Monday, January 18, 2016

జిలేబి బ్రాండ్ - రభసోత్సవం :)

జిలేబి బ్రాండ్ - రభసోత్సవం :)


ఈ మధ్య పంచ దశ లోకం లో పద్య లోకం లో పడి జిలేబి ట్రెండ్  మరీ రభస అయి పోయింది !

ఏది జూసిన ఒకటి రెండు మూడు అని గణిస్తూ ఉండటం పరి పాటి అయి పోయింది !

కాబట్టి సరదా గా "శారద" అనుమతి తో !

జిలేబి బ్రాండ్ రభసోత్సవం - అనగా ర ,భ స గణాల తో రగడ లాడటం  ఎట్లా  అన్న మాట :)

జిలేబి ట్రెండ్ కాబట్టి  ఏది గెలికి నా అది అరవై శాతం పై బడి 'రగడ' కేటగిరీ లో చేరి పోతోంది !

పూర్వ జన్మ ప్రారబ్ధం అనుకుంటా ! జేకే !

ఇక ర, భ స గురించి

ర గణం - గురువు లఘువు గురువు   -  U | U   
భ గణం - గురువు లఘువు లఘువు -   U | |
స గణం - లఘువు లఘువు గురువు  -   | | U

దీన్ని సులభం గా గురువు ఆదియు అంతము - రగణము ఉదా: శ్రీరమా - ఐదు మాత్రలు
                          గురువు ఆది భగణము   - ఉదా :- శ్రీరమ - నాలుగు మాత్రలు
                           గురువు అంతము స గణము - ఉదా: రమణా  - నాలుగు మాత్రలు
                          మొత్తం వెరసి పదమూడు మాత్రలు మరీ బేసి గా ఉంది :)

శ్రీరమా శ్రీరమ రమణా

(గురువు గారిని లెఫ్ట్ రైట్,  లెఫ్ట్,  రైట్ కొట్టించ డమని అనుకుంటే కూడా అనుకోవచ్చు ! జేకే )

మొదట సింపుల్ గా ర భ స  తో చూద్దాం (ఇది చాలా తేలిక ! ర భ స రిపీట్ నాలుగు మార్లు !)

శ్రీరమా శ్రీరమ రమణా
మాటయే సీతకు జెపితీ 
వేగమే వారధి గనుమా
లంకయే బోవలె వినుమా  !


ఇప్పుడు ర భ స లని అవి మారుతూ వస్తోంటే ఎట్లా వ్రాయొచ్చు ?

ర భ స  భ స ర  స ర భ ర భ స

దీన్నే నాలుగు పాదాలు రిపీట్ చేస్తే చాలు

ర భ స
భ స ర
స ర భ
ర  భ స

శ్రీరమా శ్రీరమ రమణా
సీతయు జతతో   వేగమే 
కావుమా  శ్రీపతీ  వేడెద
నీవుమా  రాముడు గదరా!


జస్ట్ ర భ స తో చేసే పదము హరిణ గతి వోలె ఉండు :)

కాని ర భ స ల ని మారుస్తూ చేస్తున్నది జిలేబి రగడ ! ఇది జిలేబి రగడ రభసోత్సవం :) 

శుభోదయం
చీర్స్
జిలేబి

జిలేబి "రభస" ఉత్సవం - హరిణ గతి రగడ మార్పుల తో :)  

 • జాతి(రగడలు) రకానికి చెందినది
 • 4 పాదములు ఉండును.
 •  తొమ్మిది నుండి పదమూడు అక్షరములు ఉండును
 • ప్రతి పాదమునందు ర భ స గణము లుండును  ప్రతి పాదము నందు క్రమము మారుచూ వరుస గ వచ్చును
 • ఉదాహరణ  = ర భ స ; భ స ర ; స ర భ ; ర భ స 
 • 8 comments:

  1. రభసోత్సవ శుభాకాంక్షలు ...

   మీరు కోరుకున్నట్లుగా
   మీ రభసోత్సవం ఓ నూరు రభసలతో
   నూటొక్క రకాల రసాభాసలుగా
   ముక్కలు చెక్కలవ్వాలని
   మీ ఆప్తుడిగా నా దురాశ ...

   వరదా వరదా వరదా
   నారదా నారదా నారదా
   వినదా వినదా వినదా
   శరభా శరభా శరభా

   (సరదా సరదా సరదా ...)

   ReplyDelete
  2. హతవిధీ ! మరీ యింత దురాశ తగదు
   గురుని మించిన రభస లాగుంది , కాని
   పంగనామాలు గురుడికి పాటి గాదు
   లఘువు గురుమధ్యలోకెక్కి లాగరాదు .

   ReplyDelete
   Replies
   1. గురువు కే పంగనామాలు నేటి పోకడ జరుగుతునదే అది

    Delete
   2. లఘువు గా చెప్పారు గురువు గారూ ...
    అన్నీ రభస పోకడలేనంటారా !!

    ((లఘువుగా : తిన్నగా (ఆంధ్రభారతి) )
    :-)

    Delete
   3. @ sarma garu ...

    "గురువు లఘువుగాడు
    లఘువు గురువెట్లౌను?
    గురువు కి నమస్కారమె
    గురువు లఘువుజేయు" ...

    (శర్మ గారు క్షమించగలరు అనుమతి
    లేకుండా ఉటంకించి నందులకు గాను)

    Delete
   4. గురువెన్నడు గురువే! లఘువెటులౌను?
    గురువును లఘువు జేయబూన రాదు.
    గురువు లఘువుజేయబూనిన నది
    గురు లక్షణమెట్లౌను వసుమతీశ

    గురువుకు నమస్కారమే
    గాని మస్కారము గూడనిదే

    Delete

   5. బండి రావు గారు,

    కామింట్ల తో మము సంతోష పరిచితిరి ! గావున మీకోసం మరో ర భ స సహా శేభాషు :)

    బండిరావూ గనుడు మరో
    వాలము ఇదియే జూడు మా
    రవళీ గోల భోపాళము
    భేషుగా గావును నిజమూ

    చీర్స్
    జిలేబి

    Delete
   6. తిక మక మక తిక అనెనూ
    స సరిగ బావురుమనెనూ
    చుక్కలు తలపై కనపడెనూ
    చిక్కులు కనుకో మనెనూ ...
    (మొక్కులు వినుకోమనెనూ)

    వామ్మో మల్ల మొల్ల గారితో పెట్టుకో
    గూడదనుచు నిపుడిపుడే తెలిసెనూ ...
    (భోపాళ పద్యంతో కొడతారనుకోలేదు స్మీ)
    :-)

    Delete