Tuesday, August 25, 2015

నా జేబులో డబ్బులు పోయెను - రామా హరే ! కృష్ణా హరే !


చైనా డమాల్ - గ్లోబల్ జాటర్ డమాల్ :)

చీని చీనాంబరాలు ధరించి అని ఆ కాలం లో గొప్ప గా చెప్పే వాళ్ళం. ఈ మధ్య గ్లోబలైజేషన్ గోల లో చీని చీనాంబరాలు ఎక్కడ చూసినా అక్కడ .

పాపం చీనా వాడు కొంత ఇల్లు సర్దు కుంటామని ఇల్లు కొంత సర్ది తే , ఆ సేతు హిమాచల పర్యంతం అన్నట్టు అటు జప్పాను వాడి నించి ఇటు అమెరికా వాడి దాకా అందరి జాటర్ డమాల్

కొందరు మానిక్ మండే అంటే , మరి కొందరు బ్లాక్ మండే అని గీతాలాపన చేసేరు .

బ్లడ్ బాత్ ఆన్ దలాల్ స్ట్రీట్ అంటూ మా హిందూ 'వార్' చెప్పేరు .

ఒక్క రోజులో వెయ్యిన్ని ఆరు వందల పాయింట్లు జాటర్ డమాల్ అవడం ప్రపధమం . ( అంటే, ఇకమీదట ఎప్పుడైనా జాటర్ డమాల్ అయితే దీనికి పై బడే అన్నీ పడతాయని అనుకోవాలేమో మరి :) బెంచ్ మార్క్ ?)

ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో హుళు హుళు క్కి అయి పోయిందట :) ఇంతకీ ఈ దస్కం ఎవరి జేబులో కెళ్ళి ఉంటాయి ? అమెరికా వాడి ఇంటికి మళ్ళీ చేరి పోయి ఉంటాయా ? సమాధానం లేని ప్రశ్న :)

సరే మన జైట్లీ వారేమో అబ్బే , మన దేశం సర్దేసు కుంటుంది అని వాక్రుచ్చేరు .

మా ఆర్ బీ ఐ రాజన్ గారేమో జిలేబి చీర్సు చెబితే చెప్పును గాని నేను మాత్రం చీర్స్ చెప్పనే చెప్పను అనేసేరు - రీజేర్వ్ బ్యాంక్ చీర్ లీడర్ కాదోయ్ అంటూ .
సందులో సడే మియా అంటూ వడ్డీ రేటు మార్పు కి కొంత కామా పెట్టేరు .

ఈ స్టాకు మార్కెట్టు గోలలో మామూలు విషయమై పోయిన ది - కమాడిటీ మార్కెట్ - పదహారు సంవత్సరాల ప్రాయం కోల్పోయింది :) (పదినారు వయదినిలే అంటూ ఇక మనం పాట పాడేసు కోవచ్చు )
మధ్య లో రూపాయి భేతాళుడు నాదారి ఎడారి నా పేరు బికారి అంటూ మళ్ళీ మొదలెట్టేడు !వీటన్నిటికి కారణం గ్రహ పరిస్థితులే అని నొక్కి వక్కాణిస్తూ న్నారు బ్లాగ్ జ్యోతిష్యులు :)
రాబోయే సెప్టెంబర్ 'మహీ'నా లో 'మహీ' మీద గామా రేస్ విపరీతం గా వస్తున్నాయంటా ; దానికి ముందస్తు గా ఇవన్నీ 'శుభ' సూచకాలు కని పిస్తున్నాయ్ (అట :)

జిలేబి మొన్న స్వామీ వారితో సెల్ఫీ మేళ మాడేవు కదా దాని పర్వ్యసానమే ఇది అని మరి కొందరు 'మెట్టియల్' విరిచేరు కూడన్నూ :)

జిలేబి ఇప్పుడు కూడా చీర్సేనా అంటే ఏమి చెప్పడం

జాటర్ డమాల్ అయినా చీర్సు చీర్సే :) జిలేబి జిలేబి యే !

చీర్స్
జిలేబి
 

14 comments:

 1. It is as expected, may be a bit late :)

  ReplyDelete
  Replies

  1. ఆహా శర్మ గారు, త్రికాల జ్ఞానులు :)

   జిలేబి

   Delete
  2. I have expected it when chaina devalued

   Delete
  3. Sarma gaaru,

   Very correct expectation. But most ironical is that with in a few days everything appears green :)

   There is somewhere something wrong;

   We should see what happens in September 2015 !

   Who ate my cheese :)

   cheers
   zilebi

   Delete
  4. Really to say, the down fall predicts and indicates only fear. The recovery is true. It is too early to predict about Sep 2015 :)

   Delete
  5. Time had eaten your cheese :)

   Delete
 2. ఈ స్టాక్ మార్కెట్ల మాయాజలం బోధపడదు. తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి అన్నట్లుంటుంది. ఎక్కడో జల్లు పడితే వేరెక్కడో తుమ్ములు రావడమేమిటో / జలుబు చెయ్యడమేవిటో, స్టాక్ మార్కెట్లు కుదేలయిపోవడమేమిటో, రక్తమోడడమేవిటో ..... అంతా మాయ , మాలాంటి అజ్ఞానులకి బుర్రకెక్కదు :(
  మాబోటి సామాన్యులకి అర్ధమయ్యేది దైనందిన జీవితంలోని ఇక్కట్లు - ఈ రోజు (25-08-2015) "ఈనాడు" (హైదరాబాద్) పేపర్లో మొదటి పేజ్ లో వచ్చిన "ఇదీ సంగతి" అనే కార్టూన్ దీనికి అద్దం పడుతుంది. కొనడానికి వచ్చిన వ్యక్తికి కూరగాయల వ్యాపారి "ఇదేం స్టాక్ మార్కెట్ అనుకున్నావా కుప్పకూలటానికి? ఇది కూరగాయల మార్కెట్. హెచ్చటమే కాని తగ్గటం ఉండదు" అనే జీవితసత్యాన్ని బోధిస్తోంది కార్టూన్ లో ::) :)

  ReplyDelete
  Replies

  1. విన్న కోట వారు,

   మాకు మాత్రం ఏమన్నా అర్థమై రాస్తున్నామా : అంతా గూగుల్ దేవేరి కటాక్షం. అంతా విష్ణు మాయ !

   చీర్స్
   జిలేబి

   Delete
 3. Monday morning blues...

  ReplyDelete
  Replies
  1. బోనగిరి గారు,

   చాలా కాలం తరువాయి

   మొండి చేతుల మార్నింగ్ బ్లూస్ :)

   జిలేబి

   Delete
  2. అక్కడెక్కడో జిలేబిలు, చెర్రీలు జోకులేసేసుకుంటున్నాయి. చూసారా?

   Delete

  3. బోనగిరి వారు,

   ఎక్కడ జిలేబీలు ? ఎక్కడ చెర్రీలు :) లింకు ఇవ్వకుండా ఇట్లా ఊరిస్తే గేట్లా :)

   చీర్స్
   జిలేబి

   Delete
 4. జిలేబీలు చెర్రీల సంగతేమో గానీ, మాంసం తింటామని ఎముకలు మెళ్ళో కట్టుకుని తిరుగుతున్నవాళ్ళయితే కనిపిస్తున్నారు.

  ReplyDelete
 5. http://idhenalokam.blogspot.in/2015/08/blog-post_74.html

  ReplyDelete