Thursday, January 7, 2016

నారదా ! పంచదశ లోక విహారి ! నేటి విశేషంబులు ఎద్ది ?

నారదా ! పంచదశ లోక విహారి ! నేటి విశేషంబులు ఎద్ది ?

పాలకడలి !

చైనా స్టాకు మార్కెట్ డమాల్ డమాల్ డుమాల్ డమాల్ నేపథ్యం లో లెఫ్టు సెంటరు రైటు గా గావింప బడ్డ కరెన్సీ మాత అలయస్ లక్ష్మీ దేవి అలసి సొలసి ఇంటికి వచ్చి ఎప్పట్లా స్వామీ వారి పాదాల చెంత కూర్చొని ఏ పనీ లేకుండా నిదుర పోతూ కూడా కాళ్ళు నొప్పి తో బాధ పడే తన పతి దేవుడు కాళ్ళు సుతారం గా నొక్కే హోం వర్క్ లో పడింది హుసూరు మంటూ.

నారదుల వారి ప్రవేశం -

రావోయ్ నారదా ! పంచ దశ లోక విహారి ఏమిటీ ఖబుర్లు అంది నారదుల వారి బామ్మ లచ్చిందేవి .

ఏమంటా మమ్మా ! నీకు తెలియనిది ఏమున్నది  అని మౌనం గా ఊరుకున్నాడు . 

అదేమోయ్ !  శిష్యురాలు ఇవ్వాళ నీకేం ఖబుర్లు ఇవ్వలేదా ? హాశ్చర్య పోయింది తల్లి - మార్కెట్ డమాల్ నించి కొంత సేపు రిలాక్స్ అవుదా మని అనుకుంటూ నారదుడి ఖబుర్లు తెలుసు కుందా మనుకుంటూ.

ఇవ్వకేం తల్లీ ! మన రాముల వారు ఈ మధ్య ఆశ్రిత జనాల మాటలు పట్టించు కోవటం మానేశారంట !

అంటే ?

అంటే తల్లి ఈ మధ్య పంచ దశ లోక శిష్య పరమాణువు వారి ద్వంద కర్ణం లో  లో గ్రాంధి కాన్ని రంగరించి పోసి స్వామి వారు ఇక మీదట గ్రాంధికం మాత్రమె వింటా ... వేరే ఏ లాంగ్వేజ్ కూడా నే వినను అని మంకుం పట్టేసు కున్నారట !

సీతమ్మ ఒకటే గగ్గోలు అక్కడ ! అందరూ వెళ్లి ఆమెతో మొర ఆలకించ రాదా తల్లీ అంటూ ఆమె కి డబల్ వర్క్ ఇచ్చేస్తున్నారట చెప్పాడు బామ్మ కి తగ్గ మనవడు.

ఔరా ! ఈ నిద్ర నటించే ఈ పరంధాముడు ఇంత గా మారి పోయేడా అనుకుంటూ బుగ్గన వేలు పెట్టు కునేసింది లచ్చిందేవి ;

ఇంకా ఏవి ఖబుర్లోయ్ ?

పంచ దశ లోకం లో బ్లాగుల్ని మతాల పరంగా విడ గొట్టి సంఖ్యా బలం ఎంత ఉందో గణాంకణాలు తీస్తున్నరంట తల్లోయ్ అన్నాడు నారదుడు .

అవున్రీ ! అని హాశ్చర్య పోయింది మళ్ళీ తల్లి .

అవున్రీ అవున్రీ నే తల్లి  అంతా !

ఆ !

మరి నీ శిష్యురాలు ఏం జేస్తోందోయ్ ?

అదేమిటో నా శిష్యురాలు ఈ మధ్య తను  యతులు జాతులు పక్షులు అందమూ చందమూ అంటూ ఏదో బరికేస్తూ ఉంది తల్లి గణాలు లఘువులు గురువులు అంటూ ఏదో ఎడా పెడా లేక్ఖలు పెట్టేసు కుంటుంది ; అప్పుడప్పుడు పిచ్చి దాని మల్లె ఆకాశం వైపు జూసి ఒకటి ఒకటి రెండు అంటూ లేక్ఖలు పెడుతుంది తల్లోయ్ !

మధ్యలో అదేమో వదన, ఉత్కళిక, సావేజిత అంటూ సైన్ ఆఫ్ చేస్తోంది తల్లోయ్ !

అవురా ! ఏమి ఈ కాల మాహాత్మ్యము ! సరే సరే ! నా వంట పని మొదలెట్టాలి ఈ నిద్ర పోయే స్వామి వారికి నైవేద్యం పెట్టే వేళా ఘంటా రావం వేళా వచ్చేసే ; ఉండి ఫలహారం గావించి వెళ్ళు ;

ఇవ్వాల్టి కి ఏం వంట బామ్మోయ్ ? వెజ్జా లేక నాన్ వెజ్జా ? చికన్ తింటే క్యాన్సర్ ఒస్తుందట !

యోగ నిద్ర లోంచి భారం గా కళ్ళు రవ్వంత తెరిచి , అబ్బే మన కెందుకు లే ఈ తంటాలు అనుకుంటూ స్వామి వారు మళ్ళీ కునుకేసారు !

స్వామీ

ఏమీ !

ఎట్లా ఇలా మీరు ఇరవై నాలుగు గంటలూ నిదురోగలుగు తున్నారు !

యోగ మాయ లచ్చిందేవి 


బ్రేవ్ :) (ఇది తెలుగు బ్రేవ్!  ఇంగ్లీష్ బ్రేవ్ కాదు :)

నారదా !

చీర్స్
జిలేబి  

2 comments:

  1. కవివృషభులు విహరించే
    బవరమ్ముల బురదగుంట ప్రక్క నిలిచినా
    లవలేశమైన పూయుదు
    రవహేళన పంకిలమ్ములమ్మ జిలేబీ !

    ReplyDelete
    Replies
    1. కారం అల్లం వడ కరి నాపై
      కారుణ్యం తో వడి కవళం గా
      కారాబూందీ జత కలిసే లా
      కారం వేపప్పొడి కలిపే వో !

      జిలేబి

      Delete