Sunday, November 29, 2015

క్రెడిట్ కార్డ్ ఆఫర్ ! - మీరు బాల్చీ తన్నితే - మీ దహనక్రియాల ఖర్చు కి క్రెడిట్ ఫ్రీ ఆఫర్ ! :)

క్రెడిట్ కార్డ్ ఆఫర్ ! -
 
మీరు బాల్చీ తన్నితే -
 
మీ దహనక్రియాల ఖర్చు కి క్రెడిట్ ఫ్రీ ఆఫర్ ! :)

ఆలశించిన ఆశాభంగం !
 


వెంటనే రండి !
ఆఫర్ కొన్ని రోజులు మాత్రమె !
 
మా మయానం క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ !
 


అంతే కాదు !
మీరు బాల్చీ తన్నేస్తే
 
మీ దహన క్రియల ఖర్చులు
 
మీ క్రెడిట్ కార్డ్ కి స్వైప్ చెయ్యండి :)
 
మొత్తం ఖర్చులు మా మయానం క్రెడిట్ కార్డ్ కంపెనీ యే భరిస్తుంది :-
 
వెంటనే ఆఫర్ అందుకోండి ! మీ మయానం ఖర్చులని ఆదా చేసుకోండి !
 
ఆఫర్ వేలిడ్ నవంబెర్ ముప్పయ్యో తారీఖు దాక మాత్రమె !
 
భలే మంచి చౌక బేరము !
 
 
చీర్స్
జిలేబి

14 comments:

 1. నేనొకడిని ఒక పధకం ప్రకారం చంపుదామనుకుంటున్నాను.(దేవత అయిపోదామని) వాడి దహన ఖర్చులకి లేదా చావకపోతే హాస్పటల్ ఖర్చుకి పనికి వస్తాయి. క్రెడిట్ కార్డ్ ఆఫర్ పొందాలంటే నేను ఏం చేయాలి ?

  ReplyDelete
  Replies
  1. నీహారిక గారు,

   అటువంటి క్రెడిట్ కార్డ్ లభ్యమగుటకు భేతాళ మంత్రమును ఒక కోటి, రెండు లక్షలా మూడు వేలా నాలుగు వందలా ఐదు మారు ఆరేసి గంటలకొక్క సారి ఏడు రోజుల తరబడి ఎనమిది వారల చొప్పున తొమ్మిది నెలలు వ్యవధి లో జపించాలి . అప్పుడు సిద్ది కిట్టును :)

   జిలేబి

   Delete
  2. భేతాళ మంత్రోపదేశము చేయుదురా ? తక్షణము మొదలుపెట్టెదను.

   Delete
  3. ఎంత ఓపిక అండీ మీది అని మీదో మెచ్చు కోలు కామింటు చూసానే ? అది భేతాళం వారు మీకోసం చేసిన మంత్రోపదదేశం అనుకున్నానే :) జేకే !

   చీర్స్
   జిలేబి
   డిస్క్లై మరు :) - భేతాళ మంత్ర జపము తరువాయి కూడా క్రెడిట్ కార్డ్ దొరక్కున్న మళ్ళీ మళ్ళీ చెట్టెక్క వలెను లేకుంట ఖర్మ మార్గమును అనుసంధానము చేసుకొనవలె !

   Delete
 2. వరూధిని అనే పేరుతో బ్లాగుని నిర్వహిస్తూ జిలేబీ అను ముద్దుపేరుతో ఒక పాత్రలోకి పరాయ ప్రవేశం చేసి బ్లాగులు రాస్తున్న శర్మ గారికి,

  మీ అసలు పేరు అదో కాదో కూడా నాకు స్పష్టంగా తెలియదు గానీ మీ అసలు వ్యక్తిత్వంతో నాకు కొన్ని సమాధానాలు చెప్పండి!

  నాకు వస్తుతః బ్లాగుల్ని కళకళ లాడేటట్టు చెయ్యాలనే దురుద్దేశం యేదీ లేదు!నా ఇంటర్వ్యూలో కూడా అదే ముక్క స్పష్టంగా చెప్పి ఉన్నాను.కానీ మీరు సీనియర్ బ్లాగరు,పైగా కొత్త బ్లాగర్లని హుషారు చేస్తూ మీ కామెంట్లతో ఉత్సాహపరుస్తూ అప్పుడప్పుడూ మీ బ్లాగులో కూడా కొన్ని పోష్టుల్ని ఇతర బ్లాగ్రలని పరిచయం చెయ్యడానికి కేటాయిస్తూ ఉండటం వల్ల మీకు అలాంటి దురద ఉన్నట్టు నాకు అనిపించింది.

  ఒకానొకప్పుడు మీరు కొన్ని కాపీ/పేష్టు బ్లాగుల్ల్ని పరిచయం చేసి అది తప్పు అని సలహాలు అనిపించకుండానే సలహాలు ఇచ్చి ఉన్నారు,చివాట్లు అనిపించహ్కుండానే చివాట్లు పెట్టారు -గుర్తుందా! కానీ ఈ రెండు మూడు రోజుల్లో ఒక సీనియర్ బ్లాగరు బ్లాగు నుంచి కొంత భాగాన్ని ఆ బ్లాగరు అనుమతి లేకుండా ఒక రకంగా కాపీ/పేష్టుని నిషేధించినా స్క్రీన్ షాట్ తీసి మరొక బ్లాగరు తన బ్లాగులో ప్రచురించి రచ్చ రచ్చ చేస్తుంటే మీ స్పందన మరొకలా ఎందుకు ఉంది?ఒకనాటిది దోషం అయినప్పుడు ఈనాటిది దోషం కాకుండా ఎట్లా ఉంటుంది?

  అక్కడి చర్చలో మిగతావార్ని ఉత్సాహపరచటం వల్ల తెలుస్తున్నది యేమిటి?నేను మీ అనదరికన్న్నా చాల కొత్త బ్లాగర్ని!మీరందరూ సీనియర్లు,అవునా?మరి ఒక సీనియర్ బ్లాగర్ని యెక్కడ అతను కామెంటు వేస్తే అక్కడికల్లా వొచ్చి వెక్కిరింతల కవుంటర్లు ఇస్తూ అవహేళన చేస్తూ అతను నేను చర్చలలో తల దూర్చను అని మొత్తుకుంటున్నా అతన్ని పదే పదే సవాలు చేస్తూ ఉంటే మీకు అది సమంజసంగానే అనిపిస్తున్నదా? నాకు ఆ బ్లాగర్ని సమర్ధించాలనే దురద గానీ ఈ బ్లాగర్ని విమర్శించాలనే దురద గానీ యేదీ లేదు.అసలు ఎవరు ఎట్లా ఉంటారు,ఇతను మంచివాడా చ్రెడ్డవాడా అనేది ఎవరికీ తెలియాల్సిన అవసరం ఉందా ఇక్కడ?మనం ఎవరి పట్ల ఏవిధంగా రెస్పాండ్ అయినా బ్లాగుల్లోని కంటెంటుని బట్టీ వ్యాఖ్యల్లోని భావాన్ని అబ్ట్టే కదా ప్రతిస్పందించాల్సింది!ఒక వ్యక్తి చర్చకి విముఖంగా ఉంటూ వ్యాఖ్యలు వెయ్యకూడదా?ఆ వ్యాఖ్యలలో అసభ్యత గానీ నింద గానీ ఉందా?అపాదించుకుంటే ఎన్నో ఆపాదించుకోవచ్చు,రామ అనే మాటకి ఉన్న వందల కొద్దీ అర్ధాల్లో బూతు అర్ధాలు కూడా ఉన్నాయి,మీకు తెలియనిది కాదు.అతను స్పష్తంగా నా ఉద్దేశం ఇదీ అని విడమర్చి చెప్ప్పిన తర్వాత కూడా "లేదు,నువ్వు నాకు తోచిన అర్ధం లోనే ఆ మాట వాడావు" అనటం దేన్ని సూచిస్తుంది?

  TO BE CONTTINUED

  ReplyDelete
 3. నారదా నారదా అంటూ మంటలు ఎగదొయ్యటమే కాదు,మీ వయస్సుకీ పెద్దరికానికీ తగ్గట్టు తప్పులు చేస్తున్నవారిని మందలించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది - మీరు తప్పుకోవాలనుకుంటే ఇంక ఈ ప్రస్తావనే అనవసరం,సింపుల్గా ఈ కామెంటు డెలిట్ చేసెయ్యండి.మన సమాజంలో వయస్సులో పెద్దవారికి సహజంగా మంచీ చెడూ చెప్పే బాధ్యత ఉంటుంది,ఉండాలి కూడా,కాదంటారా?మరి మీరు మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?

  భావాలు ఎవరికీ సొంతం కాకపోవచ్చు,కానీ ఒకరి పోష్టులోని భాగాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ రచ్చ చెయటం మర్యాదస్తులు చేసే పని యేనా? బ్లాగర్లకి మానవసహజమైన మర్యాదలు అఖ్ఖర్లేదా?

  నేను నా ఇంటర్వ్యూలోనే చెప్పాను, బ్లాగుల్ని ఉధ్ధరించటాంకి చీప్ ట్రిక్కులు పనికిరావు, తనకి సాధికారికంగా తెలిసిన విషయాన్ని మంచి భాషలో చెప్తే చాలు అని!మరి నేను లోపాలు లేని మరొక సాహిత్యరూపం ఎక్కడయినా ఉందేమో చూసి చెప్పరాదా అని మర్యాదగా అడిగితే నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా నన్ను పట్టుకుని " అడిగిందానికి యేడిస్తే చాలు" అంటున్నాడు అతను!అలాంటివాళ్ళనా మీరు ఉత్సాహ పరుస్తున్నది?

  మాటిమాటికీ మీకామెంట్లలో నారదుని పేరు స్మరిస్తున్నారు, నారదునికి సంబంధించి చాలా కధలు ఉన్నాయి,అన్నీ నాకు తెలియదు గానీ ఆయన వల్ల పుట్టే కలహాలకి సంబంధించిన రహస్యం మాత్రం తెలుసు!హరిద్వేషులు కూడా గౌరవించిన ప్రత్యేకత ఆయనది.ఆయన వల్ల పుట్టిన అన్ని తగాదాలకీ ఆయన చెప్పిన కొన్ని కీలకమైన నిజాలు కారణం?!కంసుడి విషయం తీసుకోండి,ఒకసారి నారదుడు వచ్చేసరికి కృష్ణుడి కన్నా ముందు పుట్టిన ఆరుగురితోనూ చాలా ఖుషీగా ఆడుకుంటున్నాడు, అదేమిటంటే "అష్తమగర్భం కదా నన్ను సంహరించేది " అంటా డు,అవునా?దానికీయన చెప్పిందేమిటి?"అగ్రజునితో కల్సి సంహరిస్తాడని కదా నాయనా అశరీరవాణీ అన్నది" అని అసలు నిజం విప్పి చెప్తాడు!అందుకే ఆయన వల్ల దోషం యేమీ ఉండదు ఆ కలహాలకి ఆయనకి పాపం అంటకపోవడానికి కారణం కూడా అదే,అవునా కాదా?

  కానీ నారదుణ్ణి స్మరిస్తూ మీరు వేస్తున్న కామెంట్లు అంత గంభీరంగా ఉన్నాయా?నాకయితే అలా అనిపించటం లేదు!

  అక్కడ జరిగింది కాపీ/పేస్టు యవ్వారంతో ఒక సీనియర్ బ్లాగరు హక్కుకి తూట్లు పొడవటం!అంత జరిగినా దాని గురించి యేమాత్రం స్పందించకుండా చర్చలో వేలు పెట్టి హుషారు చెయడం కరెక్టే అని మీరనుకుంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు!

  అలా కాకపోతే మీ స్పందన ఏమిటి? మీరిప్పుడు ఆవేశపడి ఇతర్లని యేదో చెయ్యమని నేను అడగటం లేదు,మీ భావాల్ని తెలుసుకోవాలని మాత్రమే ఆశిస్తున్నాను!

  అయిపోయిన పెళ్ళికి బాజాలు దేనికన్నట్టు మీరు కల్పించుకున్నా కల్పించుకోకపోయినా నాకు వచ్చేదీ లేదు,పొయ్యేదీ లేదు!ననా స్పందన నేను నమోదు చేశాను, నాకు మీ సహాయం అఖ్ఖర్లేదు.కానీ ఈ వ్యవహారంలో దాడికి గురయిన బ్లాగరు మీరంతే ఎంతో అభిమానంతో మీమీద ఒక శతకం కూడా రాసి ఉన్నాడు - ప్రస్తుతం మీరు అతనికి సహాయం చెయ్యలేకపోయినా ఆశ్వాసనగా నాలుగు మాటలు చెప్తే సంతోషిస్తాడు - గాయపడిన మిత్రుడు కదా!ఇక ముందు మళ్ళీ ఇలాంటివి జరిగితే పెద్దలుగా హెచ్చరించకపోయినా దూరంగా ఉంటే బాగుంటుంది!

  స్వస్తి?!

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారు,

   మీరు ఈ కామింటు జిలేబి శర్మ గారికి హృదయం తో 'బాది' నట్టున్నారు ! (మన్ కి బాత్!)

   నెనర్లు.

   శ్యామలీయం లాంటి కవులు అరుదు. వారు వ్రాసే టపాల్లో (ముఖ్యం గా భక్తి కి చెందిన వాటిల్లో ) కేలకటం ఎవరికీ భావ్యం కాదు.

   నీహారిక గారు ఏకవచనం లో వారిపై అట్లా కామేంటడటం చాలా తప్పిద మైన విషయం. ( పెర్సనల్ అట్టాక్) . సబ్జెక్ట్ మేటర్ కాకుండా సై అంటే సై అని వ్రాయడం కామెంట్ల లో సర్వ సాధారణ మై పోయింది . ఇది తప్పు.

   నీహారిక వారి కామెంట్ ఆ కారణం చేతనే తొలగించ బడింది.

   ఇక రెండో పాయింట్ -> వారు అడిగిన కొన్ని ప్రశ్నలు (ఈ బ్లాగు లో) నా వరకు ఆలోచనాత్మకమైన ప్రశ్న లని పించాయి . అందుకే వాటిని గుండె ఘోష టపా లో కామింట్లో అడిగాను ; ఎవరికైనా చెప్ప దలిస్తే చెప్పవచ్చు అన్న ఉద్దేశం తో.

   ఇక శ్యామలీయం వారి పై గాని వేరే ఏ బ్లాగిణీ బ్లాగరు పై గాని ఎవరూ పెర్సనల్ అటాక్ (సబ్జెక్ట్ మేటర్ తప్పించి ) చేయరని ఆశిస్తో , చేయకూడదని కోరుకుంటూ ...

   జిలేబి

   Delete
  2. < "వరూధిని అనే పేరుతో బ్లాగుని నిర్వహిస్తూ జిలేబీ అను ముద్దుపేరుతో ఒక పాత్రలోకి పరాయ ప్రవేశం చేసి బ్లాగులు రాస్తున్న శర్మ గారికి, "
   ఈ "ట్విస్ట్" ఏమిటి? ఈ "శర్మ" గారెవరు? ఈ సంగతి హరిబాబుగారికెలా కనిపెట్టారు?

   Delete

  3. అవునండోయ్ ! ఈ కా 'మంటల' 'గండర' గోల :) లో ఈ శర్మగారు ఎవరు అని నేను కూడా అడగటం మరిచి పోయా ! ఎవరండీ హరిబాబు గారు ఈ శర్మ గారు ?

   జిలేబి

   Delete
  4. కావమ్మ మొగుడంటే కామోసు అనౌకున్నట్టు ఇక్కడే ఎవరో మిమ్మల్ని అలా పిలిచారు,బహుశా నేను అలా అనుకుని ఉంటాను,అందుకే కదా స్పష్టంగా తెలియదు అన్నది:-)

   Delete
 4. హరి బాబు గారు, జిలేబి గారు రాసే టపాలు అర్థం కావు. అర్థంకాని గ్రాంధిక తెలుగులో, పదలను విరచి రాస్తూంటే మంచి పండితురాలేమో అనుకొన్నాను. వయసులో పెద్ద గనుక మంచి చెడు తెల్సిన పీద్ద మనిషి అనుకొంట్టుండేవాడిని. ఆ బ్రమలు నిన్నటి తో తొలగి పోయాయి. ఆవిడ స్పందించిన తీరు చూసి గౌరవం అమాంతం గా సున్నా కన్నా కింద స్థాయి కి పడిపోయింది.
  శ్యామలీయం గారి సామాజిక, రాజకీయ, సాహిత్య అభిప్రాయాలు ఎలాఉన్నా, ఆయన రామ భక్తిని శకించలేము. ఆయన వయసులో పెద్ద కూడాను. ఆయన మీద అనవసరం గా వ్యక్తిగత దాడి చేసిన వారినికనీసం మందలించక పోగా, రాసిన వ్యాఖ్యలు ఉత్సాహ పరచే విధం గా ఉన్నాయి. శ్యామలీయం గారు విశ్వామిత్రుడి యజ్ణానికి తాటకి , మారీచ, సుబహులు మొదలైన రాక్షసులు అడ్డుపడినా, రాముడి అండతో నిర్విజ్ణం గా పూర్తి చేశాడు. మీ పై కూడా రాముడి ఆశిస్సులు ఉన్నయి. మీరు దిగ్విజయం గా మీ రామ కార్యాన్ని ముందుకు తీసుకుపోండి.

  ReplyDelete
  Replies

  1. అదేమో నండీ జయహో గారు,

   జిలేబి గారి టపాలే గావు కామెంట్లు కూడా ఎవరికీ అర్థమయి చావవు :)

   నెనర్లు. సంతోషం గా ఉంది మీరు ప్రతిస్పందించిన విషయం. బ్లాగు లోకం లో హరి బాబు గారొక్కరే రివెర్స్ కామెంట్లిచ్చి వారికి రిటార్ట్ ఇచ్చి నిలదొక్కుకుని ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా మనకెందు కు లే సినబ్బా అని విరామం పుచ్చు కునేసారు.

   మీరు మస్తాపం చెందటం దానిని వ్యక్తీకరించడం చాలా మంచి విషయం. ఇంకా ఎక్కువ మంది బ్లాగర్లు కూడా దీనికి వ్యతిరేకం తెలుపుతారని ఆశిస్తాను. .

   నెనర్లు !
   చీర్స్
   జిలేబి

   Delete
  2. వ్యతిరేకుల కు అందరు రిటార్ట్ ఇవ్వ వలసిన అవసరం లేదు. రామాయణం లో రామూడి తో పాటుగా త్రిజట, సిం హిక, తాటకి, మారిచ, సుబాహులు మొదలైన అవరోధాలు కలిపించే రాక్షాస గణాలు ఉన్నాయి. ఆ పాత్రల ప్రవేశం లో ఎంతో పెద్దదదర్ గా ఊహించుకొంటారు, నిష్క్రమణ తరువాత పట్టించుకొనే వారుండరు. హరిబాబు రాముడిలా పొరాడుతున్నాడు కదా!
   పెజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయం చెప్పుకోవచ్చు. కాని చెప్పిన పేతోడిని పేజలు పట్టించుకోరు. ప్రజలు చాంగటి గారి ఉపన్యాసానికి ఇచ్చిన గౌరవం, ఉంచే నమ్మకం ఈ వ్యతిరేక అభిప్రాయాలు రాసే వారికి ఇస్తారా? వీళ్లకి అత ఫాలోయింగ్ ఉంటే దేశం లో రాముడి పేరే ఎప్పుడో మాయమయ్యేది. రెండు పాములే గదా అని నాగుపామును, ఏలిక పాము తో పోల్చగలమా? ఒకవేళ ఏలిక పాము నాగుపాములా, పడగవిప్పి నాట్యం చేస్తున్నా అనుకొని, నాట్యం చేసినా నవ్వుతారే గాని, సీరియస్ గా తీసుకోరు.

   Delete

  3. జయహో !

   చీర్స్
   జిలేబి

   Delete