Monday, December 7, 2015

జిలేబి దర్శకత్వం లో 'బ్లాగు బలి' - మెగా చిత్రరాజం అతి త్వరలో వెండి తెరపై :)


జిలేబి దర్శకత్వం లో 'బ్లాగు బలి' - మెగా చిత్రరాజం అతి త్వరలో వెండి తెరపై :)

బ్లాగ్ ఉడ్-> గ్రేప్ వైన్ స్టొరీ  -> ఆదరాబాదరా నగరం -> డిసెంబర్ ఆరు - ౨౦౧౫ ->

ప్రముఖ దర్శకురాలు బీలేజీ జిలేబి దర్శకత్వం లో బ్లాగు బలి అనే మెగా చిత్ర రాజం  అతి త్వర లో వెండి తెరపై వస్తోందన్న వార్త బ్లాగు లోకం లో సంచలనం గావిస్తోంది :)

ఈ మెగా చిత్రం రాకమునుపే బ్లాగు లోకం లో సంచలనం కనిపిస్తోందని  బ్లాగు లోకం లో ఆరి తేరిన కథా రచయిత బ్లాగ్ గాంధీ  వారు రీ ట్వీట్ చేసారు !

ఈ మెగా చిత్రం తెర వెనుక కథ చాలా పకడ్బందీ గా జరుగు తోందని దీని విషయమై మీడియా కి ఏలాంటి 'మేత' దొరక కుండా కట్టుదిట్టం చేసారని బ్లాగ్ ఉడ్ లో ని పలువురు 'కిసు కిసు' మంటున్నారు !

జిలేబి 'బ్లాగు బలి' చిత్రం తరువాయి దర్శకేంద్రులందరినీ  తల దన్ని తానొక్కతే బ్లాగ్ ఉడ్ లో ఏక 'చట్టాధి' పైత్యం గా వెలుగొంద వచ్చునని విశ్రాంతి తీసుకుంటున్న బ్లాగ్మూవీ డిస్ట్రిబ్యూటర్ ఏడుకొండల రావు ఊహాగానం చేసారు :)

ఈ చిత్రం లో బ్లాగు 'షార్ప్' నఖ సఖీ  గా పేరొందిన నటీ మణి ప్రముఖ 'విల్లీ' పాత్ర వహిస్తోందని అట్లాంటి పాత్ర ని ఆవిడ తన నట జీవితం లో ఇంత వరకు చేసినట్లు ధాకలాలు లేవని , రాబోయే బ్లాగు చరిత్ర లో 'బ్లాగు బలి' ముందు ఆ తరువాయి అన్నంత గా ఆవిడ 'రోలు' కర్ర స్వారీ చేస్తుందని బ్లాగు సింగం ఉద్ఘాటించారు !

అట్లాగే ప్రముఖ హీరో హర్రీబర్రీ శూర్పణఖ ప్రతి ఎత్తు కి పై ఎత్తు వేస్తూ జన బాహుళ్యాన్ని మనోరంజకం గావిస్తారని కూడా బ్లాగు కామెంట్ల లోకం భోగట్టా :)

ఈ చిత్ర వార్త చేస్తున్న 'హల్' చల్ తో  కలవరం చెందిన ప్రముఖ బ్లాగ్కవి  తాను బ్లాగు డిస్ట్రిబ్యూటర్ ల ద్వారా కాకుండా తన చిత్రాలని  ప్రైవేట్ చానల్స్ 'రూట్' ద్వారా అందిస్తా నని  ప్రకటన చేసారు .

కాని ఇంత జరుగుతున్నా దర్శకురాలు జిలేబి ఏ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తాను జేస్తున్న పనిని మోడీ వారి లా చేస్తూ పోతోందని మీడియా కి మేత అందివ్వడం లేదని విచారణ వెలుబుచ్చారు పద్యాల రావు గారు .

ఇంతటి తో నేటి బ్లాగ్ ఉడ్ సినెమా సమాచారం పరి సమాప్తం.

సైనింగ్ ఆఫ్

చీర్స్  సహిత :)  
జిలేబి  

13 comments:

  1. బాగుంది. ఇంతకీ కట్టప్ప ఎవరో?

    ReplyDelete
    Replies

    1. ఈ కట్టప్ప గప్సా అప్ప ఎవరండీ :)

      జిలేబి

      Delete
  2. క్షమించమ్మా బ్లాగ్ నారదామణీ! నీ సినిమా చరితలో కనీ వినీ ఎరుగనంత అట్టర్ ఫ్లాప్ కావాలని కోరుకుంటున్న ఎంతో మందిలో నేనూ ఒకడ్ని ! మీరు తెలుగు బ్లాగుల గడ్డపై పుట్టడం మా అందరి "దుర" ద "అదృష్టం" ( క్షమించాలి శ్యామలీయం వారూ సంధి చెడింది)

    ReplyDelete
    Replies
    1. సంధికేం వచ్చెలెండి. మీ హిందూధర్మం బ్లాగును చూసి మహదానందంకలిగింది. మనలో మాట, సినిమా తియ్యకుండానే ఫ్లాప్ అంటున్నారే. తియ్యకముందే ఫ్లాప్ సినిమాకు వేసిన కామెంటులో ఒక సంధి ఫ్లాప్ ఐతే ఏం సమస్య చెప్పండి?

      Delete
    2. మీ బ్లాగు పేరును వీలైతే 'అర్షధర్మం' అని మారుస్తే ఎలాగుంటుందో ఆలోచించండి శివకుమారులవారూ.

      Delete
    3. కొన్ని సినిమాలు డైరెక్టర్ ని బట్టి చెప్పవచ్చులెండి శ్యామళీయంగారు.

      Delete

    4. ఏమండీ శివకుమార్ గారు,

      తెలుగు వ్రాసిందే తప్పు ! అంతకు మించి రోలు కర్ర అయ్యవారిని పిలిచి 'సందులూ' సమోసాలు తప్పైతే క్షమించండి అంటారా ! హన్నా :)

      నెనర్లు మీరు కూడా చిత్రం రాజం అట్టర్లీ బట్టర్లీ ఫ్లాప్ కావాలను కోవడం ముదావహం !

      చీర్స్
      జిలేబి

      Delete
    5. మీరు అయితే తెలుగుని ఓ తెగులులా తలచి ఎన్ని సమోసాలనైనా వేయ్యోచ్చా .. మాకు ఆ అర్హత లేదా ?

      Delete
    6. @శ్యామలీయం నమస్కారం .. పెద్దలు మీరు కోరినట్లుగా బ్లాగు పేరు మారుస్తాను

      Delete
    7. శివ కుమార్ గారు,

      మీకూ మనందరికీ అర్హతలు గుర్తు కొస్తాయి;

      శ్యామలీయం వారు వచ్చి సరి దిద్ది తే అబ్బబ్బ , వీరికి పనీ పాటా ఏమీ లేదా , తెలుగు తెలుసు అని అన్ని చోట్లా అందరికి తెలుగు మీద క్లాసు లిస్తారు అని వారి ని ఎద్దేవా చేస్తారు.

      సో అర్హతలు గురించి మాట్లాడటం మాత్రమె కాదండీ, పెద్దలు సరిదిద్దితే కుదిరితే ఒక కప్పు మెచ్చుకోలు, కుదరక పోతే కూసింత వినమ్రత చూపిస్తే చాలు;

      ఈ టపా ఉద్దేశ్యం కూడా అదే; బ్లాగు లోకం లో ఉన్నవే అరా కొరా మంచి టపాలు బ్లాగులు; అటువంటి మంచి బ్లాగ్వీర్లు, బ్లాగ్వీరాంగణలు కూడా ఒకరూ ఇద్దరూ కామెంటర్ల వరదలకి మనస్సు నొంది తెలుగు బ్లాగ్ లోకం వదిలి పెడతామని వెళ్లి పోవడం తెలుగు బ్లాగ్ లోకానికే మచ్చ.

      జిలేబి

      Delete
  3. మీ సినిమా ఫ్లాఫ్ కావడం గ్యారెంటీ జిలేబీ గారు.
    http://kscwritesinfo.blogspot.in/

    ReplyDelete
    Replies

    1. ఏమండీ చౌదరీ గారు,

      జిలేబి సినెమా తీయడం ఫ్లాప్ అవటం గూడా నా ? దర్శకేంద్రుల వారి కే దర్శకం నేర్పించిన జిలేబి ఈ జిలేబి

      నెనర్లు మీ కామెంటు కి :)

      చీర్స్
      జిలేబి

      Delete
  4. శర్మ గారు,

    మనస్తాపం కలిగించే విషయం.

    బ్లాగు లోకం లో ఎవరో ఒకరో ఇద్దరి కో వెరచి మీరు వెళ్లి పోతాననడం సరి ఐన విషయం కాదని పిస్తుంది .

    ఈ బ్లాగు ని చదివే వారు చాలా మంది ఉన్నారు;

    మీకు కథాతధిత మనస్తాపం కలిగించే వారి వెర్రి వెంగళాయి రాతలు చదివే వాళ్ళు తక్కువే .

    ఓ పరిధి దాటాక వారి కామెంట్ల ని సేరియస్ గా తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువే అయిపోతుంది.

    అట్లాంటి వాటి మీద మీ మనసుని ఎందుకు పాడు చేసుకుంటున్నారు ?

    వయస్సు లో పెద్దవారు మీకు నేను సలహా ఇవ్వరాదు ; ఎవరో ఏదో వాగుతున్నారని మనల్ని మనం శిక్షించు కోవడం సుతరామూ సరి అయిన విషయం కాదు;

    కాబట్టి మీరు దయచేసి మీ బ్లాగు టపాలని కొనసాగించడం మానకండి . మాలిక లో ఉండండి.

    కూడలి కూడా మూత పడి పోయినట్టుంది.

    (బ్లాగిల్లు శ్రీనివాస్ గారు కూడా జెండా పై కపి రాజు పాడేసారు .)

    ఇక మిగిలింది మాలిక మాత్రమె. ఎంత కష్టమైనా నెగ్గు కుంటూ వస్తోంది. ఔత్సాహిక తెలుగు బ్లాగర్ల వల్ల; అట్లాంటిది మీ లాంటి మంచి టపాలు వ్రాసే వారు కూడా మాలిక నించి తొలగి పోతాననుకోవడం సబబు కాదు; కానేరదు ;

    కష్టే ఫలే టపాలు చదివే వారు ఎప్పటి కీ ఉంటూ నే ఉంటారు; ( అగ్రిగేటర్ లో ఉన్నా లేకున్నా ); కాని అగ్రిగేటర్ లు బ్లాగర్లు లేకుంటే ఉండలేవు. అదిన్నూ మంచి టపాలు వ్రాసే బ్లాగర్లు ;

    ఇప్పటికి కామింటు టపా ని మించి పోయింది కాబట్టి :)

    శుభోదయం
    జిలేబి

    ReplyDelete