Monday, June 29, 2015

ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు

ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు - ఆలోచనా తరంగాలు -

ఆలోచనాత్మక మైన టపా !

ఈరోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరీష్ సూరపనేని గుంటూరుకు వచ్చాడు.

'ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను.మీ ఇంటి అడ్రస్ చెబితే వచ్చి కలుస్తాను.' అని ఫోన్ చేశాడు.

'ఏం పని మీద కలవాలనుకుంటున్నారు?' అడగడం కొంచం రూడ్ గా అనిపించినా తప్పక అడిగాను.

'ప్రత్యేకంగా పనేమీ లేదు.ఊరకే కలుద్దామని వచ్చాను' అన్నాడు.

'పనేమీ లేకుంటే కలవడం ఎందుకు? పిచ్చాపాటీ కబుర్లు నేనిష్టపడను.' అన్నాను.ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే,నా సాధనకే నాకు సమయం సరిపోదు. అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను.ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను.చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.

అవతలనుంచి నిశ్శబ్దం. బహుశా చిన్నబుచ్చుకున్నాడేమో అనిపించింది.

'సరే.రండి.కానీ ఒక్క పదిహేను నిముషాలు మాత్రం మీతో మాట్లాడగలను.' అన్నాను.

కాసేపట్లో గిరీష్ ఇంటికి వచ్చి చేరాడు.

విజయవాడనుంచి హైదరాబాద్ వెడుతూ మధ్యలో నన్ను చూచి వెళదామని గుంటూరుకు వచ్చానని చెప్పాడు.శ్రీశైలం సాధనా సమ్మేళనానికి రావాలనుకుని కూడా రాలేకపోయానని అన్నాడు.

నేనేమీ రెట్టించలేదు.

కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక - 'ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. కాసేపయ్యాక మళ్ళీ ధ్యానం కొనసాగించవచ్చా?' అడిగాడు.

'అసలు చెయ్యవలసింది అదే. ఆలోచనలలో కొట్టుకుపోతున్నామన్న తెలివి వచ్చాక మళ్ళీ ధ్యానాన్ని సాగించాలి' అన్నాను.

పూర్తి గా .... ఆలోచనా తరంగాలు - శ్రీ శర్మ గారి టపా 


చీర్స్
జిలేబి

 

Saturday, June 27, 2015

రావణలంకలో రమణి సీతమ్మ!

 
శ్యామలీయం 
సంక్షిప్త రామాయణ మంజరి 


బ్రహ్మాదు లడుగగా వైకుంఠవాసి
చిన్మయు డంతట శ్రీరాము డనగ
దశరథపుత్రుడై ధరణి కేతెంచి
మునికులేశుని యాగమును వేగగాచి
హరమహా చాపంబు నవలీల నెత్తి
అవనిజ సీతమ్మ హస్తమ్ము బట్టి
జనకు డాజ్ఞాపించ సంతోషముగను
తమ్ముండు భార్యయు తనతోడు కాగ
నారచీరలు కట్టి నడచి కానలకు
ఖరదూషణాది రాకాసుల జంపి
వెలుగొందు చుండగా విపినంబు లందు
రావణుండను వాడు రాక్షసాధముడు
మోసాన సీతను మ్రుచ్చిలి పోవ
ఇంతిని వెదకుచు ఋష్యమూకాద్రి
వాసియై యుండిన వానరేశ్వరుడు
సుగ్రీవు చెలిమిని సొంపుగా బడసి
ఆతని మంత్రియౌ ఆంజనేయుండు
రావణలంకలో రమణి సీతమ్మ
జాడ లరసిరాగ సాగరమునకు
సేతువునే కట్టి చెచ్చెర కోతి
సైన్యమ్ముతో లంక చేరి ఢీ కొట్టి
సకలరాక్షసబలక్షయ మొనరించి
ఆహవంబున రావణాసురు ద్రుంచి
ముల్లోకములకును మోదమ్ము గూర్చి
స్వస్థానమును చేరి సర్వలోకములు
హర్షింప దివ్య సింహాసనం బెక్కి
పదియు నొకటి వేల వర్షముల్ పుడమి
వైభవంబుగ నేలి వైకుంఠమునకు
వేడుక మీరగా వెడలె శ్రీకరుడు
పరమాత్ము డాతని పాదాంబుజములు
తలచిన కలుగును తప్పక శుభము


శుభోదయం
జిలేబి 
(రమణీ నీ సమాన మెవరు!)

Friday, June 26, 2015

బోడిగుండుకి బట్టతలే శిక్ష ! (పని లేక రమణ - వెల్కం బెక బెక )


బోడిగుండుకి బట్టతలే శిక్ష !
one of the very impressing post from
initial years of blogging !
 
సంచలనాత్మక టపా
 
పని లేక రమణ గారు - మీరు మళ్ళీ మీ బ్లాగు మూత ని తెరిచి నందులకు
వెల్కం బెక బెక !!!
ఎప్ప్లటి లాగే మళ్ళీ మీరు టపాల తో తెలుగు బ్లాగు లోకాన్ని అలరింప జేస్తారని
ఆశిస్తూ
జిలేబి ప్రెజెంట్స్
 
 


తలనీలాలు ఇచ్చారు. ఏ దేవుడుకి సార్?". ఓ అతికుతూహల పేషంట్ యొక్క అనవసరపు వాకబు.
             
"డాక్టర్ గారు, మీరు చాలా పధ్ధతిగల మనిషండీ. ఈ రోజుల్లో చదువుకున్నవారిలో ఇంత భక్తిభావం అరుదుగా కనిపిస్తుంది!" ఓ ముసలి పంతులుగారి అతిమెచ్చుకోలు.
            
'ఓ ప్రభువా! ఈ పాపిని రక్షించు!'
             
రాన్రాను నెత్తిమీద కేశరహిత ప్రదేశం పెరుగుట వలన.. జయసూర్య, బ్రూస్ విల్లిస్ మొదలగువారి గుండు నుండి స్పూర్తి పొంది.. నేను కూడా బోడిగుండు చేయించుకొని.. ఫేషన్ గురు వలే పోజ్ కొట్టిన మొదటిరోజు అనుభవమిది!
             
మనది కర్మభూమి. ఇచ్చట బట్టతల వాడి ఫాషన్ గుండునీ, దేవుడి భక్తిగుండునీ ఒకేగాట గట్టే అజ్ఞానులే ఎక్కువ. భగవంతుణ్ణీ భక్తుణ్ణీ అంబికా దర్బార్ బత్తి ఎంత అనుసంధానం చేస్తుందో నాకు తెలీదు కానీ బోడిగుండు మాత్రం ఖచ్చితంగా చేస్తుందని చెప్పగలను.


మానవునికి తన జుట్టు అందానికీ, అహంకారానికీ చిహ్నం. ఈ రెండూ ఆ దేవుడికి సమర్పించడం త్యాగానికీ, భక్తికీ కొలబద్ద అని అంటాడు అన్నయ్య. అటులనే కానీండు. మరి గుండు దాచడానికి టోపీ ఎందుకు పెట్టుకుంటారో!
              
అయినా నా బట్టతలకో కథ ఉంది. నాకు మెడిసిన్ సీటొస్తే గుండు చేయిస్తానని మా అమ్మ తన ఇష్టదైవమైన ఆ తిరపతి వెంకన్నకి మొక్కుకుంది. కానీ నేను ససేమిరా అన్నాను.


నాకు జుట్టుపై ప్రేమకన్నా.. కష్టపడి సాధించిన మెడికల్ సీటుని దేవునిఖాతాలో వెయ్యడానికి మనసొప్పలేదు. అంచేత ఏంచేయ్యాలో తోచని అమ్మ మధ్యేమార్గంగా అర్భకుడైన రెండేళ్ళ మా అక్కకొడుక్కి గుండు కొట్టించింది. 


ఈ ఎడ్జస్టుమెంట్ గుండు ఆ దేవుడికి నచ్చినట్లు లేదు. అప్పటినుండీ వెంకటేశ్వరస్వామి నా మీద పగబట్టి.. నా నెత్తిమీద కల తనదైన బాకీ (జుట్టు)ని.. వాయిదాల పధ్ధతిన శాస్వితంగా తీసేసుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారివలే దేవుడు కూడా బాకీ వసూలు దగ్గర ఖచ్చితంగా ఉంటాట్ట! అమ్మ చెప్పింది.


'దేవుడు జుట్టునే బాకీగా ఎందుకు వసూలు చేసుకోవడం? ఏకంగా మెడిసిన్ సీటే వెనక్కి లాక్కోవచ్చుగా?' ఈ సందేహానికి అమ్మ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది.


'ఆ తిరపతి వెంకన్నకి అదెంతసేపు పని! కానీ ఆయన అలా చెయ్యడు. నువ్వు తన భక్తురాలి కొడుకువి! అంచేత ఏదో మందలించి వదిలేసినట్లు బట్టతల అనే తక్కువ శిక్ష వేశాడు. సంతోషించు.' అంటూ అమ్మ బల్ల గుద్దుతుంది. నమ్మక తప్పదు!


అంచేత మీకు చెప్పొచ్చేదేమనగా.. యుల్ బ్రిన్నర్, బ్రూస్ విల్లిస్, అమ్రిష్ పూరీ, గిబ్స్ మొదలైన బోడిగుండు వీరులంతా కూడా.. వారి తల్లులు మొక్కిన పాతమొక్కుల తాలూకా బాకీలు తీర్చే క్రమంలో బట్టతలల బారిపడ్డారని! అప్పుడేకదా మా అమ్మ 'గుండుమొక్కులు - బట్టతల థియరీ' కరెక్టయ్యేది.


ఈమధ్య ఓ తోటి బట్టబుర్రవాడు బట్టతల మేధావిత్వానికీ, మగతనానికీ ప్రతీకలనీ.. ఇంకా ఏవో చాలా చెప్పాడు.

కానీ వాడు తన బట్టతల గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ.. ఆ భాధ తప్పించుకోడానికి మాత్రమే ఈరకమైన వాదనలని తలకెత్తుకున్నాడని అర్ధమైంది.
              
నాకు మాత్రం నా జుట్టులేమి మీద అంత ఆత్మన్యూనతా భావమేమి లేదు. 'ఉంటే మంచిదే.. ఉండకపోతే మరీ మంచిది!' లాంటి ఉదాసీనవైఖరి తప్ప!

*య రమణ*

చీర్స్
జిలేబి

Thursday, June 25, 2015

కామెంట్ల తో కామెడీ - సరదా సరదా గా :)


కామెంట్ల తో కామెడీ - సరదా సరదా గా :)

ఈ మధ్య లేచిన పెను తుఫాను లో మునిగి తేలి కామింట్ల వరదలో కొట్టు మిట్టాడి ఆ పై తేలి కామింట్లు చదువుతూం టే ఒక కామింటు కి మరో కామింటు రిప్లై గా కనిపిస్తే ఆహా ఇదియే కదా కా మింటు సరదా అనుకుంటూ కొంత జోడింపు తో సరదా గా కాలక్షేపం కోసం -

  • బ్లాగు : Padmarpita...
    Janani Maata
    ఇదేం సావుకొచ్చే
    భయంతో చస్తే ఎట్లమ్మ

  • బ్లాగు : Padmarpita...
    నాలో నేను

    తిడుతూనే ప్రేమ ఎంతో ఒలకబోసారు. చాలా బాగుంది
     
    ****
     
    Sudha Srinath
    ‘తండ్రికి మరో పేరు బాధ్యత.

  • బ్లాగు : మన భద్రాచలం...!
    Uppal
    Inspiring narrative!

  • ****

    బ్లాగు : వరూధిని
    YJs

    మీరు ఎదురింటి మోకాలికి పక్కింటి బోడిగుండుకి లింక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించండి!
     
  • బ్లాగు : కష్టేఫలే
    kastephale

    ఇదీ నిజమేనండోయ్!
    బోడి గుండుకీ బొటనవేళ్ళకీ ముళ్ళెట్టడం తేలికేం కాదండి,అబ్బో! దానికెన్ని తెలివితేటలు కావాలండి, మగపురుగులికి ఆ తెలివితేటలేవీ? 
    ధన్యవాదాలు.

  • ****


    బ్లాగు : నెమలికన్ను

    మీరు మిస్సయినట్లు ఉన్నారు.ఈ కధ నుండే ఆ వ్యాఖ్యలు తీసుకున్నాను.మిమ్మల్ని ఉద్దేశ్యించి కాదు.
     
    బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

    మీకు నచ్చే జవాబులను మీకు మీరే చెప్పుకోగలరు కాని ఇతరులు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పలేరని అనిపిస్తోంది.
     
    ***
     
     
    అడ్వొకేట్ జెనరల్ గారు ఏమన్నారో నాకు తెలీదు. మీకు తెలిస్తే లింకు ఇవ్వగలరా?
     
    విన్నకోట నరసింహా రావు
    "Power tends to corrupt and absolute power corrupts absolutely" అని 19వ శతాబ్దలోనే అన్నాడు కదా ఓ బ్రిటిష్ ఎం పి లార్డ్ ఏక్టన్ (Lord Acton). ఆయనే మరో మాట కూడా అన్నాడు - "Great men are almost always bad men !
     
    *** high light :)
     
  • బ్లాగు : Telangana Assange
    assange telangana
    తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నా రూపం తెలుసు..
  •  
  • బ్లాగు : నగ్నచిత్రం
    Narayanaswamy S.
    Interesting. Look forward to it


  • ****

    సరదా గా వేరు వేరు కామింట్ల ని చదివి వాటికి లింకు పెట్టేరంటే ఆల్ ఈజ్ టైం పాస్ ఫన్ :) మీకు ఇట్లాంటివి కన పడితే షేర్ టు ఎంజాయ్ :)

    చీర్స్
    జిలేబి

     

    Tuesday, June 23, 2015

    జిలేబి ఎచట ఉండును ?

    జిలేబి ఎచట ఉండును ?

    వసుంధర వారి పరిచయం



    జిలేబి

    క్కువగా

    దివిన

    పాల లో

    ఉండును !


    జిలేబి

    Monday, June 22, 2015

    విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

    విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

    "వైదేహీ, జనకాత్మజే, స్త్రీలు స్వభావ రీత్యా విముక్త ధర్మ రీత్యా చపలులు, భేదాన్ని కలిగించే వాళ్ళు - ఇట్లాంటి పరుష వాక్యాలు నీ వద్ద నించి నేను వినలేను "

    చెప్పింది లక్ష్మణుడు - ఉద్దేశించింది సీతమ్మ తల్లిని .

    అరణ్య కాండ లో జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని,సీతా దేవి,  లక్ష్మణుని రాములవారిని కాపాడ డానికి వెళ్ళమంటే, లక్ష్మణుండు ససేమిరా కుదరదం టాడు - ఆ ఆర్త నాదం రామునిది కాదు - ఆ మాయావి రాక్షసులది - నిన్ను కాపాడ మని రాములవారి ఆజ్ఞ - ఇక్కడి నించి కదలను గాక కదలను అని లక్ష్మణుడు అంటే ,

    అమ్మవారు "సంరక్త లోచను" రాలై లక్ష్మణుని పరుష వాక్యాలతో అంటుంది -

    'లక్ష్మణా, నువ్వు నన్ను పొంద డానికే రాముని వెంట గోముఖ వ్యాఘ్రం వలె పొంచి పొంచి వచ్చావు ఈ కాననానికి" అని .

    అంతటి తో ఊరుకున్నదా  ?

    "ఇది నువ్వూ , భరతుడు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయివుండ వచ్చు. భరతుడు అర్ధం (రాజ్యం) , నువ్వు మరొక అర్ధమైన నన్ను నా పతి నించి వేరు జేయాలని అనుకున్నారు' అంటుంది పరుషం గా  .

    "నా పై కోరికతో నువ్వు  రాముడు ఎట్లా పోయినా ఏమైనా కానీ అని ఆతన్ని కాపాడ డానికి  వెళ్ళ నంటు న్నావు "

    लोभात् तु मत् कृतम् नूनम् न अनुगच्छसि राघवम् |
    व्यसनम् ते प्रियम् मन्ये स्नेहो भ्रातरि न अस्ति ते || ३-४५-७

    ఇట్లా పరుష మాటలు మాట్లాడి (వాల్మీకి అంటాడు 'సంరక్త లోచనా ! అని ) అన్న మరో క్షణం లో నే కళ్ళ నీళ్ళు జల జలా రాలి పోతున్నాయి - భీత హరిణి ! - బాష్ప శోక సమన్విత !

    మరో క్షణం లో లక్ష్మణుని - अनार्य करुणारंभ नृशंस कुल पांसन అంటూ మరో మారు జాడించడం మొద లెడు తుంది !(ఇట్లా జాడించడం అన్నది మాకు వెన్నతో బెట్టిన విద్య :) అర్థమున్నా లేకున్నా జాడిస్తాం !)

    ఈ అరణ్య కాండ లో ఈ ఒక్క సర్గ లో నే వాల్మీకి  స్త్రీ ఒక వివశ స్థితి లో ఎట్లా ఎట్లా మాట్లాడ గలదు - ఏమేమి అనుకో గలదు - ఏవిధ మైనట్టి 'reaction' చూపించ గలదు అన్నదాన్ని  ప్రముఖం గా చూపించడం జరుగుతుంది.

    యథొ కర్మః తథొ ఫలః  అన్నదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అవుతుందేమో మరి.

    ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

    మళ్ళీ అంటుంది సీతమ్మ లక్ష్మణుడి తో -- గోదాట్లో దూకైనా , అగ్నిలో దూకైనా చస్తా గాని, రాముల వారు లేని జీవితాన్ని నేను చూడ లేను - మరొక్కరి తో ఉండ లేను అని - गोदावरीम् प्रवेक्ष्यामि हीना रामेण लक्ष्मण ! అంటుంది

    (రామాయణం లో ఈ అరణ్య కాండ తనకు అన్నిటి కన్నా నచ్చిన కాండ అని చెప్పు కున్నారు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రు ల వారు - ఎందుకంటే - ఇందులో గోదావరి మాట ఉన్నదంట ! కాండం పర్యంతం ఆంధ్ర దేశం ఉన్నదంట !-  అందుకనేమో 'గోదాట్లో దూకి చస్తా ' అన్న పదం ఆంధ్ర దేశం లో ప్రాశస్త్య మైన పదమయి పోయింది మన  'ఆండోళ్ళ కి ' , సీతమ్మ వారి స్టైల్ లో !- అబ్బా, ఈ గోదావరి తీరం వాళ్ళు రామాయణం లో కూడా గోదారి పిడకల వేట  వెయ్యకుండా ఉండరు సుమీ !!!))

    प्रवेक्ष्यामि हुताशनम् |! - అగ్గి లో బుగ్గై పోతా నంటుంది మళ్ళీ .

    దీని పర్యవసానం - యుద్ధ కాండ లో అగ్ని ప్రవేశ ఘట్టం !

    మరి ఈ అగ్ని ప్రవేశానికి కారణం సీతమ్మ తన గురించి చెప్పిన శోకా తప్త మాటలే తధాస్తు దేవతలయ్యే యా ?

    పరుష వాక్యాలను విన్న లక్ష్మణుడు తన రెండు చెవుల మద్య కాల్చిన బాణం  తో పొడిచినట్టు ఉన్నది అని మళ్ళీ ఇట్లా అంటాడు - "ఇట్లాంటి ధిక్కారా లతో నిన్ను నువ్వే శపించు కుంటున్నావు వైదేహీ అని" -

    धिक् त्वाम् अद्य प्रणश्यन्तीम् !


    న తు అహం రాఘవాత్ అన్యం కదాపి (పదాపి!) పురుషం స్ప్రుశే !

    न तु अहम् राघवात् अन्यम् कदाअपि (पदापि !) पुरुषम् स्पृशे!?



    శుభోదయం
     జిలేబి
    (రామా ! నిన్ను నేను వదలను గట్టి గా 'హేటేస్తూ' ఉంటా :)

    Saturday, June 20, 2015

    బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి (ఆఖరి భాగం)


    బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి (ఆఖరి భాగం)

    ... రెండో భాగం ఇక్కడ


    ఫోటో కర్టసీ : చందమామ 1992 ఏప్రిల్ నెల 


    ... "బ్లాగ్ పండితులారా ! పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదను కుంటాను . శ్రీకాంతుడు వ్రాసిన ఈ పనికి మాలిన , పనిలేక వ్రాసిన టపాలని చదవడం రాక్షస జన్మ కంటే మరీ ఘొరమైనది ! అందువల్లనే ఏ ప్రయోజనమూ లేని ఈ చప్పిడి ఖబుర్లు విన్న బ్లాగ్రాజు ప్రవీణుడు రాక్షస రూపం నించి విముక్తుడయ్యాడు . మీ బ్లాగ్దేశ ప్రజలు తమ తమ ఖర్మ ఫలాన్ని అనుభవించ డానికి ఇక ముందు నా శాపాల తో అవసరం లేదు . 

    ఇలాంటి పనికి రాని టపాలు చదివితే చాలు ! ఇక మీదటి నించి ప్రపంచం లో మునులూ వాళ్ళ శాపాలు ఉండవు ! వాటి బదులు ఇదిగో ఇట్లాంటి టపాలే ఉంటాయి అవే మీ ప్రజల కర్మ ఫలాన్ని అనుభవింప జేస్తాయి " అన్నాడు బ్లాగ్వాస మహాముని చిరు నగవులు చిందిస్తూ .

    ఆ క్షణం లో నే బ్లాగ్ కవి పండిత కథకుల సాహితీ వేత్త లందరూ చూస్తూండగా ఆకాశం నించి యూ ఎఫ్ ఓ  ఒకటి దిగింది . అందులో ఉన్న అంతర్గ్రహ యాత్రీకులు  బ్లాగ్వాసుని ఆహ్వానించారు. బ్లాగ్వాసుడు అక్కడ ఉన్న వారితో " ఈ బ్లాగ్ టపాల ధర్మమా అని నా కర్మ ఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను . ఇక సెలవు " అంటూ ఆ యూ ఎఫ్ ఓ విమానం ఎక్కాడు . !


    బ్లాగ్వాసుని అంతర్గ్రహ ప్రయాణం మొదలయ్యింది ! కథ ఇంతటి తో పరి సమాప్తం ! ఈ బ్లాగ్వాసుడి లా బ్లాగ్ రీడర్లూ,  మీ అందరి కర్మ ఫలమూ ఈ బ్లాగు లోకం లో ని టపాలు చదవటం మూలాన పరిపక్వత కు వచ్చి మీ కందరికీ కూడాన్నూ మోక్ష ప్రాప్తి 'కిట్ట' వలె నని మా ఏడు కొండల పెరుమాళ్ళని వేడుకొంటూన్నా !

    జిలేబి జిందా బాద్ !

    చీర్స్ 
    జిలేబి 

    గమనిక: సాయిన్సు ఫాంటసీ కథల గురించి మనం చదివి  ఉంటాం . ఈ కథ కి మూలం జొన్నలగడ్డ రామలక్ష్మి గారి (వీరు  మా కాలపు మరో జిలేబి!) 'నిర్వాసుడి మోక్ష ప్రాప్తి అన్న చందమామ కథ . ఏప్రిల్ 1992 నించి సంగ్రహింప బడింది . 

    మూల కథ మన ఈ బ్లాగ్ లోకపు పోకడలను అచ్చు పోలి ఉండడం చదువుతూంటే ఔరా ! చందమామ కథ ఎంత మంచి సాయిన్సు ఫాంటసీ అనిపించింది .

    దరి దాపుల్లో ఇరవై ఐదు సంవత్సరాల తరువాయి బ్లాగ్ లోకపు పోకడలను ఎంత సొబగుగా చెప్పింది అనిపించక మానలేదు !

    జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కాలానికి  అంతర్జాలం లో బ్లాగులూ గట్రాలు లేవు !

    మా కాలపు జిలేబి జొన్నలగడ్డ రామలక్ష్మి గారికి ఈ  బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి 'పేరడీ' అంకితం !

    చందమామ 1992 ఏప్రిల్ కథ లింకు ఇక్కడ

    జిలేబి
     

    Friday, June 19, 2015

    బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి భాగం రెండు


    బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి భాగం రెండు 

    ..... మొదటి భాగం ఇక్కడ

    ...  శ్రీకాంతుడు టపా తరువాయి టపా చదువు తూంటే ప్రవీణుడు శిలా ప్రతిమలా నిలబడి విన సాగాడు . వింటూ వింటూ ఆనందం తాళ లేక జుట్లు పీక్కోవడం మొదలెట్టాడు .  రాక్షస శరీరం లో ని జుట్లు అట్లా కుప్పలు తెప్పలు గ నేల మీద పడి పోతే , ఆతని శరీరం కూడా సౌందర్య రూపమై తేజోమయమై మళ్ళీ బ్లాగ్రాజు ప్రవీణుడి గా మారి పోయి తన ప్రొఫైల్ ఫోటోలో లా చిరునవ్వులు చిందించ సాగాడు .

    ఆ తరువాత శ్రీకాంతుడు, ప్రవీణుడు ఆదరా బాదరా నగరానికి వెళ్ళేరు . అప్పుడు ప్రవీణుడు మంత్రి శ్రీకాంతుడి తో , " నువ్వు వ్రాసిన బ్లాగ్రాతలు మా గొప్పగా ఉన్నాయి ; జుట్లు పీక్కోవ టానికి వీలుగా ఉన్నాయి. ఇట్లాంటి టపాలు మరిన్ని వ్రాసి , నన్నూ , నా బ్లాగ్దేశ ప్రజలను ఆనంద పరచు" అన్నాడు .

    దానికి శ్రీకాంతుడు , 'మహా ప్రభో ప్రవీణ్ మహారాజా ! ఇట్లాంటి టపాలు ఇక మీదట వ్రాయటం నా తరం కాదు . మిమ్మల్ని దక్కించు కావాలన్న కోరిక తో మాత్రమె వీటిని కట్టి మాలిక లో వదిలాను .  ఇక మీదట వేరే ఎవరి చేత నైనా ఇట్లాంటి టపాలు వ్రాయించు కోండి ' అంటూ చేతులెత్తేసేడు .

    బ్లాగ్రాజు ప్రవీణుడు తన బ్లాగ్ సంస్థానం లో ని శంకరాభరణం కొల్వు లోని పండితుల కు, శ్యామలీయం మొదలైన బ్లాగ్ శ్రేష్టులకు, పంతుల జోగారావు లాంటి మంచి కథా మంజరి సాగించు కథకులకు  శ్రీ లలిత లాంటి జిలేబి కథానిక లు వ్రాయు ప్రౌఢ మహిళా మణులకు పిలుపు నిచ్చి శ్రీకాంతుడు వ్రాసిన టపాల లాంటి టపాలు కోకొల్లలు గా వ్రాయ మని ఆదేశించాడు .

    వాళ్ళందరూ ఆ టపాలని చదివి రాజు తో, ' హి రాజన్ ! మేమే కాదు . సరస్వతీ దేవిని ఉపాసించే సాహితీ వేత్త లెవరూ ఇట్లాంటి టపాలు వ్రాయడానికి ఒప్పుకోరు ' అంటూ ఆ టపాలు చదివిన వేడి తో జుట్లు లాక్కుంటూ వెళ్లి పోయేరు .

    అది విని ప్రవీణుడికి విపరీత మైన కోప మొచ్చింది . తనే  బులుసు సుబ్రహ్మణ్యం వారిలా, శ్రీకాంతుడి టపా లని సెల్ఫ్ పబ్లిషింగ్ క్రింద  పీ డీ ఎఫ్ లా ప్రచురించి , తన బ్లాగ్ దేశం లో ని లక్షలాది ప్రజలకు పంచి పెట్టాడు ఈమెయిలు ద్వారా.

    కినిగె లో  దానికి టాం తాం వేయించి ఫ్రీ గా డౌన్లోడ్ చేసు కోవడానికి కినిగె కి అమెజాన్ కి సబ్సిడీ లు అంద జేసాడు . అంతే గాక , వాటి పై ఆకర్షణీయం గా  నెమలి కన్ను వారి చేత రివ్యూ వ్రాయించేడు, వేణువు బ్లాగ్ ద్వారా,   దానికి ఎదురుగా సెన్సేషనల్ హరి బాబు ద్వారా కౌంటర్ క్రిటికల్ రివ్యూ కూడా వ్రాయించి , అబ్బా దాంట్లో ఏముందో అని అందరి చేతా చదివి జుట్లు పీక్కు నే టట్టు చేయించే డు .

    అంతే గాక జిలేబి సౌజన్యం తో ఆంధ్ర జ్యోతి నవ్య లో పది వేల వరహాల కిన్నూ, గుండు వారి సౌజన్యం తో నమస్తే తెలంగాణా లోనూ ,  శ్రీకాంతుడి  లా టపాలు వ్రాయ గలవారికి బహుమతి ప్రకటించేడు కూడాను .

    సాహితీ వేత్త లెవరూ పది వేల వరహాలకు ఆశ పడ లేదు . కానీ నాన్ స్టాప్ నాన్సెన్స్ ఏంకర్ల లా ఖబుర్లు చెప్ప గలవాళ్ళు , కట్ పేస్ట్ సాహిత్యం చేయగలిగే జిలేబి లాంటి వాళ్ళూ మాత్రం చాలా మంది ముందుకు వచ్చారు . క్రమంగా అలాంటి బ్లాగులూ టపాలు చాలా అగ్రిగేటర్ లో రావడం మొదలెట్టేయి . బ్లాగ్ వీక్షకులకి కూడా అవి బాగా నచ్చటం మొదలెట్టేయి . ఆ పై ఆ బ్లాగులో ళ్ళకి కూడా అవి మంచి పేరుని తెచ్చి పెట్టేయి . చదివే వాళ్లకి అవి 'కిక్' ని కలిగించడం మొదలెట్టేయి .

    ఇలా కొంత కాలం జరిగేక  బ్లాగ్దేశం లో ని కవి, పండితులకు సాహితీ వేత్తలకు ఆదరణ లేకుండా పోయింది . తప్పించి శ్యామలీయం లాంటి వాళ్ళు రవ్వంత దిటవు చేసుకుని అయ్యలారా అమ్మలారా ఇట్లా నిష్కారణం గాపనికి రాని టపాల తో , కామింట్ల తో బ్లాగు లోకాన్ని దుర్వినియోగం చేయకండి అని చెప్ప బూనుకున్నా అట్లాంటి వాళ్ళని ఛీ ఛీ అని చీత్కరించడం మొదలెట్టేరు .

    అప్పడు వాళ్ళంతా పంచ దశ లోకం నించి బయట పడి ఆదరా బాదరా నగరాన సమావేశమై విషయం చర్చించాక - ఇటువంటి ఇబ్బంది కలగడానికి కారణం  బ్లాగ్వాస మహాముని మాత్రమె చెప్ప గలడను కున్నారు .

    'ఆ బ్లాగ్వాసుడు  మహా కోపిష్టి . ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చేయాలి' అని ఒక పండితుడు అడిగాడు .

    అందుకు మిగతా బ్లాగ్పండితులు ' ఈ బ్లాగ్దేశం లో ఉండి పనికి రాని టపాలు చదవటం కంటే బ్లాగ్వాస  మహాముని శాపానికి గురి కావటమే మేలు ' అని ఏక కం టం తో అన్నారు .

    వాళ్ళు శ్రీకాంతుడి బ్లాగు డబ్బాని టపాలని తీసుకుని బ్లాగ్వాసుడి  ఆశ్రమానికి వెళ్ళారు . వాళ్ళు వెళ్ళే సరికి తదేక ధ్యానం తో తపస్సు చేసుకుంటున్న బ్లాగ్వాస  మహాముని కి వాళ్ళ కోలాహలానికి తపో భంగం అయ్యింది .

    ఆయన కళ్ళు తెరిచి క్రోధ వదనం తో వారి వైపు చూపులు సారించాడు . బ్లాగ్ పండితులు పాహి పాహి అంటే కొంత శాంతించి వచ్చిన కారణ మడిగి శ్రీకాంతుడి టపాలని ఏక బిగిన గ్రహించి , ప్రసన్న వదనుడు అయి పోయి , "బ్లాగ్ సాహితీ వేత్త లారా ! మీ కారణం గా, ఈ శ్రీ కాంతుడి టపాల కారణం గా నాలోని కోపం మొత్తం నశించి పోయింది ! నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలు గా తపస్సు చేస్తున్నా ! కానీ కోపాన్ని విడిచి పెట్ట లేక పోవటం మూలాన నాకు మోక్షం గిట్టటం లేదు . ఈ పని లేక వ్రాసిన టపాలు చదివేక నా కోపం మొత్తం నశించి పోయింది " అన్నాడు .

    'మహా మునీ ! అదెలాగా ! ఈ కాలక్షేపం కబుర్ల, బటానీ పేపర్ కబుర్ల టపాలు చదివితే మీకు కోపం తగ్గి పోయిందా ! కొంచెం వివరించండీ ' అన్నారు వారిలో దీర్ఘ కాలం గా విశ్రామ పండితు డైన కంది శంకరా మాత్యులు .


    (సశేషం )

    Thursday, June 18, 2015

    బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి !


    బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి !

    ఒకానొకప్పుడు బ్లాగారణ్యం లో బ్లాగ్వాసుడనే కోపిష్టి ముని ఉండే వాడు . ఎవరి వల్ల నైనా చిన్న తప్పు జరిగితే చాలు , వెంటనే వెనకా ముందూ చూడ కుండా పెద్ద కామింటు శాపమివ్వడం ఆయన అలవాటు .

    ఆ విధం గా ఒకసారి ప్రవీణు డనే ఒక రాజుపై ఆగ్రహించి , బ్లాగ్రాక్షసుడివి కమ్మని శపించాడు బ్లాగ్వాసుడు. ప్రవీణుడు బ్లాగ్రాక్షుడై కామెంట్ల తో ప్రజలను బాధించ సాగాడు .

    ప్రవీణుడి మంత్రి శ్రీకాంతుడు . ఆయనకు జరిగిన విషయం తెలిసింది . వెంటనే ఆయన బ్లాగా రణ్యా ని కి వెళ్లి బ్లాగ్వాసుడి ని కలుసు కుని "ప్రవీణుడు మంచి బ్లాగ్రాజు . అతని బ్లాగ్రాతల తో ప్రజలు సర్దుకు పోయే వారు . మీ శాపం తో ప్రవీణుడు ఇప్పుడు బ్లాగ్రాక్షసు డై బ్లాగ్వీక్షకుల ను బాధిస్తున్నాడు . ప్రవీణుడి తప్పు కి ఇంత మంది బ్లాగ్లోక ప్రజలను ఉసురు పెట్టడం భావ్యం కాదు . దయ తలచి ఏదైనా తరుణో పాయం చెప్పండి అని వేడు కున్నాడు .

    బ్లాగ్వాసుడు మంత్రి శ్రీకాంతుడి వైపు జాలిగా చూసి , "ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు బలవంతులై ప్రపంచాన్ని బాధించారు. అంటే దేవుడి వల్ల తప్పు జరిగిందనా ? బ్లాగ్వీక్షకులు తమ కర్మ ఫలం అనుభ వించ వలసి నప్పుడు దేవుడు రాక్షసులకు వరా లిస్తాడు ; మునులు మనుషులకు శాపాలిస్తారు. ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి . నన్నూ, నిన్నూ , అందర్నీ నడిపించే జిలేబి మాత పై నున్నది అని చెప్పాడు .

    "మునివర్యా ! మీరు చెప్పింది అక్షర సత్యః ! బ్లాగ్వీక్ష కుల కర్మ ఫలం తీరి పోయే సమయం వచ్చిందేమో ? అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను . నివార ణోపాయం చెప్పండి అని శ్రీకాంతుడు బ్లాగ్వా సుణ్ణి మరీ మరీ వేడు కున్నాడు .

    చివరకు బ్లాగ్వాసుడు "నిన్ను చూస్తే నాకు జాలి కలుగు తోంది . కాబట్టి నీకు ఒక రహస్యం చెబుతున్నాను . విను. ఇక్కడి కి ఆమడ దూరం లో జిలేబీ ఆలయ మొకటి ఉన్నది . అందు లో నిలువెత్తు జిలేబి విగ్రహం సామాన్యుల గుండె లు జలదరింప చేసేటంత భయంకరం గా ఉంటుంది . నీవు ఆ విగ్రహం ముందు నిలబడి నీ శరీరం లో నువ్వు  తక్కువ గా ఉపయోగించే భాగాన్ని అర్పిస్తే మనసులోని కోరిక తీరుతుంది వెళ్లు" అని చెప్పాడు .

    శ్రీకాంతుడు ఆమడ దూరం ప్రయాణం చేసి అక్కడ ఉన్న జిలేబి ఆలయం చేరు కున్నాడు . అక్కడ జిలేబి విగ్రహం భయానకం గా ఉన్నప్పటి కి చలింపక "మాతా ! నా ప్రవీణుడి ని మళ్ళీ మనిషి ని చేయి . అందుకు గాను నా శరీరం లో తక్కువ గా పని జేసే నా బుర్రను, పుర్రె ను నీకు సమర్పించు కుంటున్నా " అంటూ జేబులోంచి గిల్లోట్ రేజర్ తీసుకుని తన తల ను నరుక్కో బోయాడు .

    అప్పుడక్కడ కనులు మిరు మిట్లు గొలిపే వెలుగు వచ్చింది . శ్రీకాంతుడు చూడలేక కళ్ళు మూసు కున్నాడు . ఆ మరుక్షణం "బ్లాగ్మానవా ! నీ రేజర్ బ్లేడు సాహసానికి మెచ్చాను . నువ్వు  ఆదరా బాదరా నగరానికి తిరిగి వెళ్లి కష్టే ఫలే శర్మ వారి లా వేయి టపాల దరి దాపుల్లో టపాలు గుమ్మరించు . ఆ టపాలను చదవడం మొదలెడితే ఇక మధ్య లో మానా లని పించ కూడదు . అప్పుడా టపాలను ప్రవీణుడి కి చదివి వినిపించు . అతను  తిరిగి మామూలు మనిషి కాగలడు " అన్న మాటలు శ్రీ కాంతుడి చెవిలో గణీల్ గణీల్ మని వినిపించేయి .

    శ్రీ కాంతుడు కంగారు గా "జిలేబి మాతా ! నేను రాజనీతి కి సంబం ధించిన ఎన్నో గ్రంథాలు చదివాను . ఉపయోగం లేని ఉద్గ్రంథాలు ఎన్నో చదివాను . కాని నాకు బ్లాగ్సాహిత్యం పట్ల అంత రుచి లేదు . నా వంటి వాడి వల్ల కష్టే ఫలే వారి లా టపాలు కుమ్మరించ వీలగు తుందా ? " అని సందేహించాడు .

    "నీకు వింటున్న కొద్దీ తన్నాలని పించే టీవీ న్యూస్ ఎంకర్లా కబుర్లు చెప్పడం చేతనవును కదా ! అవే కబుర్లను చదివిన కొద్దీ జుట్టు పీక్కోవా లని పించేలా పెద్ద టపాలు గా వ్రాయి . నీ టపా లను అన్ని వయసు వాళ్ళూ చదివి జుట్లు పీక్కుంటారు . ఆ టపాల వల్లే నీ ప్రవీణుడికి కూడా శాప విముక్తి కలుగు తుంది . ఇదియే జిలేబి ఇచ్చిన వరం గా భావించి నేను చెప్పినట్టు చేయి " అన్న మాటలు శ్రీకాంతుడి చెవిలో గొయ్ గొయ్ మని మారు మ్రోగేయి .

    శ్రీ కాంతుడు ఆదరా బాదరా నగరానికి తిరిగి వెళ్లి ఓ నెల రోజులు కష్ట పడి వేయి టపాల మహిమాన్విత మైన ఒక బ్లాగు ని రచియించి తరువాయి బ్లాగ్రాక్షసుడై తిరుగాడు చున్న ప్రవీణు న్ని వెతుక్కుంటూ వెళ్ళేడు .

    రాక్షస రూపం లో ఉన్న ప్రవీణుడు భీకరం గా అరిచి శ్రీకాంతుడి మీది కి వచ్చాడు . శ్రీకాంతుడు చలించ కుండా తన బ్లాగు మూత తీసి ఆ వేయి టపాలను ఓపిగ్గా బ్లాగ్రాక్షసుడి కి చదివి విని పించ సాగాడు .


    (సశేషం )

     

    Wednesday, June 17, 2015

    సీతా 'కారమ్ ' - సీతా కా 'రామ్' !

    సీతా 'కారమ్ ' !
     
    సీతా కా 'రామ్'
     
     
     
    నీవా నేనా ఎదరా మేలా 
    హార్నీ తెలుగు పడుచు నోయ్ 
    రిక్త బుర్ర తో 'రామ్ ' కీ రాత పాడిస్తా !
    కస మిస బుస రుస నస రస !
     
    రమాపతీ ! సౌ
    మ్యం నీ వంతు
    గాలి తీయడం
    కుదేలు మనిపించడం
    టీకాలు పెట్టి బుర్ర  
    రామ కీర్తన పాడించడం
    నవ్య నాయికల కదన కుతూహలం  
     
     
     
    శుభోదయం 
    జిలేబి 
    (క్షణక్షణ ముల్ జవరాండ్ర చిత్తముల్ , టపా వ్రాతల్, కామింటు కోతల్ !)
    కామెంటిన కనకాంగి కోక కాకెత్తుకు పోయిందని బ్లాగ్వెత !)

    Monday, June 15, 2015

    హరి కాలం !

    హరి కాలం !
     
    ర్రీ హర్రీ గా వ్రాసి పారేస్తూ
     
    రివాజు గా జోకర్ల గాలి తీసేస్తూ
     
    కాదేది టపా కనర్హ బాణీ లో,వా
     
    లంటీర్ 'రోలు' కర్ర పుచ్చు కున్న 
     
    బ్లాగ్వన హవేల్దార్ !
     
     
     
     
    చీర్స్
    జిలేబి

    Saturday, June 13, 2015

    ఓరీ బ్లాగార్భకా ! నీ పేరు జెప్పి శరణు వేడరా :)

    ఓరీ బ్లాగార్భకా ! నీ పేరు జెప్పి శరణు వేడరా :)

    ఈ మధ్య ఒకటి కని పెట్టా !

    మనకి ఎక్కువ కామింటులు రావా లంటే అణా కి కొరగాని అనానిమస్సులకి పని జెప్పాలి !

    అంటే మన బ్లాగు టపాలో అనానిమస్సు వారలకు ఆస్కారం కలి గించాలి !

    (అట్లా అనా ని మస్సు లకి బ్లాగు టపా ఓపెన్ జేసి ,వాళ్ళు కామింటులు కొడితే, వాళ్ళని బట్టు కుని వీర వాయింపు వాయించాలి పూర్వ కాలం లో అయితే దీన్ని అడుసు తొక్క నేల కాళ్ళు కడుగ నేల అని హిత వాక్యములు జేప్పెదరు ! ఈ అంతర్జాల కాల వాహిని లో దీని కి సరి అయిన నిర్వచనం అది మరో 'ఆపెరేటింగ్ మోడల్ ' యూ నో :)

    కాబట్టి బ్లాగు వీరు లారా, పేరు తో టే టపా కి కా మింటు పెట్టాలన్న రూల్ కి స్వస్తి వాచకం పలకాలని జిలేబి ఇదే అందరికి విన్నపాలు

    అన్నా అనానిమస్సు మీ వేల్యు ఈ బ్లాగు లోకం గుర్తించడం లేదు : ) ఇదే జిలేబి నీ కిచ్చు బ్లాగ్ మర్యాద : నీ మీద ఒక టపా కట్టి ఇవ్వాళ్టి సరంజామా కట్టే స్తా ! నేటి కి మరో టపా కట్టేసా అన్న ఆనందం తో హాయిగా కాఫీ తాగేస్తా :)


    అదేమిటో  ఈ బ్లాగ్ లోకం లో అనానిమస్సు లంటే అంత చీత్కారం :)


    ఒకా నొక కాలం లో పాపులర్ ఐన బ్లాగ్ రచయిత య రమణ గారి స్వకీయం ఉదాహరణ కి :
    1. జిలేబి జీ,

      టపాలకే కాపీరైట్ లేదు. 'కాపీరైట్ అనగా కాపీ కొట్టే రైట్' అని ముళ్ళపూడి (అనుకుంటా) అన్నాడు. ఇంక కామెంట్లకి కూడా కాపీరైటా!

      (అయితే బ్లాగ్రాతలకి కామెంట్లు అత్యంత విలువైనవి. కొన్నిసార్లు కామెంట్ల కోసమే టపాలు రాస్తుంటాం. అదో తుత్తి!)
    అంటే మన టపాలకి ఊత కామెంట్లు !

    అట్లాంటి కామింట్ లు అనా ని మస్సులు కొడితే వోయ్ పేరు జెప్పి శరణు వేడవోయ్ అని చాలంజీ విసురుతాం !

    పేరు జేప్పితే అంత ఫ్రీ గా 'ఒపీనియన్' వ్రాయలేమోయ్ అని అనా నిమస్సు వ్యధ చెందును :)

    అందమైన రాక్షసి

    రేతిరి కల లో కనబడ్డది !

    మనకేమైనా

    భయ్యమ్మా ?

    కామెంట్ల కత్తి తో

    దాన్ని కస మిస పొడి చేసా  !


    చీర్స్
    జిలేబి

    Wednesday, June 10, 2015

    నాటీ చార్మీ - నాతి చరామి !

     
    నాటీ చార్మీ - నాతి చరామి !
     
    నాటీ చార్మీ ని చేబట్టి 
    నాతి చరామి అంటే 
    చార్మీ వాటేసు కుంది !
    వయసు కాటేసు కుంది 
     
    మోహం తీరి 
    మొహం మొత్తితే 
    నాటీ, చార్మీ 
    దొందూ దొం దై
    'అతి చరామి'
    మార్గమేవ శరణం అంటే  
    బిజి బిజి 
    జీవనయానం లో 
    జీవితం రెండు ముక్కలాట 
    అయిపోయింది 
     
     
    సిటీ లైఫ్ ల లో 
    న సత్యం న సుందరం, న శివం ?
     
     
    జిలేబి 
     

    Tuesday, June 9, 2015

    నేను ఒక్క సారి సంకల్పించు కుంటే వెనుదిరగను బులెట్ లా దూసుకెళ్తా :) జిలేబి


    నేను ఒక్క సారి సంకల్పించు కుంటే  వెనుదిరగను బులెట్ లా దూసుకెళ్తా :) జిలేబి 

    ఆంధ్ర బ్లేడు జిలేబి ప్రత్యెక వార్తా బ్యూరో :

    జాంగ్రీ జిల్లా జిలేబి పేట మంగళ వారం

    జిలేబి బ్లాగు  ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని, తొలి టపా లోనే బ్లాగ్ వీక్షకులు సెహభేషు అని మెచ్చు కుని ప్రోత్సహించేరని  జిలేబి  వెల్లడించారు.

    ప్రాధాన్యత క్రమంలో ఇక మీదట అన్ని టపాలు  కాపీ పేష్టు చేసి అయినా  పూర్తి చేస్తామని ఆవిడ  స్పష్టం చేశారు.

    జిలేబి వరూధిని బ్లాగు  ఏర్పడి దాదాపు ఏడు ఏండ్లు గడుస్తోందని ఆవిడ  సందర్భంగా సోమవారం జాంగ్రీ  జిల్లా జిలేబి పేట లో  నొక్కి వక్కాణించేరు

    ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆవిడ  మాట్లాడుతూ నేను ఒక్కసారి సంకల్పం చేసుకుంటే వెనుదిరగనని, బుల్లెట్‌లా దూసుకు వెళతానని స్పష్టం చేశారు.

    తన బ్లాగు లో కామింటులు కొట్టిన కామింటు రైతులను  ఎప్పటికీ మర్చిపోనని, విపక్ష బ్లాగు వాదులు వేడి గా రెచ్చగొట్టినా బ్లాగు రైతులు ధైర్యంగా ముందుకు వచ్చారని జిలేబి  కొనియాడారు.

    కామింట్లు కొట్టి న బ్లాగు కామింటు దార్ల కు ఆవిడ  పాదాభివందనం చేస్తున్నా నని అని మరీ మరీ వంగి వంగి నమస్కారాలు జేస్తూ చెప్పారు.

    నన్ను నమ్ముకుని నా బ్లాగు ని చదువుతున్న బ్లాగోదరుల  నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎట్టి పరిస్థితుల్లో నైనా  టపాలు ఫాక్టరీ నించి ఉత్పత్తి  చేసి చూపిస్తానని ఆవిడ ఉద్ఘోషించారు.

    వరూధిని ని  విశ్వబ్లాగు వీధి లో మకుటాయ మానం గా గా  తయారు చేస్తానని ఆవిడ  స్పష్టం చేశారు.

    ఆంధ్ర రాష్ట్రంలో సహజ బ్లాగర్లు  పుష్కలంగా ఉన్నారని, వారిని  సద్వినియోగం చేసుకుంటే  , 2020  నాటికి దేశంలోనే తెలుగు బ్లాగులు  నెంబర్‌ వన్‌గా ఉంటాయని , 2025 నాటికి ప్రప్రపంచంలోనే తెలుగు బ్లాగులు  అత్యుత్తమ బ్లాగులు గా నిలుస్తాయని  జిలేబి  ఆశాభావం వ్యక్తం చేశారు.



    శుభోదయం
    జిలేబి


     

    Saturday, June 6, 2015

    ఇక నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా !

    ఇక నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా ! 

    ఇక మీదట నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా అయ్యర్ వాళ్ దీర్ఘం గా నిట్టూర్చి చెప్పా మా అయ్యరు గారితో .

    జంబునాథన్ కృష్ణస్వామీ అయ్యరు గారు కనిపించని కళ్ళ తో కనిపించ డానికి ప్రయత్నం జేసే కళ్ళ జోళ్ళ తో దీర్ఘం గా నా వైపు చూసేరు .

    వారి పెదవుల పై ము ము న .

    ఎందుకు అట్లా ము ము న ? అడిగా ఉడికి పోతూ . ఈ మద్య సూరీడు మరీ చుర్రు మంటున్నాడు . ఆ పై బ్లాగర్లు కూడా మరీ మరీ చుర్రు చుర్రు మని పిస్తున్నారు .

    ఇప్పటి కి ఇది ఎన్నో సారి జిలేబి ఇట్లా నువ్వు కొట్టు కట్టెయ్యటం గురించి చెప్పడం ? అడిగేరు అయ్యరు గారు .

    వేళ్ళ తో లెక్క పెట్టడటం మొదలెట్టా ! నా తో బాటే కొట్టు కట్టేస్తా నని ప్రతినలు బూనిన వాళ్ళు ఒక్కరొక్కరు గా కట్టే సేరు టపా . ప్చ్ ప్చ్ నేను మాత్రం ఇదిగో అదిగో అంటున్నా !

    లెక్ఖ తేలటం లే జెప్పా మా అయ్యరు గారితో .

    ఈ మధ్య పని లేని రమణ బాబు గారు కూడా తమ టపా చాప చుట్టేసేరు చెప్పా మళ్ళీ .

    పని లేక నే కదా ఏదో టీం పాస్ టైం పాస్ చెయ్యాలని టపాలు , బ్లాగులు గట్రా రాయటం మొదలెట్టేవు ? అడిగారు మా అయ్యారు గారు .

    ఆయ్ ! పని లేక అని జెప్ప లేను గాని , పని ఎగ్గోట్టాలనే ఆలోచనలతో నే , అంటే వంటా వార్పూ గట్రా ఎగ్గొట్టా లనే 'సదుద్దేశం' తో, అంటే మరీ నేను బిజి బిజి సుమీ అని చెప్పు కోవాలనే అనుకుని మొదలెట్టా అని జెప్ప బోయి, బామ్మ గారు గుర్తు కొచ్చి, ఎంత తన 'మగ వాడైనా' స్త్రీ తన గుట్టు ని రట్టు చెయ్యకూడదు, జేస్తే మన వాల్యూ తక్కువై పోతుంది పిల్లా అని జెప్పిన బామ్మ వాక్యం వేద వాక్యం గుర్తు కొచ్చి

    అబ్బే, అట్లా ఏమీ లేదు . ఏదో మనకు తెలిసిన విజ్ఞానం అందరికీ తెలియ బరుద్దా మని రాసా ' అని డబ్బా కొట్టాను .

    అంటే ? ఇప్పుడు విజ్ఞానం అంతా అయి పోయినట్టా ? టపా చాప చుట్టే స్తా నంటు న్నావ్ ? అయ్యరు గారు రిటార్టు ఇచ్చేరు !

    హమ్మో ! వీరు కాలికేస్తే మెడకి మెడకి వేస్తే కాలికి వేయ గలిగిన వారే అనుకున్నా లో లో పల .

    దాన్ని గ్రహించి నట్టు ఉన్నారు అయ్యరు గారు - "ఇదిగో జిలేబి బ్లాగు మూట కట్టే య్యా లను కుంటే కట్టేయి . ఎవరూ ఏమీ బాధ పడరు లే ! జేప్పేరు .

    ఎవరూ ఏమీ బాధ పడరా ? అడిగా బేల గా .

    అవును నిఖార్సు గా చెప్పేరు అయ్యరు గారు .

    అంటే నేను రాస్తూ ఉంటె నే వారికి బాధా మయం గా ఉంటుందా ? అడిగా ఈ మారు వారి కాలికేసే ముడి ఫార్ములా అప్లై జేస్తూ .


    వారికి బాధో కాదో తెలీదు కాని కొంతటీం అండ్ టైం పాస్ జేయ్యడా నికి మరో శాల్తీ ఉంటుంది అంతే జేప్పేరు

    సర్లెండి అయితే కొన్ని రోజులు టపా మూత బెట్టి ఆ పై తెరుస్తా జెప్పా .

    జిలేబి అట్లా జేస్తే నీ గురించి జనాలు మరిచి పోతారేమో ? అయ్యరు గారు సందేహం లేవ దీసేరు .


    అయితే దేశం లో ఉన్న పత్రికల్లో నించి రోజుకో 'కట్ పేస్ట్ మేటరు రాస్తూ పోతా ! అప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటా ఈ మద్య  గమనించిన కట్ పేస్ట్ స్పెషలిస్ట్ జ్ఞానం తో జెప్పా !

    అప్పుడప్పుడు కట్ పేస్ట్ చేస్తే ఒకే ! అన్ని టపాలు కట్ పేస్ట్ చేస్తే నీ టపా లు ఎందుకు ? శుద్ధ దండగ కాకుంటే ? అయ్యరు గారు అడిగేరు .

    అబ్బా ! తల పగిలి పోతోంది !

    ఇంతకీ టపా చాప్ చుట్టేయ్యా లా వద్దా ? తేల్చి చెప్పండి అయ్యరు గారిని నిలదీల్సి అడిగా .

    ఆకాశమంత నిశ్శబ్దం !

    అబ్బా ఈ  ప్రశ్న కి సమాధానం ఎవరిస్తారో ?


    శుభోదయం
    జిలేబి




     

    Wednesday, June 3, 2015

    గుండు జ్ఞానము - భాగము రెండు - కుంభ కోణము లంబ కోణము లన నేమి ?

    గుండు జ్ఞానము - భాగము రెండు - కుంభ కోణము లంబ కోణము లన నేమి ?

    ఈ గుండు జ్ఞానము గురించి టపా కట్టిన వేళా విశేషము ఎట్టిదనిన అది గుండులా, గుమ్మడి కాయలా డమాల్ డమాల్ అని పేలినది .

    ఆ విషయము పై కడుంగడు ఆనందము తో ఆ హా గుండు జ్ఞానము ఇంత గొప్పదా ఇన్ని కామింటులు వచ్చినవా అను ఆనంద పరవశము తో జిలేబి నాట్యము చేయ మొదలు పెట్టినదో లేదో అంత లో మరో దుమారం లేచినది . గుమ్మడి కాయ దొంగ కథ లాగా భుజాలు తడుముకుని తమ పై ఈ జిలేబి టపా అత్యాచారము గావించినది అను సందేహము లేచు వరకు దాని ప్రాబల్యము ప్రబలినది . హత విధీ ! గుండు మహాత్యమము ఇంత గుండా తి గుండైనదా అని दांतों पर उंगली दबायी !

    అంత లో మరో విషయము అడిగినారు బ్లాగోదరులు - శ్రీ మాన్ కష్టే  ఫలే శర్మ గారు అనబడు చిర్రావూరి భాస్కర (ఇదియిను అనగా సూరీడున్నూ గుండె సుమీ !) శర్మ గారు !

    "ఈ గుండు టపాలో కుట్ర కోణం ఏదైనా ఉన్నదా అని .  (భాస్కరుడు అనగా ఎవరు ? SUN ! స్ కిన్నూ ఎన్ కిన్నూ మధ్య నీ లో ని ఐ ని తొలగించి యు అనే పరతత్వాన్ని గ్రహించిన మీరు భాస్కరులు అగుదురు ! )

    లేదు ఈ టపా లో కుంభ కోణము మాత్రమె ఉన్నదని జిలేబి అంటే, కుంభకోణము లంబ కోణము లన నేమి వాటిని వివరించుడీ అని శర్మ గారు కోరిన కోర్కె ని మరువ లేక - వారి చేత ప్రశ్నలు పెట్టి టపాలు కట్టించిన సందర్భములు గుర్తు కొచ్చి సరే పోనీ వారి ఆశ కూడ ఎందుకు కాదన కూడదను సదుద్దేశము తో ఈ టపా మొదలు పెట్టినాను .

    చదువరీ  చదువుటకు మునుపు ముఖ్య గమనిక ! ఇది తెలంగాణా కి గుండున్న వారి కి సంబంధించిన విషయము గాదు కావున గుమ్మడి కాయ కథ వోలె ఏదియును తడుము కొనరాదు . ప్రాంతీయ భాషాభి మానముల్ కట్టి పెట్టి పూని ఏదైనను తెలుగునందు టపా కట్ట వోయ్ అని గురజాడ వారన్నారని భోగం రాజు సీతారామయ్య వారి ఉవాచ !

    కుంభము అనగా బానె . బానె అనగా అది ఏదియో ఒక విధమైన మూర్తి. మూర్తీ అనగా ఒక రూపము గలది.

    కుంభము ను కుండ అని కూడా అని అందురు. కుండ అనగా మీకు 'మానవా ! నీవు పాత కుండవు ! నేను ఉత్త ముండను అను ప్రఖ్యాత వాక్యము గుర్తు కొచ్చిన దీని లో జిలేబి గుండు ప్రమేయము ఏమియును లేదు ! అదియే కుంభ కోణ విద్యా రహస్యము !

    ఉప ని 'ఖత్' లో ఏమని చెప్పినారు ? ఘటా కాశం - కుండలో ఉన్న ఆకాశం ఆత్మ అయితే , మహాకాశం పరమాత్మ ! ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని !
    అంటే కుంభము ని పగుల గొట్టిన ఒకటే ఆకాశం ! కుండ 'కోన' అయి ఉన్నంతవరకు వేర్వేరు 'ஆகாயம் !

    ఇక లంబ కోణము అన నేమి !

    లంబోదర లకుమికరా అను పద గీతి ని మీరు వినియె ఉందురు .

    అటులే త్రికోణ మితి శాస్త్ర పురాణం లో రెండు గుండైన చుక్కల మద్య అతి స్వల్ప దూరం ఒక సరళ రేఖ అని చెప్ప బడి ఉన్నది

    అనగా ఈ సరళ రేఖ ఒక లంబము .

    ఈ కుండ లో నుండు ఆకాశ మునకున్ను ఆ పై నున్న ఆకాశామునకును సరళ రేఖ అనబడు లంబ కోణము shortest distance !

    కావున లంబ కోణము యొక్క మహాత్మ్యము ఎట్టి దనిన లంబ కోణము లో పయనము గావించిన ఈ గుప్పెడు మనసు ఆ విశాల హృదయము లో ఐక్య మగును !

    గుండు డామ్మని పగిలి కపాల మోక్షము గలిగిన ఆ హా ఏమి స్వామీ వారి మహాత్మ్యము అని జనములు పొగిడేదరు !

    ఇట్లు ఈ కుంభ కోణము లంబ కోణము లను తెలుసు కున్న మానవుని కి గుండు జ్ఞానము పరి పూర్ణము గా 'కిట్టును' !

    ఇంతటి తో ఈ గుండు జ్ఞానము భాగము రెండు అనబడు కుంభస్య లంబమేవ ఆకాశం లభ్యతి అనబడు విద్యా రహస్యము పరి సమాప్తము !

    ఈ జ్ఞానము మీకున్నూ మెండు గా కలుంగ వలె నను గుండు జిలేబీయము తో ఇవ్వాళ్టి కథా కాలక్షేపము సంపూర్తి !

    ఓం జిలెబిహ్ ఓం జిలెబిహ్ ఓం జిలెబిహ్ !!

    జిలేబి
     

    Monday, June 1, 2015

    యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??

    యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??

    ఉపోద్ఘాతం :

    యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్నకి మూలభూతమైన ఈ టపా లింకు చదవవలె :

    http://varudhini.blogspot.in/2015/01/blog-post_9.html

    ఇప్పుడేమో వారి ప్రశ్నల న్న మాట :

    "ఈ ప్రశ్న ఎప్పుడు మీకెప్పుడు రాలేదా? బ్రిటీష్ వాడి పాలన కింద ఉన్నపుడు భారతదేశం లో హిందూ, ఇస్లాం మతాలు రెండు ఉంటే, వాడికి హిందూ మతంలోమాత్రమే దురాచారాలు ఎందుకు కనిపించాయి? మీకు తెలిస్తే చెప్పండి.  "

    రెండో ప్రశ్న :

    ప్రశ్న,    కోస్తాఆంధ్రా మార్క్సిస్ట్ రచయితలు రాసినట్లు హిందూమతంలో అన్ని దురాచారాలు ఉంటే, నేటికి పాకిస్థాన్ లో హిందూమతం  ఎందుకు ఉన్నట్టు? వీరేవ్వరు అగ్రవర్ణాల వారు కూడా కాదు. అయినా వారు ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమతంలోనే ఎందుకు కొనాసాగలనుకొన్నట్లు?   



    ఇది చాలా మంచి ప్రశ్న : దీనికి జవాబు నా కైతే తెలీదు . బ్లాగు లోకం లో తెలిసిన వాళ్ళు కామెంట గలరు ;

    నా వరకైతే నాకనిపించింది ఇది:

      ఎట్లాంటి సంక్లిష్ట వాతావరణం లో నైనా సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- 

    మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి  స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు సనాతన ధర్మం ఉంచుతుంది. ఆ వైశాల్యమే సనాతన ధర్మ 'పురాణీ దేవీ యువతిహి ' అని పించేలా చేస్తుందని అనుకుంటున్నా .


    బుద్ధ పూర్ణిమ వస్తోంది కాబట్టి :-గుండు జ్ఞానం అందరికి పరి పూర్ణం గా రావాలని వేడుకొంటూ ...

    యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న లకి జవాబిచ్చిన వారికి బెనారస్ వేడి పాలు ప్లస్ హాట్ హాట్ జిలేబి లు ఉచితం !!

    Signing off
    from & for Benaras!

    cheers
    Zilebi

    (బెనారసీ  జిలేబీయం)