Monday, June 1, 2015

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??

ఉపోద్ఘాతం :

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్నకి మూలభూతమైన ఈ టపా లింకు చదవవలె :

http://varudhini.blogspot.in/2015/01/blog-post_9.html

ఇప్పుడేమో వారి ప్రశ్నల న్న మాట :

"ఈ ప్రశ్న ఎప్పుడు మీకెప్పుడు రాలేదా? బ్రిటీష్ వాడి పాలన కింద ఉన్నపుడు భారతదేశం లో హిందూ, ఇస్లాం మతాలు రెండు ఉంటే, వాడికి హిందూ మతంలోమాత్రమే దురాచారాలు ఎందుకు కనిపించాయి? మీకు తెలిస్తే చెప్పండి.  "

రెండో ప్రశ్న :

ప్రశ్న,    కోస్తాఆంధ్రా మార్క్సిస్ట్ రచయితలు రాసినట్లు హిందూమతంలో అన్ని దురాచారాలు ఉంటే, నేటికి పాకిస్థాన్ లో హిందూమతం  ఎందుకు ఉన్నట్టు? వీరేవ్వరు అగ్రవర్ణాల వారు కూడా కాదు. అయినా వారు ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమతంలోనే ఎందుకు కొనాసాగలనుకొన్నట్లు?   ఇది చాలా మంచి ప్రశ్న : దీనికి జవాబు నా కైతే తెలీదు . బ్లాగు లోకం లో తెలిసిన వాళ్ళు కామెంట గలరు ;

నా వరకైతే నాకనిపించింది ఇది:

  ఎట్లాంటి సంక్లిష్ట వాతావరణం లో నైనా సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- 

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి  స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు సనాతన ధర్మం ఉంచుతుంది. ఆ వైశాల్యమే సనాతన ధర్మ 'పురాణీ దేవీ యువతిహి ' అని పించేలా చేస్తుందని అనుకుంటున్నా .


బుద్ధ పూర్ణిమ వస్తోంది కాబట్టి :-గుండు జ్ఞానం అందరికి పరి పూర్ణం గా రావాలని వేడుకొంటూ ...

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న లకి జవాబిచ్చిన వారికి బెనారస్ వేడి పాలు ప్లస్ హాట్ హాట్ జిలేబి లు ఉచితం !!

Signing off
from & for Benaras!

cheers
Zilebi

(బెనారసీ  జిలేబీయం)

8 comments:

 1. ధర్మ పురాణీ దేవీ యువతిహి
  ?
  జిలేబీ దేవీ యువతి హిహిహీ
  (just for fun,రమణ గారి లాగా అలిగితే కష్టం:-))

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. నేను ఆల్రెడీ నా బ్లాగులో మొదటి ప్రశ్నకి జవాబిచ్చాను.ఆది యందు బ్రాహ్మణులు క్రైస్తవ ప్రభువుల యొద్ద మిక్కిలి ఆదరణ పొందిన వారైరి!సాక్ష్యము యేనుగుల వీరాసామయ్య గారి "కాశీయాత్ర చరిత్ర" మరియూ గురజాడ ఆంగ్ల ప్రభువుల పట్ల చూపించిన అనురక్తి?

  మన దేవళములను కూడా ఇంగ్లీషు కలక్తర్లు ఆదరించిరి - అది మాత్రము ధనప్రీతి వల్ల కాచ్చును!క్రైస్తవ మిషనరీలు రంగప్రవేశము చేసి పరమతమును ప్రోత్సహించుతేల అస్మదీయ మతమున్నది కదా యన వారును మన బ్రాహ్మణ మిత్రులను దూరముంచిరి.అట్టి సమయాన క్రైస్తవ మిత్రులకు దూరమయిన పిదప మనవారు హిందూ జాతీయవాదము వైపుకు మరలినారు,క్రైస్తవ మిషనరీలు అప్పటివరకూ జంతుబలులు చేయు అనాగరికులని తామే తిట్టిన కింది కులాల వార్ని మచ్చిక చేసుకునుతకు హిందూ మతములోని దురాచారములను మరియు బ్రాహ్మనాధిక్యతను ప్రచారము గావించిరి - అది చరిత్ర.
  విస్తారము గ తెలియుతకు ఇక్కడ నొక్కండి.

  ReplyDelete
 4. ఆదినుంచీ ఒకటి గుర్తించారు ఆంగ్లేయులు. "డివైడ్ ఎండ్ కాంక్వెర్" అనేది. వాళ్ళు మనదేశం మీద పడేసరికి మనం అతి సంపన్నులం - ఒక్క బిచ్చగాడైనా లేని దేశం. ఉన్న సంపదంతా కొల్లగొట్టడం మొదటి ఉద్దేశ్యం. దానికోసం ఏ అశుద్ధం తినడానికైనా సిద్ధ పడ్డారు. దానిలో మొదటిగా మనకి ఏమీ రాదని వెక్కిరించడం, పురాణాలూ వేదాలూ తప్పని నిరూపించడం, అంతమంది దేముళ్ళు అనవసరం, అన్ని వేదాలెందుకు ఒక్క బైబిల్ ఉంటే చాలు మొదలైనవి. గంగ శివుడి నెత్తిమీదనుంచి భువికి దిగింది అని అంటే గంతోత్రి దగ్గిరకెళ్ళి ఫోటోలు తీసి ఒరే వెర్రి వెధవల్లారా గంగోత్రి అంటే ఇదిరా అని చెప్పి మనమీద మనకున్న నమ్మకాల్ని చెదరగొట్టేరు. ఈ మధ్యన వచ్చిన గంగావతరణంలో ఆకాశం మీదనుంచి ఎలా కుంభవృష్టి కురిసిందో అదే విధంగా గంగావతరణం జరిగిఉంటుందని తెలుసుకోలేకపోయేరు. తెలిసినా మనకి తెలియనివ్వలేదు. మనవు గారి బ్లాగులో ఈ లంకె ఉంది చూడండి.
  http://ssmanavu.blogspot.com/2013/06/blog-post_30.html

  సో, మొత్తమ్మీద మన దుంప తెంపడానికి మన మతాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు స్వామి వివేకానంద లాంటివారు, "ఒరే వెధవల్లారా నోరు మూసుకోండిరా" అని చెప్పి మన మీద మనకి నమ్మకం కలిగేలా చేసి మతాన్ని నిలబెట్టారు. అదంతా మరో కధ.

  మరి మహమ్మదీయుల మీదకెందుకు వెళ్ళలేదంటే అప్పట్లో వాళ్ళో పెద్ద గ్రూప్ కాదు. అతి పెద్ద గ్రూప్ ని పాడుచేస్తే చిన్నవి అవే పోతాయని అనుకుని ఉండొచ్చు. కానీ హిందూ మతం గొప్ప ఇప్పుడు యోగా వల్లైతేనేం మరోదానితోనైతేనేం గుర్తిస్తున్నారు. మనం ఈ టెస్ట్ పాసై ఇంకా నిలదొక్కుకునే ఉన్నాం. ఇవి నాకు తెలిసినంతలో కారణాలు.

  ReplyDelete
 5. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను
  శ్యామలీయం గారికి ఇది - పాతపోస్టులో కామెంటితే చూడరేమో అని ఇక్కడ పెడుతున్నాను. మీ గుండు పద్యాలు మధుర కవనం అనక తప్పదు. :-) తిరుపతి గుండు భూయాత్ :-)

  ReplyDelete
 6. 1)ముస్లిం ,హిందూ రెండు మతాలలో ,హిందూ మత సంస్కరణనే ఎందుకు చేసారు అంటే మెజారిటీలు హిందువులే....
  మెజారిటి ప్రజలను ముందు మూడనమ్మకాలనుండి దూరం చెయ్యడం కోసం
  "బ్రిటిష్ వారు ఇండియా ను దోచుకున్నారు అనెది .మిషినరీ ల పేరిట మత మార్పిడులకు పాల్పడ్డది సత్యం ...at the same టైం
  వారు "సమానత్వం" కోసం కోసం కృషి చేసింది అంతే సత్యం"
  ఆధారాలకోసం "మీరు మన దేశం లో బ్రిటిష్ వారు చట్టాలు ,రాజ్యంగరచనకు దోహదం చేసిన అంశాలు పరిశీలించగలరు".
  2)ముస్లిం రాజుల ఇక్కడి సంప్రదాయ వ్యవహారాల్లో(ex:వర్ణ వ్యవస్థ ,సతి)వేలు పెట్టక పోవడం వల్లనే మననుండి బ్రిటిష్ వారు ఎదుర్కున్న తిరుగుబాటు లేకుండా పాలించారు.
  అంటే వాళ్ళు ఇక్కడి బ్రహ్మనాదిపత్యాన్ని అంగీకరించారు.ఇక్కడ మనం కలిఫా ఉద్యమాన్ని కూడా పరిశీలించాలి బ్రిటిష్ వారు ముస్లిం మతం లో చేసిన సంస్కరణల కోసం.
  రెండవ ప్రశ్న జవాబు:
  మతం అనేది పుట్టుకతో వస్తుంది...అందులోని ఆచారాలు సంప్రదాయాలు మంచివైనా చెడువైనా అవి మనఎదుగుదల తో పాటు జీవన విధానం లో అలవాటుగా మారుతాయి,తప్పని తెలిసినా చేస్తారు,OCD అంటారు ,పైగా వాటికి అప్పటికే ఇవ్వబడిన వాక్యానలతో సమర్దిన్చుకుంటారు
  for ex:మనం ఇప్పటికి కుల పిచ్చి ని కలిగి ఉండడం చదువుకున్న వాళ్ళు కూడా దెయ్యాలను వదిలించుకోవడాలు
  superstitions నమ్మడం,నా మతం అన్నిటికంటే గొప్పది అంటారు,ఎందుకో తెలియదు.అందువలన పుట్టుకతో వచ్చిన మతం నచ్చినా నచ్చక పోయినా అందులో చివరి శ్వాశవరకు ఉండడానికి ప్రయత్నిస్తారు
  ఏ మతం లో నైన విలువల బోధన ముఖ్యం అందుకే వేదాల కన్నా భగవద్గీత ముఖ్యమైంది మనకు ..
  "ఒక మతం గొప్పతనం ప్రాక్టికల్ గా అట్టడుగు వ్యక్తి కి ప్రాక్టికల్ ఇచ్చే ప్రాధాన్యం మీద ఆధారపడుతుంది"
  pls dont reply comments like other links "which are not practical" and beliefs

  ReplyDelete
  Replies
  1. Please answer my second Question also

   Delete
  2. ఇండియాలో ముస్లిం లు ఎలాగయితే జీవిస్తున్నారో పాకిస్థాన్ లో హిందువులూ అలాగే జీవిస్తున్నారు. ఇక్కడ ఇండియన్స్ ముస్లిం లను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారా ? అబ్దుల్ కలాం గారు, షారుఖ్ ఖాన్ లాంటి సెలబ్రిటీలకే దిక్కులేదు.మతప్రాతిపదికగా విడిపోతే పార్శీలూ,క్రైస్థవులూ కూడా అలా విడిపోతామంటే ఎలా అని మహాత్మా గాంధీ ఆనాడే ప్రశ్నించారు. విడిపోవడం వలన పాకిస్థాన్ బాగుపడిందేమీ లేదు,తెలంగాణాలో ఆంధ్రా వారొచ్చి బాగుచేస్తున్నదీ లేదు.ఎవరి పాట్లు వాళ్ళే పడాలి.కుల,మతాలకన్నా వ్యక్తి ప్రాబల్యమే ఎక్కువ అని ఒబామా నుండి మోడీ దాకా నిరూపిస్తూనే ఉన్నారు. అన్ని ప్రతికూలతల మధ్యా బ్రతికే వారినే హీరోలని పిలుచుకుంటాం, మధ్యలో ఒకరిద్దరు ఇందిరా గాంధీ లాటి వాళ్ళు, కర్తవ్యం విజయశాంతీ లాంటి కిరణ్ బేడీ వచ్చినా ఆడవాళ్ళు కదా పెద్దగా లెక్కచేయరు ! హీరోగా శ్రీ రాముడే ఉండాలనేది హిందువుల అభిజాత్యం !


   Delete