Saturday, June 6, 2015

ఇక నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా !

ఇక నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా ! 

ఇక మీదట నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా అయ్యర్ వాళ్ దీర్ఘం గా నిట్టూర్చి చెప్పా మా అయ్యరు గారితో .

జంబునాథన్ కృష్ణస్వామీ అయ్యరు గారు కనిపించని కళ్ళ తో కనిపించ డానికి ప్రయత్నం జేసే కళ్ళ జోళ్ళ తో దీర్ఘం గా నా వైపు చూసేరు .

వారి పెదవుల పై ము ము న .

ఎందుకు అట్లా ము ము న ? అడిగా ఉడికి పోతూ . ఈ మద్య సూరీడు మరీ చుర్రు మంటున్నాడు . ఆ పై బ్లాగర్లు కూడా మరీ మరీ చుర్రు చుర్రు మని పిస్తున్నారు .

ఇప్పటి కి ఇది ఎన్నో సారి జిలేబి ఇట్లా నువ్వు కొట్టు కట్టెయ్యటం గురించి చెప్పడం ? అడిగేరు అయ్యరు గారు .

వేళ్ళ తో లెక్క పెట్టడటం మొదలెట్టా ! నా తో బాటే కొట్టు కట్టేస్తా నని ప్రతినలు బూనిన వాళ్ళు ఒక్కరొక్కరు గా కట్టే సేరు టపా . ప్చ్ ప్చ్ నేను మాత్రం ఇదిగో అదిగో అంటున్నా !

లెక్ఖ తేలటం లే జెప్పా మా అయ్యరు గారితో .

ఈ మధ్య పని లేని రమణ బాబు గారు కూడా తమ టపా చాప చుట్టేసేరు చెప్పా మళ్ళీ .

పని లేక నే కదా ఏదో టీం పాస్ టైం పాస్ చెయ్యాలని టపాలు , బ్లాగులు గట్రా రాయటం మొదలెట్టేవు ? అడిగారు మా అయ్యారు గారు .

ఆయ్ ! పని లేక అని జెప్ప లేను గాని , పని ఎగ్గోట్టాలనే ఆలోచనలతో నే , అంటే వంటా వార్పూ గట్రా ఎగ్గొట్టా లనే 'సదుద్దేశం' తో, అంటే మరీ నేను బిజి బిజి సుమీ అని చెప్పు కోవాలనే అనుకుని మొదలెట్టా అని జెప్ప బోయి, బామ్మ గారు గుర్తు కొచ్చి, ఎంత తన 'మగ వాడైనా' స్త్రీ తన గుట్టు ని రట్టు చెయ్యకూడదు, జేస్తే మన వాల్యూ తక్కువై పోతుంది పిల్లా అని జెప్పిన బామ్మ వాక్యం వేద వాక్యం గుర్తు కొచ్చి

అబ్బే, అట్లా ఏమీ లేదు . ఏదో మనకు తెలిసిన విజ్ఞానం అందరికీ తెలియ బరుద్దా మని రాసా ' అని డబ్బా కొట్టాను .

అంటే ? ఇప్పుడు విజ్ఞానం అంతా అయి పోయినట్టా ? టపా చాప చుట్టే స్తా నంటు న్నావ్ ? అయ్యరు గారు రిటార్టు ఇచ్చేరు !

హమ్మో ! వీరు కాలికేస్తే మెడకి మెడకి వేస్తే కాలికి వేయ గలిగిన వారే అనుకున్నా లో లో పల .

దాన్ని గ్రహించి నట్టు ఉన్నారు అయ్యరు గారు - "ఇదిగో జిలేబి బ్లాగు మూట కట్టే య్యా లను కుంటే కట్టేయి . ఎవరూ ఏమీ బాధ పడరు లే ! జేప్పేరు .

ఎవరూ ఏమీ బాధ పడరా ? అడిగా బేల గా .

అవును నిఖార్సు గా చెప్పేరు అయ్యరు గారు .

అంటే నేను రాస్తూ ఉంటె నే వారికి బాధా మయం గా ఉంటుందా ? అడిగా ఈ మారు వారి కాలికేసే ముడి ఫార్ములా అప్లై జేస్తూ .


వారికి బాధో కాదో తెలీదు కాని కొంతటీం అండ్ టైం పాస్ జేయ్యడా నికి మరో శాల్తీ ఉంటుంది అంతే జేప్పేరు

సర్లెండి అయితే కొన్ని రోజులు టపా మూత బెట్టి ఆ పై తెరుస్తా జెప్పా .

జిలేబి అట్లా జేస్తే నీ గురించి జనాలు మరిచి పోతారేమో ? అయ్యరు గారు సందేహం లేవ దీసేరు .


అయితే దేశం లో ఉన్న పత్రికల్లో నించి రోజుకో 'కట్ పేస్ట్ మేటరు రాస్తూ పోతా ! అప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటా ఈ మద్య  గమనించిన కట్ పేస్ట్ స్పెషలిస్ట్ జ్ఞానం తో జెప్పా !

అప్పుడప్పుడు కట్ పేస్ట్ చేస్తే ఒకే ! అన్ని టపాలు కట్ పేస్ట్ చేస్తే నీ టపా లు ఎందుకు ? శుద్ధ దండగ కాకుంటే ? అయ్యరు గారు అడిగేరు .

అబ్బా ! తల పగిలి పోతోంది !

ఇంతకీ టపా చాప్ చుట్టేయ్యా లా వద్దా ? తేల్చి చెప్పండి అయ్యరు గారిని నిలదీల్సి అడిగా .

ఆకాశమంత నిశ్శబ్దం !

అబ్బా ఈ  ప్రశ్న కి సమాధానం ఎవరిస్తారో ?


శుభోదయం
జిలేబి




 

9 comments:

  1. Please Mam,, don't close the blog.. already ramana gari blog ni miss avutunnam,,mee vanti vari gurniche kada "Pilla Zamindar" cinema lo ok dialogue rasaru.. Science kavalante internet lo dorukutundi,,sanskaram kavalante mee vanti anubava daarsinikulu kavali...

    ReplyDelete
  2. A hilarious blog by ,Pani Leka Ramana on "Importance of Mandatory Internships for PG Medical Students “ was enlightening and equally justified comments made by some PG students had enlighten their plight,,,
    Also, your blog in November or december 2014 on feverishness and anxiety, Vyasa maharshi searching about his lost cow was enlightening, though vyasa maharshi has divya drishti,he forgot about his own power and searched all over Himalayas on foot,, (your justification was hilarious,that the power may be exhausted for simple uses.. ) , I read that blog on midnight and was very bad mood,after reading that I was very relaxed and started looking the life in different perspective.. if some problem has come, I would first relax and thing of the problem and solution rather than feeling bad.. 
    Please don’t close the blog , please don’t bother those “Copy Paste” Rubbish mongers.. You are different class,, you people are positive energy ..

    ReplyDelete
  3. ఏముంది, మీ బ్లాగు మూసెయ్యాలా, వద్దా అని ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పోల్ పెట్టండి.
    ఎక్కువమంది ఏం చెప్తే అది చెయ్యండి.
    రిగ్గింగులు గట్రా జరగకుండా (మీరు కూడ చెయ్యకుండా) జాగ్రత్త పడండి.
    ఆ తరువాత ఇది ప్రజల నిర్ణయం, నాకేమి సంబంధం లేదు అని ప్రకటించేయండి.

    ReplyDelete
  4. అయ్యరు గారు అసలు విషయం పసికట్టేసారుగా!
    జిలేబీ పప్పులు ఇంకెన్నాళ్ళో ఉడకవు కాబోలు?

    ReplyDelete
  5. ఈ టపా గుండు జ్ఞానం సీరీస్ లో మూడో భాగమా?

    ReplyDelete
  6. Be a dispassionate judge for yourselves of the following.
    Are you,
    1. ashamed of writing something in your blog?
    2. Feared of something or somebody?
    3. Disgusted of writing in blog?
    4. Not having any stuff of your own to write?
    5. Not determined and bold to face consequences, if any?
    6. Depressed?
    7. Finally, last but not least is, physically unable to write?

    Suppose you are a well versed, old and bold lady for which we are very proud of you. If you are having any of the valid reasons enumerated above, you are at liberty to close your blog.

    ReplyDelete
  7. అయితే దేశం లో ఉన్న పత్రికల్లో నించి రోజుకో 'కట్ పేస్ట్ మేటరు రాస్తూ పోతా ! అప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటా ఈ మద్య గమనించిన కట్ పేస్ట్ స్పెషలిస్ట్ జ్ఞానం తో జెప్పా !

    అప్పుడప్పుడు కట్ పేస్ట్ చేస్తే ఒకే ! అన్ని టపాలు కట్ పేస్ట్ చేస్తే నీ టపా లు ఎందుకు ? శుద్ధ దండగ కాకుంటే ?//

    ఇది యెవరికి తగలాలో వారికి ఖచ్చితంగా తగులుతుంది.

    ReplyDelete
  8. Is it ? one more wicket down and line clear for the third wicket to follow?
    ఏంటీ! నిజంగానే కొట్టుకట్టేశారా? అంటే మాకు లైన్ క్లియర్ ఇచ్చేసినట్టేనా? :)

    ReplyDelete

  9. నా మీద దయ యుంచి కామేంటి నన్ను ప్రోత్సహించిన మీ అందరికి బ్లాగ్వీయ నెనరస్య నెనరః !

    ఉరుకుతా ఉరుకుతానన్న సయితేగాని ఉరికినసయితిని జూడలా :)

    ఈ సామేతేదో బాగుంది ఈ ఫార్ములా ఫాలో అయి బోతా :)

    జిలేబి

    ReplyDelete