Tuesday, March 22, 2016

ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)

ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)అయ్యరు గారందించిన కాఫీ సిప్ జేస్తో 'అహా' కుంభకోణం డిగ్రీ కాఫీ బాగుందండోయ్' అంటే ,

ఏమోయ్ జిలేబి ఈ మధ్య మరీ బిజీ బిజీ అయి పోయేవ్ ? అన్నారు కుశలము విచారిస్తో !

వారు నా కుశలాన్ని విచారించే పధ్ధతి ఇదే గా మరి అనుకుంటూ

ఏముంది లెండి ! ఈ మధ్య పద్య రచనల మీద పడ్డా ! మీకు తెలుసుగా ఒక పదం కుదిరితే మరో పదం కుదరదు ! పోనీ  పాదం కుదిరింది అని ఆనందం తో మీరిచ్చిన కాఫీ సిప్ జేస్తే మరో పాదం రాలె ! ఇట్లా కుస్తీ ల తో నే సరి పోతోందండోయ్ - చెప్పా !

ఓహో ! నత్త బాధ లన్న మాట ! హిందూ పేపరు లో తల బెట్టి న్యూసు చదువుతో అన్నారు !

అయ్యర్ వాళ్ ! ఈ పద్యాల గోళం లో పడి ఈ మధ్య దేశం లో ఏమి జరుగు తోందో తెలీక పోయే ! ఏమిటి దేశం ఖబుర్లు అన్నా ! అర్రెర్రే ! బడ్జెట్ సీసన్ కూడా అయిపోయే వాటి మీద కూడా జిలేబి ఏమీ కామెంటరీ వ్రాయక పోయెనే అనుకుంటూ !

ఆ ఏముంది లే జిలేబి దేశం లో ఆర్ట్ అఫ్ లివింగ్ వాడు గ్రాండ్ స్కేల్ లో కల్చరల్ ఈవెంట్ పెడితే హిందూ వాడు దాంట్లో ఎక్కువ రంద్రాన్వేషణ పెట్టాడు !

అంటే !

నెగటివ్ పాయింట్స్ అన్నీ పట్టు కొచ్చి అబ్బే ! వీళ్ళకి ఈవెంట్ మేనజ్ మెంట్ తేలీదని తేల్చి పారేసాడు !

ఓ !

అంతే కాదు ! రవిశంకర్ మొదట్లో పొలిటికల్ లీడర్ లా మాట్లాడ ప్రయత్నించి తాను ఆధ్యాత్మిక గురువు అన్న మాట గుర్తుకొచ్చిందేమో సరిదిద్దు కుని హృదయం తో మాట్లాడటం మొదలెట్టాడు !

ఓ !

అదే మీటింగు లో మోడీ వాళ్ళ కి కావలసినంత జోష్ భరీ మస్త్ భారీ స్లోగన్ లు అందించాడు కూడా ! ఏ ఓ ఎల్ అంటే ఏమిటి అంటూ వాళ్ళ కే వాళ్ళ గురించి తెలీనిది చెప్పాడు :)

ఓ ! మన మోడీ గారేం చేస్తున్నా రండీ  ఇంకా !

వారా ? ఈ మధ్య ఒక సూఫీ కాన్ఫెరెన్స్ లో వాళ్ళు మస్త్ ప్యార్ భరీ ఉర్దూ లో రాగం తీస్తో మాట్లాడితే , తన ఫేవరైట్ భాష హిందీ లో జబర్దస్త్ వాయించ కుండా అరువు ఆంగ్లం లో వాళ్ళ కి మెసేజ్ ఇచ్చాడు ప్రసంగం లో !

ఏమని ?

అల్లాః హి రహ్మాన్ అవుర్ రహీం హై ! అని !

వారెవ్వా ! ఇంకా ?

ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు గాని ఏమిటి ఇవ్వాళ నా మీద పడ్డావ్ ? కాఫీ బావుందా ? 

కాఫీ బ్రహ్మాండం ! ఇంతకీ అయ్యర్ వాళ్ ఈ మధ్య ఒక పద్యం వ్రాసా ! చదివి వినిపించ మంటా రా !

అయ్య బాబోయ్ ! జిలేబి ! ఎన్నై విట్టుడు ! ఎనక్కు వేండామ్ ఉన్ పద్యం !

అయ్యర్ వాళ్ మళ్ళీ గోముగా మరో మారు పిలిచా !

ఇదిగో జిలేబి నీకు పనీ పాటా లేదు ! అట్లా గాదు గా నా కైతే !

వంటా వార్పూ నా మెడ కి అంట గట్టావ్ ! ఆఫీస్ పనంటూ !

ఆఫీస్ పని ఏమి నిర్వాకం చేస్తా ఉన్నావో మన మురుగ ప్పెరుమాళ్ కే ఎరుక ! ఎప్పుడు జూసినా ఒకటి రెండూ ఒకటి అంటూ గణా లని గుణిస్తో ఉన్నావ్ తప్పించి ఆఫీసు పనీ ఏమీ చేసినట్టు  దాఖలాలు లేవు ! పనీ పాటా లేక పోతే వంటా వార్పూ చెయ్య కూడదు నాకు మరి కొంత రిలీఫ్ కూడా !

అయ్యర్ వాళ్ అయం వెరీ వెరీ బిజీ ! మరో కప్పు కాఫీ బట్రాండి ! హుకూం జారీ చేసా !

హుసూరు మని హుజూర్ అని అయ్యర్ గారు మళ్ళీ వంట గది ముఖం పట్టేరు !

హమ్మయ్య! ఇట్లాంటి అయ్యరు గారు ఉన్నంత వరకు మన టైం పాస్ కి డోకా వచ్చింది ఏమీ లేదను కుంటూ  మళ్ళీ భారీ శరీరాన్ని కరిగించు కోడా నికి పద్యాల తో కుస్తీ పట్టటం మొదలెట్టా తూలికా రమణి చెప్పిన కిటుకు యిదే గా మరి ! జాలం మీద పడి బరువు తగ్గించు కో అని సరి కొత్త తెకినీకు అన్న మాట :)

చీర్స్
జిలేబి

12 comments:

 1. అయ్యోరే అయ్యర్ అయ్యయ్యో
  కుయ్యోరే మొర్రోరే ప్రొద్దు ప్రొద్దున్నే
  అయ్యారే జిలేబీ అమ్మమ్మో
  జియోరే కభీ, ఐసీ ఖుషీ ఖుషీ మే( ...

  ReplyDelete
 2. అయ్యయ్యో పాపం అమాయకపు కుంభకోణం అయ్యరూ
  అయిపోతాడంటారా ఆయన చివరికో అరవ లోక చినజియ్యరూ
  గయ్ మనే లోపునే నోరురా పిలుస్తూ అమ్మలూ తాయారూ
  తయ్యారే! అని అప్పటికప్పుడు అందిస్తూ కమ్మని కాఫీ ఫిల్టరూ ...

  కుయ్యుమనే సాహసమంతా చివరంటా అడుగంటినప్పుడూ ...
  దెయ్యం సినిమా లేస్తూనే త్రీడీ లో ఇం(కం)ట్లో కనబడినప్పుడూ...

  లోల ...
  :)

  ReplyDelete
  Replies
  1. తమ్ముడు కాఫీ కప్పుకె
   గుమ్మయినా డింక నాల్గు కూరల తోడన్
   కమ్మని భోజన మయ్యరు
   ఇమ్ముగ వడ్డించ జూచి యేమయ్యెదరో ?

   Delete
 3. అయ్యర్ సార్ ఇట్లా తెనుగు తమిళ్ మామీకి చిక్కిపోతివా ! మురుగా!! మురుగా!!!

  లోలాచ్చి లోలా.

  ReplyDelete
 4. సెహభేషు జిలేబీజీ !
  బహు కాలము పిదప 'వచన' భాష తరించెన్ ,
  అహహా! 'గురుడి'కి మించిన
  అహమహమిక 'పద్య' భాష అటకెక్కినదా!

  ReplyDelete
  Replies
  1. చిరుహాసము దరహాసము
   పరిహాసముగాదు తవరి పద్యపు ధాటిన్
   గురుడిక గుండై పోవును
   త్వరపడి బ్లాగున బిగిసిన తలుపులు దెరుచున్ .

   Delete

 5. బండి రావు గారు !

  నెనర్లు ! ఫార్మ్ లోకి వచ్చేస్తున్నారు :) ఆల్ ది బెష్టు :)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 6. శర్మ గారు,!

  మురుగా మురుగా ! జ్ఞాన పండితా :)

  జిలేబి

  ReplyDelete

 7. 'లక్షాకుల' వారు :)

  సరళపు చెలువపు తెలుగున
  గిరగిర పలుకుల నడకల కిటుకుల లక్కా
  కు రచనల జూచి నేర్వన్
  కరముగ శ్రీపాద గురువు కరుణన గంటిన్ !

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గురు మహేశ్వర
   శ్రీ పాదము కరుణలు గల సిరుల జిలేబీ !
   కోపాహంకారుల యీ

   పాపాత్ముల కొలుపులేల పరిణత హృదయీ !

   Delete

 8. భామల మనసెరిగెనుర ! బాగ తెలుసు
  కొనెను నాతడు మాధురి కోణములను
  పలుకు పలుకుల కువలయ పరిమళముగ
  వెంటబడి జంపువాడె పో ప్రియసఖుండు :)

  ReplyDelete
 9. నాటి రాయల సభ నేడు దర్శించే భాగ్యం. ధన్యోస్మి..

  ReplyDelete