Tuesday, December 8, 2015

తెలుగు బ్లాగ్లోకపు పునాదుల్ని కుదిపేస్తున్న ఆ నాలుగు ప్రశ్నలు !

తెలుగు బ్లాగ్లోకపు పునాదుల్ని కుదిపేస్తున్న ఆ నాలుగు ప్రశ్నలు 

ఈ టపా సదుద్దేశం తో బెట్ట బడినది ; తెలుగు బ్లాగ్లోకం పునాదులు కదిలి పోవచ్చు గాక; వయస్సు తో పై బడ్డ వారు జిలేబి ని నిందించు గాక; జ్ఞాన వృద్ధులు చీత్కరించు గాక; నలుగురు నవ్వి పోదురు గాక;

కానీ సనాతన ధర్మపు పునాదులు ఇట్లాంటి ప్రశ్నల తో నే కాలా కాలం గా పటిష్టాత్మక మవుతున్నది అన్న ఆలోచనే ఈ టపా పెట్టడానికి కారణం .

పదుగురారు మాట పాడి అయి కొంత కాలం ధర న జెల్ల వచ్చు; సనాతన ధర్మం మాత్రం కొంత కాలం కాదు సనాతనం గా నిత్య నూతనం గా ఉండటానికి కారణం మూలాన్ని ప్రశ్నించటం ;


నీహారిక గారు కొన్ని మరీ నిఖార్సైన , సూటి ఐన  ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా అడిగేరు - వారు వ్రాసేటప్పుడు అంత దీర్ఘం గా ఆలోచించి ఉంటారో లేదు నా కైతే తెలీదు ; కానీ ఈ ప్రశ్నలు నిజంగా నా వరకైతే ఆలోచనల కు పదును పెట్టేవి . 

నీహారిక సంధించిన  ప్రశ్నలు -

పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?

మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ? 

ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ?  

చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?జిలేబి
ధైర్యే సాహసే జ్ఞానం !
యథో ధర్మః తతో జయః !

37 comments:

 1. ధర్మం నాలుగు ప్రశ్నల మీదే ఆధారపడి ఉంది.(ఆలోచించడమే కాదు ఆచరణలో అడుగులు వేసాను.) ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పినవాడూ,ఆచరించి చూపినవాడే "దేవుడు" !

  ReplyDelete
 2. "పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి?"

  "దేవుడు" అని పిలవాలి
  టెర్రరిష్టులని చంపినవాళ్ళకి అవార్డులిచ్చి గౌరవించటంలేదా?

  ReplyDelete
 3. పై నాలుగు ప్రశ్నలకూ సమాధానం మీకు భగవద్గీతలో దొరకలేదా ?
  ఈ ప్రశ్నలు తెలుగు బ్లాగులోకపు పునాదుల్ని ఎలా కదిలిస్తాయో మీరే చెప్పాలి. మీ బ్లాగుకు ప్రచారం, వీక్షకులు కావాలంటే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి . అవి కూడా సంధించడానికి రెడీ అవ్వండి .

  ReplyDelete
 4. అసలు ఈ ప్రశ్నలే శుద్ధ తప్పు. వీటికి బ్లాగోకపు పునాదులు కదలటం ఏమిటి? ఓ పక్క పురాణాలని ఉటంకిస్తూ, ఇంకో పక్క ఈ చెత్త ప్రశ్నలేమిటి?

  రాక్షసులని చంపేవాడు ఖచితంగా దేవుడే.

  ముందుగ ప్లాన్ వేసుకుని సీతాదేవిని ఎత్తుకు పోయునపుడు కనిపించని తప్పు, ఎన్నో సంధి అవకాశాలని ఇచ్చి, బంధు మిత్రులు చాలా మంది తప్పు అని వారిస్తున్నా యుద్ధానికి వచ్చినవాడిని చంపడం ఎంతమాత్రమూ తప్పు కాదు.

  ధర్మాన్ని రక్షించడం అంటే, చేతులు కట్టుకు కూర్చోవడం కాదు. శ్రీ కృష్ణుడైనా, శ్రీ రాముడైనా ఎన్నో సంధి అవకాశాలు ఇచ్చాకే యుద్ధానికి వెళ్లారు.

  అలీన ఉద్యమము, అణు ఒప్పందాలేం సాధించాయో ప్రపంచానికి తెలుసు, మీకు తెలియకపోతే ఎలా? కసబ్ లాంటి వాళ్ళ ముందు చాలా మందే శాంతి మంత్రం పఠించారు, కానీ చేరి మూర్ఖుల మనసు రంజింపరాదే?

  ఇకనైనా ఏదైనా productive / creative discussions చేయండి. అసలే సనాతన ధర్మం మీద ముప్పేట దాడి జరుగుతుంటే, మనవాళ్ళే వెన్ను పోటు పొడిస్తే ఎలా?

  హరి: ఓం!!

  ReplyDelete
 5. ఇదొక చెత్త ప్రశ్న... మదోన్మాదంతో రెచ్చిపోయి, సొంత తమ్ముడి మాట కూడా వినకుండా యుద్దానికి సిద్దమయ్యాడు కాబట్టే, రావణుడు రాక్షసుడయ్యాడు. అతడిని చంపాడు కాబట్టే రాముడు దేవుడయ్యాడు. ఇప్పుడు మతోన్మాదంతో రెచ్చిపోయి, ఎవరి మాటా వినని వాళ్ళకి, ఎదుటి వారి మీద ఉగ్రవాద దాడులు చేసేవారికి యుద్దంతోనే సమాధానం చెప్పాలి. వారిదగ్గర శాంతి మంత్రం పఠిస్తే, చెప్పే వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తారు. నీహారిక గారికి హిందూ మతం నచ్చకపోతే, ప్రశ్నించడాని వీలులేని మతాలు చాలానే ఉన్నాయి. నిరభ్యంతరంగా ఆ దేశాలకి వెళ్ళవచ్చు. కళ్ళెదురుగుండా, ఆడపిల్లల్ని Yazdi అని పేరు పెట్టి అమ్మేస్తుంటే, ఏమీ పీకలేరు గాని, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం లో పిడకలవేట ఇప్పుడు అవసరమా? చూసే వాళ్ళు వెర్రి వాళ్ళయితే, ఏదో జరిగిందంట.. (అదేంటో మీకు తెలుసు కదా)..

  ReplyDelete
 6. 1. పదిమంది రాక్షసులను చంపిన వాడు తప్పని సరిగా రాక్షసుడే అవుతాడు.. అతడే రాక్షసులలో ప్రహ్లాదుని వంటివాడు..(భగవద్గీత)
  2. మాన ప్రాణ హరణం చెయ్యని అమాయకుణ్ణి భగవంతుడు అని మనం పూజించే వాళ్ళు చంపిన దాఖలాలు లేవు.. అసలు రావణ వధకు ప్లాన్ వేసింది శూర్ఫణక.. శూర్పణక భర్తను అన్న అయిన రావణుడు సంహరిస్తాడు.. దాంతో అన్న మీద పగతో వాణ్ణి రెచ్చగొట్టి సీతని ఎత్తుకెళ్ళేలా చేసి రావణ వధకు కారకురాలైంది.. ఎవరెన్ని చెప్పినా.. విభీషణుడు చెప్పినా వినకుండా చావు దాకా తెచ్చుకున్నాడు..

  3.సామ, దాన, బేద, దండోపాయాల్లో ఆఖరుది యుద్ధం.. అన్నీ విఫలము అయ్యి ప్రతినాయకుడు యుద్దాన్ని కాంక్షిస్తేనే తప్ప భగవంతుడుఎవరిమీద యుద్దానికి దిగలేదు..
  4. ధర్మాన్ని కాపాడుటకు యుద్ధమే అనివార్యమని ఎవరూ ఎక్కడా చెప్పలేదు... ఆనాటికీ ఈనాటికీ ...అందుకే అణు ఒప్పందాలు.. అలీన ఉద్యమాలు...ఒక నియంత కారణము వలనో అన్యాయంగా వేరొక ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనో ఎవరైనా ప్రయత్నిస్తే వాటిని నిరోధించి సామాన్య పౌరుల జీవనాన్ని రక్షించడం పాలకుల కర్తవ్యం... క్షణికావేశంలోను..రెచ్చగొట్టే ధోరణి వలననో యుద్దం అంటూ జరిగితే నేటి అణుబాంబుల వలన మొత్తం జీవ రాశికే ముప్పు ఏర్పడుతుంది.. అటువంటి ముప్పును తప్పించి శాంతియుతంగా జీవనం సాగించడానికి ప్రపంచ దేశాలన్ని ఒడంబడికలు ఏర్పరచుకున్నాయి.. అందుకు మన నెహ్రూ గారు ఎంతో కృషిచేసారు...మనం గర్వించాలి ఒక భారతీయుడిగా..

  పురాణాలను ఎద్దేవా చేస్తూ రాయడం వలన వాటిని తమ బ్లాగులో కనబడేలా చేసే జిలేబీ లాంటి వారికి ఆనందం కల్గిస్తే కల్గించవచ్చు..ఇదొక మానసిక అపరిపక్వత... మీలాంటి వారు త్రేతాయుగం నుండీ వున్నారు.. కాని దాని వలన భక్తులకు ఎటువంటి నష్టమూ లేదు..
  కోట్లమంది భక్తులలో నరనరాన భక్తి అనే అమృతం దాగివుంది.. ఏ మతం అయినా సరే.. అద్యాత్మిక భావంతో నిత్యకర్మలు ఆచరించే వారు పొందే ఆనందం ఇతరులు పొందలేరు.. సరికదా పైకి మితండ వాదన చేస్తున్నా లోలోపల భయపడే వారు ఎక్కువ.. చలం లాంటి వాళ్ళే ఆఖరున అరుణాచలంలో తేలినట్టు జీవిత చరమాంకంలోనైనా భగవంతుని స్మరించని వాళ్ళు ఉండరు.. అప్పటికి సమయం వుండదు కాబట్టి వయసులో ఉన్నప్పుడే భక్తి రసామృతం లో తేలితే ఆనందంగా జీవించి ఇతరులని ఆనందంగా జీవించేలా చేస్తారు...

  ReplyDelete
 7. These questions are basic,so if the quirent sits leisurely and think logically,they wil surely get the answers by themselves..Before raising any kind of question,one must at least think a weeks time about the question that they are going to ask.In my experience i got several answers all for my raised question by my self wth deeper thought and continuous thinking process.I feel these 4 questions even doesnt reach and touch the foundations of hindu sanathana dharma..If anybody thinks so,its better to leave them to their ignorance.such persons should first try to read more about the subjects....

  ReplyDelete
 8. First of all,let the quirent search for the actual meaning of the word-Rakshasa..wth the help of beejaakshara nighantuvu and also veda niruktha nightavu..Dont say that these things are not available wth the quirent..one must do the basic home-work to get enlighted..quirent must check the letter "RA' MEANING FIRST..AND THEN COMBINE THE DEFINITION GIVEN IN NIRUKTHA NIGHTUVU..Both books are available wth potti sriramulu telugu viswa vidyalayam..wish you all good luck quirents..

  ReplyDelete
 9. పై ప్రశ్నలన్నింటికీ కష్టేఫలి మాస్టారు ఇక్కడ చాలా గొప్పగా చెప్పారు.
  http://kasthephali.blogspot.in/2015/12/blog-post_8.html

  ReplyDelete
 10. పనీపాటా లేకపోతే ఇలాంటి డౌట్లే వస్తాయిస్మీ!?
  వీటితో పానీపూరీలు కూడా కొనలేవు జిలేబీ?!

  ReplyDelete
 11. @ జగదీష్,

  హిందూమతంలో ఉండి మీరేం పీకారో చెప్పండి.మీరు వాదన కోసం అయితే వేరే బ్లాగులు ఉన్నాయి,అక్కడికెళ్ళి భజన చేసుకోండి.ఇక్కడ చర్చ మాత్రమే జరుగుతుంది.మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కూడా కాదు. కొంతమంది వెధవలు, నీకిష్టం లేకపోతే వేరే దేశం వెళ్ళండి అని అంటున్నారు.మళ్ళీ వాళ్ళే మతమార్పిడులు జరుపుతున్నారు అని అంటున్నారు.వెళ్ళమనేదీ మీరే ... వెళుతుంటే ఆపేదీ మీరేనా ?

  ఇపుడు సందర్భం వచ్చింది కనుక చెపుతున్నాను.నేను రామజన్మ భూమి సమస్యను సామరస్యంగా పరిష్కరించలేకపోతే వెళ్ళేది వేరే మతానికే,అది క్రైస్తవమన్నా కావచ్చు,ఇస్లాం అన్నా కావచ్చు,బౌద్ధం అన్నా కావచ్చు.

  రక్తపాతం జరుపకుండా ఎవరు రామజన్మభూమి సమస్యను పరిష్కరిస్తారో వారిమతంలోకి వెళతాను. నేనొక్కదాన్నే పోతానని మాత్రం అనుకోకండి నాతోపాటు "పనిలేని" కోట్లాదిమందిని తీసుకుపోతాను.

  ReplyDelete
 12. ఈ జిలేబీకి ఇంతకాలం మనమిచ్చిన గౌరవంతో కళ్ళు నెత్తికెక్కి ...
  వివేకం అటకెక్కి .. సంస్కృతీ సాంప్రదాయాలు మంటగలిపి ...
  ఇవీ ప్రశ్నలు !!

  ReplyDelete
 13. @ voleti,

  1.ప్రహ్లాదుడు ఎవరినీ చంపలేదు కనుక దేవుడా ? రాక్షసుడా ? మనిషా ?
  2.ఎవరివల్ల రావణ వధ జరిగింది అన్నది మా టాపిక్ కాదు.చంపటం కరెక్టా కాదా అన్నదే నా ప్రశ్న.చంపటం తప్పుకాదు అని మీరన్నట్లయితే కసబ్ చేసిందీ తప్పు కాదు అన్నది నా వాదన.
  3.సామ,దాన,భేధం విఫలమయినప్పుడే యుద్ధం. మొదటి మూడూ సక్రమంగా చేయటంలేదన్నదే నా ఆవేదన.
  4.భయం అంటే భక్తి అని మీ మాటలవలన అర్ధం అయింది.ప్రస్థుతానికి నాకు భయం లేదు.మీరన్నట్లు భయం వేస్తే అపుడు నేనూ భక్తురాలిగా మారతానేమో ?

  ReplyDelete
  Replies
  1. నీహారిక గారు మీవాదనను అంగీకరించలేను. చంపడం తప్పా? కాదా? అంటున్నారు. అలా కసబ్ చేసిడీ తప్పు కాదంటున్నారు. మంచివాడిని చంపితే తప్పు, చెడ్డవాళ్లను చంపిందెలా తప్పవుతుంది.100% శ్రీరాముడు చేసింది కరెక్టే!

   Delete
  2. చెడ్డవాళ్ళంటే ఎవరు? ఎలా తెలుస్తుంది? ఫలానా మనిషి చెడ్డ అనుకుంటాను కనుక నేను చంపితే పోలీసులు ఊరుకుంటారా?

   Delete
 14. @Astrojyo,

  ఈ దేశంలో మీలాంటి మేధావులూ,స్వామీజీలు,బాబాలూ,రవిశంకర్ లూ,కంచి పీఠాధిపతులూ హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మూడు ఎకరాల భూమి వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించడం చేతకానివాళ్ళు ఎన్ని ధ్యానాలూ,వ్రతాలూ,పూజలూ చేస్తే ఏమి ? చేయకపోతే ఏమి ?
  ఎవరినివారు ఉద్ధరించుకుంటే చాలు.ఊరిని ఉద్ధరించనక్కరలేదు.

  ReplyDelete
 15. @నీహారిక నీలాంటి నాస్తికురాలికి పురాణాలపై చర్చలు ఎందుకంట? నా ప్రశ్నకు జవాబు చెప్పు కమ్యూనిస్టులు అందరూ నాస్తికులా ? నాస్తికులందరూ కంయూనిస్టులా? కమ్యూనిస్టులలో ఆస్తికులెవరు? నాస్తికులెవరు ? వారెందుకు సంప్రదాయాలపై దాడి చేస్తారు ? ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి ...

  ReplyDelete
 16. జిలేబీ గారూ ఇప్పటివరకూ కామెంట్లకు లేని మోడరేషన్ ఇప్పుడు ఎందుకో ?

  ReplyDelete
  Replies
  1. వెరీ వెరీ సింపుల్ శివ కుమార్ గారు,

   మా 'షార్ప్' నఖ సఖీ వచ్చి మిమ్మల్నందర్నీ కుమ్మేసి చెడా మడా తిట్టేసి పోతుంది :) ఆ పై మీరు టపా కంటెంట్ తప్పించి మిగిలిన అన్ని విషయాల మీద పడతారు :

   ఇప్పుడర్థమయి ఉంటుందను కుంటా టపా కామెంట్లు దారి ఎట్లా తప్పుతాయో :

   జేకే !
   చీర్స్
   జిలేబి

   Delete
 17. జిలేబీ గారూ, నీహారిక గారి ప్రశ్నలకు నాకు తోచిన సమాధానాలు ఇవిగోనండీ:

  a. పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి?

  యుద్ధం అంటూ వచ్చాక జంకడం సరికాదు. చంపకపోతే చస్తాము కదా. ఇకపోతే తాము దేవుళ్ళమనీ వైరి వర్గం వారు రాక్షసులనే ఇరు వర్గాల వారూ భావిస్తారు. మీకు ఎవరు (లేదా ఎవరి స్టాండ్) నచ్చితే వారిని దేవుళ్ళుగా అవతలి వారిని రాక్షసులుగా భావిస్తారు. There is no absolute truth. Truth depends on the observer.

  b. మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా?

  ఏ యుద్దానికయినా కొన్ని లక్ష్యాలు ఉన్నట్టే వ్యూహాలూ ఉంటాయి ఉండి తీరాలి కూడా. వ్యూహం బాగుంటేనే అనుకున్న ప్రాణహాని లక్ష్యం నెరవేరుతుంది. Failing to plan is planning to fail!

  c. ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా?

  హింస లేకుండానే లక్ష్యం నెరవేరాలంటే ప్రతిసారీ కుదరదు. అందునా యుద్ధమంటేనే హింసాయుతం. చంపకపోతే చస్తాము!

  d. చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు? అణు ఒప్పందాలెందుకు?

  అలీనోద్యమం చేసిన వారు కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఇక ఒప్పందాలు/రాయబారాలు గట్రా అంటారా అవీ లక్ష్యసాధన మార్గాలే. Diplomacy is continuation of war by other means!

  ReplyDelete
 18. @ niraahika
  1. జన్మత: రాక్షసుడే అయినా విష్ణువు ని దేవుడిగా గుర్తించిన భక్తుడతడు..మనిషికి దైవత్వ లక్షణాలు రాక్షస లక్షణాలు రెండు కలగవచ్చు అది వారి పెరిగిన వాతావరణం తల్లితండ్రుల సంస్కారం, పూర్వ జన్మ సుకృతం వలన కలగవచ్చు.. రాక్షస గుణాలు వున్నవారు రాక్షసులవుతారు..
  2. ఒక క్షత్రియుడిగా రాముడు ప్రజలకు, మునులకు అపకారం చేసే వారిని చంపడం ధర్మం.. అది ఆ రోజులకు వర్తిస్తుంది..
  3. సామ దాన బేధాలు ఎవరివలన విఫలం అయ్యాయి...ఆఖరు క్షణం వరకూ రాముడు అవకాశం కల్పించినా మూర్ఖంగా యుద్ధం చేసాడు..
  4. ప్రతిమనిషికి భయం అయినా ఉండాలి లేదా భక్తి అయినా వుండాలి.. ఈ రెండు లోపించడం వలననే నేడు ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి..మనం చేసే ప్రతి పనిలోను ఈ రెండు ఉంటేనే మనసా వాచా కర్మణా పనులు సాధించగలము..మీరు ఆల్రెడీ భక్తులు కాబట్టే మీ బ్లాగులో మీ భర్త తో బాటు గుడులుచుట్టు తిరుగుతున్న ఫొటోలు పెట్టారు.. మీరాబాయి ఫొటో పెట్టుకున్నారు... ఇంకా పై ముసుగు ఎందుకు?? నాస్తికత్వం వేరు..ఇతర మతాలను భక్తి విశ్వాసాలను కించపరచడం వేరు.. ఇది ఉగ్రవాదం కన్నా భయంకరమైనది.. కసబ్ మీదృష్టిలొ గొప్పవాడు అయితే ఆరాధించండి ఎవరూ వధ్ధనరు.. కాని వయసులో పెద్దవారిని గౌరవించడం మన కనీస ధర్మం..

  ReplyDelete
  Replies
  1. @ voleti,

   మీరు చెప్పిన విషయాలే నేనూ చెపుతున్నాను.మీతో నేను విభేధించలేదే ? నేను మీరాబాయి పిక్ పెట్టుకోలేదు,సన్యాసిని పిక్ పెట్టుకున్నాను.నేను నాస్థికురాలిని అని మీతో చెప్పానా ? రావణూడూ గొప్పవాడే అంటున్నాను అంటే ఇతరులు చెడ్డవారని అర్ధం కాదు.మనిషి పరిస్థితుల ప్రభావం వల్ల చెడ్డగా మారతాడు అని చెపుతున్నాను.ఈనాడు మీరు పెద్దవారు అని చెప్పబడుతున్న కురువృద్ధుల్ , కురుబాంధవులు ఆనాడు నన్ను అవమానించినపుడు ఏమయ్యారు ? మీలాగే అవమానాలు పడుతుంటే సహించలేక వారిని మార్చాలంటే నేను మారక తప్పదని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనే ఇస్తోంది.ప్రజ,జిలేబీ కమెంట్స్ డెలిట్ చేస్తున్నారు.మార్పు కావాలంటే మారక తప్పదు.కురు వృద్ధులు ఎద్దేవా పోస్టులు వ్రాయకపోతే అవమానం చెయ్యలేము కదా ? వయసులో పెద్దవాళ్ళయినా వంకరబుద్ధులు చూపితే సహించలేను.

   Delete
 19. Wow , very interesting debate Zilebi garu

  ReplyDelete
 20. నీహారిక (గారూ అనాలో లేదో తెల్సుకోలేనంత అజ్ఞానిని)
  అద్భుతమైన్ ప్రశ్నలు వేశరు. మొత్తం బుద్ధుడు తెలుసుకున్న సత్యాలూ, రామకృష్ణ పరమహంస, వివేకానందులూ కూడా ఇటువంటివి అడిగి ఉన్నట్టు లేదు. ఈ జ్ఞానం అంతా మీరు సంపాదించినదే అని నేను అనుకుంటున్నాను. మీ లాంటి వాళ్ళు దేశ ప్రగతికి అద్దం పడతారు. మీరు గానీ ఆశ్రమం ఏదైనా ఏర్పాటు చేసారా (అదే ధర్మం గురించి)? చేస్తే నన్ను మీ ఆశ్రమంలో చేర్చుకోరూ?

  మీ పాదసేవ చేసి తరించాలని ఉంది. ఇంత చిన్న విషయాలు కూడా సమాధానం చెప్పలేని జిలేబీలు మనకెందుకు. వాళ్ళని పనికిరాని రామనామం చేసుకోనిద్దాం. మీ ఆశ్రమంలో మనం ధర్మం గురించి మాట్లాడుకుంటూ ప్రపంచానికి మేలు చేసి ఉద్ధరిద్ధాం. మీకు ఎలాగా అన్నీ నాలుగు ప్రశ్నల్తో తెలిసిపోయాయి కనక నాలుగుని రెండో, ఒకటో చేసేయవచ్చు. మీ మేధస్సుకి ఏమని పేరుపెట్టాలో అర్ధం కాకుండా ఉంది - అజ్ఞానిని కదా?

  ReplyDelete
 21. neehaarika:
  2.ఎవరివల్ల రావణ వధ జరిగింది అన్నది మా టాపిక్ కాదు.చంపటం కరెక్టా కాదా అన్నదే నా ప్రశ్న.చంపటం తప్పుకాదు అని మీరన్నట్లయితే కసబ్ చేసిందీ తప్పు కాదు అన్నది నా వాదన.
  haribabu:
  ప్రారంభం:
  హరిబాబు,శ్యామలీయం,శ్రీకాంత్ చారి - ఈ ముగ్గురు వ్యక్తులూ ఒక చోట కూడి సమాజంగా ఏర్పడితే ఆ ముగ్గురూ అన్ని కాలాల లోనూ ఒకే విధమయిన సంబంధాల్ని కలిగి ఉందరు.క్షణ క్షణానికీ స్థానాలు మారుతాయి.ఏ స్థానంలో ఎవరు ఉన్నా ఆ ముగ్గురూ ఎప్పుడూ ఒకరితో ఒకరు ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉంటారు - ఏ ఇద్దరూ అలీనంగా ఎప్పటికీ ఉండలేరు!

  సంఘర్షణ:
  హరిబాబూ శ్యామలీయమూ ఒకే దానికోసం పోటీ పడితే ఇద్దరికీ దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదనే పట్టుదల ఉంటే వాళ్ళు తప్పకుండా పోటీ పడ్తారు,అది యుధ్ధమూ కావ్చ్చు,ఎవరో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోనూ వచ్చు - ఇద్దరిలోనూ వాంచ బలంగా ఉంటే ఎంతమంది ఎన్ని శాంతిసూక్తులు వినిపించినా ఇద్దరిలో ఎవడూ వెనక్కి తగ్గడు. నీహారిక అంటున్న " సామ,దాన,భేధం విఫలమయినప్పుడే యుద్ధం. మొదటి మూడూ సక్రమంగా చేయటంలేదన్నదే నా ఆవేదన" అనేది చాలా అతెలివితక్కువ మాట! అవి నాలుగూ కోరుకున్న దాన్ని సాధించటానికి చేసే ప్రయత్నాల లోని స్థాయీభేదాలు,ఏ స్థాయిలో ఫలితం ఎవరికి ఏకపక్షంగా జమ అయితే ఆ స్థాయిలో సంఘర్షణ ఆగుతుంది.యుధ్ధం వరకూ వెళ్ళకుండా మొదటి మూడు అద్సల్లో ఫలితం ఎవరో ఒకరికి దఖలు పడితేనో ఎవరో ఒకరు వెనక్కి తగ్గీతోనో తప్ప్ప సంఘర్షణ ఆగదు,అది ఖాయం!

  అయితే ఈ ఇద్దరూ వాళ్ళ పాటికి వాళ్ళు పోట్లాడుకుంటున్నారు,మరి శ్రీకాంత్ చారి ఇందులో కలగజేసుకోవ టం లేదు కాబట్టి తను అలీనంగా ఉన్నట్టే కదా అని మీకు డౌటు రావచ్చు.కానీ అతను కూడా అలీనంగా ఉం డడు గాక ఉం డడు!వీళ్ళిద్దరిలోఒకడు అధర్మయుధ్ధం చేసినపుడు వ్యతిరేకించనూ వచ్చు,లేదా వాళ్ళ మధ్యన సంఘర్షణని తగ్గించే ప్రయత్నాలు చెయ్యనూ వచ్చు, వీళ్ళ మధ్యన జరిగే కలహం తనకు లాభసాటి అనిపిస్తే సంఘర్షణని మరింత ప్రోత్సహించనూ వచ్చు అదీ ఇదీ గాకపోతే కనీసం ప్రేక్షకుడిగా వినోదించనూఒ వచ్చు!ప్రతి యుధ్ధానికీ ప్రేక్షకులు ఉంటారు,తటస్థులూ ఉంటారు ,ప్రోత్సాహకులూ. ఉంటారు శ్రీకాంత్ చారి వీటిలో ఏదొ ఓక్ స్థానంలో ఖచ్చితంగా ఉంటాడు.ఎవరు చెలిచారు,ఎవరు ఓడారు అనేది నిర్నయించేది ఈ స్థానంలో ఉన్న శ్రీకాంత్ చారి.

  ReplyDelete
 22. ఫలితం:
  చాణక్యుడు షాడ్గుణ్యం అన్నాడు.అందులో అతి ముఖ్యమైనదాన్ని తీసేసినందువల్ల తొలినాళ్లలో మన దేశపు విదేశాంగ విధానం లోని పంచశీలలో ఒక శీలని చైనా వూడగొట్టింది.మరో శీలని బంగ్లాదేశ్ యుధ్ధంలో ఆయన గారి కూతురు వూడగొట్టింది.అలీన విధానం అనేది ఒక మిధ్యా సిధ్ధాంతం - అప్పట్లో పెట్టుబడీదారీ విధానాన్ని పాటించే అమేరికాకి దీటుగా కమ్యునిష్టు దేశం సోవియట్ రష్యా చాణక్యుడు విజిగీషువుకి ఉద్దేశించిన ప్రపంచాధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అని నిలబడటం వల్ల అప్పటి వరకూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు అలసూలుగా ఉండి అప్పుదే విడిపోయి కూదదీసుకుంటున్న కొందరికి అవసరమై రష్యా పతనంతో అలీన విధానం చాలా సహజంగా పెట్టుబడిదారీ దేశాల్తో విలీన విధానంగా మారింది.

  షాడ్గుణ్యం:
  హరిబాబు,శ్యామలీయం,శ్రీకాంత్ చారి గాలిలో ఉండరు కదా!వాళ్ళు కొంత భూమిని తన అధీనంలో ఉంచుకోవాలని చూస్తారు.పోట్లాడుకున్నా పంచుకున్నా ఇద్దరికీ తన అధీనంలో ఉన్న భూమి మీద స్వైరవిహరం చేయగలిగిన సర్వంసహాధికారం కావాలి! రాజు అని రకాల నీతుల్ని శాసించేదీ పాటించేదీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికే!నీతి అంటే చాణక్యుని ఉద్దేశంలో చాలా వాస్తవికంగా ఉంటుంది - అబధ్ధమాడరాదు, దొంగతనము చేయరాదు,స్త్రీలను గౌరవించవలెను లాంటివి ఎదటివారిలో తనకు విశ్వసనీయతని కల్పించుకోవడానికి ఉద్దేశించినవి మాత్రమే!అసలైన నీతి ఎప్పటికీ విజయాన్ని సాధించుతూనే ఉండటానికి అవసరమైన రాజనీతియే!

  షాడ్గుణ్యంలోని మోదటి నియమం:రాజు విజిగీషువు.అంటే ఒక రాజు తొలిసారి గెలిచిన ఒక నగరంతో సరిపెట్టుకోనఖ్ఖర లేదు - అతనికి ఈ సమస్త భూమండలాన్ని గెలిచే హక్కు ఉంది!

  ఏ రాజు ఈ షాడ్గుణ్యాన్ని పాటించదల్చుకున్నాడో అతడు ప్రస్తుతం తన అధీనంలో ఉన్న భూమిని/రాజ్యాన్ని కేంద్రస్థానంలో నిలబెట్టుకోవాలి.అక్కడి నుంచి అన్నివైపులా ఉన్న భూభాగాల లోని రాజులతో ఒక అధ్భుతమైన మండలరేఖావృత్తంలో సంచలిస్తూ ప్రతి రాజ్యంతోనూ సమతౌల్యాన్ని పాటించమన్నాడు.ఎప్పటి వరకూ అంటే ఇక తప్పనిసరిగా ఎవరో ఒకర్ని గెలిచి రాజ్యం విస్తరించుకోవడానికి నిర్ణయించుకునే వరకు!ఏమిటీ సమతౌల్యం అంటే ఏ ఒకరినీ అతిగా బలపడనివ్వకు,అలాగని ఏ ఒక్కరినీ అతిగా బలహీనపడనివ్వకు!మొదటిది అందరూ ఒప్పుకుంటారు,ఎందుకంటే ఎదటివాడు అతిగా బలపడితే తనని గెలిచి అతని రాజ్యంలో కలిపేసుకుంటాదనే కామన్ సెన్సు ఉంటుంది గనక!రెండో సూచన కొంత వింతగా ఉన్నా చాణక్యుడి పరిశీలన అమోఘం అనిపిస్తుంది దానికి అతని విశ్లేషణ ఏమిటో తెలిస్తే!

  ReplyDelete
 23. మండలం:
  ఇక్కడ దాదాపు అందరికీ ఇప్పటికే తెలిసిన "మిత్రుడికి శత్రువు మనకూ శత్రువు","శత్రువుకి మిత్రుడు మనకూ శత్రువు" అనే సుభాషితాల రూపంగా చెప్పిన మండల సిధ్ధాంతం వస్తుంది.నీ పొరుగు రాజు బలహీనపడిపోయాడని నువ్వు చంకలు గుద్దుకుంటుంటే కన్నుమూసి తెరిచేలోగా అవతలి వైపున ఉన్న అతి బలవంతుడు దాన్ని ఆక్రమించి నీకు పొరుగు రాజుగా మారి ప్రమాదకారి అవుతాడు.ఇందులో ఒక ధర్మసూక్ష్మం ఉంది."మిత్రుడికి మిత్రుడు","శత్రువుకి ఇత్రుడు" అనే కాంబినేషన్లని పర్మనెంటుగా ఉంచవద్దని నొక్కి వక్కాణించాడు!ఏ ఒక్క పొరుగు రాజునీ శాశ్వత మిత్రుడిగానూ శాశ్వాతవైరిగానూ కలలో కూడా భావించవద్దని కూడా నొక్కి వక్కాణించాడు - స్వతంత్రభారతప్రప్రధమప్రధాని ఈ చాణక్యనీతిని పట్టించుకోకపోవడం వల్లనే చైనాని శాశ్వాతమిత్రుడుగా భావించి చావుదెబ్బ తిన్నాడు.

  ఉపసంహారం
  ఈ మొత్తం స్థలకాలబుధ్ధిత్రయం కలిసిన విశ్లేషణ అర్ధం అయిన వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పబోయేది అర్ధం అవుతుంది.అర్ధం కాకపోతే అర్ధం అయ్యేవరకు మల్ళీ మళ్ళీ మరోసారి పైనుంచి చదువుకుని అప్పుడు ఇక్కడినుంచి చదవటం కొనసాగించండి!

  హరిబాబు అనేవాణ్ణి సెంటరులో నిలబెడితే మిగతా ఇద్దరూ ఏదో ఒక సమయంలో ప్రతిస్పర్ధి అవుతాడు.ఇద్దరూ కలిసే వచ్చినా స్థానం ఒకటే కదా!శ్యామలీయం వైపు నుంచి చూసినా శ్రీకాంత్ చారి వైపు నుంచి చూసిన ఐదే దృశ్యం కనపడుతుంది,కనపడాలి - అది చాణక్యనీతి వంటబట్టిందనటానికి గుర్తు!

  మొత్తం భూమండలాన్నంతా పాలించటానికి హక్కు ఉందన్నాడు గానీ ధర్మవిజయాన్నే కాంక్షించమన్నాడు.అక్రమ మార్గాన లభించిన గెలుపు అవమానకరమైనది,దానికన్నా అపజయమే మేలు అన్నాడు.అక్రమంగా గెలిచిన విజయం వల్ల ఓడిపోయిన రాజుపట్ల విశ్వాసం గలవాళ్ళు పగతో తిరుగుబాటు చెయ్యడం గానీ రహస్యకుట్రలతో వధించడం గానీ చేసే అవకాశం ఉంది గనక అది శాశ్వతమైనది కాదని కూడా అన్నాడు. అధికారం ఉన్న చోట తిరుగుబాటు,కుట్ర,మోసం,ఆంతర్గత విప్లవం లాంటివి తప్ప్పనిసరిగా ఉంటాయి గనక వీలున్నంతవరకూ వివేకవంతుదైన ప్రభువు ధర్మపధం వీడి మితిమీరిన క్రౌర్యం చూపించటం ఆత్మవినాశనానికి దారి తీస్తుందని హెచ్చరించాడు!

  ReplyDelete
 24. భరతవాక్యం:
  ఇప్పుడు ఇక్కడ నీహారిక వేస్తున్న ప్రశ్నలు సాంస్కృతికమైనవో,పురాణాలకు సంబంధించినవో కాదు ఈ రాజనీతికి సంబంధించిన ప్రశ్నలే - మరోరకంగా వీటికి జవాబులు చెప్పదం అసాధ్యం!ఎవరు దేవతలు, ఎవరు రాక్షసులు, ఎవరో ఒకర్ని చంపడం అవసరమా,అతన్ని చంపితే తప్పు లేనప్పుదు ఇతన్నీ చంపవచ్చుగా అన్న ప్రశ్నలు అన్నీ సూటీగా రాజనీతికి సంబంధించినవి.తనకీ మీకూ స్పష్టంగా తెలియకపోయినా అది వాస్తవం - అందుకే నేను సమాధానం చెప్పటానికి చాణక్యనీతిని ఎత్తుకున్నది. జిలేబి అక్కడ చర్చలో మొదటిసారి ప్రస్తావించినప్పటినుంచీ నేనూ ఆలోచిస్తూనే ఉన్నాను,అయితే ఎటూ నేను చాణక్యనీతి గురించి వరస పోష్టులు వేద్దామని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను.కాబట్టి ఇక్కడ క్లుప్తంగానే(?) చెబుతున్నాను/మిగిలినవి నా బ్లాగులో చానక్యనీతికి సంబంధించిన పోష్టుల వరసలో చెప్తాను!

  ఎవరిని సెంటరులో నిలబెడితే అతను విజిగీషువు అవుతాడు.అతను ఖచ్చితంగా పాజిటివ్ అవుతాదు,దేవుడు, ప్రభువు,రక్షకుడు, ఉద్యమ నాయకుడు, వ్యాపారసంస్థకు అధిపతి, ఇంటి యజమాని/కుటుంబపెద్ద ఎవరయినా కావచ్చు - చెప్పానుగా ఇవన్నీ స్థానాలు అని!
  సమతా స్థితి అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే "బఫర్ స్టేట్" చెదరకుండా కొనసాగించగలిగితే ఎవరినీ చంపాల్సిన అవసరంఉందదుసమతాస్థితి చెదిరి యుధ్ధం వచ్చినప్పుడు మాత్రం ఏ రాజుని ఆశ్రయించిన కవి ఆ రాజుని దేవుడిగానూ శత్రురాజుని దుర్మార్గుడిగానూ నిలబెట్టి సాహిత్యరచన చేస్తాడు - యుధ్ధంలో గెలుపు కోసం పోరాడేటందుకు సైనికుల్లో ఉత్తేజాన్ని పెంచటానికి అవి తప్పనిసరి దినుసులు!

  చాణక్యుని అసలైన హెచ్చరిక దూకుడుగా ముందుకురికి తొలిదెబ్బ తీసి గెలవాలనే మూర్ఖత్వం ఎప్పటికీ మంచిది కాదన్నాడు.ఇది రెండు విధాల ప్రమాదం: మొదటిది తటస్థులు నిన్ను సమర్ధించరు,యుధ్ధోన్మాది అనే అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువ - యుధ్ధంలో అపజయమే ఎదురైతే పరిస్థితి మరీ దిగజారుతుంది.తమాషా యేంటంటే ఆధునిక కలంలో జరిగిన ప్రపంచ యుధ్ధాలతో సహా అన్నిటినీ సునిశితంగా పరిశీలించి చూస్తే తొలిసారి దాడి చేసిన వాళ్ళు చాలామంది ఇలాగే అభాసుపాలయ్యారు - అదీ చాణక్యుడి ప్రాక్టికాలిటీ!

  ముందుగా దాడి చేసిన వాడల్లా మూర్ఖుడే అవుతాడు!

  P.S:ఇప్పుడు రాముణ్ణ్ణి సెంటరులో నిలబెడితే రావణుడు రాక్ససుడు.రావణుణ్ణి సెంటరులో నిలబెడితే రాముడు రాక్షసుడు:-)

  ఒక విపరీతమైఅన మరీ అసంబధ్ధపు ప్రతిపాదన మీద నా అప్పీలు లేని తీర్పు
  neehaarika
  చంపటం తప్పుకాదు అని మీరన్నట్లయితే కసబ్ చేసిందీ తప్పు కాదు అన్నది నా వాదన.
  haribaabu:రాముడు,రావణుడు - వాళ్ళు సమ స్థాయిలో ఎదురెదురుగా నిలబడి యుధ్ధం చేశారు గాబట్టి ఎవరి నయినా విజిగీషువు స్థానంలో నిలబేట్టవచ్చు,కానీ కసబ్ అట్లా కాదు - అతను భారత ప్రభుత్వానికి సమస్థాయిలో నిలబడి విజిగీషువుగా బహిరంగ యుధ్ధానికి రాలేదు, మన దేశప్రజల్లో కొందరిని,అదీ తనకి హాని చెయ్యని వారిని,తనకి సత్రువులు కానివారని తెలిసీ చంపిన దుండగీడు!అతన్ని కూడా సమర్ధించటం అంటే సాంకేతికంగా భూతదయని చూపించినా అతనిలో పశ్చాత్తాపాన్ని ఎదురు చూసే అమాయకత్వాన్ని ప్రదర్శించినా అది పిచ్చితనం!

  ReplyDelete
 25. పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే,
  పదిమంది రాక్షసులను చంపినవాడు - వందమంది మనుష్యులను రక్షించినవాడు అవుతాడు.

  ReplyDelete
  Replies
  1. కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే సొంతంగా అలోచించినా ఇంత సింపుల్గా తేలిపోయే పెశ్నల్ని గూడా ఎదటివాళ్ళని నిలదీస్తూ అడగటం:-)

   ఇప్పుడు జవాబు గూడా పెశ్నలోనే ఉందని తెలీట్లా?!

   Delete
 26. >>> ముందుగా దాడి చేసిన వాడల్లా మూర్ఖుడే అవుతాడు!

  హరిబాబు, ఇంతకీ ముందు దాడి చేసినవాడు ఎవరని మీ ఉద్దేశం? రావణుడా, రాముడా?

  ReplyDelete
  Replies
  1. త్రిలోకవిద్రావణుడు అంతే ఏమిటో తెలియదంటూనే "నువ్వయితే నీ వాదన సమర్ధించుకోవాలంతే బయట నుంచి తెచ్చుకోలాలి,నేను రామాయణం నుంచే వందల కొద్దీ శ్లోకాలు చూపెట్టగలను(అర్ధం కాకపోయినా ఎవరన్నా ప్రతిపదార్ధాలు చెప్పిన చోటు నుంచి యెత్తుకొచ్చి పెట్టగలను అన్నట్టు నాకు అర్ధమయింది లెండి?)" అన్నంత పాండిత్యం ఉందిగా, ఆ మాత్రం తెలియదా - సెతుర్లు గాకపోతే:-)

   Delete
  2. కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే సొంతంగా అలోచించినా ఇంత సింపుల్గా తేలిపోయే పెశ్నల్ని గూడా ఎదటివాళ్ళని నిలదీస్తూ అడగటం:-)

   ఇప్పుడు జవాబు గూడా పెశ్నలోనే ఉందని తెలీట్లా?!

   Delete
 27. చెన్నైకి మళ్ళీ ఈనెల 16 నుంచి 20 మధ్యలో వర్షగందం ఉందని కొందరు జ్యోతిష్కులు చెప్పారని వార్తలు వస్తున్నాయి.మొన్ననే అంత జరిగి తెరపి ఇచ్చాక నాసా పేరుతో వచ్చిన పాత్ వార్తని రిఫెర్ చేస్తూ 72 గంటల్లోగా చెన్నని ఖాళీ చేసి వెళ్లండి అని వాట్సాప్ లో మెసేజి వచ్చింది.మా వాళ్లయితే ప్యాక్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు!అసలు నాసా చెప్పిందేమితో ఎప్పుడు చెప్పిందో చూస్తే గానీ నమ్మకూదదని చెప్పి జస్ట్ ఆన్లైన్ సెర్చి చేస్తేనే అది పాత వార్త అని తెలిసిపోయింది.

  జనం అట్లా ఉన్నారు.ఇంత వైపరీత్యం జరిగి జనం ఇట్లాంతి స్థితిలో ఉంటే వాళ్ళ సాడిజం వాళ్ళు చూపించుకుంటున్నారు,యెట్లా ఇలాంటి వెధవల్తో?

  ReplyDelete

 28. హమ్మయ్య ! కామెంటు మాడరేషన్ మహిమాన్వితమైన దన్న మాట !

  మాడరేషన్ లో ఇరుక్కున్న కామింట్లు అనీ వదిలి ఉంటె ఇక్కడ రావణ కాష్టం మళ్ళీ మొదలయి ఉంటుందేమో :)!

  కామింటిన అందరికి నెనర్లు !

  దీనివల్ల తెలినదేమి టంటే కామెంటర్లు నిజంగా చెప్పాల్సి వస్తే సరి అయిన ధోరణి లో తప్పక సరి అయిన పాయింట్లు ఇస్తారని తేలింది !

  తెలుగు బ్లాగు లోకమూ జిందాబాద్ ! కామెంటర్లు జిందాబాద్ !

  ఇక రేపటినించి ఈ టపా లో వచ్చిన 'ఎగదోతలు' ఎద్దేవాలు చూచెదము ! (అనగా పబ్లిష్ చేయ బడును !)

  ఆ పై నారదాయ నమః ఈ బ్లాగు ఏమగునో ఆ కొండ పై పెరుమాళ్ళ కే ఎరుక !

  జేకే !

  నెనర్లతో

  జిలేబి

  ReplyDelete