Monday, February 8, 2016

గోదారి జవ్వని కన్నులు !

గోదారి జవ్వని కన్నులు !
 

భువి యంతా  తనదై
చేసుకుని ఉన్నాయి
జవ్వని కన్నులు
ఎర్రజేయుచు సంరక్త లోచని
రక్తాంత లోచని  
పొగరెక్కిన కళ్ళు
కళ్ళు తిరిగి పోవు కళ్ళు
కాటుక కళ్ళు
భీత హరిణేక్షణ !
అరమోడ్పు కళ్ళు
అర్ధ నిమీలిత నేత్రీ
నిమీలిత నేత్రీ
విశాల నయనీ
విశాలాక్షి
పంకజాక్షి  
బరువున మూత బడ్డ కళ్ళు
కలువ కళ్ళు
తామర కళ్ళు
-పద్మపత్ర నయని -
-పద్మదలాయతాక్షి
గంభీర మైన కళ్ళు
రమ్యమైన కళ్ళు
పిల్లి కళ్ళు
ఆవు కళ్ళు
చెంపకు చారడేసి కళ్ళు
మరీ
చిలిపి కళ్ళు :)
 
శుభోదయం
జిలేబి


 

11 comments:

  1. < "..... పిల్లి కళ్ళు, ఆవు కళ్ళు ......." >

    చేప కళ్ళు (మీనాక్షి) వదిలేశారేం? :)

    ReplyDelete

  2. విన్న కోట వారు :)

    అన్నీ మేమే చెప్పేస్తే ఎట్లా :)

    ఎవరెవరు ఏయే కనుల జవ్వనుల జూసినారో తెలియాలి కదా మరి :) జేకే !

    మీనా కుమారి లేకను
    నానా బాధలు పడెనుగ నయ్యరు చూడన్
    తానే కమ్మని తెమ్మర
    ఆనా డు గనగ జిలేబి అయ్యెను తనకే !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. ఏకహాయన కురంగ లోచనాలు!(ఒక సంవత్సరం వయసు గల లేడి కళ్లు) అనేది ఒక మహాకవి భావన. ఒక సంవత్సరమే ఎందుకు చెప్పగలరా?

    ReplyDelete
  4. శ్రీధర్ గారు,

    చాన్నాళ్ళ తరువాయి ! కుశలమా!

    Is it that it(the deer-does) gets matured around that age?

    గని నేకహాయన కురం
    గనయన! భీతహ రిణేక్షి ! గాభర గానన్
    మనమున కలిగెను ఆహా
    యనగన మధురిమ సునయన యతిజత పాడన్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  5. మీ అంచనా సరి అయినదే సుమండీ! ఇక ఆ శ్లోకాన్ని వినండి ( ఉమా సహస్రం 12 వ స్తబకము, 8,9 శ్లోకాలు. కావ్య కంఠ గణపతి ముని ప్రణీతం )

    సందర్భం: మన్మథ దహనం అయిన తరువాత,
    శ్లోకం:8: తాడితో మకర కేతునా శరై రంస దేశ మవలంబ్య పాణినా ;
    ఏక హాయన కురంగ లోచనం త్వా మిదం కిల జగాద శంకరః
    తాత్పర్యము: మన్మధుడు పుష్ప బానములతో కొట్టగా, ఆ బాణ ఘాత వేదనను సహించ లేక శంకరుడు, తన చేతితో నీ భుజాగ్రమును
    ఊతగా గొని, ఒక సంవత్సరపు వయసు గల లేడి పిల్ల కన్నుల వంటి కన్నుల వలె చంచలంయిన చూపులు గల నీతో ఇట్లు పలికెను.

    శ్లోకం: 9: కాకలీ కలకలం కరోత్యసౌ బాల చూత మదిరహ్య కోకిలా
    వాచా ముద్గిర సరోజ లోచనే గ్ర్వమున్నత మియం విముంచతు
    తాత్పర్య్సం: పద్మాక్షీ! పార్వతీ!ఈ ఆడు కోయుల లేత మామిడి చెట్టుపయి కూర్చోండి అవ్యక్త మధుర ధ్వనితో కోలాహలము చేయుచున్నది.
    నీవు నీ కంఠ ధ్వని వినిపించుము, ఈ కోయిల గర్వమణుగును.

    జిలేబీ గారూ! స్త్రీ యొక్క ఏ అవయవ వర్ణనని జిలేబీతో పోలుస్తారు?

    ReplyDelete
  6. భలే వారండోయ్ శ్రీధర్ గారు :)

    బాణం జిలేబి మీది కే ఎక్కు పెట్టేసారు :)

    చెప్పా లంటే జిలేబి ఎచ్చోటను అందమే :)

    శ్రీధర ! జిలేబి హృదయము
    సాదరము సరసవిరసము సారము గాంచన్
    శోధన చేయగ మాధురి
    కాదన అవయవ ముగలద కాంతల మేనిన్ ?

    ఇంతకీ ఈ జిలేబి అన్న భక్షణం భారద్దేశం వారిది కాదని ఇది తుర్కులు దేశం లో వచ్చినప్పుడు వారితో బాటు వచ్చిందని అనుకుంటున్నా ! సో , పాత కాలపు సంస్కృత పదం ఉందా దీనికి ? తెలియదు ! (ఆ మధ్య కంది వారు ఒక పదం చెప్పారు ఏమిటబ్బా అది ? )

    మీరే చెప్పాలి ! నా వరకైతే పైన చెప్పబడినదే :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  7. ఇది ఆధునిక రచయితల వర్ణనే నండీ ! పురాతనం కాదు.'జిలేబీ చుట్టల లాంటి చెవులు' అనేది ఆ వర్ణన !

    ReplyDelete
  8. శ్రీధర్ గారు,

    సంస్కృతం లో 'కుండలిక' అంటా రట :)

    సరిగ్గా సరి పోయింది మీ వర్ణన కూడా :)

    మంచి కాలం దర్శకేంద్రుల వారికి ఏక హాయన కురంగము గాని జిలేబి గాని ఐడియా రాకుండా పోయే ! వచ్చి ఉంటె తెలుగు సినీ లోకము ఏమేమి "ఛాయా" రూపములు గాంచి ఉండునో ! జేకే !

    నెనర్లు మీ ఓపిక కి :)

    చీర్స్
    జిలేబి

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  9. శ్రీధర్ గారు,

    మీరు కళ్ళ వర్ణన ల మీద చాలా రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు !
    కాబట్టి మీకో చిలిపి ప్రశ్న :)

    "నిరంతర వ్యాఖ్యా ప్రకటన కుతూహల లోచనీ" అని ఎందుకంటారు ?

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మరి మరి కన్నుల వర్ణణ
      నరసిరి గాబోలు! 'గురుడు' హాయిగొలుపగా ,
      పరి పరి 'శిష్య' నిమీలిత
      వర లోచన శోభనములు వర్ణించిరిపో .

      Delete
    2. లక్కాకుల వారు:)

      మీరు మరీను :)

      మరిమరి మిమ్ముల పోలిన
      సిరి సిరి పొందిక పదముల సిగలను పట్టన్
      పరిపరి శిష్య నిమీలిత
      సరసము గాంచన నటునిటు శరములు అయ్యెన్ :)

      Delete