Friday, August 28, 2015

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! -పద్య రచన- శ్రీ గుండు మధుసూదన్!

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! 

పద్య రచన- శ్రీ గుండు మధుసూదన్!

నేడు శ్రావణ మాసమునందు  పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మీ శుక్రవారము. పరమ పవిత్రమైన పండుగ రోజు.

ఈ సందర్భముగా శ్రీ గుండు మధుసూదనరావుగారు రచించిన వరలక్ష్మీ  వ్రత మాహాత్మ్యము కథను పద్యములలో చదివి ఆనందించండి.

శ్రీ గుండు మధుసూదన్ గారికి
అభినందనల తో జిలేబి 
 

పద్య రచన. శ్రీ గుండు మధుసూదన్! 
ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14)
(ఇది వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)

Thursday, August 27, 2015

కాళిదాసు చెల్లెలి మావ భలే మంచోడు :)

 
కాళిదాసు చెల్లెలి మావ భలే మంచోడు :)
 
కాళిదాసు చెల్లెలు
కవిత చెబ్తే 
మావ మెలితిరిగి
వంకర్లు పోయేడు 
 
 
 
జేకే !
 
జిలేబి 

Tuesday, August 25, 2015

నా జేబులో డబ్బులు పోయెను - రామా హరే ! కృష్ణా హరే !


చైనా డమాల్ - గ్లోబల్ జాటర్ డమాల్ :)

చీని చీనాంబరాలు ధరించి అని ఆ కాలం లో గొప్ప గా చెప్పే వాళ్ళం. ఈ మధ్య గ్లోబలైజేషన్ గోల లో చీని చీనాంబరాలు ఎక్కడ చూసినా అక్కడ .

పాపం చీనా వాడు కొంత ఇల్లు సర్దు కుంటామని ఇల్లు కొంత సర్ది తే , ఆ సేతు హిమాచల పర్యంతం అన్నట్టు అటు జప్పాను వాడి నించి ఇటు అమెరికా వాడి దాకా అందరి జాటర్ డమాల్

కొందరు మానిక్ మండే అంటే , మరి కొందరు బ్లాక్ మండే అని గీతాలాపన చేసేరు .

బ్లడ్ బాత్ ఆన్ దలాల్ స్ట్రీట్ అంటూ మా హిందూ 'వార్' చెప్పేరు .

ఒక్క రోజులో వెయ్యిన్ని ఆరు వందల పాయింట్లు జాటర్ డమాల్ అవడం ప్రపధమం . ( అంటే, ఇకమీదట ఎప్పుడైనా జాటర్ డమాల్ అయితే దీనికి పై బడే అన్నీ పడతాయని అనుకోవాలేమో మరి :) బెంచ్ మార్క్ ?)

ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో హుళు హుళు క్కి అయి పోయిందట :) ఇంతకీ ఈ దస్కం ఎవరి జేబులో కెళ్ళి ఉంటాయి ? అమెరికా వాడి ఇంటికి మళ్ళీ చేరి పోయి ఉంటాయా ? సమాధానం లేని ప్రశ్న :)

సరే మన జైట్లీ వారేమో అబ్బే , మన దేశం సర్దేసు కుంటుంది అని వాక్రుచ్చేరు .

మా ఆర్ బీ ఐ రాజన్ గారేమో జిలేబి చీర్సు చెబితే చెప్పును గాని నేను మాత్రం చీర్స్ చెప్పనే చెప్పను అనేసేరు - రీజేర్వ్ బ్యాంక్ చీర్ లీడర్ కాదోయ్ అంటూ .
సందులో సడే మియా అంటూ వడ్డీ రేటు మార్పు కి కొంత కామా పెట్టేరు .

ఈ స్టాకు మార్కెట్టు గోలలో మామూలు విషయమై పోయిన ది - కమాడిటీ మార్కెట్ - పదహారు సంవత్సరాల ప్రాయం కోల్పోయింది :) (పదినారు వయదినిలే అంటూ ఇక మనం పాట పాడేసు కోవచ్చు )
మధ్య లో రూపాయి భేతాళుడు నాదారి ఎడారి నా పేరు బికారి అంటూ మళ్ళీ మొదలెట్టేడు !వీటన్నిటికి కారణం గ్రహ పరిస్థితులే అని నొక్కి వక్కాణిస్తూ న్నారు బ్లాగ్ జ్యోతిష్యులు :)
రాబోయే సెప్టెంబర్ 'మహీ'నా లో 'మహీ' మీద గామా రేస్ విపరీతం గా వస్తున్నాయంటా ; దానికి ముందస్తు గా ఇవన్నీ 'శుభ' సూచకాలు కని పిస్తున్నాయ్ (అట :)

జిలేబి మొన్న స్వామీ వారితో సెల్ఫీ మేళ మాడేవు కదా దాని పర్వ్యసానమే ఇది అని మరి కొందరు 'మెట్టియల్' విరిచేరు కూడన్నూ :)

జిలేబి ఇప్పుడు కూడా చీర్సేనా అంటే ఏమి చెప్పడం

జాటర్ డమాల్ అయినా చీర్సు చీర్సే :) జిలేబి జిలేబి యే !

చీర్స్
జిలేబి
 

Friday, August 21, 2015

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !
 
శ్రీ మన్మధ నామ సవంత్సరే
దక్షిణాయనే వర్ష ఋతౌ
శ్రావణ మాసే శుక్ల పక్షే

....


విచ్చేసిన వారందరికీ శుభోదయం. ఈ కళ్యాణ సేవ తదుపరి స్వామీ వారితో సెల్ఫీ సేవ ప్రారంభ మగుతుంది .

మీ మీ మోబైళ్ళ తో  పద్మావతీ మంగ తాయారు సమేత  స్వామీ వారితో సెల్ఫీ దిగాలనుకున్న వాళ్ళందరూ తలో వెయ్యిన్నూట పదహార్లు కౌంటర్లో చెల్లించి రశీదు పుచ్చుకోవాల్సిందని మనవి .

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్త జనవాహిని కౌంటరు మీద పడింది .

కౌంటరు కలెక్షను మొదలయ్యింది :)


ఆ హా ఒకా నొక కాలం లో మీ మోబైళ్ళు కి నో ఎంట్రీ . ఆ పై స్విచ్ ఆఫ్ మోడ్ ; ఆ పై సైలెంట్ మోడ్ ;

The current trend is "selfie" mode :) Mod "I" ndia :)


స్వామీ వారు , అమ్మ వారలు కూడా మరింత సింగారించు కునేరు. సెల్ఫీ లో మనం బాగా కనబడాలి కదా మరి :

స్వామీ వారి తో సెల్ఫీ దిగండి . మీ జీవితాన్ని  శుభకరం గా మలచు కోండి .

మీకు మొబైలు లేదా ? no problem.

పక్కనే సామ్సంగ్ వారు 'స్వామి సంఘ్' అనే సరికొత్త మేడ్ ఇన్ ఇండియా 'ఇండీ' మొబైల్ షాప్ కూడా తరిచేరు . అందులో కొనుక్కోవచ్చు . స్టేటు బ్యాంకు వారి  పన్నెండు నెలల ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంస్టాల్ మెంట్ ఆఫర్ కూడా ఉంది .

అట్లాగే ఐఫోన్ వారి 'ఐపద్మిని' అనే సరి కొత్త ఇండీ మొబైల్ కూడా ఉందండోయ్ .

ఆఫర్ ఆఫర్ ఆఫర్ !

బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ మేడ్ ఇన్ ఇండియా మోబైళ్ళు కూడా ఉంది

ఆలశించిన ఆశా భంగం. భలే మంచి చౌక బేరం

రారండోయ్ రారండోయ్
పిల్లా జెల్లా రారండోయ్ !


శుభోదయం
చీర్స్
జిలేబి
(Mod "I" ndia )

Monday, August 17, 2015

జ్యోతి లక్ష్మి చీర కట్టింది జిలేబి సినిమా ప్రవచనం

జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది' జిలేబి- సినిమా ప్రవచనం
 
అకాల చరాచర అండ పిండ బ్రహ్మాండములో ఉండు అమ్మ ఎవరు ?
ఆవిడ ఏ రూపం లో ఉంది ?
అదియే పరతత్వ మైన జ్యోతి రూపం లో మనకు కానవచ్చును .
 
శివ పురాణం లో లక్ష్మీం 'చీర' రాజ  తన్హాయీ ' అని చెప్ప బడి ఉంది .
 
అట్లా  జ్యోతి, లక్ష్మి ,చీర కట్టింది ఎవరిని ?
 
అండ పిండ బ్రహ్మాండ లోకంలో ఉన్న
ద్విపద చతుష్పద జీవరాసులన్నీ 
ఆ  చీర ఒడుపులో నించి ఊడి పడి,
ఆ మాత 'క్షీర' ఉడుపుల్లో పెరిగిన 
ఆ మాత ఇచ్చిన  వరాల బిడ్డలే  కదా !
 
జిలేబి అనగా ఎవరు ?
 
బ్లాగ్మాత
 
పంచ దశ లోక పరమాణువు .
 
సినిమా అనగా నేమి ?
 
ఆది శంకరుల వారి - దృక్ దృశ్య వివేకావివేక  'చూడ ' , (ర) మణీ, మనీ !
 
ప్రవచనం అనగా నేమి ?
 
ప్రస్తుత వచనం . ప్రసంగ వచనం 
అది అప్రస్తుత మైతే, అప్రసంగం అయితే 
 తపాళ్ టైటిళ్ళు తిట్లు గా పరిడ విల్లును .
 
ఇంతటి తో జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది జిలేబి' సినిమా ప్రవచనం పరి సమాప్తం .
 
ఈ ప్రవచనాన్ని చదివిన వారికి , చదివి వినిపించిన వారికీ
ఆ కొండ పైనున్న మా పెరుమాళ్ళు
రెండు రెట్లు 'వడ్డెనలు'
వాయించునని తెలియ జేసుకుంటో
 
"ఐ యామ్ వేద" !
 
జిలేబి
 
 

Friday, August 14, 2015

కన్నీటి కలువ

కన్నీటి కలువ 
 
ఒక కలువ
విరుచు కోవాలని 
ఆకాశం వైపు చూసింది 
 
చినుకుల కన్నీళ్లు 
కలువ ని తాకితే 
 
కన్నీటి కలువ 
కాలువ లా పెల్లుబుకింది 
 
 
జిలేబి 


 

Monday, August 10, 2015

బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి - దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగం

బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి - దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగం
 
వారి ప్రసంగ వేగం రైలు స్పీడు ...
సో కొంత స్పీడు తగ్గించి వినాలను కుంటే
Audacity సాఫ్ట్వేర్ ద్వారా తగ్గించి వినవచ్చు .
(Its clarity is better at 90% Change Speed)
 
 
 
 
 
cheers
zilebi

Thursday, August 6, 2015

స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో !

 
స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో!!!

స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో బ్లాగు వేణీ వేణులు గొంతెత్తి ఓహో ఆహా అని స్వామీ వారిని కొనియాడు తూంటే స్వామీజీ వారు తమ బవిరి గడ్డం తడుము కుంటూ తమ భక్త బ్లాగు జనవాహిని ఆసాంతం గమనించి , తలయాడించి తమ సంతోషాన్ని వెలుబరచి చిరు నగవు చిందించేరు .

బ్లాగు భక్త జనవాహిని 'ఆనంద' డోలికలో తూగు లాడేరు .

భక్తులారా ! స్వామీ వారు గొంతు సవరించు కునేరు .

వెంటనే జనవాహిని స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ వారికి జయ్ అంటూ మరో మారు గళం ఎత్తింది .

స్వామీ వారు చేయి ఊపేరు - జనవాహిని నిశ్శబ్దం గా స్వామీ వారి వైపు ఆతురత తో చూసింది .

బ్లాగ్ భక్తులారా ! మీకు ఇవ్వాళ నేను జ్ఞాన బోధ చేయడానికి ఉపక్రమిస్తున్నా . చెప్పేరు స్వామీ వారు .

"భగవంతుడు భక్త జన మందారుడు అంటారు కదా ! అసలు ఆ భగమంతుడు కి భక్తుడి కి అసలు సంబంధం కలిగించే వారు ఎవరు " స్వామీ వారు ప్రశ్నించి నిదానించేరు .

వెంట నే బ్లాగు భక్తుల గుసగుసలు, రుస రుసలు మొదలయ్యేయి . టప టపా  చేతులు తట్టేయి . స్వామీ వారు ముదావహం గా తలూపేరు .

బ్లాగ్ 'భక్తులూ' కానివ్వండి ఇక మీ కామింటులు ! స్వామీ వారు చేయి పై కెత్తి గాలి లో ఊపేరు .

భక్తులు తమ తమ లేపుటాపు లను తెరచి తాపము తో కామింట డటం మొదలెట్టేరు .....

అవి ఎట్లన .....


చీర్స్
జిలేబి