Monday, May 25, 2015

విగ్రహం లో ని దేవుడు ఉలిక్కి పడ్డాడు !

విగ్రహం లో ని దేవుడు ఉలిక్కి పడ్డాడు !

విగ్రహం లో దేవుడా ! ఇట్లాంటి వి మా ఇంటా వంటా లేదండీ ! ఇవన్నీ పాప భూయిష్టం ! చెప్పేడు ఆ శాల్తీ . 

విగ్రహం లో అప్పటి దాకా జోగుతూ, తూగుతూ, కురై ఒండ్రుం ఇల్లై మరై మూర్తి కన్ణా అంటూ ఎమ్ ఎస్ ఆర్ద్రత తో పాడుతూ ఉంటె, ఆహా ఏమి ఈ గాన మహిమ అనుకుంటూ డోలాయ మాన మైన  విగ్రహం లో ని దేవుడు ఉలిక్కి పడ్డాడు !

కళ్ళు చిట్లింటి చూసాడు . ఎవడో శాల్తీ - పదునాలుగు వందల సంవత్సరాల మునుపు శాల్తీ - ధ్యానం లో ఏకమై , మమేకమై , ఏకత్వాన్ని ప్రతి పాదిస్తే, ఈ కాలం మానవుడు దానికి వక్ర భాష్యం చెప్పుకుంటూ ఉంటె, ఆలోచనలో పడ్డాడు . 

అవును కదా అదే సమయం లో భారద్దేశం లో తన పంపు శంకరుడు కూడా అద్వైతాన్ని ప్రతి పాదిం చేడు . 

తన వా డైన కృష్ణుడు చెప్పలే ? యే యథా మాం ప్రపద్యంతే  తాం తదైవ భజామ్యహమ్ ? అంటూ ?

అబ్బ ! ఈ మానవులకి అతి తెలివి ఎక్కువై పోయిన్దిస్మీ అనుకుని నిట్టూ ర్చేడు కొండ దేవర . 

కొండల లో నెల కొన్న కోనేటి రాయా ! మరో శాల్తీ పాడటం మొదలెట్టేడు . 

ఓం ఓం అంటూ మరో శాల్తీ ఓంకార నాదాన్ని పూరించే డు . 

అల్లాహో అంటూ మరో మానవుడు గొంతెత్తే డు . 

మై లార్డ్ ఇన్ ది హెవెన్ .... అంటూ మరొక్కడు .... 

హృదయేషు లక్ష్మీ అని మౌనం లో, ధ్యాన మార్గం లో మరో మానవుడు ... 

కర్మ మార్గమే సరి దేవుడూ లేదూ, దెయ్యమో లేదూ అనుకుంటూ మరో మానవుడు !

కొండ దేవర చుట్టూ తా పరికించి చూసేడు !

తాను నెల కొల్పిన ఈ ప్రకృతి ఎంత వైవిధ్యం తో ఉంది ?

అట్లాంటింది ఆ ప్రకృతి ని నెలకొల్పిన తన్ను ఒక్క మార్గం లో నే చేరు కోగలాడా ఈ కోన్ కిస్కా మానవుడు ?

ఏమిటో వీండ్ల వెర్రి !

ప్చ్ ప్చ్ ఈ మానవుడు కి జ్ఞానం ఇచ్చేడు తను . దాన్ని సద్వినియోగం మాత్రమె చేసుకోవోయ్ అని చెప్పి ఉండాల్సింది  నిట్టూర్చేడు . 

దేవేరి ముసి ముసి నవ్వులు నవ్వింది స్వామీ వారిని చూసి - ఆ సమయం లో తనే కదా విష్ణు మాయ యై హాయ్ డియర్ అంటే, స్వామి మాయలో పడి ఆ చెప్పడాన్ని మరిచి పోయేడు !??



చీర్స్ 
జిలేబి 

4 comments:

  1. బ్లాగుల్లోని కామెంటేటర్లు ఉలిక్కిపడ్డారు?

    ReplyDelete
  2. దేవుడు ప్రపంచం నుంచే పారిపోతున్నాడు :)

    ReplyDelete
  3. బ్లాగర్లు కూడా ఉలిక్కిపడుండాలే !

    ReplyDelete
  4. హరిబాబు గారు, శర్మ గారు, విన్న కోట వారు,

    అబ్బే ! ఇంకా జోష్ రాలేదండీ !!

    జిలేబి

    ReplyDelete