Saturday, December 31, 2016

అదిగో భీముడొస్తున్నాడు :)


అదిగో  భీముడొస్తున్నాడు :)

వడివడి గా భీముండొ
చ్చు డిజిధన జిలేబి యాపు చూడండర్రా
కుడిచేతి బొటన వేలిక
నడయాడగ దస్కములటు పారున్నర్రా !

చీర్స్
జిలేబి

Tuesday, December 6, 2016

మేడం జయ - ఒక నివాళి - జిలేబి

 
 
మేడం జయ - ఒక నివాళి - జిలేబి


 
 
 

అదిగో జయలలిత పయన
మదిగో యింద్ర సభయందు మహిమాన్వితమై
పదిలంబుగా నమరగన్,
పదికాలము నిలుతువమ్మ ప్రజల మనమునన్

జిలేబి
 
 

Saturday, November 26, 2016

మాన్యు 'మెంటల్' 'మిస్' మేనేజ్మెంట్ - అయ్యరు గారి తో కాఫీ - జిలేబీయం !



మాన్యు 'మెంటల్' 'మిస్' మేనేజ్మెంట్ - అయ్యరు గారి తో కాఫీ - జిలేబీయం !


వేడి వేడిగా పొగలు సెగలు కక్కుతున్న కాఫీ టేబిల్ మీద పెట్టి

"ఏమోయ్ జిలేబి ఏమిటి నీ బ్లాగు విశేషాలు" పృచ్చించేరు  మా అయ్యరు గారు.

వేడి కాఫీ తాగుదామని పెదవుల దగ్గిరికి తీసుకుని చప్పరిస్తో ఆ ప్రశ్న కి ఉలిక్కి పడితే  పొలమారి కాఫీ గుండె లో కి దూసు కెళదామా అని చూసింది !
 

అయ్యర్వాళ్ నేనే కదా దేశం లో పరిస్థితులు ఏమిటి అని మామూలు గా అడిగే దాన్ని ఏమిటి మీరు ఈ మారు అడుగు తున్నారు ? అంటూంటే

అయ్యరు గారు    హిందూ పేపర్ లో తల బెట్టేసేరు అంత లో !

".... మొన్న జిలేబి తయారు చేస్తామని ప్రయత్న్తిస్తే అది మైసూర్పాక్ అయి పోవడం గుర్తు కొచ్చి చెప్పా

ఈమధ్య యింటి పట్టున
మైమరచి జిలేబి జేయ మైసూర్పాకై
తా మారగాను జయ్యని
నో మారు వసుంధరమ్మ నోట్సు కదిపితీ :)

మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంటోయ్ మా అయ్యరు గారు సెలవిచ్చారు !

మాన్యుమెంటల్ మిస్ మేనేజ్ మెంట్ ! నోరు వెళ్ళ బెట్టేసా !

అవునోయ్ ! జిలేబి పేరు పెట్టు కుని జిలేబి తయారు చేస్తే మైసూర్ పాక్ అది కాస్తా అయితే మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్ కాకుంటే ఇంకేమిటి ? అన్నారు అయ్యరు గారు.

గుర్రు గా చూసా వారి వైపు. !

అంటే అర్థం ఏమిటండి ? అడిగా వారిని సందేహం తో !

యిదిగో జిలేబి నాకు తెలిసిన తెలుగు చాలా తక్కువ - స్మారక అనిర్వహణ అనొచ్చను కుంటా అన్నారు వారు !

స్మారక అనిర్వహణ ?  అడిగా సందే హం తో  అంటే అపస్మారక అనిర్వహణ కూడా ఉంటుందేమో అనుకుంటూ !

అవునోయ్ ! ఈ మాట నాది కాదు మన మనమోహనుల వారిది !

మనమోహనుల వారిదా !

అవునోయ్ !
అయితే అది ఖచ్చితం గా అపస్మారక నిర్వాకమే అయ్యుంటుంది లెండి అన్నా మళ్ళీ జిలేబి వేద్దామా లేక , సమోసా కాపీ రైటు కూడా మనమే కొట్టేద్దామా అన్న ఆలోచనలో పడి పోతూ !
ఏమోయ్ , మిస్, ఏమి మేనేజ్ చేయాలను కుంటున్నావ్ ?

నోట్లోంచి పదాలు రావటం లేదండి !

అయితే ఓ స్పీకర్ పెట్టు కోవోయ్ !  అట్లా అయితే అది మరో మాన్యుమెంటల్ "మిస్" మేనేజ్ మెంట్ ఖచ్చితం గా అవుతుంది అన్నారు అయ్యరు గారు !  'దేశం లో యిప్పుడు ముగ్గురు 'మిస్' మేనేజ్ మెంటు చేస్తొంటే వాళ్ళ తో బాటూ నువ్వు కూడా చెయ్య వోయ్'


యిదిగో అయ్యర్వాళ్ మీ పోలిటిక్స్ నాకర్థం కావు సుమండీ !నా జిలేబి చుట్టటం లో నే పడతా అంటూ కాఫీ ముగించి మళ్ళీ నా పదాల వేటలో నే పడ్డా !



చీర్స్
జిలేబి 

Wednesday, November 23, 2016

డాక్టర్ బాలమురళీ కృష్ణ - ఒక నివాళి !


మనీ ముందు పెట్టు - మోహనం పాడతా !
 
 
 

అవనిని బేర్చిన రాగము
లవలీలగ నారదాదులకు వినిపించ
న్నవ భావోద్వేగముతో
భువి వీడితి వోయి బాలమురళీ కృష్ణా !
 
 

ముంబై షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర ఆడిటోరియం లో డాక్టర్ మంగళంపల్లి వారికి 'Life time achievement in Fine arts' అన్న అవార్డుని సభా వారు అందించారు. మహారాష్ట్ర గవర్నరు గారు బాలమురళి కృష్ణ గార్ని సత్కరించారు. ఈ సమయం లో మరో ముగ్గురు యువ కళా కారులని కూడా సంగీత శిరోమణి అని సత్కరించారు.

ఈ సందర్భం లో గవర్నరు గారు బాలమురళీ గారిని పొగుడుతూ,  సరస్వతీ, మహాలక్ష్మీ పరిపూర్ణ కృపా కటాక్షాలు డాక్టర్ మంగళంపల్లి వారికుందని ఆయన సంగీతానికి 'gggreat service' (అదేమండీ మూడు 'జీ' లు పెట్టేరు అంటారా, గవర్నరు శ్రీ శంకర నారాయణన్ గారు మలయాళీ లాగున్నారు , గ్రేట్ సర్వీస్ ని వారు అలా 'నొక్కి' వక్కాణించారు మరి, కేరళా స్టైల్ లో) చేస్తున్నారని చెప్పారు.

వారి ప్రసంగం తరువాయి మంగళంపల్లి వారు ఈ పిట్ట కథ చెప్పేరు

'గవర్నరు గారు సరస్వతీ, మహాలక్ష్మీ కటాక్షాలు నా పై ఉందని చెప్పడం నా జీవితం లో జరిగిన ఒక సంఘటన ని నాకు గుర్తుచేస్తోంది.

తమిళ నాడు లో చెట్టియార్ వారి పెళ్లి లో పాడడానికి వారు వెళ్ళినప్పుడు జరిగినది ఇది. చెట్టియార్ గారి పెళ్ళిళ్ళలో ఒక విద్వాంసుడు మూడు గంటలు పాడితే, మరో చెట్టియారు మరో విద్వాంసుడిని పిలిచి ఆ విద్వాంసుడి కన్నా ఎక్కువ సేపు పాడాలని చెప్పే రకం అన్న మాట అంటే, ఎవరెక్కువ సేపు పాడితే వారి అభిప్రాయం ఆ విద్వాంసుడే మరీ గొప్ప అన్న మాట!.

వీరు వెళ్ళిన పెళ్లి లో బాలమురళీ గారు, మూడున్నర గంటల పైన కచేరీ చేసేరు. ఆ పై న ఆ చెట్టియారు వచ్చి 'సామీ, మోహనం పాడండని అడిగే డ ట.

మంగళం పల్లి వారన్నారట,చెట్టి గారు మొదట  నా ముందు మనీ పెట్టండి ఆ పైనే మోహనం పాడతా అని.

చెట్టి గారు మరీ కోప్పడి, 'సామీ, చెట్టి వారు, ఎప్పుడైనా కచేరీ కి డబ్బులివ్వక పోయారా?' అన్నాడు

మంగళం పల్లి వారు, తాను భీష్మించు కున్నారు, మనీ ముందర పెడితే గాని మోహనం పాడ నని.

ఈ మారు చెట్టి గారికి మరీ కోపం వచ్చి, 'ఇది మాకు ఇన్సల్ట్' అంటే, అదేమో నాకు తెలీదు, ముందర మనీ పెట్టండి మోహనం పాడతా అని మంకు పట్టేరు బాలమురళీ వారు.

మొత్తం మీద చెట్టి గారు, డాక్టరు గారి ముందు మనీ పెట్టారు

ఆ పై బాలమురళీ వారు మోహనం గా మోహనం పాడారు.

అది విని తాదాత్మ్యం చెందిన చెట్టి గారు, స్వామీ, ఇంత గొప్ప గా పాడేరు, అయనా ఆ మనీ ముందర పెట్టడం అన్నదానికి ఎందుకు మొండి పట్టేరు? మా మీద మీకు నమ్మకం లేదా ? మీరు పాడేక , డబ్బులివ్వమని సందేహమా మీకు ? ' అని వాపోతే,

మంగళం పల్లి వారన్నారట, 'చెట్టి గారు, మోహన రాగం స,రి,గ ప ద స , స ద ప గ రి స. అంటే, మోహనం లో మ, ని లేదు. అందుకే మనీ ముందర పెట్ట మన్నా. స్వప్త స్వర ఘోష అయ్యింది కదా, మీ పెళ్లి లో, అంటే, చెట్టి గారు మరీ ఖుషీ పడి , డాక్టరు గారిని మరింత గొప్ప గా సత్కరించేరు.!

అదీ కదా సరస్వతీ, మహా లక్ష్మీ కటాక్షం అంటే !

 
జిలేబి 

Memories from ముంబై musings!
డిసెంబర్  22, 2012.

ఫుట్ నోట్ - 21st feb 2017- added:

Source->

http://chitrakavitaprapancham.blogspot.com/2017/02/blog-post_98.html


ఒక కవి ఒక రాజు దగ్గరకు వెళ్ళి
ఆ రాజును సంబోధిస్తూ ఈ శ్లోకం చెప్పాడు-

య దస్తి ద-ప యోర్మధ్యే త దస్తి తవ మందిరే
తన్నాస్తి మద్గృహే రాజన్ తదర్థ మహ మాగతః


ఓ రాజా ద-ప మధ్య ఉన్నదేదో అది నీ యింట ఉన్నది.
అది మా గృహంలో లేదు దానికోసం వచ్చాను మీవద్దకు-
అని భావం.

ఇంతకు ఏది ఆయన దగ్గరుంది
ఈయన దగ్గరలేనిది ఏదే ప్రక్కనున్నవారికి
అర్థం కాలేదు. ఇంతకు ఏమిటది-

తథదధన - పఫబభమ
అనే అక్షారాలు తీసుకుంటే
అందులో ద - ప లమధ్య
ఏముందో తెలుస్తుంది.
తథద ధన  పఫబభమ
వీటి మధ్య ధన అనేది ఉంది కదా!
అదేనండీ ధనం దానికోసం వచ్చాడు ఆయన.

Wednesday, November 9, 2016

ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా !


ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా !


కొండ మీద ఏడు కొండల రాయుడికి ఏకాంత సేవ మొదలయింది. భోగ శ్రీనివాసుల వారికి పానుపు సేవ చేస్తూ స్వామి వారిని చూచి 'స్వామీ! ఇవ్వాల్టి కి బాగా నిద్ర పొండి! రేపట్నించి మన లైఫే వేరు ' పూజారి స్వామి వారు చెప్పారు !

నిద్ర పోయే ముందు కనుక్కుందామా లేదా ఆ ఏమైతే ఏముంది లే ! అంతా విష్ణు మాయే గదా అని రవ్వంత ఆలోచనలో పడి, సావకాశం గా ఎందుకైనా కనుక్కుంటే మంచిదే అనుకుని, మరీ 'ప్రాబ్లం' ఏదైనా వస్తే 'సిక్ లీవ్' పెట్టేయొచ్చు అనుకున్న స్వామి వారు, 'ఏమోయ్ ! ఎందుకు రేపటి నించి లైఫే వేరు అంటున్నావ్ ' అన్నాడు సందేహం గా !

అర్చక స్వాముల వారు ముసిముసి నవ్వులు నవ్వారు !

స్వామీ ! ఇక మీరు మీ కుబేరుల వారి బకాయి చెల్లించే రోజులు దరిదాపుల్లో కి వచ్చేస్తాయను కుంటా ! చెప్పాడా యన !

స్వామి వారికి మహానందం కలిగింది ! 'నిజంగానా' ! అంటూ దాంతో తలే ఉంగలీ దబాయించేసారు !

అవును స్వామీ ! మీ అనుంగు శిష్యుడు మోడీ దేశం లో పెద్ద నోట్లకి బందు చెప్పేసాడు. ఇక మీకు పండగే పండగ ! కట్టల కొద్దీ నోట్లు యిక హుండీ వశం ! డబ్బులు మానావరి గా వస్తే మీ బకాయి తీరినట్టే కదా !

నిజంగా వస్తుందంటావా ? స్వామి వారు ఇంతకు మునుపు కూడా ఇట్లాంటి వి చూసి వున్నారు ! ఆ మారు కూడా బకాయి తీరలే! ఏమో ఈమారైనా వస్తుందా ? తన బకాయి తీరు తుందా !

హు! ఆశ ఎవరిని విడిచింది ! ఏమో బకాయి తీరేంత దస్కం వస్తుందే మో ! ఎవరికీ తెలుసు - స్వామి వారు ఆశా భావం వ్యక్తం చేసారు !

అందుకే స్వామీ ! ఇవ్వాళ బాగా రెస్టు తీసుకోండీ ! రేపట్నించి నోట్ల లెక్కలు ఇక మనం జబర్దస్తీ గా 'మోడీ' లెట్ట వచ్చు ! అర్చక స్వామి వారు చెప్పారు !

స్వామి వారు ఆవులించారు !

ఆ ఆవులింత లో జగమంతా అర్చక స్వామి వారికి కనబడి  పదునాలుగు లోకాలావల పంచదశ లోకం లో జిలేబి కూడా కనబడింది :)

చీర్స్
జిలేబి  

Tuesday, November 8, 2016

కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !

 
 
 
 
కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !
అదిరిందా ? కుదిరిందా ?
ముదితా !రమణీ !జిలేబి ! ముద్దుల పద్యం
బదురుచు దాగెన్బోవే !
కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !
 
 
చీర్స్
జిలేబి
 
 
 

Monday, November 7, 2016

సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!






సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!
 
వింధ్యారణ్యములందు భక్తజనుడై విద్వత్తు మేల్గాంచ భ
ద్రం,ధ్యాతవ్యమునిగ్గు తేల వలయున్; దాంపత్య సంసార మో
హం ధ్యానీయము మానవాళి కిచటన్ హాసంబు లావణ్యమై
సంధ్యా, వందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!


సావేజిత
జిలేబి  


Thursday, November 3, 2016

ఒక సమోసా కథ - జిలేబీయం :)


ఒక సమోసా కథ - జిలేబీయం :)
 
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమి :)

ఈ కథలో వచ్చిన బ్లాగర్ల పేర్లు వాళ్ళ బ్లాగు అడ్రస్ లు

మీకు తెలిస్తే చెప్పుకోండి చూద్దాం :)

****
 
 

ప్రాణి నంబర్ 1. బ్లాగరు సమోసా! బ్లాగరు సమోసా!”

సమోసా ప్రాణి ముందుకొచ్చింది.

యముడు చిత్రగుప్తుడి వైపు తిరిగి అడిగేడు, “ఏమిటీయన చేసిన పాపాలు?”

“ఈయన కాదండి, ఈవిడ.”

“ఓహో సరే, ఈవిడ చేసిన తప్పులేమిటి?”

“బ్లాగు మొదలుపెట్టిన రోజుల్లో సమోసా ఎలా తయారు చేయచ్చో, కారప్పూస ఎలా చేయచ్చో, మరోటీ, ఇంకోటీ స్నాకుల గురించీ రాసేవారు. కానీ ఉత్తరోత్తరా ఆటవెలదీ, తేటగీతి అనే తెలుగు పద్యాలు రాయడం నేర్చుకుని జనాల్ని చంపుకు తినడం సాగించారు. ఉదాహరణకి చూడండి:

ఏ.తె. నిజమాటల ననుచును త
            నజబ్బలను చరచుచు, టపటప మనుచు
            నిజమేనని చెప్పుటమేలా?
             ఈజనులకు వేస్టు సామోసా గరగరం పల్కు!

“ఏ.తె. అన్నారేమిటి? ఇదేమి వృత్తం? కందమా, ఆటవెలదా, తేటగీతా?” యముడు కాస్త అనుమానంగా అడిగేడు.
“ప్రభో, నన్నా అడుగుతున్నారు? నాకు ఈ చిట్టా చూడ్డానికే సమయం సరిపోవట్లేదు.” చిత్రగుప్తుడు అరిచేడు.


“అయినా అసలు కధ చెప్పబోతున్నాను వినండి. ఇలాంటి పద్యాలు ఈవిడ తన బ్లాగులోనూ, ఇతర బ్లాగుల్లోనూ కామెంట్ల రూపంలో వేయడం మొదలు పెట్టింది. దాంతో ప్రతీ ఒక్కరూ పద్యాల్రాయడం మొదలెట్టారు. అది ఎంతవరకూ వచ్చిందంటే నాలుగు లైన్లు రాయడం కూడా రాని వాళ్ళు, వచ్చినా రాయని వాళ్ళు, అసలు ఛందస్సంటే ఏవిటో తెలీనివాళ్ళు, కొత్తరకం ఛందస్సు మొదలు పెట్టి ఇలా ఏ వృత్తానికీ పట్టని పద్యాలు రాయడం సాగించారు. ఈవిడ సృష్టించిన ఈ పద్యం ఏ.తె. అని ఎందుకన్నారంటే ఎవరైనా ఇదేం వృత్తం అని అడిగితే ‘ఏమో తెలియదు’ అని చెప్పడానికి అంటున్నారు. అదీ కష్టం అనుకున్న జనాలు…”


“ఏవిటీ, నాలుగు లైన్లు రాయడం కష్టమా?”


“…అదేకదండి మరి వింత? అదీ కష్టం అనుకున్న జనాలు నానీలనీ, మినీలనీ, వానీలనీ మొదలుపెట్టి రెండు లైన్లతో, ఒక్కలైనుతో రాస్తున్నారు. ఇదేమి వృత్తమయ్యా అంటే ఇదో కొత్తది మీరూ నేర్చుకోండి అనే ముక్తాయింపు మొదలైంది. రెండు ఇంగ్లీషు పదాలు లేకుండా ఓ తెలుగు వాక్యం నోట్లోంచి రావట్లేదు వీళ్ళకి.

ఈవిడ పద్యాల దగ్గిరకొస్తే ‘సమోసా’ అనే పదం వచ్చేలాగ పద్యాలు రాస్తో జనాలని కుడీ, ఎడమగా వాయిస్తోందీవిడ.”

పూర్తిగా చదవండి !

చీర్స్
జిలేబి

Saturday, October 29, 2016

దీపావళీ శుభాకాంక్షలు !



 
 
దీపావళీ శుభాకాంక్షలు !
 
 
అందరికీ దీపావళి
యందము గా వెలుగు దివ్వియల జీవితమై
డెందంబానందంబుల
బొంద వలయు నిలన యష్ట భోగముల గనన్ !
 
 
 
 
శుభకామనలతో
జిలేబి

Friday, October 28, 2016

పొట్టలో చుక్క !

 
పొట్టలో చుక్క !
 
 
ఒక వృత్తానికి
 
ఒకే ఒక కేంద్రం
 
ఒక కేంద్రానికి
 
అనంతమైన
 
వృత్తాలు !
 
శుభోదయం
జిలేబి
 
 

Wednesday, October 26, 2016

వేదం లో అన్నీ ఉన్నాయ ష ! - రంగనాయకమ్మ గారి వేద 'ఘోష' !


వేదం లో అన్నీ ఉన్నాయ ష ! - రంగనాయకమ్మ గారి వేద 'ఘోష' !


వెల్కం టు వేదాస్ !  (లాస్ వెగాస్ స్టైల్ అన్న మాట !)

మా వేదం లో అన్నీ ఉన్నాయ ష :)

రామాయణం రంకు అయ్యింది; భారతం బొంకు అయ్యింది.

వేదం లో ఏముంది

పదండి పదండి ముందుకు చదువు దా మన మందదరమూ వేదం లో ఏమున్నదని !

ముప్పాళ రంగనాయకమ్మ గారి - వేదాలు (త్రీ టైమ్స్ ! , నాలుగు సార్లని ఉండాలి గదా? )



భలే మంచి చౌక బేరము ! ఎనభై రూపాయలు మాత్రమే !

చీర్స్
జిలేబి



 

Saturday, October 22, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 6-ఆఖరి భాగం



మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం -6
(ఆఖరు భాగం)


ఇరవై మూడు - ఇరవై ఐదవ అంకం దాక

హస్త బ్రత - ధనంజయునికి కేశవ సిద్ధి ఉపదేశం - మకుటా రామ -అష్ట వ్రత !

అష్ట వ్రత ఇట్లా హస్త బ్రత గా అపభ్రంశం చెందినట్టుంది.

హస్త అంటే ఎనిమిది; వ్రత అంటే నిబద్ధత లేక అనుసరించ వలసిన పధ్ధతి మార్గం.

రామ దేవ (శ్రీరామ ) తన కాలం లో ఆచరించి న మేటి ధర్మం, తద్వారా రాజ్యాన్ని సుభిక్షం గా రామ రాజ్యం గా పాలించిన తీరు వర్ణన.

దానికి మూలం ఈ అష్ట వ్రత. ఈ అష్ట వ్రతాన్ని ఆచరించిన వాడు ఖచ్చితం గా మకుటాన్ని దాల్చిన వాడై తీరుతాడు (మకుటా రామ !) .

అవి ఏమిటి?

స్థూలం గా యిది మంత్ర పుష్పం సారాంశం లా ఉన్నది.

మంత్ర పుష్పానికి అపూర్వ మైన నిర్వచనం లా అనిపిస్తుంది.

అద్భుతః.

ఆంగ్లం  + తెలుగు లో నా కనిపించినంత వరకు క్రింద ఇస్తున్నా.

Kesawasidi - The eight principles known as the Hasthabrata are derived from the basic elements.

1- Sun illuminates the entire universe to bring life to all existence. So is a king who must serve as a  beacon of light for his entire monarchy.

2- Moon illuminates the night providing peaceful and protecting radiance. So is a king who must be able to offer enlightenment when the empire is cast in darkness.

3- Stars serve as adornments in the sky, as points of the compass to determine the seasons and impart a sense of direction. So is a king who must be the center of all ethics, conduct and cultural traditions in his kingdom;

4-Clouds elicit foreboding in all those behold them, yet at the moment they break into rain, they become a source of renewal. So is a king, who must exude a fearful and powerful aura. Yet his governance must lead to prosperity and peace.

5-Earth embodies a robust and pure nature. So is a king, must possess strength of character, not be easily influenced by flattery, and not be swayed by those spreading tales.

6-Ocean is wide, without limits, and fills all spaces as though infinitely. So is a king, whose character needs to be open and generous and not over-sensitive to those critical of him.

7- Fire has the ability to conquer all in its path without discrimination, yet at the same time is vital and necessary force. So is a king, who must have the courage to hand down punishment to those who deserve it, without an eye toward friend or family.

8-Wind has the ability to sweep across an entire locality in even measure.  So is a king, who needs to act consistently throughout his reign.

మంత్ర పుష్ప సారాంశం !

నిప్పు వేడి
గాలి వేగం
సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు
మేఘ గర్జన
ఋతువుల రాగం
అన్నీ నేనే అన్నది జల పుష్పం
ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !


Arjuna- Then what is the essence of Hasthabrata , Venerable one?

Kesawasidi- Serving as an example. Live by it each day of your life.

మిగిలిన కథ

కేశవ సిద్ధి విజయ ధను ని అర్జుని కి యిచ్చి, దాన్ని కర్ణునిని కి అందజేయ మంటాడు. అర్జునిని నిష్క్రమణ.

కేశవ సిద్ధి శ్రీ కృష్ణ పరమాత్మ గా, ద్వారావతి (ద్వారక?) రాజు గా మారుతాడు.

క్రేస్న సిన  ఎంగ్ గెలుంగ్
మంగ్రుక్మినింగ్ చక్రనిర
కతోన్ కుమితిర్ కంగ్ అనెంగ్ అస్త
తుబు విస్ను సంగ్ బతర అరస గ్లెబుర్ బూమి
 
Kresna sinayeng gelung
Mangrukmining gelung,
Katon kumitir kang aneng asta,
Tuhu Wisnu sang Bathara arsa nglebur bumi


తిరుగు ప్రయాణం లో అర్జునుడు కర్ణుని కలవటం; అతని విజయ ధనువు ని తిరిగి యివ్వటం; ఆ పై దారిలో బంబాంగ్ సింతవాక ని కలవటం; సింత వాక సరసం (అర్జునినికి సింత వాక సెంబద్ర అని తెలియదు కాబట్టి ) మీద పడి రావటం; అర్జునుడు కోపం తో సెంబద్ర తో పోట్లాడటానికి దిగటం; సింతవాక సరసం గా విరసం; ఆ పై శ్రీ కృష్ణుడి రావటం; సింత వాక సెంబద్ర అని తెలియటం; సుఖాంతం !

ఈ మధ్య లో భీముడు అర్జునిని వెతుకుతూ వస్తోంటే దారి మధ్య లో కుంభ కర్ణుడు అతన్ని అడ్డు కొంటాడు; యిద్దరి మధ్యా వాగ్వివాదం; భీముడు కుంభ కర్ణుడి ని ఓడించటం; కుంభ కర్ణుడు తేజో పుంజమై భీముని తొడ లో కి వెళ్ళటం; (తద్వారా కేశవ సిద్ధి చూపించిన స్వర్గా రోహణ ) ; కుంభ కర్ణుని శక్తి కూడా భీముని చేరిందని చెప్పటానికి చెప్పిన కథ లా ఉంది.

ఆఖరు గా పాండవులంతా కలవటం.

శుభం !

======

కొన్ని లింకులు -

ఈ క్రింది లింకు లో కాకవిన్ రామాయణం ఆంగ్ల అనువాదం ఉంది. ఈ రామాయాణం దరిదాపుల్లో 900 AD ఆ ప్రాంతం లో వ్రాయ బడింది (జావా+సంస్కృతం కలబోత) ఆంగ్లానువాదం అద్భుతః !  దీనికి మూలం భట్టి వారి రామచరిత అన్నది ఉండ వచ్చు .

కాకవిన్ రామాయణం లింకులు - Serat Rama-

ఆర్కైవ్ డాట్ ఆర్గ్ ఫ్రీ డౌన్లోడ్

Kakawin Ramayana


వయాంగ్ కులిత్ కి ఒక యూట్యూబ్ లింక్ (చాలా ఉన్నాయి ; ఇది ఒక 'సింతవక :)



 

సమాప్తం

చీర్స్
జిలేబి

Friday, October 21, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 5



మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 5

(పతేట్ సంఘ)

పన్నెండు-పదిహేనవ అంకం

అర్జునిడి ప్రవేశం అడవి లో; అతని తో బాటు బాదరాయణుడు, బాదరాయుని సంతానం ;
అర్జునినికి గల వివిధ పేర్లు వీరి ప్రకారం(మనకు తెలీనివి)  -జనక, కుంబలవలి, పమది, జాహ్నవి, విభత్సు, కుంతది (కుంతీ పుత్రా?) ; పాండుసివి ;

విభీషణుడి ని వీడిన మదలోభ మాత్సర్యాలు అర్జునిని ప్రేరేపిస్తాయి; వాటి ప్రేరేపణ లకు తావివ్వకుండా అర్జునుడు వాటి తో పోరాడి బాదరాయుని సలహా తో వాటిని అగ్ని అస్త్రం గా ప్రయోగించి దగ్ధం చేస్తాడు.

పదహారవ అంకం

నారదుని ప్రవేశం; శోకతప్త యైన సెంబద్ర (సుభద్ర) ; అర్జునిని జాడ తెలియక ఉండటం; నారదుల వారి ని సలహా అడగటం; తన భర్త మళ్ళీ మాయ మయ్యాడు అంటే మళ్ళీ ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుని రావటానికి వెళ్ళాడేమో అని విచార పడటం; నారదుల వారు కారణ మది కాదని రామ మకుటం కోసం పార్థుడు వెళ్ళా డని చెప్పటం; సెంబద్ర తానూ అర్జునిని కలవాలని చెప్పటం తో, నారదుల వారు సెంబద్ర ని మగ వాని గా మార్చి బంబాంగ్ సింతవక  అన్న పేరు పెట్టడటం; దుర్యాపుర అరణ్య ప్రాంతాలలో అర్జునిని వెదక మని సెంబద్ర తో చెప్పటం !

పతేట్ మన్యుర

పదిహేడవ అంకం

బంబాంగ్ సింతవక అర్జునిని వెతుకుతూ వెళ్ళటం; దారిలో గ్రామాల వర్ణన

పదినెనిమిదవ అంకం

ధర్మరాజు సభ; వెళ్లి న అర్జునిడి జాడ ఇంకా తెలియటం లేదు; అజాత శత్రువు (ధర్మజుడు) చింతాక్రాంతుడవటం; భీముని నకులుని పిలిచి వాళ్ళ అభిప్రాయాలనడగటం; అర్జునిని వెతుకుతూ భీముని వెళ్ళ మనటం;

పందొమ్మిద వ అంకం

భీముని వర్ణన; అతని వస్త్రముల వర్ణన; అతని బలము ఎట్లాంటిదో చెప్పటం; భీముడు అర్జునిని వెతుకుతూ వెళ్ళటం;

ఇరవై వ అంకం

సింతవక ఘటోత్కచుని అడవి లో కలవటం; వీళ్లద్దరి మధ్య సంభాషణ; తాను సింతవక అని చెప్పటం; ఘటోత్కచుడు అర్జునిని జాడ సింతవక కి తెలుసా అని ఆడగటం; సింత వక ఘటోత్కచుడు తన శిష్యుడైతే చెబ్తాననటం; ఘటోత్కచుడు కోపగించ టం; వీళ్ళ యిద్దరి మధ్యా యుద్ధం; సింత వక గెలవటం; ఘటోత్కచుడు సింత వక శిష్యుడు గా ఒప్పేసు కోవటం; యిద్దరూ కలిసి అర్జునిని వెతక టానికి నిష్క్రమణ .

ఇరవై ఒకటవ అంకం

అర్జునిని ప్రవేశం; మహంబీర (గరుడుడు ) అర్జునిని కయ్యానికి కాలు దువ్వటం; అర్జునుడు తాను వర సిద్ధి కై వచ్చానని ఇట్లా తన శక్తిని గరుడు ని తో పోట్లాట కి యుప యోగించ ననటం; గరుడుడు నిష్క్రమణ; కువర (సర్పము) , సితుబంద (ఏనుగు) అర్జునిని పై కి రావటం; అర్జునుడు యోగ ముద్రలో కి వెళ్ళటం; అతని నించి ఒక వింత కాంతి వచ్చి వీళ్ళ యిద్దరిని ఓడించటం;

బాదరాయణుడు అర్జునిని తో శిఖరం ఎక్కేటప్పుడు గాలి వాటం మనకే ఎప్పుడూ ఉండదు; మనం గమనిక తో ఉండాలని ఉద్బోధ చేయటం;

ఇరవై రెండవ అంకం

కేశవ సిద్ధి ఆశ్రమ వాటిక; కుంభకర్ణుడు ప్రవేశం; కేశవ సిద్ధి తేజస్సు విభీషణుడు తేజస్సు పోలి ఉందని కేశవ సిద్ధి ని తనకు మోక్షం ప్రసాదించా లని కోరటం; కేశవ సిద్ధి ఉపదేశం; రాక్షసుడై నా, దేవత లైనా మంచి అన్నది చేయక పోతే దాని పరిణామాలని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పటం; ఆ పై కుంభ కర్ణుని అడవి లో కి వెళ్లి ఒక తేజోవంత మైన మనిషి కనడతాడు అతని ద్వారా నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పటం; కుంభ కర్ణుని నిష్క్రమణ.

హనుమంతుల వారి ప్రవేశం; తాను కర్ణుని ఎదిరించి విజయ ధను తెచ్చానని చెప్పటం; ఈ విజయ ధను నిజంగా పాండవ మధ్యముని కి చెందాల్సిందని కాని కర్ణుడు దాన్ని కాజేసాడని చెప్పటం ; అందుకనే కర్ణుని ఓడించి ఈ ధను తెచ్చా నని చెప్పటం; దీన్ని అర్జునినికి ఇద్దా మనటం;

కేశవసిద్ధి హనుమంతుల వార్ని మృదువుగా హెచ్చరించటం; తను తపస్వి ఇట్లాంటి పనులు చేయకుండా యుండాల్సిందని అనటం; మళ్ళీ వెళ్లి తపస్సు చేసుకోమని చెప్పటం; హనుమంతు ల వారి నిష్క్రమణ .

అర్జునిని ప్రవేశం; కేశవ సిద్ధి తేజస్సు చూసి తనే రామ మకుటాన్ని ఇవ్వ గలవాడన్న నిర్ధారణ కి రావటం; ఆ మాటే చెబ్తే కేశవ సిద్ది ఔనని, అర్జునిని పరీక్షిస్తాడు. విజయ ధను ని యిచ్చి యిదే తీసుకు పొమ్మంటాడు;

అర్జునుడు విజయధను ని గుర్తించి యిది తనది కాదని దాన్ని తాను తాకనని; యుద్ధం లో ఎవరైనా దాన్నెక్కు పెట్టి , యుద్ధం లో ఓడితే  చావనన్న చస్తా కాని దాన్ని తీసుకోనని చెప్పటం; అది కర్ణుడిదని చెప్పటం;

కేశవ సిద్ధి అర్జునిని నిబద్ద త కి సంతోషించి రామ మకుటాన్ని బోధిస్తాననటం;

కేశవ సిద్ధి 'హస్త బ్రత' (అష్ట వ్రత ) -రామ మకుట బోధన - అర్జునిని కి దాన్ని అందించటానికి మొదలు పెడతాడు ;

హస్త బ్రత (అష్ట వ్రత!)

సశేషం 

Thursday, October 20, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 4


మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 4


ఎనిమిదవ అంకం :

దుర్యాపుర అరణ్య ప్రాంతం లో శ్వేలగిరి పర్వత శ్రేణులలో కుతారుంగు ప్రదేశం - తపస్వి కేశవ సిద్ధి ఆశ్రమ వాటిక;
కేశవ సిద్ధి తన శిష్యులైన , వాయు పరంపర లోని వారైన, అనోమాన్(హనుమంతుడు), మహంబిర (గరుడుడు), జాజల్వ్రేక (అసురుడు) సితుబంద (ఏనుగు) లతో.

కేశవ సిద్ధి హనుమంతుల మధ్య సుదీర్ఘ సంభాషణ - కేశవ సిద్ధి బోధన - యేది ధర్మం ; యేది న్యాయం; మానవుని జీవితం లో మూడు ఘట్టాలు - ఒకటి జీవం; రెండు జీవమెందుకన్న జ్ఞాన పూర్ణత; మూడు ఆ పరిపూర్ణత్వాన్ని పొందడం; ప్రకృతి జీవాన్ని పెంపొందిస్తుంది అది యుపయోగ కర మైనదైతే; కాదంటే అది పృకృతి లో కలిసి పోతుంది మరో రూప మవటానికి (పనికి వచ్చేలా)-> (పునరపి జటరే శయనం); నేల కూలిన చెట్టు, ప్రాణి, మరో చెట్టు కో, ప్రాణి కో జీవ మవుతుంది; 

కేశవ సిద్ధి, అతి త్వరలో దేవత ల ద్వారా ఈ తరానికి అందించ బోయే రామ మకుటం గురించి హనుమంతుని కి చెప్పి , అతనికి దానికి సరితూగు మనిషి ఎవరైనా వస్తారేమో వాళ్ళని జాగ్రత్త గా గమనించ మని బాధ్యత అప్ప గిస్తాడు. 

తొమ్మిది,పదవ అంకం :

కుతరుంగు వాటిక లో కర్ణ, దుర్శాసన,హస్తిన సేన   ప్రవేశం. హనుమంతునితో సంభాషణ. హనుమంతుడు కేశవ సిద్ధి శిష్యుడని చెప్పటం; కర్ణుడు కేశవ సిద్ధి ని కలవాలని, రాముని మకుటానికై తా వచ్చా నని చెప్పి కలవాలని చెప్పటం; దానికి హనుమంతుడు కేశవ సిద్ధి ప్రస్తుతానికి ధ్యానం లో ఉన్నారని కలవడానికి వీలు లేదనటం; దీని మీద కర్ణుడి ఆగ్రహం; తానెవరో తెలిసే హనుమంతుడు యిట్లా మాట్లాడ తాడా అనటం ;

దీంతో కర్ణ,దుశ్శాసన, కార్తమరామ,  హస్తిన సేనా  హనుమంతుని తో యుద్ధానికి  తలపడటం; కర్ణుడి కరవాలం, కుంతదుర్వాస అస్త్రం, ఆ పై అతని ఆఖరి మహా అస్త్రమైన విజయధను ప్రయోగించటం; హనుమంతుడు అవలీల గా విజయధను ని కూడా పట్టి వశం చేసుకోవడం జరుగు తుంది; దీంతో కర్ణుడు అతని సేనలు నిర్వీర్యులవు తారు.

ఇక్కడి నించి కథ, రామాయణ కాలపు విభీషణుడు చంద్రమణిక పర్వత ప్రాంతం లో తపస్సు చేసుకుంటున్న వన వాటిక కు వెళుతుంది.

పదకొండవ అంకం :
 
విభీషణుడు తపోవంతుడై చంద్రమణిక పర్వత ప్రాంతం లో ఉంటాడు;
విభీషణుడి తపో శక్తి వర్ణన; విశేషం గా కనిపించినది ప్రతి గురువారం రాత్రి అతని ప్రతి అణువు నించి వింత కాంతి రాత్రంతా వెదజల్లుతూ ఉండటం గురించి వర్ణన!
భీషవర్ణ, (విభీషణుడి కొడుకు) తండ్రి ని కలవడానికి రావడం; లంక బాగోగులు విచారణ; భీష వర్ణుడు కోరిక పై విభీషణుడి తత్వ బోధ. జీవితం లో కాలసినవి ముఖ్య మైనవి, నియమ నిబద్ధత, నిష్ట తో చదువుల ని గరపడం; మన ప్రవర్తన; అక్కడి నించి వాటిని ఎట్లా మనిషి పెంపొందించు కోవాలో చెప్పడం.

ఆ పై విభీషణుడు తన కంతిమ కాలమాసన్న మయ్యిందని చెప్పడం; శోక తప్తుడై భీష వర్ణుని నిష్క్రమణ.  విభీషణుడు ధ్యానముద్ర లో కి వెళ్ళటం ; అతని నించి వెలువడిన తేజో పుంజం వేరు లోకాలని తాకి మరో లోకం లో ఉన్న కుంభకర్ణుడు (ఇతను అటు స్వర్గానికి పోకుండా , యిటు భువిలో నూ లేకుండా ఊగిస లాడుతూ అదే తానున్న లోకమే స్వర్గమన్న భ్రాంతి లో ఉన్నవాడు) ఆ కాంతి పుంజానికి ఆకర్షితుడై రావటం; విభీషణుని కలవటం; విభీషణుడు అతనికి మంచి మాటలు చెబుతూ - మనిషి జీవిత లక్ష్యం పరంధాముని చేరటం; స్వర్గాన్ని అధిరోహించటం అని చెప్పి , ఇప్పటి కాలం లో విష్ణు మూర్తి మళ్ళీ అవతారం దాల్చాడని అతనిని కలిసి విముక్తి ని కోరమని చెబుతాడు. కుంభకర్ణుడి నిష్క్రమణ.

మళ్ళీ ధ్యానం లోకి వెళ్ళిన విభీషణుడు; అతని నించి కామ క్రోధ మద లోభమాత్సర్యాలు వెలుపలికి తోసి వేయ బడటం; వాటికి విభీషణుడు ఉపదేశం ( వేరే ఎక్కడైనా స్థలం చూసు కోమని చెబ్తాడు - తను పై లోకాలకి వెళుతూ );
విభీషణుడి స్వర్గా రోహణ ;

ఇక్కడి నించి కథ  మారి బాదరాయుణుడి ఆశ్రమ వాటిక కి వెళుతుంది.


ఈ పదవ అంకం లో విభీషణుడు కుంభ కర్ణుడి కి చేసే అద్భుత ఉపదేశ సారాంశం -
 
Tan samar pamoring Sukma,
sinukma ya winahya ing ngasepi,
sinimpen telenging kalbu,
Pambukaning wahana,
tarlen saking liyep layaping ngaluyup,
pindha pesating supena,
sumusuping rasa jati.

sekar macapat Pangkur form - From Serat Wedhatama (Canto 1-verse 13) a macapat poem from Mangkunagara IV - mid to late 1800, Surakarta.

Unafraid of a bleeding of the soul,
Practiced in times of deep inner peace
cherished deep in one's heart
An opening of the doorway,
Mixed awareness and other-worldness,
Transformed into the realm of dreams,
Enveloped in eternal truth.

(One should not be afraid to achieve transformation through meditation).

మరో కణిక !

(పంచ పాదు లైన వాటి గురించి )

చందం - జగతి ఛందస్సు - కుసుమ విచిత్ర అంటున్నారు. కాని చంద్రవర్త్మ కి దరిదాపుల్లో ఉంది .


చంద్రవర్త్మ - ఏమైనా సరిజేస్తే కుసుమ విచిత్ర అవుతుందా ?
 
భూత, పాండవ తతాగ తివిషయా
యింద్రి యక్ష సర మారుత పవనా
బాణ మార్గన, సమీరణ వరయంగ్
పంచ వాయువిసి కంగుళియ లిమా 
 

Buta Pandawa tata gati wisaya ,
indriyaksa sara maruta ,
pawana bana margana ,
samirana lan warayang ,
panca bayu wisikan gulingan lima.

From Chandrasengkala -> (Canto I, Verse 5) , a sekar ageng poem in a collection edited by Bratakesava. 1928. Surakarta.

This is a compilation of chronograms for the number five. It is a list of phrases that represent the eliment of 5. Each phrase is a reference to the number five.

Panca Buta ; Pancha Pandava; Pancha vishaya ? ; Pancha Indriya; Pancha Yaskhasa (Panchaakshari Mantra?); Pancha Marutha Pavana? ; Pancha Bana; Pancha Sameerana (Pancha Vaayu?) ; varayung , gulingan, lima represent again number 5 ?



(సశేషం)

Wednesday, October 19, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 3



మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 3
 
 
మూడవ, నాల్గవ  అంకం
 
దుర్యోధనుడు కర్ణుని పంపించి వేసాక తన అంతః పురం వైపు వెళతాడు. ఇక్కడ అంతః పురం వర్ణన అమోఘం గా కొనసాగుతుంది. కొన్ని విశేషాలు - దుర్యోధనుని వేషధారణ వర్ణన , అతని కిరీట వర్ణన వస్త్రముల వర్ణన మొదలైనవి సవివరం గా ఉంది.  ఆ తరువాయి అంతః పుర వర్ణన అందులో ని వజ్ర వైడూర్యాలు కెంపుల తళుక్కులు ; ద్వారపాలకుల పేరులు - సింగారబల, బలోపేత అను యిద్దరు అసుర రూపం లో  (వీరే స్వర్గ ద్వార పాలకులు కూడా నట ) అంతః పురం లో వెళ్ళటం అక్కడ బానువతి (దుర్యోధనుని భార్య) ఎదురు రాటం;  బానువతి సౌందర్య వర్ణన (మన ఆంధ్ర దేశపు కవులు కుచద్వయములను చంద్రుని తోనూ, మామిడి పండ్ల తో నూ పోలిస్తే, వీళ్ళు మృదు నారీకేళం తో పోల్చడం విశేషం :) ఆ పై దుర్యోధనుడు బానువతి, కుమార్తె లెస్మన వతి సంభాషణ ;
 
 
దుర్యోధనుడు బానువతికి రామ మకుటం గురించి చెప్పడం; యిద్దరూ చేరి దైవ ప్రార్థన చేయడం (ఆ మకుటం తమకు దక్కాలని ); ఆ పై భోజన కార్యక్రమం ( దుర్యోధనుని ఇష్టమైన వంట - సంబెల్ కమెంగి కావాలనటం :) -> యిదేదో జావా వాళ్ళ ఇష్టమైన దేమో !)
 
ఐదవ అంకం
 
దుర్యోధనుని భోజన కార్యక్రమం జరుగుతున్నప్పుడు హాస్య ప్రధాన మైన లింబుక , చంగిక ల సరస సంభాషణ ; వంట అంత రసోస్పూరితం గా ఉన్నదని  దాని మీద చెణుకులు గట్రా;
 
భోజన కార్యక్రమం తరువాయి దుర్యోధనుడు ధ్యానానికి వెళతాడు; నవ నాడుల ని స్తంభింప జేస్తూ, పద్మాసనం లో కూర్చొని ధ్యానానికి వెళ్ళినా మనస్సు సంచలనం ఆగ కుండా ఉండటం ; దాన్ని ఆపి ధ్యాన సూక్ష్మా వస్తకి వెళ్ళటా నికి అతడు ప్రయత్నం చెయ్యడం ; ఆ పై శయనాగారం వెళ్ళటం ; ఈ ఘట్టం లో ఒక అమోఘ మైన సులుకోన్ ఉన్నది - ఆధ్యాత్మిక పరమైన విషయం సంబంధించి; యిది పూర్తి గా జావా భాష లో ఉంది. దాని అనువాదం సుమారు గా -> ధ్యానం ద్వారా హృదయం లోని లోతైన శాంతి ని కనుక్కోగలం అన్నది.
 
ఆరవ అంకం
 
దర్బారు హాలు లో  దుశ్శాసనుని వర్ణన; అతని ఇలాకా బంజారుజుంటూ (బంజరు భూమి యా? ) జనుల గురించి వాడి అట్టహాసాల గురించి వర్ణన ; చిత్రాక్ష, చిత్రాక్షి , దుశ్శాసనుల,దుర్మగతి, దుర్యోధన ,అశ్వత్థామ  సంభాషణ; సంగ్కుని రావడం; రాముని మకుటం గురించి చెప్పడం; కర్ణుడు దానికై వెళుతున్న విషయం చెప్పడం; తమ సైన్యాన్ని తయారు చేయమనటం ;
 
అశ్వత్థామ సైనికుల దగ్గర వెళ్లి వాళ్ళని తయారవ డ మని చెప్పడం; యిందులో అశ్వముల ని మూడు విధాలు గా చూసు కునే వారి వర్ణన ఉన్నది - గమేల్- ఆశ్వాలకి అలంకరణ చేసేవాళ్ళు; పెకంతిక్ - అశ్వాల బాగోగుల ను చూసుకునే వాళ్ళు; పనేగర్ - అశ్వాలకి శిక్షణ యిచ్చే వాళ్ళు !
 
అక్షౌహిణి తయారు చేయమనటం (కర్ణుని కి సహాయం గా వెళ్ళ టానికి )
 
హక్సైని అన్న పదం కనబడుతుంది; యిది అక్షౌహిణి - ఒక అక్షౌహిణి - 21,870 పట్టి. ఒక పట్టి - ఐదు సైనికులు; మూడు గుర్రాలు, ఒక రథం, ఒక యేనుగు; (5m+3h+1c+1e= 10 in count) ;
 
ఏడవ అంకం
 
దుర్యోధనుని సేన కర్ణుని సహాయం గా రాముని మకుటం కోసం బయలుదేరటం; ఈ అంకం లో రథము వర్ణన సవివరం గా ఉంది; రథాన్ని దేంతో తయారు చేసారు? దానికి ఉపయోగించిన వస్తువులు ఏమిటి ? అన్న వర్ణన సుదీర్ఘం గా ఉంది; రథానికి పూన్చిన గుర్రాలు ఒకటి మగ గుర్రం ; మరొకటి ఆడ గుర్రం;
 
సేన తో బాటు భాజా బజంత్రీ గా వివిధ వాయిద్యాల వర్ణన ! కళ , సంగ్క, గుర్నంగ్,పుక్సుర్, తోంగ్-తోంగ్, గృత్, టేటేగ్, మగురు, గంగ్స , సౌరన్.
 
సేనావాహిని చీమల దండు లా వెళుతోందని వర్ణన !
 
ఇక ఈ మూడవ అంకం లో ఒక సులుకోన్ ! - దుర్యోధనుడు, బానువతి ఉద్యానవనం లో సేద దీరటం లా యిది, ఆ వన వర్ణన !
 
శార్దూల విక్రీడితం మళ్ళీ (మూడవ అంకం నించి).
 
 
శార్దూలవిక్రీడితము
 
ఖిల్యాన్ సంగ్కరికా తథామనరె పథ్ రేణ్యా బలే కాంచనా !
శోభాభ్రామహెనీంగ్ పవళ్ నటరికం, రుక్ ముత్య హారా రరస్
వైడూర్యామర నీలభప్రణి పగేర్ తుంజుంజ్ఞ మంతెన్ లుమెంగ్
ముంతబ్ హింతెని గాపురణ్య మచవింతెన్ సూర్యకాంత్యోజ్వలా
 
 
Suluk Pathêt Manyura Ageng
 
Kilyan sangka rika tataman arêpat ,rèhnya balé kancana ,
sobha bra mahêning pawal natar ,ikarok mutyahara araras ,
widuriya amaranila ,bapra ni pagêr tunjungnya mantên lumong ,
Muntab intên i gapuranya ,macawintên suryakantha ujwala.
 
To the west was a well-arranged garden complete with a golden pavilion; the sands in the yard, sparkling brightly, were of corals mixed with beautiful pearls; the walls of its fences were of opals and sapphires, the lotuses of luminous emeralds; the gates were inlaid with blazing diamonds, while the head-monster sculptures were of gleaming crystals.
 
Lagu Sardula Wikridita (lampha 19)
From Barata Yudha (Canto V, verse 2), a Kekawin poem in Old Javanese by mpu Sedhah and mpu Punuluh.
Circa 1157, reign of King Jayabaya Kediri.
 
 
(సశేషం)
 

Tuesday, October 18, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 2

 
మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 2


మొదటి అంకం

క ఏక అధి దశ పూర్వ ? అంటూ ఈ అంకం మొదలవు తుంది. శూన్యం నించి ఆవిర్భవించింది అంతా అంటూ మొదలయి హస్తిన వర్ణన  ఉంటుంది. విశేషం ఏమిటంటే హస్తిన కి నౌకా తీరం ఉండటం !  (జావా ద్వీపం కాబట్టి హస్తిన క్కూడా తీరం వచ్చి ఉండ వచ్చు).

దుర్యోధన, ద్రోణ, సంగ్కుని, కార్తమరామ ల మధ్య సంభాషణ - టూకీ గా - దుర్యోధనునికి వచ్చిన కలలో దేవతలు శ్రీ రాముల వారి మకుటాన్ని - వారి పరిపాలనా దక్షత సిద్దాంతాన్ని ఈ భారత కాలం లో ప్రసాదించ డానికి ఒక తపస్వి వేచి ఉన్నాడు. ఎవరికైతే అర్హత ఉన్నదో వారికది లభ్యం అవుతుందని కల. ఈ విషయమై, మిగిలిన వాళ్ళ అభిప్రాయాలని కోరడానికి దుర్యోధనుడు ద్రోణుని మొదట తన అభిప్రాయం అడుగుతాడు.

ద్రోణుడు కూడా తానూ అట్లాంటి విషయం గురించి విని ఉన్నాడని ఆనతి కాలం లో నే ఇట్లాంటి వరమివ్వడం జరుగుతుందని దానికై ఎవరికైతే అర్హత ఉన్నదో వారి కి అది లభ్యమవు తుందని అంటాడు.

అట్లాంటి వరాన్ని ఎట్లా పొందడం ఎట్లా దాన్ని కాపాడు కోవడం అని సంగ్కుని అడగటం దానికి జవాబు గా ద్రోణుడు వరమంటే ఏమిటి అని చెప్పడం తో సంగ్కుని అడుగుతాడు కౌరవుల కి దాన్ని పొందే అర్హత ఉందా అని.

దానికి సమాధానం గా ద్రోణుడు తాను విన్నది 'సంబివర' వ్యాపారులు (దేశాటనం చేస్త్తూ వ్యాపారం చేసు కునే వాళ్ళు ?) అనుకుంటున్నది చెబ్తాడు - పాండవ మధ్యముడు 'జనకుడు', తన దేశమైన (ఇలాకా ? ) మధుకర ని వీడి  ఏదో యాత్ర కి బయలు దేరాడని, జనకుడు యాత్రకి బయలు దేరితే ఖచ్చితం గా అది ఇట్లాంటి ఏదో వరం కోసమే అయ్యుంటుందని అంటాడు .

ఆ పై మరో సంభాషణ సంగ్కుని కి ద్రోణుని కి మధ్య - జనకుడు ప్రయత్నిస్తున్నాడు అంటే అది మనకు దక్కడం కష్ట మేమో అన్న సందేహానికి , ప్రయత్నం ఉంటే మానవుడు దేన్నైనా సాధించ గలుగు తాడు అంటూ ద్రోణుడు సుదీర్ఘ వివరణ ఇస్తాడు - > సూక్ష్మం గా -> కర్మ సిద్దాంతం; శరణాగతి; 

ఈ ఉద్బోధ విన్నాక దుర్యోధనుడు తను ఆ ప్రయత్నం చేస్తా నంటే, సంగ్కుని రాజకీయ చతురుడు దుర్యోధనుడు కాకుండా వేరే ఎవరైనా అర్జునుని కి సమ ఉజ్జీ వెళ్ళా లని అంటాడు ( దుర్యోధనుడు వెళ్లి పరాభవం చెందితే అది బాగోదు - రాజకీయ చతురత ).

అర్జునిని సమ ఉజ్జీ ఐన బసుకర్ణ ని పంపించాలని నిర్ణయం జరుగుతుంది.

రెండవ అంకం -

ఈ రెండవ అంకం లో కర్ణుడు దుర్యోధన సంభాషణ - దుర్యాపుర అరణ్య ప్రాంతం లో కుంతరుంగు పర్వత శ్రేణి లో శ్వేల గిరి (శ్వేత గిరి? ) ముని వాటిక లో కేశవ సిద్ధి మౌని రాముని మకుటాన్ని ఈ తరానికి చేర్చటానికి వేచి ఉన్నాడు.

కర్ణుడు వెళ్లి ఆ వరాన్ని పొంది రావాలి. కర్ణుడు తాను దుర్యోధనుడి సేవకుడనై ఆ కార్యాన్ని సాధించు కొని వస్తా నంటాడు.

ఈ మొదటి అంకం లో వచ్చిన ఒక సులుకోన్ (శ్లోకం ) -  బానువతి - దుర్యోధనులు వనం లో సేద దీరుతున్నా రన్న అర్థం లో ఉన్నది . (కథకి సులుకోన్ కి సంబంధం ఉండదు).

ఛందం - శార్దూల విక్రీడితం - సంస్కృత + పురాతన జావా కలయిక; కొన్ని పదాలు అర్థ మవుతాయి ; కొన్ని కాలేదు; చదివింది ఆంగ్లం లో ; కాబట్టి ఛందస్సు సాఫ్ట్వేర్ ని బట్టి  పరిష్కరించింది (తప్పొప్పులు ఉండ వచ్చు );

ఇది భారత యుద్ధ అన్న జావా భారత కథ - Canto V, Verse 1- (1157- CE of King Jayabaya Kediri కాలం నాటిదట ఈ భారత యుద్ధ అన్న గ్రంథం ) నించి సంగ్రహింప బడినది.


శార్దూల విక్రీడితం (లంపా 19 )

లెంగ్ లెంగ్ రమ్యనికం శశాంక కుమెనీర్మంగ్రెంఘరూమింగ్పురీ !
మంగ్కిన్ తన్ పసిరింఘ్ హలేప్ని కయుమా మస్ లిర్ మురుబ్ యింగ్లఘిత్
తేక్వన్ సర్వ మణీక్ తవింజ్ఞ సినవుంగ్సాక్షాత్సెకార్సీనుజీ
ఉంగ్యాన్ బానువతీ వనాంరె మలెగెన్ లన్ నాథ దుర్యోధనా !
 


ఆంగ్లం లో చదివినది - మీకు వేరే ఏదయినా స్ఫురిస్తే తెలియ జేయ గలరు !


Leng-leng ramya ningkang sasangka kumenyar mangrengga ruming puri
Mangkin tanpa siring halep nikang umah mas lir murub ing langit
Tekwan sarvwa manik tawingenya sinawung saksat sekar sinuji ;
Unggyan Banuwati, ywan amrem alengen, lan Nata Duryudana

Lagu Sardoola Wikridhita (lampha 19) form
From Baratayuda (canto V, verse1), a kekawin poem in Old Jawanese by mpu Sedhah and mpu Panuluh
circa 1157, era of King Jayabaya Kediri.

Meaning- The moon's enchanting radiance so enhanced the splendor of the palace, that the golden pavilion which seemed to flare into the sky was now quite beyond compare. Its walls, moreover, were formed of various jewels strung together like embroidered flowers.  It was here that Banuwati and King Duryudana lay sleeping, enraptured by love.


(సశేషం) 

Monday, October 17, 2016

మకుటా రామ ! - వయాంగ్ కులిత్ - The Legacy of Rama's Crown - భాగం - 1

 
 
మకుటా రామ ! -
 
The Legacy of Rama's Crown
 
వయాంగ్ కులిత్

ఉపోద్ఘాతం -

మన దేశం లోని తోలు బొమ్మలాట లాంటిది ఇండోనేషియా లోని వయాంగ్ కులిత్ (Wayang Kulit).

ఈ వయాంగ్ కులిత్ జావా సంస్కృతి కి సంబంధించినది. జావా, బాలీ ద్వీప సమూహం లో ఇప్పటికి బతికి న సంస్కృతికి ప్రతీక. United Nations declared this as an World Heritage to be preserved.

జావా ద్వీప జనబాహుళ్యం లో ఉన్న నమ్మిక  ప్రకారం జావా లో సంతతి పరీక్షిత్ వారసులు గా చెప్పుకోవడం కద్దు.

వీరి పురాతన భారత యుద్ధ - భారత కథ సుమారు పది/పదకొండో శతాబ్దం లో వ్రాయ బడింది. ఇది పురాతన జావా భాష లో వ్రాయ బడింది. ఈ శైలి ని కాకవిన్ అంటారు (ట!). (Ka Kawin or Ke Kawin).

ఈ వయాంగ్ కులిత్ లో ముఖ్యం గా భారత దేశపు భారత రామాయణం లో నించి వచ్చే పాత్రల తో తోలు బొమ్మలాట ఉంటుంది.

మధ్య మధ్య లో సులుకున్ (శ్లోకం ? ) అంటూ సంస్కృత, పురాతన జావా పద జాలం కలిసిన వి కనబడతాయి. (ఇవి ఛందో బద్దం గా ఉండటం విశేషం ) 

ఒక రాత్రి మొత్తం (సుమారు ఆరు గంటల పాటు ) సాగుతుందట ఈ తోలు బొమ్మ లాట.

అట్లాంటి ప్రదర్శన లో ఒకటి మకుటా రామ !.

రాముని కిరీటం  అన్న కథా వస్తువు ఆధారం గా మహా భారత కాలపు నాయకుల ను పెట్టుకుని నీతి , సంస్కృతి , మంచీ చెడ్డా చెప్పు కునే టట్లు ఉంటుంది.

ఈ ఆట లో ముఖ్య పాత్రలు

అర్జునుడు - ఇతనికున్న యితర పేరు మన భారత దేశం లో లేనిది(నాకు తెలిసినంత వరకు)   -  జనకుడు . . జ్లామ్ప్రోంగ్ ; మార్గన; పెర్మది (పెర్మది, జ్లామ్ప్రోంగ్ జావా పేర్ల లా ఉన్నాయి).

సాదేవ (సహదేవుడు); నకుల;

శకుని - సంగ్కుని అన్న పేరు తో ఉన్నాడు !

ధర్మ రాజు - పుంత దేవ అన్న పేరుతో కనబడ తాడు.

దుర్యోధనుడు - మరో పేరు - జగపితాన ; (జగత్పిత ?)

దుర్సాసన (దుశ్శాసనుడు) ; కార్తమరామ ; చిత్రాక్ష ; చిత్రాక్షి; దుర్మగతి   (కౌరవ సంతానం ) - చిత్రాక్ష, చిత్రాక్షి కవలలు (మగ వారు).

బాణోవతి -   దుర్యోధనుని భార్య భానుమతి  వీరి ప్రకారం బాణోవతి !

లెక్ష్మణవతి - లక్ష్మణ - దుర్యోధనుని కూతురు;

దుర్ణ (ద్రోణ)- ఇతర పేరులు - ద్విజ వర ; కుంభాయన ;

భీష్మ- గంగా దత్త  ;

అశ్వత్థామ ;

కర్ణుడు - యితని యితర పేర్లు - సూర్యపుత్ర; సూర్యాత్మజ ; బసు కర్ణ;

అర్జుని భార్య సుభద్ర కు వీరి ప్రకారం పేరు సెంబద్ర ; మరో పేరు లారా ఇరెంగ్ ! ; సింతవక - సెంబద్ర మగ వేషం లో మారినప్పుడు పేరు; (ఎందుకు మారింది ? కథా విషయం లో కి వెళితే తెలుస్తుంది :))

నారద  - (నారదుల వారు లేకుంటే కథ ఎట్లా మరి !)

భీమసేనుడు; ఇతని యితర పేరులు - భ్రాతసేన ; ఆర్యసేన;

మహంబీర ! - గరుడుడు ( గరుడ లేకుంటే మరి ఇండోనేషియా ఎట్లా ! ) ;


క్రేస్న - కృష్ణ - హరిమూర్తి ;

ఈ తోలు బొమ్మ లాట లో రామాయణ కాలానికి చెందిన వాళ్ళూ కనడతారు -

విభీషణుడు- మరో పేరు గుణవాన్ ;

విభీషణుడి కొడుకు - భీషవర్ణ ;

కుంభకర్ణుడు ; అతని భార్య కిశ్వణి ! (కుంభకర్ణుడి భార్య పేరు మొదటి సారి వినడం!) ;

అనోమోన్ - హనుమాన్ - మన హనుమంతుల వారు .

వాయు సంతానం గా, హనుమాన్ వారితో బాటు జాజల్వ్రేక (అసురుడు) ; కువర - పాము; సితుబంద - ఏనుగు;


కేశవసిద్ధి - తపస్వి - రామ మకుటాన్ని భారత కాలం లో వారికి అంద జేయ డానికి వేచి ఉన్న  తపస్వి.

లింబుక , చంగిక - వీళ్ళు కామెడి ట్రాక్ - లంబూ జంబూ లాగా అన్న మాట ! (మాయా బజార్ గుర్తొస్తుందా? )

సరే కథాక్రమం బెట్టిదన !

(సశేషం!)

Thursday, October 13, 2016

కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)


 
 
 
కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
అరచూపు! వాలుచూపు బె
దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
బి రుసరుస చూపు తా కను
లెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
చీర్స్
జిలేబి
 






Saturday, October 8, 2016

సరస్వతీ నమస్తుభ్యం !

 
సరస్వతీ నమస్తుభ్యం !
 
 

చిత్రం - శ్రీ కేశవ్ - ది హిందూ దినపత్రిక కార్టూనిస్ట్
 
 
పలుకుల తల్లి ! మినుకుగొ
మ్మ!లచ్చి కోడలు ! జిలేబి మాటలబోటీ !
నిలచితి వమ్మ ! జనులమన
ముల మేలగు రీతిగాను ముంగటి రమణీ !
 
జిలేబి


Friday, October 7, 2016

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !


విజయ దశమి శుభాకాంక్షలతో


చిత్రం - శ్రీ కేశవ్ - హిందూ దినపత్రిక కార్టూనిస్ట్

జిలేబి

Wednesday, October 5, 2016

వై నాటీజ్ మై క్వొశ్చెన్ !

 
 
వైనాటీజ్ మై క్వొశ్చెన్ !


పుల్లెల శ్యామ్ గారి మణిప్రవాళ కందం
ఆంధ్రామృతం బ్లాగు లో చదివాక !


శ్యామ్ గారి కందం :-

ఐ నో సమాఫ్ద పీపుల్
మే నాటెంజాయ్ ద తెలుగు మీటరినింగ్లీష్
వై నాటీజ్ మై క్వొశ్చెన్
హౌ నై సీజ్ దట్ రిథం యిననదర్ లాంగ్వేజ్ !


జిలేబి సరదా జవాబు :)


వైనా టీజ్ దై క్వొశ్చెన్ !
ఐనో బట్యిఫయిటెల్యు ఐవిల్ బీస్మాష్డ్ :) 
ఫైనర్ దస్కిల్ గోస్ సర్ 
ఫైనర్ వి బికం ద తెలుగు ఫైర్బ్రాండ్ దట్జ్ వై :)

చీర్స్
జిలేబి
(వెరీ నాటీ :)

Saturday, October 1, 2016

ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !


ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !
 

ఫోటో : కర్టసీ : ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్
 
సర్జిక లాప్రేషన్లన్
గర్జించెను, భరతదేశ ఘనతయు గూడన్
తర్జని జూపగ నార్మీ,
ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !
 
 
 
చీర్స్
జిలేబి  

Wednesday, September 28, 2016

పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !


పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
 
తరచూ హరి తానొక్కటి
ని రమించుచు కోరుచు కమనీయంబుగన
న్నరసియు సొలసియు వేరొక
పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
చీర్స్
జిలేబి

Tuesday, September 27, 2016

శరముల సారింతునోయి సమరసము గనన్ !


గీతోపదేశం !

 
Painting - Courtesy- Shri Keshav of The Hindu Fame
 
ముందు:
 
హరివిల్లువలె మనమ్ము స
మరసము గానవలెనుగద !  మైత్రీం భజరే !
గరళంబు కత్తికట్టుట!
శరముల సారింపగ హృది సరియన లేదే !
 
తరువాయి :
 
హరి! విల్లువలె మనమ్ము ను
సరి జేసెదనోయి మేలు  సఖుడా ! కృష్ణా !
గరళం బైనన్ త్రాగెద ! 
శరముల సారింతునోయి సమరసము గనన్
 
 
 
శుభోదయం
జిలేబి

Sunday, September 11, 2016

సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !


సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
రుజుమాటల నాడుచు చ
ట్టు జబ్బలను బట్టి వెనుక టుప్పని బేల్చున్
:)
నిజమును పలుకగ తగదూ !
సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
శుభోదయం
జిలేబి

Monday, September 5, 2016

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !





న్యూస్ కర్టసీ  :_ ఈనాడు న్యూస్  "మింటిన" వారు  - సిరిలేనివాసు :)

ముంబయి: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల పదార్థాలు ఉపయోగించి వినూత్నంగా బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. మట్టి, బియ్యం, చాక్‌పీస్‌, ఛాక్లెట్‌లు ఇలా రకరకాల వాటితో చేసినవి చూస్తూనే ఉంటాం. కాని ముంబయికి చెందిన కొందరు కళాకారులు జిలేబీల గణపయ్యను తయారు చేశారు. పసుపు రంగులో ఉన్న ఈ జిలేబీల గణనాథుడు సందర్శకులను తెగ ఆకట్టుకుంటుంది. సోమవారం వినాయకచవితి సందర్భంగా ముంబయిలోని ఓ వీధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.


బ్లాగ్ వీక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !

వార్తా ప్రదాత శ్రీ సిరిలేని వాసుల వారికి నెనర్లు !


గణపతి జిలేబి బప్పా !
ననుదినము కొలుతుము మంచి నడతయు గనగన్
వినుమా విన్నప మిదియే !
జనులందరిని గనవయ్య చక్కగ నీవే !



శుభోదయం
జిలేబి 

Wednesday, August 31, 2016

అత్యధిక ఆశావహ రాష్ట్రం గా తెలంగాణ - చీర్స్ !

అత్యధిక ఆశావహ రాష్ట్రం గా తెలంగాణ - చీర్స్ !

 
అత్యధికాశావహ రా
ష్ట్రాద్యాత్ప్రథమ తెలగాణ షాన్దారు బడసెన్ !
విద్యా వైద్యంబైటీ
సద్యో జాతపు జిలేబి సాధన గనుమా !
 
త్రీ చీర్స్ టు తెలంగాణా !
 
జిలేబి  
 

Monday, August 29, 2016

The Mathematics of కందం !

The Mathematics of కందం !

ఈ మధ్య  "A Beautiful Question" (Finding Nature's Deep Design- by Frank Wilczek-winner of the nobel prize in Physics) పుస్తకం చదువుతూంటే ఔరా ప్రకృతి గణిత మయం మాయం అనిపించే సింది !




ఈ మధ్య ముప్పావు సంవత్సరం పాటు ఊపులో శంకరాభారణ బ్లాగు లో చేస్తున్న సవారి , నేర్చుకుంటున్న (అనుకుంటున్నా :) వి, ఆ పై గురుళ్ళ సైడు కిక్కులు, (అకటా వికటాలు :) , అనానిమస్సు ల చీవాట్లు, చింపిరి హవా జుట్లు  , దాంతో బ్లాగు లోకం లో 'గండర' గోళం మీద పడి రచ్చ చేయటం అన్నింటి మధ్యా నెవర్ గివ్ అప్ జిలేబి అనుకుంటూ ఈ కంద పద్యం తెలుగు లో ఎందు కంత పాప్యులర్ అయిపోయిందబ్బా అని ఒకింత దాంతో తలే ఉంగలీ దబాయించ కుండా ఉండక పోయా !


పై పుస్తకం చదువుతూంటే కందం లో ని మేథమేటిక్స్ దీనికి కారణ మయి ఉంటుందే మో అనిపించింది.

ఛందస్సు లో గణితం తప్పక ఉంది. (మూలం లోకి వెళితే ) కందం కూడా అందులో భాగమే  ; కాని దీనికి గలిగినంత ప్రాముఖ్యత మిగిలిన వాటికి లేక పోవడం అనడం కన్నా ఇందులో ఉన్న సౌలభ్యం మిగిలిన వాటి లో లేక పోవడం ( ఆటవెలది, తేట గీతి కి ఉన్న సౌలభ్యం వదిలేస్తే ) మూల కారణం అరవై నాలుగు అన్న మేజిక్ నంబర్ అనుకున్నా !

గురు లఘు మాత్రలు మొత్తం వెరసి కందం లో అరవై నాలుగు . ఈ అరవై నాలుగు మధురగతి రగడ లో కూడా కనిపిస్తుంది. అయినా కందం టాప్స్ అండ్ రాక్స్ :)

మొదటి, మూడవ పాదం లో పన్నెండు మాత్రలు , రెండు నాల్గవ పాదం లో ఇరవై మాత్రలు మొత్తం కలిపి 12+20+12+20 = 64.

ఈ పన్నెండు ఇరవై కి 3:5 నిష్పత్తి మరో విశేషం ( సమత లేక పోవడం );

మధుర గతి రగడ లో అయితే సమతుల్యత దీనికన్నా ఎక్కువ ప్రతి పాదం లోనూ 16 ! అయినా దానికి ఇంత ప్రాచుర్యం లేదు !

ఈ అరవై నాలుగు ఒక మేజిక్ సంఖ్యే ! అరవై నాలుగు కళలు అంటాం ;

కందం లో ఉన్న not so even distribution (12,20) కూడా ఈ ప్రాముఖ్యత కి కారణం అయ్యుంటుందేమో మరి !

ఆ పై ఈ అరవై నాలుగు మాత్రలకి కొంత యతి ప్రాస కలిపి, ఆ పై జగణం పొజిషన్ ఖచ్చితం గా ఎక్కడ ఉండాలో చెప్పటం లాంటి నిర్దుష్టత తో  పటిష్టం చేయటం  (మధుర గతి రగడ లో దీనికన్నా ఇంకొంచెం పటిష్టత ఎక్కవే - అంత్యానుప్రాస కూడా ఉంది ) దీనికి సొబగు దక్కినట్టుంది !

మొత్తం మీద నాటి చందోకారుల మేథస్సు తీక్షణత కి యిది ప్రతీక అనుకోవచ్చు. కందం పొందిక దీనికి ఉదాహరణ !

సో నేటి కందం కందం :)

అరుబది నాల్గు కళలవలె
అరుబది నాల్గనగ మాత్ర లా కందంబూ !
పరిపరి విధముగ పదముల
సరితూకంబు గణితంబు చక్కగ కలిసెన్!



ముప్పది రెండుకు రెండుగ
నొప్పిన కందము జిలేబి నొకపరి గనుమా
అబ్బురమగు పదబంధము
అప్పటి కవుల గణితంబు అద్భుతము గదా !

చీర్స్
జిలేబి

Saturday, August 27, 2016

భాగ్య దా లక్ష్మీ బారమ్మా !

భాగ్య దా లక్ష్మీ బారమ్మా !

క్రితం రోజు వేణువు గారు సరి కొత్త గాయని (Young Budding Upcoming Artist) సూర్య గాయత్రి ని పరిచయం చేసారు.

అద్భుతః అనుకోకుండా ఉండ లేక పోయా !

అంత చిన్ని వయసులో ఆ స్వర మాధుర్యం అమోఘం ! (పదకొండు పన్నెండు సంవత్సారాల ప్రాయం ? ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ! కేరళ అమ్మాయి . తండ్రి మృదంగ విద్వాంసుడు ; తల్లి గృహిణి. వడకర ఉత్తర కేరళ రాష్ట్రం నివాసం !

ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అన్న సోషియల్ మీడియా థీం తో వెలుగు లోకి వచ్చిన మరో ఆణి ముత్యం .

మరో ఎం ఎస్ దేశానికి వస్తున్నారా ? ప్రకృతి ప్రసాదించిన వరమా మన దేశానికి అన్నట్టున్న స్వరం.

ఈ అమ్మాయి పాట భాగ్యదా లక్ష్మీ బారమ్మా !



త్రీ చీర్స్ టు సూర్య గాయత్రి అండ్ వారి గురువు గారు కులదీప్ పాయ్ గారికి
 
చీర్స్
జిలేబి

 

Thursday, August 25, 2016

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు !

 
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు !  





చిత్రం : కర్టసీ - కేశవ్ ఆఫ్ అవర్ హిందూ ఫేమ్ !
 
 
కృష్ణం వందే జగద్గురుమ్ !

అమవసి శశివదన ! మురా
రి మహిని భవహరముగ నొనరించిన వనమా
లి! మరిమరి కొలుతు మయ్యా
సుమగురు ద్రఢిమను గనంగ శుభముల బడయన్

జిలేబి
 

Friday, August 19, 2016

కారాగారపు టపాలు కనకన మనవోయ్ !



కారాగారపు టపాలు కనకన మనవోయ్ !


పారా హుషారు సారూ
కారాగారపు టపాలు కనకన మనవోయ్ !
వీరావేశము వలదోయ్
బారా తలుపులు తెరువుము  బాగుగ మనవోయ్ !



చీర్స్
జిలేబి
 

Wednesday, August 17, 2016

శ్మశాన వాటిక లో జిలేబి


శ్మశాన వాటిక లో జిలేబి



ఫోటో కర్టసీ : ది హిందూ దినపత్రిక - 16 ఆగస్ట్ 2016

నిన్న మా హిందూ వారు తమిళ నాడు ఎడిషన్ లో ఒక ముఖ్యమైన సమాజం లో మార్పు గాన వచ్చు రీతి లో ని ఒక వార్త ను ప్రచురించారు .

తమిళ నాడు ప్రభుత్వం ఒక జిలేబి కి కల్పనా చావ్లా అవార్డు బహుకరించింది . కారణం ?

శ్మశాన వాటిక శివుని కే సొత్తు. మహిళలు అక్కడికి వెళ్ళడం లో నూ (ఆఖరికి అందరూ అక్కడి కే వెళ్ళినా ) సమాజ పరమైన నిషేధాలు ఉన్నాయి .

అయినా వాటి నన్నిటిని అధిగమించి ఒక జయంతి (ఈవిడా జగణమే - జిలేబి లా :)
శ్మశాన వాటిక కేర్ టేకర్ రూపం లో ఉద్యోగ బాధ్యత లను తీసు కోవడానికి పూనుకొంది.

జేజేలు .

గగనానికి ఎగిరినా ఆఖరుకి శ్మశానానికి గూడా వెరవమంటూ శ్మశాన వాటిక లో ఇంచార్జ్ గా ఈ జయంతి ఉద్యోగం లో చేరడానికి కారణ మైన విషయం ఏమిటి ?

ఆవిడ, ఆవిడ సోదరి యిద్దరూ ఆడువారు. తండ్రి చని పోయినప్పుడు దహన కార్య క్రమాలకి ఆవిడ తన కజిన్స్ మీద ఆధార పడ వలసి వచ్చింది, ఇబ్బందుల నెదురు కోవాల్సి వచ్చింది. 

అందులో నించి పుట్టినదీ జాగృతి ఆలోచనా స్రవంతి .

ఆ జిలేబి కి శుభాకాంక్షల తో !

ఫోటో కర్టసీ మా హిందూ వారు.

పూర్తి నిడివి వ్యాసం  లింకు


చీర్స్ టు జయంతి
జిలేబి

Friday, August 12, 2016

ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక ! జిలేబీయం

ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !

గురుడు కన్యారాశి లో ప్రవేశిస్తున్న ఈ శుభ దినాన బ్లాగు లోకపు వారి సౌలభ్యం కోసం ప్రైవేట్ అయిన బ్లాగు నించి కష్టే ఫలే వారి టపాలు జిలేబి బ్లాగు ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో ధారా వాహిక గా రాబోతోందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నా !

తెలుగు వారి పంచ దశ లోకమనబడు ఈ బ్లాగు లోకం లో కష్టే ఫలే వారి ని వారి టపా మాధుర్యాన్ని తెలియని వాళ్ళు ఉండరని అంటే అతి శయోక్తి కాదు; కాని ఈ మధ్య వారి బ్లాగు సెలెక్టివ్ ఇంటలిజెంషియా వారికి మాత్రమె పరిమిత మై పోవడం తో వారి టపాలని తెలుగు వాళ్ళందరూ చదవడానికి సౌకర్యం లేకుండా పోయింది (ముఖ్యం గా జిలేబి చదవడానికి :))

కాబట్టి వారి టపా మాధుర్యాన్ని గూగల్ సెర్చ్ లో మళ్ళీ కనబడేలా చేయడానికి ఈ పునర్బ్లాగీకరణం చేయడం జరుగుతోంది; వారి పేరు మీదనే ఈ టపాలన్నీ ప్రచురించ బడతాయి  ;

అందరికి ఉపయోగ పడుతందని ఆశిస్తో !

మొదటి టపా కై ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో వచ్చిన టపా !


— శర్మ కాలక్షేపం కబుర్లు—
Posted on సెప్టెంబర్ 23, 2011 

గురు, దైవ వందనం

 కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు.
అడుక్కునైనా చదువుకోమన్న శ్రీ దేవరభట్ల రామా రావు గారికి నమస్కారాలు. శ్రీ. చెఱుకుపల్లి హనుమత్ కవిరాట్ లక్ష్మణశాస్త్రిగారికి, జోస్యుల వేకట నరసింహంగారికి, సమయపాలన నేర్పిన వర్రె అప్పలరాజు మాస్టరికి, తెలుగు మాస్టారు సుబ్రహ్మణ్యంగారికి, జాన్ మాస్టారికి వందనములు.

నేటి కాలంలో బోధగురువులు శ్రీచాగంటి కోటేశ్వర రావుగారికి నమస్కారం. తెలుగు వ్రాయడానికి తన బ్లాగు ద్వారా సహకారం అందించిన శ్రీభైరవభట్ల కామేశ్వర రావు గారికి నమస్కారం. నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా వ్రాయడం వచ్చినంతనే బ్లాగు వ్రాయమని ప్రొత్సహించిన భమిడిపాటి ఫణిబాబుగారికి వందనం. ఏందరో మహానుభావులు అందరికీ వందనం.

పూర్తి గా చదవడానికి రాబోవు టపాలు చదవడానికి ఈ లింకు నొక్కవలె


శుభోదయం
జిలేబి