Monday, February 22, 2016

ముసురు పట్టిన ఆకాశం

ముసురు పట్టిన ఆకాశం
 
ఆకాశం ముసురు పట్టింది
నాకు ఇవ్వాళ అందుకే
మనసేం బావో లేదు
అనుకున్నా
 
వర్షం జోరున కురిసింది
ఆకాశం తేట బడింది
మనసు వర్షం లో తడిసి
ముద్దయ్యింది తేలికయ్యింది
 
శరీరం లో ఎనభై శాతం
నీరుందంటే మరి యిట్లాగే
కదా ప్రకృతి తో
తనూ ప్రతిధ్వని స్తుంది !
 
శుభోదయం
జిలేబి

8 comments:

  1. ఆట పాటల జిలేబీ మనసుకి
    చేటేదో కలిగిందట, తటాలున కురిసిన
    చాటు లేని వాన మాటున
    తేటేదో కలిగెనట మది మురిసెనట ...
    :-)

    ReplyDelete

  2. ఆకసమున ముసురు గనెన్
    శోకము బొందెన్ జిలేబి సోదియు జెప్పెన్
    ఆ, కరి మేఘము కురువన్
    షోకుగ బోవున్ గదోయి శోకము గూడన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. @ mr jilebee ...

    ముసురేసే మబ్బేసే విసుగేదో రెబ్బేసే
    వేసటేదో తియ్యరాదా ఓ అయ్యరు దొర
    పసరేదో పుయ్యరాదా ఓ అయ్యరు దొర
    మసరేదో మాపరాదా ...

    పిసరంత దయజూసే వానేదో కురిసేసే మ
    నసంతా మురిసిందంటా మీ బీవీ జర
    ముసి ముసిగా నవ్విందంటా ఓ అయ్యరు దొర
    మిస పాటేదో విసిరిందంటా ...


    https://www.youtube.com/watch?v=taNRFpbnUFE

    :-)
    jf ...
    lol ...

    ReplyDelete
  4. అందరికీ తంపులు పెట్టీ పెట్టీ అయినా తుత్తి లేని యేడుపా అది?
    అగ్గి రగిల్చినా ఇంత ప్రశాంతంగా ఉన్నారేమిటా అని కొత్త ఏడుపా!

    ReplyDelete
    Replies

    1. హరి బాబు గారు,


      చాలా మంచివిషయాలు సెలవిచ్చారు.

      ఇలాంటిమాటలు చెప్తే వినేవారు నేడున్నారా?.

      చెప్పేవారిని వింతగా చూస్తున్నారు.

      ధన్యవాదాలు

      జిలేబి

      Delete
    2. అచ్చంగా ఇవే పదాలతో "కష్టేఫలే" బ్లాగులో వేరొకరు ఆల్రెడీ వ్యాఖ్య వ్రాసినట్లున్నారే !! అంటే జిలేబీ గారి అనుకరణ ఆ వ్యాఖ్యాతకి కాంప్లిమెంట్ అనుకోవాలా?

      Delete