Friday, November 20, 2015

'గరిక' పాటి చేయని సత్యానికి ఎందుకంత విలువ ?

'గరిక' పాటి చేయని సత్యానికి ఎందుకంత విలువ ?

ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . !

నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి !

మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు !

అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ  అని సంతోష పడి పోయా !

సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే.

అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే  న ఇతి !  ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు.

గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ .

గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను.

ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు  . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త  ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా)  !

నారాయణ సూక్తం  'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ .

క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది .

ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది !

సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం.

జిలేబి
(హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)

7 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సామాజిక స్పృహ చాలా మంచిది. కానీ ప్రాబ్లెం ఏంటంటే నండీ ప్రతీదీ లౌకిక జీవనానికి ముడిపెట్టుకోవాలనుక్కోవడం తగని పని. సత్య వ్రతంలో కల్పంలో చెప్ప బడిన సత్యం అంటే మన లౌకిక జీవనంలో "నిజాలు-అబద్ధాలు మాట్లాడడం" కావు. ఒకవేళ అవి సమాజానికి మంచి చేస్తాయని అలా అన్వయించి చెప్పినా ఆ అన్వయం మాత్రం ’సత్యం’ కానేరదు. పడవలో ఉన్న మణిమాణిక్యాలు సత్య వస్తువులు కావు ఎదురుగా వచ్చిన నారాయణుడు సత్య వస్తువని గుర్తెరగడం సత్ తో సంగం పెట్టుకోవడం. సత్ ని ఎరగడం. సత్య వ్రతంలో సత్యం. అంతే తప్ప అబద్ధాలూ నిజాలు మోసాలూ కావు. తత్త్వం తెలుసుకొని వివరించాలి. తత్త్వ విచారణమే భారతీయత అది ఋషి హృదయం తప్ప కంటికి కనపడే సత్యాసత్య లౌకిక విచారణలు కావు. తత్త్వ విచారణలో లౌకిక సామాజిక ప్రయోజనాలు అనుషంగికం. సామాజిక ప్రయోజనంకోసమే లౌకిక ప్రయోజనం కోసమే వేదాలు ధర్మాలు వ్రతాలు పూజలు అంటే ఋషుల హృదయం అర్థమవ్వని వాని వ్యాఖ్యానం. సత్యం తెలుసుకోవడం తెలియజేయడం ఋషి హృదయం సామాజిక లౌకిక ప్రయోజనం అనుషంగికం నిక్కచ్చిగా ఆచరిస్తే అది ఎలాగూ వచ్చితీరుతుంది. దీపం వెలిగించడం వెలుగు కోసం దానితోపాతూ వెచ్చదనం అనుషంగికంలా.

    ReplyDelete
  3. గొప్ప టాపిక్ దొరికిందండోయ్ అమ్మ కామాక్షికి విస్తారంగా వ్రాసుకుని నివేదించుకోడానికి ధన్యవాదాలు...

    ReplyDelete
  4. రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావు గారికి అంత మంది ఫానులా?

    ReplyDelete
  5. అయ్యగారి నాగేంద్ర గారు,

    మీకు ఈ టపా స్ఫూర్తి నిచ్చినందుకు కడుంగడు ఆనందం ! నెనర్లు !

    @జై గొట్టి ముక్కల్ గారు,

    ఈ మోహనరావు ఎవరు ?

    జిలేబి

    ReplyDelete
  6. జిలేబి గారు మీరు గరికతో పోల్చింది సత్యాన్నని తెలుసు. <> అలా ఎప్పుడూ అనుకోకండి. మీ రాక మాకెంతో సంతోషం.

    ReplyDelete