా గాని వారిని స్ట్రెయిట్ గా తప్పు పట్ట కుండా డొంక తిరుగుడు గా కథ లాగిస్తూంటే ) మీరు వ్రాసారు. అట్లాంటి రచయిత భావ ప్రకటనకి ఊత నిస్తూ .

    అట్లాంటి మీరే బ్లాగు లోకం లో కోన్ కిస్కా దొంగ నాయకమ్మల ల కామెంట్ల కో, కాకుంటే , మీ బ్లాగు లో నే వ్రాసే కామెంట్ల కో , ప్రొటెస్ట్ చేసి బ్లాగు మూయడం సబబు కాదు.

    ఇదియే జిలేబి విన్నపం - టేక్ బ్రేక్, బట్ డూ కం బేక్ విత్ యువర్ ఎవర్ విట్టింగ్ పోస్ట్స్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఏకీభవిస్తున్నాను జిలేబీ గారూ.

      Delete
  6. డాక్టర్ గారూ, మాంచి హిలేరియస్ స్టైల్లో రావిశాస్త్రి, కేశవరెడ్డి,.. లాంటి నేను మిస్సయిన అనేక రచయితలూ, రచనలు, ఇంకా ఎన్నెన్నో సంగతులు మీరు చెప్తుంటే ఎవరో జ్వాలను రగిలించారు ..
    వేరెవరో(పాఠకులం) దానికి బలియైనారు... ఈ పాట గుర్తొస్తోంది సార్.
    "పనిలేక"లోనే రిక్వెస్ట్ చేద్దామనుకుని కొంచెం లేటయ్యాను. ఇలా అవకాశం కల్పించిన జిలేబీగారికి థాంక్స్ చెప్తూ మీరు మళ్ళీ "పబ్లీకున నిలబడాలని" కోరుతున్నాను.
    - అం'తరంగం'

    ReplyDelete
  7. "పబ్లీకున నిలబడమనడం'లో నా ఉద్దేశం - అలా నిలబడినప్పుడు అప్పుడప్పుడు కొందరు ఏదో అంటూనే వుంటారు, అలాంటి సందర్భాలు రాకుండా ఎవాయిడ్ చేస్తూ మీ అభిప్రాయాలు వ్రాయవచ్చు అని. _/\_

    ReplyDelete