Monday, June 22, 2015

విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

"వైదేహీ, జనకాత్మజే, స్త్రీలు స్వభావ రీత్యా విముక్త ధర్మ రీత్యా చపలులు, భేదాన్ని కలిగించే వాళ్ళు - ఇట్లాంటి పరుష వాక్యాలు నీ వద్ద నించి నేను వినలేను "

చెప్పింది లక్ష్మణుడు - ఉద్దేశించింది సీతమ్మ తల్లిని .

అరణ్య కాండ లో జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని,సీతా దేవి,  లక్ష్మణుని రాములవారిని కాపాడ డానికి వెళ్ళమంటే, లక్ష్మణుండు ససేమిరా కుదరదం టాడు - ఆ ఆర్త నాదం రామునిది కాదు - ఆ మాయావి రాక్షసులది - నిన్ను కాపాడ మని రాములవారి ఆజ్ఞ - ఇక్కడి నించి కదలను గాక కదలను అని లక్ష్మణుడు అంటే ,

అమ్మవారు "సంరక్త లోచను" రాలై లక్ష్మణుని పరుష వాక్యాలతో అంటుంది -

'లక్ష్మణా, నువ్వు నన్ను పొంద డానికే రాముని వెంట గోముఖ వ్యాఘ్రం వలె పొంచి పొంచి వచ్చావు ఈ కాననానికి" అని .

అంతటి తో ఊరుకున్నదా  ?

"ఇది నువ్వూ , భరతుడు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయివుండ వచ్చు. భరతుడు అర్ధం (రాజ్యం) , నువ్వు మరొక అర్ధమైన నన్ను నా పతి నించి వేరు జేయాలని అనుకున్నారు' అంటుంది పరుషం గా  .

"నా పై కోరికతో నువ్వు  రాముడు ఎట్లా పోయినా ఏమైనా కానీ అని ఆతన్ని కాపాడ డానికి  వెళ్ళ నంటు న్నావు "

लोभात् तु मत् कृतम् नूनम् न अनुगच्छसि राघवम् |
व्यसनम् ते प्रियम् मन्ये स्नेहो भ्रातरि न अस्ति ते || ३-४५-७

ఇట్లా పరుష మాటలు మాట్లాడి (వాల్మీకి అంటాడు 'సంరక్త లోచనా ! అని ) అన్న మరో క్షణం లో నే కళ్ళ నీళ్ళు జల జలా రాలి పోతున్నాయి - భీత హరిణి ! - బాష్ప శోక సమన్విత !

మరో క్షణం లో లక్ష్మణుని - अनार्य करुणारंभ नृशंस कुल पांसन అంటూ మరో మారు జాడించడం మొద లెడు తుంది !(ఇట్లా జాడించడం అన్నది మాకు వెన్నతో బెట్టిన విద్య :) అర్థమున్నా లేకున్నా జాడిస్తాం !)

ఈ అరణ్య కాండ లో ఈ ఒక్క సర్గ లో నే వాల్మీకి  స్త్రీ ఒక వివశ స్థితి లో ఎట్లా ఎట్లా మాట్లాడ గలదు - ఏమేమి అనుకో గలదు - ఏవిధ మైనట్టి 'reaction' చూపించ గలదు అన్నదాన్ని  ప్రముఖం గా చూపించడం జరుగుతుంది.

యథొ కర్మః తథొ ఫలః  అన్నదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అవుతుందేమో మరి.

ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

మళ్ళీ అంటుంది సీతమ్మ లక్ష్మణుడి తో -- గోదాట్లో దూకైనా , అగ్నిలో దూకైనా చస్తా గాని, రాముల వారు లేని జీవితాన్ని నేను చూడ లేను - మరొక్కరి తో ఉండ లేను అని - गोदावरीम् प्रवेक्ष्यामि हीना रामेण लक्ष्मण ! అంటుంది

(రామాయణం లో ఈ అరణ్య కాండ తనకు అన్నిటి కన్నా నచ్చిన కాండ అని చెప్పు కున్నారు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రు ల వారు - ఎందుకంటే - ఇందులో గోదావరి మాట ఉన్నదంట ! కాండం పర్యంతం ఆంధ్ర దేశం ఉన్నదంట !-  అందుకనేమో 'గోదాట్లో దూకి చస్తా ' అన్న పదం ఆంధ్ర దేశం లో ప్రాశస్త్య మైన పదమయి పోయింది మన  'ఆండోళ్ళ కి ' , సీతమ్మ వారి స్టైల్ లో !- అబ్బా, ఈ గోదావరి తీరం వాళ్ళు రామాయణం లో కూడా గోదారి పిడకల వేట  వెయ్యకుండా ఉండరు సుమీ !!!))

प्रवेक्ष्यामि हुताशनम् |! - అగ్గి లో బుగ్గై పోతా నంటుంది మళ్ళీ .

దీని పర్యవసానం - యుద్ధ కాండ లో అగ్ని ప్రవేశ ఘట్టం !

మరి ఈ అగ్ని ప్రవేశానికి కారణం సీతమ్మ తన గురించి చెప్పిన శోకా తప్త మాటలే తధాస్తు దేవతలయ్యే యా ?

పరుష వాక్యాలను విన్న లక్ష్మణుడు తన రెండు చెవుల మద్య కాల్చిన బాణం  తో పొడిచినట్టు ఉన్నది అని మళ్ళీ ఇట్లా అంటాడు - "ఇట్లాంటి ధిక్కారా లతో నిన్ను నువ్వే శపించు కుంటున్నావు వైదేహీ అని" -

धिक् त्वाम् अद्य प्रणश्यन्तीम् !


న తు అహం రాఘవాత్ అన్యం కదాపి (పదాపి!) పురుషం స్ప్రుశే !

न तु अहम् राघवात् अन्यम् कदाअपि (पदापि !) पुरुषम् स्पृशे!?శుభోదయం
 జిలేబి
(రామా ! నిన్ను నేను వదలను గట్టి గా 'హేటేస్తూ' ఉంటా :)

12 comments:

 1. రామా! శ్రీ రామా !! శ్యామల రామా!!!

  ReplyDelete
 2. విముక్త అంటే అర్థమేమిటి?

  ReplyDelete
  Replies

  1. విముక్త ధర్మః - > ధర్మము చేత కట్టు బడని (అని అనుకుంటా !)

   జిలేబి

   Delete
  2. వదలి వేసిన - అని అర్ధం,అంటే "ధర్మాన్ని వదలివేసిన" అని అర్ధం?

   Delete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. మీరు ఎప్పుడు సూపరహే :)

  ReplyDelete
  Replies

  1. దీనివల్ల అప్పుడప్పుడు పప్పులో పడడం కద్దు :)

   జిలేబి

   Delete
 5. భేదాన్ని ...కాదు ఖేదము కలిగించు వారు..

  ReplyDelete
  Replies

  1. ఖేదాన్ని భేదాన్ని నిర్వేదాన్ని కలిగించు వారు !!

   జిలేబి

   Delete
 6. @jilaebi
  ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

  haribabu:అదేమిటి జిలేబీ,నేను హిందూ ధర్మ ప్రహేళికలులో ఇదే అర్ధం చెప్పానుగా,అంత పొగిడావు - అప్పుదే మరుపా?

  ReplyDelete
  Replies

  1. హరి బాబు గారు,

   అప్పుడప్పుడు సమయానికి తగినట్టు మరిచి పోతూంటా మండి ! సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమి చెప్పే రంటే ....


   చీర్స్
   జిలేబి

   Delete
 7. పోన్లే జిలేబీ మాతా,
  అసలు శ్లోకాలు చదివి అర్ధం చేసుకోలేని నాకు మొత్తం సన్నివేశం కళ్ళకి కట్టింది.

  దీని కంటిన్యుయేషను లంకలఓ హనుమంతుల వారు చూస్తుండగా మెదకి ఉరి బిగించుకోబొతూ చెప్పిన "ప్రియాన్న సంభవేత్ దుఃఖం,అప్రియాత్ అధికం భయం,తాభ్యాం హి యే వియుజ్యంతే - నమస్తేషాం మహాత్మనః" అనే పశ్చాతాపంలో మళ్ళీ సీతాహరనం నాడు తను చేసిన లక్ష్మణ నిదకి పశ్చాత్తాపం అనిపిస్తుంది కదూ!

  ఇది సుందర కాండ లోని నవగ్రహ రత్నమాల లోని 5వ మంత్రం?!

  ReplyDelete