Sunday, January 3, 2016

విద్యున్మాలా జిలేబీయం !


విద్యున్మాలా జిలేబీయం !

జిలేబి ఒక విద్యుత్ (విద్వత్ కాదు :) జేకే !) తీగ !

ముట్టుకుంటే షాకు ఇచ్చును !

అదియు ఓవర్  కాలిన డోస్ "దోస" (దోష :)) షాక్ ఇచ్చును :)

అట్లాంటి షాకు షోకుల తో జిలేబి కాలం వెళ్ళ బుచ్చుతూ అయ్యరు గారి చలువ వల్ల కాలం నెట్టు కుంటూ వస్తోంది !

తన సోకు తన షాకు తనకు తెలియక పోయే :)

ఏమి చేదాము !

నేటి టపా విద్యున్మాలా జిలేబియం !

గురువు శ్యామలీయం వారు (వారు మన 'స్తాపాలతో' పోవోయ్ అన్నా అది వారి కెంపు కాబట్టి మా కింపు సో గురువులు గురువులే ఎల్లప్పుడూ ) విద్యున్మాల  మీద టపా పెట్టేరు !

సో ఫాలో ఆన్ జీవ్స్ స్టైల్ లో జిలేబి ఒక విద్యున్మాల వేసేసింది అచట !

వారు చెప్పినారు పోవోయ్ జిలేబి నేను వేయను నీ  కామింటుల్ నిన్ను బర్తరఫ్ జేసేసినా అని  నీ 'దుషట కెవ్వు మింటులు నచ్చలేదు సుమీ నాకు అని  :)

సో మనకు మనమే ఒక టపా కట్టి వేద్దారి !


విద్యున్మాలా (విద్యుల్లేఖా)
 
విద్యున్మాలా పద్య లక్షణములు
 1. ఈ పద్య ఛందస్సుకే విద్యుల్లేఖా  అనే ఇతర నామము కూడా కలదు.
 2. వృత్తం రకానికి చెందినది
 3. అనుష్టుప్పు ఛందమునకు చెందిన 1 వ వృత్తము.
 4. 8 అక్షరములు ఉండును.
 5. 16 మాత్రలు ఉండును.
 6. మాత్రా శ్రేణి: U U U - U U U - U U
  • చతుర్మాత్రా శ్రేణి: U U - U U - U U - U U
  • షణ్మాత్రా శ్రేణి: U U U - U U U - U U
 7. 4 పాదములు ఉండును.
 8. ప్రాస నియమం కలదు
 9. ప్రతి పాదమునందు 5 వ అక్షరము యతి స్థానము
 10. ప్రతి పాదమునందు మ , మ , గా(గగ) గణములుండును.


==========

విద్యున్మాలా జిలేబీయం !
 
రామా సీతారామా జూచీ
నా మా తల్లీ  నా  మోమూగా
నీ మాటేగా   నీ అంగూళీ 
యా మా సీతాయమ్మాకిచ్చీ 
 
 
కొస తునక :)
 
జిలేబి కొస తునక వేయ కుంటే బాగోదు :)
 
ఈ ఛందం వ్రాస్తా ఉంటె మన ఎల్లారీశ్వరి గారి పాత పాట ఒకటి గుర్తు కొచ్చింది; కొద్ది గ తరచి జూస్తే అదియునూ విద్యున్మాల లా అగుపించే :) (కాకుంటే నాకు తెలీదు :)
 
 
లేలే లేలే లేనా రాజా
లేలే లేలే లేనా రాజా
రారా రారా రానా రాజా 
రారా రారా రానా రాజా 
 
 
శుభోదయం
జిలేబి   

5 comments:

 1. తవికలే తవికలు (TIE) :)

  ReplyDelete
 2. సీతమ్మవారిమీద ఒక చెడ్డపోస్ట్ టైటిల్ పెట్టినందుకు నాకు నేనే ఒక సంవత్సరం పాటు బ్లాగులకు రాకుండా శిక్షవేసుకున్నాను. మీకు మీ గురువుగారు వేశారు. ప్రతి చెడ్డపనికీ ఒక శిక్ష ఉండాలి అని బలంగా కోరుకుంటాను. ఎవరూ శిక్ష వేయకపోతే ప్రకృతి తప్పకుండా వేస్తుంది. ఎవరూ శిక్ష నించి తప్పించుకోలేరు. బ్లాగుల్లో మంచివాతావరణం ఉండాలని కోరుకునేవారిలో మీరు కూడా ఉన్నారని నాకు తెలుసు. ఆ శిక్షని కూడా ఆనందంగా స్వీకరించండి. తన బ్లాగుకి రావద్దాన్నారు కానీ మీ బ్లాగులో మీరు పెట్టిన పోస్ట్ ఉందికదా ? (కామెంటులకు టపాలు అద్దెకివ్వబడును) దానిలో వ్రాయండి. మీ టపా మీకు అక్కరకొచ్చింది కూడానూ....ఏమంటారు ?

  ReplyDelete
  Replies
  1. దుషట చతుషటయము :)

   యే యథా మాం కామింట్యతే తాం తదైవ ....

   జేకే !

   చీర్స్
   జిలేబి

   Delete
 3. హామీ ఉందా అంతేవాసం
  బేమా భాగ్యం బెంతో సౌఖ్యం
  క్షేమస్తోమం శిష్యం కృత్యం
  బేమాత్రంబూ ఏమర్వొద్దూ

  ReplyDelete
  Replies

  1. లక్కాకుల వారు - నమో నమః !

   మామా నీవే మాతో రావా
   వామా భాగే వాణీ రావే
   జామూ నీదే జాణా నేనే
   భామా నీవే భాగం నాలో

   చీర్స్
   జిలేబి

   Delete