Tuesday, December 1, 2015

రామ నీ సమాన మెవరు !

రామ నీ సమాన మెవరు !

రామ నీ సమాన మెవరు అని పాడినారు కాకర్ల వారు .నిజంగా నే రాములవారు వారి కాలం లో నే గాదు (వారి యుగం లో మాత్రమె గాదు) ఆ పై యుగాలలో కూడా చిరస్థాయి గా ఉన్నవారే !

రామాయణం లో పిడకల వేట చేయడానికి వాల్మీకి చాలా 'ఆస్కార్' లు  అందుకోవాలి (ఆస్కారాలు ఇచ్చాడు కాబట్టి :)

రాముల వారిని పొగడటానికి ఎన్నెన్ని ఘట్టాలు ఉన్నాయో తెగడటానికి (వంకలు వెదక టానికి ) అన్నేసి ఘట్టాలు.

సాదా సీదా గా చెప్పాలంటే రాముల వారిని పుంసాం మోహన రూపాయ అని జెప్పి మానవ మాత్రుల లో ఉండే అన్ని గుణ గణా లను వారి లో చూడ గలిగాడు కవి .

మానవు లకి ఔరా ఒక మనిషి మనీషి గా నిలబడటానికి కాల వ్యవధి లో ఎన్నేసి కష్టాలు నష్టాలు చూడ వలసి వస్తుంది అనిపించక మానదు .

మరి సీతమ్మ ? పుట్టని అమ్మ అని ఈ మధ్య ఒకరన్నారు . భూదేవి ఒడి లో నాగలి కి తగిలిన నారి .  జనకాత్మజ . జానకి .

రాముల వారి తో సరి సమానంగా కష్టాలను స్వీకరించింది . నువ్వు వనవాసం చేసి రావోయ్ అని ఈ కాలం లో జిలేబిలు చెప్పగలరు .

తమ్ముడు - లక్ష్మణుడు - వాడిని ఎవరూ అడగలేదు వెళ్ళ వోయ్ వనవాసానికి అని. తనకు తానై అన్నకు తోడుగా వెళ్ళాడు .

వీటన్నిటి కి మించి ఊర్మిళ . హిందీ సాహిత్యం లో ఊర్మిళా కీ విరహ్ అనిమైథిలి శరణ్ గుప్త వారి దను కుంటా ఒక ఖండిక ఉంది . ఊర్మిళ తరపున రాసిన కవివరుల్లో వారే మొదటి వారను కుంటా .  సాకేత్ అన్నది పుస్తకం పేరు .

భారతీయ భాషల్లో నే కాకుండా ప్రపంచ భాషల్లో కూడా అద్బుతం గా అనువదింప బడి , కల్పవృక్షం గా పేర్కొనబడి , విష వృక్షం గా చెప్పబడి పరి పరి కోణాల నించీ విశ్లేషించ బడినది రాముల వారి చరిత్ర .

అంతే కాదు ; మనకు దగ్గిర గా తెలిసిన కాల ఘట్టం లో త్యాగయ్య వారి చేత కొనియాడ బడి , వారి కి రాముల వారి కన్న వేరెవ్వరు లేరు అని రామాయణం మొత్తం వారి సంగీతం లో ఇమిడి మనకు ఈ నాటికీ పాటల రూపం తో ఆవిష్కరించ బడి ఉన్నది .

రాబోవు కాలం లో మరిన్ని విశ్లేషణలు  పరి పరి విధాల పరిశోధనలు వాటి మీద రావచ్చు గాక.

ఎంత వచ్చినా ఏమి వ్రాసినా కాలం లో ఇమిడి పోయి వాటిని స్వకీయం చేసుకునే భారత సంస్క్రతి కళ కళ లాడు తున్న సంస్కృతీ .సజీవ సంస్కృతీ .అందులో ఇది అది అని లేకుండా అన్నీ కలిసి మహా సాగరమై మహోన్నతం గా వెలుగొందటం తధ్యం.

రామ నీ సమాన మెవరు.

శుభోదయం
జిలేబి


 

9 comments:

 1. ఎంత చక్కగా వ్రాసారండీ .. జోహారులు!

  ReplyDelete
  Replies
  1. నెనర్లు ఫణీంద్ర గారు,

   బహుకాల దర్శనం ! కుశలమా ?

   జిలేబి

   Delete
 2. > ఊర్మిళ తరపున రాసిన కవివరుల్లో వారే మొదటి వారను కుంటా .
  తెలుగులో స్త్రీల పాటలు (అంటే స్త్రీలు పాడుకొనే పాటలు) చాలా ఉన్నాయి. వాటిలో 'ఊర్మిళాదేవి నిద్ర' అని కూడా ఒక పాట ఉంది. దీనికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంటుంది.

  ReplyDelete
  Replies

  1. శ్యామలీయం వారు,

   ఆ ఊర్మిళా దేవి నిదుర గురించి మీరు ఒక టపా వ్రాయాలి తప్పక .

   జిలేబి

   Delete
  2. అవసరమైతే ప్రయత్నిస్తానండీ. కాని ఈ పాటకు సంబంధించి మనకు సమాచారం చక్కగా నెట్‍లో ఉంది చూడండి ఊర్మిళాదేవి నిద్ర - ఈమాట వారి వ్యాసం ఈ వ్యాసంలో పాట ఆడియో కూడా ఉంది. అలాగే శ్రీవెల్చేరు నారాయణరావు గారి వ్యాసానికి కూడా అందులో ఒకలింకు ఉంది. మంచి వ్యాసం తప్పక చదవండి.

   నా దగ్గర సాహిత్య అకాదమీ వారి పుస్తకం కాబోలు ఉంది అందులో మంచి ప్రతి ఉండవచ్చు పాటకి. చూస్తాను.

   Delete
 3. రామాయణ గాథ ఘవత
  భూమీతల మంత దెలియు - పూని విమర్శిం
  చే మహనీయులు కూడా
  ధీమంతులె ఆప్రభావ తీవ్రత పడుటన్

  ఇంత మంచి పోష్టు హృదయంగమము గాగ
  వ్రాయు ధిషణ గల్గు వారి మదికి
  మకిలి యంటుకొనెడు తకరాదు లెందుకు
  బుధ్ధి మయ ప్రపంచ మిద్ది యనఘ !

  ReplyDelete
  Replies

  1. లక్కాకుల వారు,

   బుద్ధి 'మాయ' ప్రపంచ మిద్ది :)

   మహోదరుడు కుంభకర్ణుడి తో అంటాడు యుద్ధ కాండలో - కర్మ చేసుకుంటూ వెళ్ళు అని - అట్లా అప్పుడప్పుడు బుద్ధి మాయ లో ఇట్లాంటి 'మకిలి యంటకొనుడు' తకరారులు కూడాన్నూ :) ఎదో ఆఖరున సత్ఫలితాలు ఇవ్వక పోతాయా అని :)

   कर्म चैव हि सर्वेषाम् कारणानां प्रयोजनम् |
   श्रेयः पापीयसाम् चात्र फलं भवति कर्मणाम् ||

   చీర్స్
   జిలేబి

   Delete
  2. మాట సాగదీసి మాయలో పడకండి
   మార్పు కోరునట్టి మనసు కలద ?
   ఎంచుకున్న మార్గ మేమంత మంచిదా ?
   మంచి మార్గ మొకటి యెంచుకొనుడు .

   Delete
  3. లక్కాకుల వారు !

   ఈ మధ్య మీరు రాస్తున్న కవితా పరంపరలో ఇది మరో ఆణిముత్యం ! అభినందనలు.

   Delete