Tuesday, January 5, 2016

జిలేబి వదన - సరికొత్త తెలుగు బ్లాగ్ అగ్రిగేటర్ అతిత్వరలో !

జిలేబి వదన  - సరికొత్త తెలుగు బ్లాగ్ అగ్రిగేటర్ అతిత్వరలో !
 
వస్తోంది ! వస్తోంది !
అతి త్వరలో ! మీ ముందుకు వస్తోంది 
 
తెలుగు బ్లాగ్ లోకం లో కనీ వినీ ఎరుగని 
సరి కొత్త రీతి లో మీ ముందుకు జిలేబివదన 
అల్ట్రా మాడరన్ సెర్చ్ ఇంజిన్ సాయం తో 
తెలుగు బ్లాగ్ లోకం అదిరి పోయేలా 
వస్తోంది బ్లాగ్ అగ్రిగేటర్ 
 
స్పెషల్ ఫీచర్స్ ->
 
బ్లాగ్ అడిషన్ -> అడ్మిన్ వారి కైవసం 
బ్లాగ్ రిమూవల్ -> అడ్మిన్ వారి కైవసం 


డబ్బూ దస్కం -> ఫ్రీ ఫార్ లైఫ్ !

 
అతి ముఖ్య గమనిక ! -> ఈ అగ్రిగేటర్ లో టపా కామింట్లు మాత్రమే వస్తాయి !
టపాలు రావు ! మీ టపాలు సత్తా ఉంటె ఎట్లాగూ అవి వస్తాయి కామింటు  రూపేణా !
లేదంటారా అవి గూగల్ సెర్చ్ -లో ఎట్లాగూ వస్తాయి :)
 
వేచి చూడుడీ ! సరికొత్త జిలేబి వదన సరికొత్త బ్లాగ్ అగ్రిగేటర్ !
 
చీర్స్ 
శుభోదయం 
జిలేబి :)

17 comments:

  1. అయ్యబాబోయ్ జిలేబీల అగ్రిగేట
    రట , కమింగ్ సూనట , వివరాలు దెలిపె ,
    పోష్టులకు గాదు , కామెంట్ల బూష్టుల కట ,
    స్వాగతము పల్కుచుంటిమి సకల జనము .

    ReplyDelete
    Replies

    1. నమో నమః లక్కాకుల వారు :)

      భయము వలదు వలదు !

      చీర్స్
      జిలేబి

      Delete
  2. తెలుగు బ్లాగర్లతో బాగా ఆడుకుంటున్నారు జిలేబీగారూ

    ReplyDelete
    Replies

    1. శ్రీనివాస్ గారు,

      ఆడుతూ పాడుతూ పని జేస్తోంటే అలుపూ సొలుపూ తెలియదులే :) జేకే !

      చీర్స్
      జిలేబి

      Delete
    2. బై ది వే, ఈ సరికొత్త కామింట్ల తెలుగు అగ్రిగేటర్ లో కామింట్లు బ్లాగ్ వారి అప్రూవల్ కోసం వెయిట్ చేయదు ; కామింటారు కొట్టిన చాలు ; అది అప్రూవల్ కాక పోయినా స్పాం ఫోల్డర్ లో ఉన్నా కూడా పోలింగ్ అయి అగ్రిగేటర్ లో వచ్చును :)

      రానున్నది జిలేబి వదన 'బ్లాగిణీగ్రేటర్' తడాఖా :)

      చీర్స్
      జిలేబి

      Delete
    3. జయము జయము జిలేబీ వారూ జయము జయము

      Delete

    4. నమో నమః ! జ్యోతిర్మాయీ వారు శుభము శుభము :)

      జిలేబి

      Delete
  3. కానివ్వండి కానివ్వండి. కామెంట్ల అగ్రిగేటర్ అంటే అధిరిపోయినట్టే, ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని, ముందేసే పోస్టుల కన్నా, వెనక రాసే కామెంట్లే మహ రంజుగా ఉంటాయి.. :-)

    ReplyDelete
    Replies
    1. శుక్రాచార్య ! మీకు తెలియనిది ఏమున్నది :) కొమ్ములకు వాడి ఎక్కువ ! చెవి అయ్యో పాపం :)

      చీర్స్
      జిలేబి

      Delete
  4. < ".... కామింట్లు బ్లాగ్ వారి అప్రూవల్ కోసం వెయిట్ చేయదు ;"

    చోఓ.. చ్వీట్.

    ReplyDelete
    Replies

    1. విన్న కోట వారు,

      అచ్చోచ్చో చ్వీటు :)

      జిలేబి

      Delete
    2. బాగానే ఉంది కానీ మా "కోట" ని వేరుజేయకండి ప్లీజ్ :) "విన్నకోట" అనే పేరు ఒకటే పదం. థాంక్స్.

      Delete

    3. అబ్బే ! విన్న కోట వారు,

      ఈ మధ్య అన్నింటినీ మూడు గణాలు గా జూస్తున్నా మండీ ! అదీ విషయం

      విన్న కోట వారు జెప్పె
      తిన్నగ తిన వేము నొప్పు
      విన వినవలె అదియు నిదియు
      వినగ వినగ వెలుగు తెలియు

      చీర్స్
      జిలేబి

      Delete

    4. ఈ మధ్య అన్నింటినీ మూడ గ నాలుగు గ జూస్తున్నా మండీ ! జేకే !

      చీర్స్
      జిలేబి

      Delete
  5. అబ్బో మీ అగ్రిగేటర్ దెబ్బకు తెలుగు బ్లాగర్ల పని అయ్యిపోయినట్టేనన్న మాట!

    ReplyDelete
    Replies

    1. కె ఎస్ చౌదరి గారు,

      జిలేబి యా మజాకా యా మరి ! వస్తోంది వస్తోంది జిలేబి వదన బ్లాగిణీగ్రేటర్ అదురహో అంటూ అతి త్వరలో !

      చీర్స్
      జిలేబి

      Delete
  6. మర్చిపోయా! మనం ఆంధ్రులం కదూ!! :)

    ReplyDelete