Tuesday, January 12, 2016

ఏమండీ జిలేబి గారండీ ! చెప్పన్రీ బీ లేజీ :)

ఏమండీ జిలేబి గారండీ ! చెప్పన్రీ బీలేజి  :)

ఏమండీ జిలేబి గారు బాగున్నారా !

కంప్యూటర్ లో తలపెట్టేసి గురు లఘువుల తో కుస్తీ పడేస్తో , గ్రామ్య మైన పదాలకి గ్రాంధిక పదా లేమిటబ్బా అని పెర్ముటేషణ్ కాంబినేషన్ లతో "రగడ" వేసేసు కుంటూ గురువు ఘూటం కొడితే లఘువు లెస్ అయి పోయే, లఘువు లాగిస్తే గురువు గుర్రం ఎక్కే లా ఉన్న పదాల్ని కూడికలు తీసి వేతలు "భాగ" హారాలు సమా హారాలు, సమోసాలు చేసేసు కుంటూన్న జిలేబి ఉలిక్కి పడింది ;

అయోమయం గా తలెత్తి తనని ఎవరు అంత రెస్పెక్ట్ తో అండీ అన్నారు అని జూసింది :)

అదే అయోమయం లో ఎదురుగా బీ లేజీ  కనిపించే ఎదురుగా !

చెప్పన్రీ అనే జిలేబి !

ఏమండీ జిలేబి ! ఏమిటంత సీరియస్ గా అండీ బ్లాగులో నండీ లెక్కలు పెట్టేసు కుంటున్నా రండీ ?

అదేన్రీ బీ లేజీ  ఈ మధ్య మరీ  గౌరవం ఇచ్చేస్తున్రీ ? జనరల్ గా ఏమోయ్ అనే గదా పిలుస్తున్రీ ? అడిగింది జిలేబి

బీ లేజీ తల గోక్కునే  !

ఏమండీ ! మీరే కదా అన్నీ అండీ అనాలని చెప్పారండీ ?

నేను ఎప్పడు చెప్పిండు ?

బీ లేజీ వెర్రి ముఖం పెట్టే! 

చూడండ్రీ ! ఈ వెధవ లెక్కల్ తేలట్లే తెమలట్లే !

ఏమండీ ? ఏ లెక్ఖలండీ ?

ఇవన్రీ

ఏవండీ ?

ఇవన్రీ అంటూంటే !

ఓ ?

ఔ మల్లా :)

కాదండీ ఇంతకీ జిలేబి గారండీ ....

అబ్బబ్బా ! బీ లేజీ  ఇంతకు మించి ఏం జెప్పన్రీ ;

మధ్య లో సినబ్బ ఉండ్లా ! వాడు వచ్చూడ్సి నాడు !

వాడు పూడ్శే అమ్మగారో !

ఎవడ్రా ?

ఆ ఏబ్రాసి గాడే !

యాడికి ?

మన నాయని ఉండ్లా యాడికే

ఎందుకో ?

వాడి పెండ్లాం గాడ సదువు చెప్పించు కుంటాందట ! సర్లే గా సినబ్బా నే నాడికే పోతా ! పెండ్లాం ని తోల్కొని ఇంటి గాడి కి బోతా అన్నాడు వోడు ;

తత్ సమయే  భారవి ఆగంతః !

జిలేబి త్వాం కిం కరోతి ?
స్వకపోలాయాం భట్టేయం కరోతి వా
నా అన్య పరిమాణానాం తరూణాం ఫలం ఇచ్చంతీ ?

వసూని వాంచన్న వశీ న మన్యునా
స్వధర్మ ఇత్యేవ నివృత్తి కారణః
గురూపదిష్టేన రిపౌ సుతేపి వా
నిహంతి దండేన స ధర్మసంప్లవం !

అంతా విని బుర్ర గోక్కుంది మళ్ళీ ఈ మారు జిలేబి :)

గురువు లఘువు ల కాంబినేషన్ మీద మళ్ళీ పడి పోతూ , అబ్బబ్బా మరీ ఇంత శుద్ధ మొద్దు అయిపోతున్నా నె సుమీ అనుకుంటూ :)


శుభోదయం :)

చీర్స్
జిలేబి

6 comments:

  1. అయిదు గుంజీలు, పదహారు లెంప దెబ్బలు

    ReplyDelete
    Replies

    1. వామ్మో వామ్మో !

      అయిదు గుంజీలే ! ఇంత భారీ కాయం తో కుదరదు గాక కుదరదు సామే !

      జిలేబి

      Delete
  2. నాకు తెల్వక అడుగుత ఇయ్యాల ఆమ్మకు ఏమయిందో ఏమో ఇట్ల రంది పడ్తాంది!

    బాసలు యాసలు అనేటటువంటివి పట్టుకొని ఆగం కావొద్దు. మన నడుమింట మంది వెతల కతలతొ రామ గోసలు ఎన్నో పడుతుండంగ గివ్వీటివి కావాల్నా?

    ReplyDelete
    Replies
    1. ఓ లమ్మో !

      ఇదేమి బాస రా సామీ ఒక్క "ముక్కా"అర్థం గాలే ! :)

      జిలేబి

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. గా పోర డంతే!తెలుంగు లో బుడుంగు.ఉర్దూ తో ఫిదా,ఇంగ్లీష్ కే ఫ్రెండ్షిప్:-)

      Delete