Wednesday, September 16, 2015

నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)

నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)

శిష్యా !

గురూ

ఇవ్వాళ్టి న్యూస్ పేపర్లన్నీ వచ్చేయా ? న్యూస్ ఛానల్ అన్నీ సమీక్షించావా ?

చేసేసాను గురూ !

లేక్ఖెంత ?

జపానులో పెను తుఫాను - మూడు శాల్తీలు లేచి పోయేయి

హు; శని మూడో గళ్ళ లో ఉన్నాడు .

సౌదీ లో వందమంది క్రేను క్రింద నుజ్జ్జు

సహస్రాణాం మయా సృష్ట్యాం రాసుకో . రాహువు కేతుని చూస్తున్నాడు .

ఇంకా ?

అమెరికా లో స్కూలు బస్సు ఆక్సిడెంటు - ఇద్దరు పిల్లలు

బాలార్కుని మార్కు ఇది రాసేసుకో .

ఇండో నేషియా లో ఖాండవ దహనం గురువర్యా

రాసుకో - అగ్ని దేవుడు నెయ్యి కోసం చూస్తున్నాడు .

లెక్ఖ లయ్యేయా ?

ఓ లెక్ఖ బకాయి గురూ !

ఏమిటోయ్ ?

అమెరికా వాడు వడ్డీ రేటు పెంచు దామా వద్దా అని ఆలోచిస్తున్నాడట ....

హు హు హు ! వాడి శ్రాద్ధం దరి దాపుల్లో కి వచ్చేస్తోంది - అమెరికా ఎంబసీ వాడు తనకు వీసా ఇవ్వక పోవడం గుర్తు కొచ్చే స్వామీ వారికి - రాసుకో - మిధునం లో మిడి మిడి పాటు తప్పదు . ధనుస్సు లో శని ప్రవేశిస్తున్నాడు . అయ్యిందా లెక్ఖ ?

ఓ మోస్తరు అయినట్టే గురువు గారు !

ఓకే ! వీటన్నిటిని మన రీసెర్చ్ విభాగానికి పంపి తీక్షణం గా గ్రహ గతుల్ని వీటి కనుగుణం గా సంశోధించు !

అట్లాగే గురువరా !

రాబోయే కాలం లో ఏమి జరుగును గురువరా ? ఎనీ క్లూ ?

బిడ్డా ! రాబోయే కాల రహస్యం శ్రీవిద్యా రహస్యం ! అది అందరికి చెప్ప బడదు ! కాలం దాట గానే పేపర్లో వచ్చె అన్ని బ్యాడ్ న్యూస్ లు సంకలనం చేసుకుని రా నా దగ్గిరికి వాటన్ని టికీ మూలాలను గ్రహ గతులనించి నీకు లాగి చూపిస్తా :)

గ్రహ గతులు అన్నింటి నీ నిర్దారిస్తాయ్ అవన్నీ నీకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది - మొన్న అమావాస్య వచ్చింది చంద్రుణ్ణి చూసేవా ?

చంద్రుడు ఒట్టేసి కనబళ్ళేదు గురూ :)

శిష్యా ! నాకు నువ్వు తగిన పరమానందయ్య శిష్యుడవే !

జై బోలో గురు మహారాజ్ కీ ! జై జై జై! విజయీ భవ ! రాబోయే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏమి జరుగును గురు మహారాజ్ !

గుండు గురువు బవిరి గడ్డం తడివేరు ! - ఇరవై తొమ్మిదో తేది చెబ్తా నీకు ఆ రహస్యం :)


చీర్స్
జిలేబి 

13 comments:

 1. మీ ఆలోచనా తరంగాల తీరు అర్ధం అయింది. మీకంటే నేనే బాఘా భవిష్యత్తు చెప్పగలను. మోదీ కి బ్రాహ్మణులకూ తప్పవు తిప్పలు !

  ReplyDelete
  Replies
  1. అక్కడికి మిగతా వాళ్ళు బావుకున్నట్టు...

   Delete
  2. అక్కడికి మిగతా వాళ్ళు బావుకున్నట్టు...

   Delete
 2. కోట్ల సంవత్సరాలనుంచీ ప్రపంచం ఒక్కలాగే ఉంది. ఒకప్పుడో హిరణ్యాక్షుడూ, ఓ రావణ బ్రహ్మా జనాల్ని హింసిస్తే ఇప్పుడున్నటువంటి నరరూప రాక్షసులు మరోలా (అంటే లేప్ టాప్ లు వాడుతూ) చంపుకు తింటున్నారు. జ్యోతిష్కులూ, బ్రహ్మ జ్ఞానులూ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అయితే ఒకటే తేడా. బ్రహ్మ జ్ఞానులనీ యోగులనీ చెప్పుకునేవారు ఏ కాలంలోనైనా సరే ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుందనీ, అందులోనేంచే రత్నాలు పుడతాయనీ తెలుసుకుని, ఏ ఆపద వచ్చినా ప్రపంచ శాంతి కోసం ప్రార్ధిస్తారు తప్ప, "ఈ ప్రపంచం మీద నాకు నమ్మకం పోయింది, మీరందరూ వెధవలు, చావండిరా" అని అస్తమానూ చంపుకు తినరు.

  అన్నింటికన్నా ముఖ్య విషయం, ఈ యోగులందరికీ జరిగేది, జరగబోయేది తెల్సినా "లోకా సమస్తా సుఖినోభవంతు" అనడం మాత్రం మానరు ఎందుకంటే అలా ఉన్న ప్రపంచంలోంచే బ్రహ్మజ్ఞానం రాబట్టుకోవాలి అనేది వాళ్ళు గుర్తెరిగిన సత్యం. అంతే కానీ రోజూ జాతక చక్రం వేసి ఇలా అవుతుందని చెప్పడం, అది జరిగిందో లేదో మళ్ళీ అందరికీ చెప్పడానికి రోజూ ఎక్కడ ఎన్ని చావులు జరిగాయో గూగిలిస్తూ మళ్ళీ మళ్ళీ జనాలకి గుర్తు చేయరు. వేమన పద్యం గుర్తు వచ్చిందా లేదా? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.

  యోగులెంతమంది ఎలా చెప్పినా వాళ్ళు గుర్తెరిగిన సత్యం ఏమిటంటే ఈ ప్రపంచం అనేది వంపు ఉన్న కుక్కతోక లంటిది. దాన్నీ అలా వదలకుండా తప్పులు చూపిస్తూ ఉంటే ఏమౌతుందో తెలుసా జిలేబీజీ? సాయి బాబా చెప్పినదే - ఎదుటి వాళ్ల తప్పులు గురించి మాట్లాడితే వాళ్ల పాపాలు మనకీ మన పుణ్యం వాళ్లకీ చేరుతుంది. స్వస్తి!

  ReplyDelete
 3. "ఇరవై తొమ్మిదో తేదీ" వరకు జిలేబీ గారు కూడా నో ఉలుకు-నో పలుకా?

  ReplyDelete
 4. మీరన్న ఇరవై తొమ్మిదో తేదీ వచ్చింది.

  ReplyDelete
 5. అంతా నిశ్శబ్దంగా ఉంది.
  హేగిద్దిరి, జిలేబీ వరే? సౌక్యమా? సుగమాణో? కుశలమా?

  ReplyDelete
 6. రారు!రారు!!రారు!!! IనికోసంI
  రారూ ఎవ్వరూ IనికోసంI

  చందమామా నిజం చూడకు!
  చూసినా సాక్ష్యం చెప్పకు!!.

  ReplyDelete
 7. ఎన్నమ్మా సౌక్యమా!
  ఎప్పిడి ఇరికిది మనసు?

  ReplyDelete
 8. ఆగదు నిమిషం నీ కోసమూ
  ఆగితే సాగదు ఈలోకమూ!
  ముందుకు సాగదు 'ఈ'లోకమూ

  ReplyDelete
 9. జిలేబి గారికి జలుబు చేసినట్టుంది.

  ReplyDelete
 10. Sep 28 Lunar eclipse (Grahanam) ki dimma tiriginattundi! although, as per astrology, its a very good eclipse! for good people though, of course! if not here, wait for a month, till oct 20 +, days, to know its effects,or look back to aug 20+, as per astrologyzone.com, he he.

  ReplyDelete