Thursday, December 10, 2015

బ్లాగ్కామెంట్ హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం - కాన్స్పిరసీ - జిలేబి ఉద్ఘాటన !

బ్లాగ్కామెంట్  హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం - కాన్స్పిరసీ - జిలేబి ఉద్ఘాటన !

నిన్న జరిగిన బ్లాగార్ల మెంట్ లో అతలా కుతలమైన బ్లాగ్ కామెంట్ ఫ్లోర్ !

 
బ్లాగ్ కామెంట్ల హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం  ఓం ప్రథమం వారి కాన్సిపిరసీ అని ప్రముఖ వయోవృద్ధ బ్లాగిణి జిలేబి చెబ్తూ 'నేను నా బామ్మ గారి మనవరాలిని నన్ను ఎవ్వరూ భయ పెట్టలేరు ' అని ఉద్ఘాటిం చేరు !

ఈ సందర్భం లో ఆవిడ నుదిటి పై రూపాయి బిళ్ళ  సింధూరం తో , ఒక వైపు చూస్తె మిధిలాపురి మైధిలి లా , మరో వైపు నించి చూస్తే విజయవాడ కనక దుర్గమ్మ లా ,  అసమదీయులు , తల్లీ కంచి కామాక్షి, మధుర మీనాక్షి , కాశీ విశాలాక్షీ, అంటూ జేజేలు పలుకుతూ వస్తోంటే , 'కెలు కేశ్వరాంబ'   అంటూ తసమదీయులు కిసు కిసు లాడుతూ  వస్తోంటే బ్లాగ్మీడియా వారికి "నీలాంబరి"  లా ఫోటో షాట్ ఇచ్చారు :)

క్రితం కొన్ని రోజులు గా ముమ్మరం గా బ్లాగాగ్ర గ ణ్యు లు  ఏది చెప్పినా 'జీ' , 'ఎస్' అనాల్సిందే తప్పించి వారి కి ఎదురుగా 'తీటి' తే ధర్మాగ్రహం ,  అవమాన పరుస్తున్నారన్న ఆరోపణ ల తో బ్లాగ్ లోకపు కామెంట్ల లోకం అల్లకల్లోలం అయి పోయిన విషయం బ్లాగర్లందరికి ఎరుకైన విషయం 'ఇరుకైన' విషయమని విదితమే !

కామెంటుల చెండుల తో చెడుగుడు ఆడుతూ , నారదాయ నమః అంటూ అక్కడక్కడ ఘ్రుతం లాగిస్తూ విన్యాసాలు చేస్తూ ఒక వైపు జిలేబి 'ఆగడాలు' , మరో వైపు జిలేబి పై కేసు బనాయించి ఇది ఆవిడ, ఆవిడ అనుయాయుల కుట్ర , బ్లాగ్ దేశానికి నమ్మక ద్రోహం అంటూ ఉర్రూత లూగిస్తున్న పవనాలు ఈ 'హవా' లో ఎన్నేసి 'కామింట్లు' ద్రవ్య విలం బితం అయ్యే యో ఎవరి కెరుక అని ప్రముఖ పొలిటికల్ సెటై రిస్ట్ 'తేట 'గీతి  ట్వీటారు :)


ఇప్పుడు ఈ నమ్మక ద్రోహం కేసు 'జీ' ఎస్' లు తప్పించి టీకాలు పెట్ట కూడదన్న ధర్మాగ్రహం సమయం లో మళ్ళీ తెరపై రావడం,  రసవత్తరం గా జిలేబి ఇందులో ఓం ప్రథమం వారి కాన్స్పిరసీ ఉందని చెప్పడం ఇవన్నీ చూస్తూంటే తన తల తిరిగి పోతోందని  పిస్తుందని బ్లాగ్ పొలిటికల్ అనలిస్ట్ హర్రీ బర్రీ  తన అభిప్రాయాన్ని తెలియ జేసారు :)

ఇంతటి తో ఈ నాటి కాన్స్పిరసీ ఘట్టపు ఫ్లాష్ న్యూస్ పరి సమాప్తం !

రేపు మళ్ళీ ఏమి జరుగునో ఎవరి కెరుక !

శుభోదయం
జిలేబి
జీ , ఎస్ ఓన్లీ ; నో 'టీ' :) (యు ఆర్ వెరీ నాటీ:)
 

21 comments:

  1. "చేసుకున్నవారికి చేసుకున్నంత".

    ReplyDelete
    Replies

    1. చేసుకున్నవారికి చేసుకున్నంత రామా హరే! స్వామీ హరే :)

      జిలేబి

      Delete
  2. ఒకానొకప్పుడు బ్లాగులోకంలోకి తొంగిచూసి "అరె ..మనం కూడా రాస్తే బావుంటుందే" అని ఔత్సాహికులు తమ తమ అనుభవాలను.. భావాలను..ఇతరులతో పంచుకుని చిలిపి జట్టీలు పెట్టుకుని ఆనందిచేవారు... సెపరేట్ తెలంగాణా పుణ్యామా అని కాస్త భావోద్వేగాలు కలిగిన మాట వాస్తవం.. అవన్నీ సద్దుమణిగి నిజమైన బ్లాగు వీరులు.. కురు వృధ్ధులు (సీనియర్లు) తెలుగుని బతికిస్తూ ఉంటే .... జిలేబీ వారు పుణ్యమా అని వారు మనస్తాపానికి గురై బ్లాగులను మూసేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే... ఈ పాపానికి ఒడిగట్టిన మీరు మీ శిష్యలోకంతో కలసి పాప పరిష్కారార్ధం ఏదైనా బ్లాగు వ్రతం చేస్తే బావుంటుందని నా ఉచిత సలహా..

    ReplyDelete
    Replies

    1. చేతిలో తంబూరా పెట్టుకుని ఆల్రెడీ 'బ్లాగువాతలు' పెట్టేసు కుంటున్నారు వోలేటి వారు :) ఇక వ్రతాలు కూడా చెయ్యాలా :)

      జేకే !

      జిలేబి

      Delete
  3. మిమ్మల్ని మీరు సోనియా"గాంధీ" తో పోల్చుకోవడం బాగుంది .. అలాగే కంటిన్యూ కండి .. జిలేబమ్మా

    ReplyDelete
    Replies
    1. కొంప తీసి సోనియా గాంధీతో పాటు జిలేబీ గారినీ ఇటలీ పంపే పథకం రచిస్తున్నారా :)

      Delete

    2. శ్రీనివాస్ గారు,
      మాకు మేమే ! వారికి వారే !

      జైగొట్టి వారు,

      సరిగ్గా కనుక్కున్నట్టు ఉన్నారు :)

      జిలేబి

      Delete
  4. one may become mental if one read post like this. dislike it.

    ReplyDelete
  5. జిలేబీగారూ ! నాకు ఒక అనుమానం వస్తున్నది . మీరు గతకొంతకాలంగా తెలుగు బ్లాగులపై రీసెర్చ్ చేస్తున్నారని ... మరి ఆ రిజల్ట్ ఎప్పుడు చెపుతారో ?
    నారదుడు ఎ పక్షం వహించినా లోక కల్యాణం కోసమే కదా ! కాకపొతే కొంతకాలం ఈ "అపార్ధాలు", "నీలాపనిందలు" తప్పవు... ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు,

      మీరు స్మార్ట్ శ్రీనివాస్ గారు :) కొంత క్లూ ఇస్తే నే మొత్తం అర్థం చేసుకునేసారు !

      ఎప్పుడు మా మాచనవజ్జుల వారు మమ్మల్ని అర్థం చేసు కుంటారో ఏమో !

      ఎరక్క పోయి కామింటాను ఇరుక్కు పోయాను :)

      చీర్స్
      జిలేబి

      Delete
  6. భేతాళిక దాడికి ఒక బ్లాగు ఢాం!
    భూతాలిక నిద్ర లేచాయి,ఝూం?

    ReplyDelete
    Replies
    1. నిద్ర లేపింది మీరే స్వామీ!

      Delete
    2. మూయబోవని తలుపు తెరవమని పిలుపు!
      రాధ కెందుకో నవ్వు గొలుపు?
      అసలు భేతాళికలు నిదురించున దెప్పుడు?

      Delete
    3. నాకు గుర్తున్నంత వరకు నిద్ర లేపింది స్వయానా జిలేబీ గారేననీ.

      జిలేబీ గారి "వరూధిని" బ్లాగులో ఈ క్రింది టపాలో (June 26, 2015) వారి వ్యాఖ్య చూడండి.
      ==================
      టపా పేరు : WEDNESDAY, JUNE 17, 2015
      సీతా 'కారమ్ ' - సీతా కా 'రామ్' !
      ==================
      "Zilebi Jun 26, 2015, 9:13:00 AM
      నీహారిక గారు,
      హమ్మయ్య ! నా టపా కి ఫలితం దక్కింది. మిమ్మల్ని మళ్ళీ బ్లాగు లోకం లోకి రప్పించా లన్నదే ఈ టపా కి మూలం.
      .........
      .........
      ఇక మీరు ఏక్టివ్ గా ఉంటారని ఆశిస్తా :)"
      ==================

      అందువల్ల బోనగిరి గారూ ఈ విషయంలో హరిబాబు గారు నిర్దోషులేమో పాపం? కానీ ఆశ్చర్యంగా హరిబాబు గారు మీరన్నది ఇంతవరకు ఖండించలేదంటే మీరన్నదే నిజమా (నేనే ఎక్కడైనా మిస్సయానేమో)?

      Delete

    4. విన్న కోట వారు,

      హరి బాబు గారు ఎక్కడెక్కడ ఏమేమి 'రాచు'కుంటున్నారో ఎవరెవర్ని నిదుర లేపుతున్నారో దానికి ఆజా పేజా లేదు :)

      ఔరా మనమే నిదుర నించి లేపి ఉంటాము అని సర్దేసుకుని ఉంటారు బోనగిరి కామెంటు చదివి :)

      జేకే !
      నెనర్లు
      నేను కూడా ఆ కామెంటు కొట్టాక మరిచి పోయా :) మీరు తవ్వకాల లో నించి తీసి బాణం నా పై ఎక్కు పెట్టేసారు :)

      విన్న కోట వారికి బ్లాగు ఉందా ? పేరు ఏమిటి ? (లింకు ఇవ్వ గలరు :)

      చీర్స్
      జిలేబి

      Delete
    5. భేతాళిక నేనైతే భూతాలు మీరేనా విన్నకోటవారూ ? విక్రమార్కుడేడీ ?

      Delete
  7. ముందుంది ముసళ్ళ పండగ :)

    నెక్స్ట్ టార్గెట్ హరిబాబు గారి బ్లాగేనా ?

    జిలేబి

    ReplyDelete
  8. నేను బ్లాగు లోకం నుంచి వ్ల్ళ్ళిన నెలరోజుల లోపు రెండు పనులు జరుగుతాయి.1).అయోధ్యలో ధర్మహాస రామచంద్రుని ప్రతిష్ఠాపన!2).హరిబాబు ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం>

    ReplyDelete
  9. నేను బ్లాగు లోకం నుంచి తప్పుకున్న నెలరోజుల లోపు రెండు పనులు జరుగుతాయి.1).అయోధ్యలో ధర్మహాస రామచంద్రుని ప్రతిష్ఠాపన!2).హరిబాబు ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం>

    ReplyDelete
    Replies

    1. హరి బాబు గారు,

      మరో మాట చెప్పండి :)

      జిలేబి

      Delete
    2. నేను మాటంటే మాటే!
      నా దారి రహదారి,ఝూం?

      Delete