Friday, January 22, 2016

నడి రేయి నగరాజు బండి

నడి రేయి నగరాజు బండి
 
నగరం లో పురాన్ని విడిచి
స్వంతింటికి దారి పట్టా  
అలజడి ఉన్నా నిర్భయం గా
అక్కడి  మహామహుల
నెదురు కోడానికి కలవడానికి
 
నడిరేయి నగరాజు బండి
పట్టా సుదూరదేశాలకు
నా స్వప్నం సర్వస్వం
హస్త పేటిక న మూట గట్టి
 
ద్వారబంధం తెంచుకు
ఆకసానికి ఎగిరాను
నామది పిలుపు  
నాది గా అనాదిగా 
 
నడిరేయి గంట గణగణన
టంచను బండి నెక్కా
ఆలోచిస్తో స్వప్న జగత్తు
నక్షత్ర పుర వీధి లోనికి  
 
ఎవరూ ప్రయత్నించని  మార్గం
నాదైనది సుగమ్యం గాకున్నా
స్వప్నం సొగసుగ సాక్షాత్కరిస్తే  
మరి స్వప్నానికి విలువేది ?
 
నా విఫలాలే నా యెద 
ప్రతీక నా కలికితురాయి
 
నడిరేయి నగరాజు బండి
నన్ను సాగనీ నీతోడు
నేనెరుగని సుదూర తీరాలకు
నీవే చూపించు మార్గం  
నను గమ్యానికి జేర్చు నీవే
 
శుభోదయం
జిలేబి

2 comments:

  1. నా విఫలాలే నా యెద
    ప్రతీక నా కలికితురాయి - ? ? @#*&

    ReplyDelete

  2. జీ కె కె గారు,

    నెనర్లు

    నా విఫలాలె నాయెద (యొక్క) ప్రతీక ; అవే నా యెదకు ప్రతీక అన్న అర్థం లో వాడా మండీ !

    మీరు కామింటినందులకు నెనర్లు !

    జిలేబి

    ReplyDelete