Wednesday, September 2, 2015

హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)


హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)
 
 

అక్కడక్కడా చెదురు ముదురు గా తెలుగు బ్లాగు లోకం లో టపాలు రాద్దామని, వీలైతే తమకు తెలిసిన దానిని నలుగురుకి షేర్ చేసుకుందామని గట్రా 'సద్భావన' తో ఉన్న బ్లాగు మణులు, మాన్యులు బితుకు బితుకు మని నేటి టపా రాద్దామా వద్దా అని డైలమా లో పడి సరే పోనీ ఈ దురద వదిలితే పోయేదా ఏదో ఒకటి రాద్దా మని నిర్ణయించు కని కీ బోర్డ్ పట్టేరు , టపా రాసి హమ్మయ్యా ఇవ్వాల్టికి మనం రాసే సాం - ఏడుకొండల వాడా వెంకట రమణా నా టపాలు 'హ్యాక్' కాకుండా చూడు సామీ అంటూ పెరుమాళ్ళ కి నమస్కారం పెట్టి పబ్లిష్ బటన్ నొక్కేరు .

అంతలో బ్లాగు భూతాలూ , పెను భూతాలూ, లిటిల్ రాస్కేల్స్, బిగ్ 'భ్రాతర్స్' , టైనీ 'త్విట్టర్స్' ఆవులింతలు బెట్టి ముసుగు తన్ని నిదుర పోదామా లేక బ్లాగు లోకం మీద పడి కస మిస కామింట్ల తో కుదేద్దామా అని మళ్ళీ ముసుగులు పెట్టు కునేయి .

అంతలో వాళ్ళ బాస్ అందర్నీ 'జర నిద్ర లేవండహే' అని  అదమాయించి తానూ టపాలకి కామెంట్లు బరకడానికి సంసిద్ధురా లయ్యింది.

అగ్రిగేటర్ ల లో కామింట్ల వరదలు తయారయ్యేయి .

కుక్కా !

నక్కా !

నంగ నాచి

ఓసీ శూర్పణఖ !

బద్మాష్ !

ఆంద్రోళ్ళ ఆగడాలు

తెలంగాణా తిట్లు

నువ్వా  నేనా

సై అంటే సై



బ్లాగు భూతాలూ, రాస్కేల్స్ గుంభన గా నవ్వు కునేయి . టపాలు రాస్తారర్రా :) చూడండి మీ టపాల కన్నా పెద్ద పెద్ద కామింట్లు పెడతాం అంటూ 'బద్మాష్' అంటూ అరిచేయి .

వాళ్ళ బాస్ అందరికి ఆర్డర్ పడే సింది - ఒరేయ్ బడుద్దాయిలు, అందరూ ఓ పదో పరకో పేర్లు పెట్టు కొండర్రా మీలో కొందరు పొగుడుతూ రాయాలి . మరి కొందరు తెగుడుతూ రాయాలి . మరి కొందరు బండ 'బూట్ల' తో తల తన్నేలా కామింటా లి .

సై అంటే సై అనేయి కామింటు కామినులు, భూత ప్రేత పిశాచాలు :)

హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులో కామేంటోళ్ళం టే నే నాకు భయ్యం :)

శుభోదయం
చీర్స్
జిలేబి

29 comments:

  1. నమస్తే ,,జిలేబీ గారు . బావున్నారా ?
    మీరు (అదేలెండి) మీలాంటి మరొకరు భయమంతూనే పాము పుట్టలో వేలు,పులి నోట్లో తల పెట్టేసారు .
    మీరు చెప్పింది నిజమండీ ! భలే వ్రాసారుగా ! పోస్ట్ ల కన్నా కామెంట్స్ గోల ఎక్కువైంది . విరక్తి వచ్చి నేను కామెంట్ ఆప్షన్ తీసేసి మరీ మళ్ళీ బ్లాగ్ లోకి వస్తున్నా ! మీరే కనబడ్డారు కామెంటటానికి. నా కామెంట్ భయపెడితే మన్నించాలి . నాది అసలు సిసలైన పేరు,బ్లాగ్ అండీ . భయపడవద్దు . :)

    ReplyDelete
    Replies
    1. వనజ వనమాలీ గారు,

      బహు కాల దర్శనం !

      ఇట్లా భయ పడితే ఎట్లా అండీ ! కామెంట్ల కి భయపడి మూత పెట్టడమా ! అదిన్నూ వనజ గారా !

      భయము వీడండీ ! నిర్భయం గా వ్రాయండి . సవాల్ పే సవాల్ చెయ్యండి అట్లా ఎవరు కామింటు తారో అట్లాంటి వారి దరిదాపుల్లో కి అల్లా టప్పా వ్యాఖ్యల తో మరో మారు ఎవరూ రారు

      ఆల్ ది బెస్ట్ !

      చీర్స్
      జిలేబి

      Delete


  2. పిడివాదమను రోగ పీడితుల్ కొందరు

    సహనమ్ము కోల్పోయి సంచరింత్రు

    జ్వలిత హింసానంద సైకోలు కొందరు

    అఙ్ఞాత రూపాన యరచు చుంద్రు

    పాండిత్య బురదలో పడి దొర్లు కొందరు

    తప్పులెంచుటె తమ గొప్ప యంద్రు

    చెత్త రాతల కొంగుశ్రీల భూషించుచు

    కొందరు పరవశంబందు చుంద్రు



    కూటముల్ గట్టి కొందరు కూడి మాడి

    పూని తమలోన తారు మెప్పులు వహింత్రు

    సంయమనము పాటించరు చాల మంది

    తెలుగు బ్లాగుల కామెంటు ధీరు లిపుడు .



    అన్నియును తమకె తెలియునన్న యహమె ,

    యతిశయమె మూలమింతకు _ స్వాతి శయము

    వీడి , యితరులు చెప్పేది కూడ వినుటె

    విఙ్ఞత కద ! , యిచ్చోట సర్వఙ్ఞు లెవరు ?

    ReplyDelete
    Replies

    1. లక్కాకుల వెంకట రాజా రావు గారు,

      బహు కాల దర్శనం !

      మీ కవితావేదన అర్థం చేసుకో గలను . తెలుగు బ్లాగు లోకపు తెగులు ఎప్పుడు వదులు తుందో మరి ?

      జిలేబి

      Delete
  3. బ్లాగుల్లో రాక్షసులు అంటే ఎవరో తెలుసా!!?#http://ssmanavu.blogspot.in/2015/05/blog-post_27.html

    ReplyDelete
    Replies

    1. మద్ది గుంట నరసింహా రావు గారు,

      మీ బ్లాగులూ రాక్షసులు టపా భేషు! బ్లాగ్వాసుని మోక్ష ప్రాప్తి గుర్తు కోస్తోంది :)

      జిలేబి

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. నేనైతే ఈ‌మధ్య కొన్నిరోజులుగా ఏమీ‌ వ్రాయలేదు. ఇదీ బాగానే ఉన్నట్లుంది!. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదన్న సామెత ఉందికదా అలాగన్న మాట.


    చెత్తకీర్తనలని నిందచేయు వారు
    న్యాయమెఱుగనని మాట వేయువారు
    తెలిసియును బ్లాక్మెయిలరని పలుకు వారు
    నోరుగలవారు నాకేమొ నోరు లేదు


    అందుచేత వ్రాయమనస్కరించక పోవటం హెచ్చుశాతం కారణం. వృత్తిగలమైన వత్తిళ్ళు మిగతాశాతం‌ కారణంగా శ్యామలీయం బ్లాగు ప్రస్తుతానికి మౌనంగా ఉంది.

    అస్త్రసన్యాసం అంటూ ఇంకా గట్టిగా ఏమీ‌ అనుకోలేదు కాని కొన్ని కొన్ని వేరే ఆలోచనలైతే ఉన్నాయి. వనజగారు అన్నట్లుగా నావి కూడా కామెంట్ ఆప్షన్ తీసేసి వంటివే ఆలోచనలు అనుకోండి. చూడాలి ముందుముందు రాముడు ఎలా వ్రాయిస్తాడో - ఏంం‌ జరుగుతుందో.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం వారు,

      రాసే వాడు రాముడు. కామెంటే వాడు కూడా రాముడే ! కాకుంటే మత్తు లో ఉన్న రాముడు ! మీ రాముల వ్రాత తో మత్తు రాముల మత్తు వీడు తుందని ఆశిద్దాం !

      అందుకని మీరు బ్లాగ్ టపా శస్త్ర సన్యాసం చేయవలదు :)

      జిలేబి

      Delete
  6. కలికాలం...... లేకపోతే శ్యామలీయం గారి కామెంట్ ను కూడా డిలీట్ చేస్తారా..... ఇంకా నాకు ఒక చిన్న డౌట్..... బ్లాగ్ రాసిన వాళ్ళే తిరిగి అజ్జ్ఞాత పేరుతో పొగుడుతూ, గిట్టని వాళ్ళని బండ బూతులు తిడుతున్నారేమో అనిపిస్తుంది... ఒక్కోసారి. . . .

    ReplyDelete
    Replies
    1. అయ్యయ్యో ఇందులో ఎవరు చేసిందీ ఏమీ లేదండీ. నా కామెంటును నేనే తీసేసానండీ - ముద్రారాక్షసాలు దొర్లాయని. మళ్ళా ఆ కామెంటునే సాఫుచేసి ప్రచురించానన్నమాట.

      Delete
    2. మీరు కూడా భాషాపరమైన అప్పుతచ్చులు చేస్తారన్నమాట.....

      Delete
    3. నేను ఉబంటు, విండోస్ రెండూ అవసరాన్నిబట్టి వాడుతున్నాను. అందుచేత తెలుగులో వ్రాసేందుకు విండోస్‍లో ఉన్నప్పుడు ప్రముఖ్ వాడుతాను, ఉబంటులో RTS వాడుతాను. కొన్ని కొన్ని కీ-అమరికలు తేడాగా ఉన్నాయి రెండింటికీ. పొరబడి తప్పు కాంబినేషన్ వాడితేనో లేదా తొందరలో షిఫ్ట్ కీ వగైరా సరిగా నొక్కకపోవటం వంటి వాటివల్లనో ముద్రారాక్షసాలు దొర్లుతూ ఉంటాయి అప్పుడప్పుడు. పైగా పరధ్యానంలోనో పరిశీలగా చూసుకోకపోవటం వలనో కొన్ని వాక్యదోషాలూ వస్తూ ఉంటాయి. గమనికలోనికి వచ్చినప్పుడు వాటిని సరిచేసుకోవటం చేస్తుంటాను. అదీ సంగతి. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.

      Delete
    4. కిరణ్ కుమార్ గారు,

      శ్యామలీయం వారి కామింటుల తో 'దిల్' తో 'ఈత చేయొచ్చు గాని డిలీటు చేయడమా ! కుదరదు గాక కుదరదు !

      అసలు జిలేబి ఎవరి కామింటులు డిలీటు చేయలేదు !

      ఇది గూగుల్ వాడు కామింటు వీరుల వీరాంగణల కిచ్చిన సౌకర్యం ! మీ కామింటులను మీరే డిలీటు చేసు కోవచ్చు !

      దీన్ని బ్లాగు లోకం లో బహు బాగుగా ఉపయోగించు కున్న భ్లాగ్ భామా మణి ఒకరు గలరు :)

      జిలేబి

      Delete
  7. మా బ్లాగుల్లో ఒక పడుచుంది
    వ్యాఖలంటె బహ్యమంది?
    - అరె హఠ్ గయ్ హఠ్ గయ్!!
    ఆ బ్లాగుల్లోనే ఒక చిన్నోడూ
    నేనున్నాలే పదమన్నాడూ!
    - అరె బచ్ గయ్ బచ్ గయ్!!

    ReplyDelete
    Replies

    1. హరి బాబు గారు,

      కౌన్ థీ ఓ :)

      పడుచు కామింటు రెప రెప లాడిన చిన్నోడు పదనిసలు పాడ కుండా ఉంటా డా అని :)

      జిలేబి

      Delete
    2. అవే కళ్ళు!
      భయపెట్టే కళ్ళు?
      మహా మాయావులు!
      దూరాకాశ వీధుల్లో తారాదీపాలు?!

      Delete
  8. కామెంట్లకి భయపడో..ఇబ్బంది పడో బ్లాగులు రాయడం మానివేయటం కరెక్టు కాదు...రాసే ముందే అవతల వాళ్ళ రియాక్షన్ ఊహించాలి..దాన్ని ఎదుర్కొనే తెలివి ఉండాలి... గొడవ అనుకొనే అంశాలని రాయడమెందుకు..ఏడవడమెందుకు... అందరికీ అన్నీ తెలుసుండవు.. మనకి తెలుసినదే గీకితే పోలే.... కామెంట్ల ఆప్షన్ తీసేసిన వాళ్ళు బ్లాగుల్ని రాయడం అనవసరం అని నా అభిప్రాయం..మనని పొగిడిన వాడు మన శత్రువు.. విమర్శించిన వాడే నిజమైన మిత్రుడని పెద్దల ఉవాచ..

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. వోలేటివారూ,

      కామెంట్లకి భయపడటం లేదండి - అలా భయపడటం సరైనదీ కాదనే నా అభిప్రాయం కూడా. కొందరి వలనో కొన్ని ధోరణులలోని వ్యాఖ్యలవలనో ఇబ్బంది పడటం అంటారా, ఇబ్బందులకు సవాలక్ష కారణాలుంటాయి కదండీ, ముఖ్యంగా ఇబ్బందిపెట్టి వినోదించాలనుకునే అల్పులూ ఉంటారు కదా లోకంలో.

      కామెంట్ల ఆప్షన్ తీసేసిన వాళ్ళు బ్లాగుల్ని రాయడం అనవసరం అన్న మీ అభిప్రాయం గమనార్హమైనది. కాని మరొక కోణంలో కూడా అలోచించవచ్చును కదా. ఒకరు బ్లాగు వ్రాయటానికి ఎవరి అనుమతీ అక్కరలేదు. అది వారివారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన సంగతి. ఇతరులు చదివినా ఫరవాలేదనుకున్న పక్షంలో పబ్లిక్‍గా ఉంచుతారు బ్లాగును. దాని అర్థం అందరి ప్రశ్నలకూ పొగడ్తలకూ అనుమానాలకూ అభినందనలకూ ఎత్తిపొడుపులకూ నిందలకూ జవాబులు చెప్పటం అనే బాధ్యత స్వీకరించటం కానేకాదు. అలాగె పెద్దల అభినందనలనూ మనం పడదోసేవారి మెఱమెచ్చులతో పోల్చలేము కదా. ఏతావాతా తేలేది ఏమంటే అపరిమితంగానో మరిమితంగానో వ్యాఖ్యలను అంగీకరించటమూ అన్నింటికీ ఇష్టపూర్వకంగానో, జవాబు పొందటానికి యోగ్యమైనవి అనుకున్నవాటికి మాత్రమే జవాబివ్వటమో వంటివి బ్లాగు వ్రాసేవారు ఆలోచించుకోవలసిన విషయం. అందుచేత కామెంట్ల ఆప్షన్ తీసేసిన వాళ్ళు బ్లాగుల్ని రాయడం అనవసరం అన్న మీ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నందుకు మన్నించాలి.

      విమర్శించిన వాడే నిజమైన మిత్రుడని తప్పక అంగీకరించాలి అందరూ. కాని సరైయైన విమర్శ చేసే వారే మిత్రులు సుమా - నిందాలాపాలన్నీ విమర్శలని భ్రమపడనవసరం లేదు టపాకర్తలూ వ్యాఖ్యాతలూను.

      Delete

    3. భలే వారండీ వోలేటి వారు,

      >> రాసే ముందే అవతల వాళ్ళ రియాక్షన్ ఊహించాలి :)

      ఇది మరీ చోద్యం. బ్లాగు వ్రాయటమేమైనా మేం అవతల వాళ్ళ కోసం వ్రాస్తున్నామా :) ఏదో మా దురద కొద్దీ గోక్కుంటున్నాం :) గీక్కుంటున్నామ్ :) జేకే !

      ఇట్లా మిగిలిన వాళ్ళ రియాక్షన్ గట్రా ఆలోచిస్తా ఉంటె ఇక వ్రాయటం ఎట్లా మరి ! ఇదేమన్నా शतरंग के खिलाड़ी యా !
      ఏదో టైం పాస్ ప్లస్ టీం పాస్ !

      కామెంటే వాళ్ళు కూడా గుర్తుంచు కోవాల్సిన విషయమిది . వ్రాసే వాళ్ళేమి మా కంతా తెలుసోయ్ అని వ్రాయటం లేదను కుంటా !
      మనకు తెలిసిన ఆనందాన్ని (దురదని) నలుగురితో పంచు కుందా మనే ఉద్దేశ్యం తో అనుకుంటా ! ఆనందం పంచు కుంటే డబల్స్ అప్ ! దురద పంచుకుంటే హావ్స్ డౌన్ !

      జిలేబి పరార్ :)
      జిలేబి

      Delete
  9. విమర్శ అంటే వేషం మార్చుకువచ్చిన ప్రశంశ అని బ్లాగుల్లోనే చదివాను.

    అందరూ నీతిసూత్రాలూ,వేదాలూ వ్రాస్తూఉంటారు కానీ ఆచరణలో శూన్యం.

    ఒక మనిషి ప్రవర్తనని విమర్శకి స్పందించిన తీరులోనే అంచనా వేస్తాను.

    మోడరేషన్ పెట్టారంటే కమ్యూనిజాన్ని పాటిస్తున్నారని అర్ధం.
    మోడరేషన్ లేకపోతే ప్రజాస్వామ్యం పాటిస్తున్నారని అర్ధం.

    అసలు కమెంట్సే వద్దనుకోగలిగారంటే నియంతగా మారారన్నమాట,శుభం !

    ReplyDelete
    Replies

    1. నీహారిక గారు,

      జిల్లన భేషైన మాట అన్నారు :)_ విమర్శ అంటే వేషం మార్చుకువచ్చిన ప్రశంశ !

      'సెగ' భేషు :)

      జిలేబి

      Delete
  10. అందరి వ్యాఖ్యలు బాగున్నాయి గాని ఈ టపా గురించి నాకు మొదట్లోనే కలిగిన అనుమానం తన కామెంట్ల పెట్టెకి తాళం వేసుకునే ఉద్దేశ్యం జిలేబీ గారికి ఏ "కోశానా" ఉండకపోవచ్చని. ఆవిడకి కామెంట్లంటే ప్రీతి కదా :) కామెంట్ల పెట్టె ఉండి తీరాలని ఆవిడ వేరే వారికి కూడా "గట్టిగా" సూచించారుగా ఈమధ్యే. (జేకే)

    ReplyDelete
  11. జిలేబీ కామెంట్ల పెట్టెకి తాలం వేస్తే బిజెనెస్సు యెట్టా జరుగుద్దీ అంట?
    దుక్నం బందు జేస్తె అగ్గిపుల్లలు వెలిగించే దెవురూ బ్లాగుల్లో మరింక!

    ReplyDelete
  12. ఒక్కసారి ఒక్క నెల అనానిమస్సులకి సావకాశం ఇవ్వరాదూ :)

    ReplyDelete
  13. జిలేబికి చీమలు పట్టినట్టు మీ టపాలకి కామెంట్లు పట్టాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  14. ఈ తెలుగుబ్లాగులోకాన్ని మనమే సృష్టించుకున్నాం. దాని ఉనినికీ మనికికీ మనమే బాధ్యులం. బాధ్యతలేని వ్యక్తులు ఈ బ్లాగులోకంతో ఆటలాడుకోకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మనదే!

    ReplyDelete