Tuesday, March 29, 2016

బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు !

బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు !


ఈ మధ్య జిలేబి వదన అగ్రిగేటర్ అంటూ జిలేబి తూచ్ అని ఓ స్టాప్ గేప్ బ్లాగ్ లిస్టింగ్ పెట్టింది ఆఖరి గరిక మా మాలిక గూడా మొరాయించటం తో !

బ్లాగిల్లు శ్రీనివాస్ గారు కామింట్ లాడుతూ శుభ సూచకం ఇచ్చారు ! - రాబోయే ఉగాది పండగ నాటికి వారి చలువ తెలుగు బ్లాగు లోకానికి మరో సరి క్రొత్త అగ్రిగేటర్ వస్తుందని !

హమ్మయ్య అనుకున్నా !

సో ఈ రాబోయే అగ్రిగేటర్ కోసం ఎదురు జూస్తో

ఈ అగ్రిగేటర్ కి సలహాలు ఏమన్నా ఇచ్చే దైతే ఇక్కడ ఇవ్వగలరు !
జిలేబి సలహాలు

చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తో శ్రీనివాస్ గారిని పరేషాన్ జేయ దలచు కోను !
లేటెస్ట్ స్క్రోల్లింగ్ పోస్ట్స్ + కామెంట్స్ (ఇది ముఖ్యం జిలేబి కి మరీను :) లిస్టు జేస్తే అదే ఇప్పటి పరిస్థుతుల్లో గొప్ప సహాయం తెలుగు బ్లాగు లోకానికి !

డబ్బులిచ్చి లిస్టింగ్ జేసుకోవాలా ? ఊహూ ! వలదు వలదు !

అగ్రిగేటర్ గూగుల్ ప్రకటనల మాధ్యమం ద్వారా గాని మరి ఏవిధమైన మాధ్యమం ద్వారా గాని డబ్బులు గిట్టు బాటు అయితే చేసు కోవచ్చా ? తప్పక చేసుకోవచ్చు అనుకుంటా నా వరకైతే నవ్య వార పత్రిక స్టైల్ అదే ! ఆ టెంప్లెట్ బ్లాగ్ అగ్రిగేటర్ ఫాలో అయితే సైడ్ బార్స్ ప్రకటనల కి ఉపయోగ పడొచ్చు ! దస్కం అగ్రిగేటర్ కి వస్తే మహద్భాగ్యం !

రండి సరి కొత్త తెలుగు బ్లాగు రాబోయే బ్లాగు కి స్వాగతం పలుకుదాం !

మీ సలహాలు అవసరం ! కామింటు రూపేణా గాని వారి ఈ మెయిల్ కి గాని తెలియ జేస్తారని ఆశిస్తో !

కోట్ :

జిలేబీ గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. తెలుగు బ్లాగర్లకు ఓ వేదిక లేకపోవడం నాకూ బాధగానే ఉంది . బ్లాగిల్లు మూతపడిన తరువాత కూడలి , ప్రస్తుతం మాలిక ... ఇక తెలుగు బ్లాగర్లకు ఏమీ మిగల్లేదు అనే అనుకోవాలి.
మీ అభిమానం కొనసాగితే త్వరలోనే మరో ఆగ్రిగేటర్ రావచ్చు . ఉగాదికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.
ఎలా ఉండాలి అనే దానిపై మీ సలహాలు నాకు మెయిల్ చేయండి. srinivasrjy (ఎట్) gmail dot com

శ్రీనివాస్  క
అన్కోట్

చీర్స్
జిలేబి

15 comments:

 1. శ్రీనివాస్ జీ

  కొడుకుని కంటానంటే వద్దనే అత్తగారుంటుందా? ఆగ్రిగేటర్ తయారు చేస్తానంటే కాదంటామా? ఒక్క సంగతి మరచిపోకండి. గుడి పునాదిలో వేసిన రాతికి మొక్కుతారా? గుళ్ళో విగ్రహానికి మొక్కుతారా? ఐతే పునాదిరాతికి విలువలేదా? ఉంది కాని ఎవరూ గుర్తించరు, అలాగే ఆగ్రిగేటర్ ఉపయోగించుకుంటారు, అవసరానికి ఒక మాట మాటాడరు, అది సర్వ సహజం, నాతో సహా. ప్రోత్సాహం నిండుకుంటుంది, ఓపికున్నవరకు చేయడమే అనుకుంటే బాధలేదు. ఈ రోజు మానేసినవారంతా ఒకప్పుడు ఉత్సాహంగా మొదలెట్టినవారే కదూ! ఉత్సాహం ప్రోత్సాహం ఉండవనే దిగండి, నేను చాలా నిక్కచ్చిగా మొహమాటం లేకుండా చెబుతున్న మాట, నచ్చకపోవచ్చు కూడా :)

  ఆగ్రిగేటర్ లో ముఖ్యంగా ఇవి ఇవ్వండి చాలు, ఎక్కువ చేసుకుని నిర్వహించలేక బాధ పడద్దు.

  1. వేసిన టపా నలభై ఎనిమిది గంటలు కనపడేలా ఒకటే పేజిలో ఇవ్వండి, చాలు. ఒకరెన్ని టపాలు వేసినా ఒక్కటపా మాత్రమే కనపడితే చాలు.

  2. కామెంట్లు అవసరమే, జిలేబిగారు చెప్పినట్టుగా హారం మోడల్ లో చేస్తే చాలు.

  3. మిగిలినవన్నీ మీ ఓపిక, అవసరం లేనివే. వీలు కుదిరితే తెనుగు=తెనుగు. తెనుగు=ఇంగ్లీషు, ఇంగ్లీష్=తెనుగు, తెనుగు=హిందీ, హిందీ=ఇంగ్లీష డిషనరీలివ్వండి. చాలునని నా అభిప్రాయం.

  ఇక, ఇరుసున కమ్దెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ!
  సొమ్ములు లేకుండా ఏ పనీ అవదు. అసలు ఊరికే ఎందుకివ్వాలి? ఇదెందుకు ఆలోచించరూ? బ్లాగర్ నుంచి వసూలు చేయడానికి మీకిష్టం లేదు, సరే! కాదనలేదు. అడ్వర్టైజ్మెంట్లు తీసుకోండి, సొమ్ము కొంతేనా చేర్చుకోండి,ఈ సంగతి చాలా కాలం నుంచే అంటున్న మాట. ఆ పై మీ ఇష్టం, అడిగారు గనక, చెప్పడమే నా ధర్మం....

  ReplyDelete
 2. జిలేబి, శర్మ గార్లకు నమస్కారం!
  ప్రభుత్వాల అలసత్వం వల్ల ప్రాంతీయ భాషలకు అలాగే మన తెలుగుకు ఆదరణ తగ్గిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎదే విషయాన్ని శ్రీ రామోజీరావు గారు తమ "తెలుగు-వెలుగు" పత్రిక సంపాదకీయాలలో చెపుతుంటారు.
  లింకు : http://ramojifoundation.org/flipbook/link.php

  నావంతు సాయంగా తెలుగుని బ్రతికించే ప్రయత్నం ఇది.. అంతే.

  అరుచుకున్నా, కరుచుకున్నా తెలుగు వాళ్ళంతా ఒక్కటే కదా. కామెంట్లే బ్లాగులను నిలపెదతాయని ఎన్నోసార్లు నేను చెప్పాను . అందుకే క్రొత్త ఆగ్రిగేటర్ లో కామెంట్ల విభాగం ఉంటుంది.
  అలాగే వార్తల బ్లాగులు విడదీసి వేరేవిభాగంగా చూపే ఆలోచన.
  సింపుల్ గా ఉండే తాజా టపాల విభాగం దాదాపు నెల రోజుల టపాల వరకూ బ్యాక్ అప్ తో ...
  ఇవన్నీ విభాగాలే..
  అయితే మొదటి పేజి మాత్రం సంకలిని కాదు. ఆ పేజిని అన్ని విభాగాల కలయికకు, తెలుగు భాషాభివృద్దికి దోహదం చేసేలా రూపకల్పన ...
  ఇవీ ఆలోచనలు .. ఇక మీ సూచనలను స్వీకరించే ప్రయత్నం చేస్తాను .

  ReplyDelete
 3. జిలేబీ మాతా వందనం.. అభినందనం....
  మాలిక మూసుకుని పోయింది.. జల్లెడ ఆగిపోయింది... కూడలి కూలబడిపోయింది...
  ఇలాంటి పరిష్తితుల్లో ఎడారిలో ఒయాసిస్సు లాగ నాలాంటి గొంతెండిపోయిన ఔత్సాహికులకి దాహార్తిని తీర్చిన జిలేబీ మాతా నీకు శతకోటి వందనాలు... కానీ మీ జిలేబీ వదన చాలామందికి తెలియదు అనుకుంటా..వీక్షకుల సంఖ్య పెద్దగాలేదు.. భవిష్యత్తు ఆశాజనకంగా వుండాలని కోరుతూ.. నీ భక్తుడు..

  ReplyDelete
  Replies
  1. "జిలేబీ బుట్ట" అని పేరు పెడితే ఇంకా పసందుగా ఉండేది అనిపిస్తుంది :)

   Delete
  2. కొంచం ఆత్మీయంగా అనుకోవచ్చుగా అకారాన్ని ఇకారం చేసి. :)

   Delete
 4. Sorry folks,

  We had a credit card expiry issue that led to Maalika problems over the last 3-4 days. The aggregator is now back up. Apologies for the inconvenience.

  ReplyDelete
 5. Two of us make payments to three different sites (Hosting, Nameserver and VPN) to run Maalika. One of the credit cards expired and the when the payment didn't go through, the site has blocked the access. Meanwhile I did something stupid on the site .... newayz all that got resolved and Maalika is now live.

  ReplyDelete

 6. @వోలేటి వారు,

  అంతా విష్ణు మాయ ! నెనర్లు ! :) జిలేబివదన తెలియాలంటే మీ లాంటి బ్లాగర్లు ఆ లింకుని తమ తమ బ్లాగుల్లో పొందు పరచి లేక 'టపా' ద్వారా ప్రకటించి ప్రోత్స హించ వలె !:) అప్పుడే దాని గురించి తెలియ వచ్చును :)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 7. @విన్న కోట వారు !

  మంచి కాలం 'జిలేబి చుట్ట' అని చెప్పలే :)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 8. శర్మ గారికి

  అర్థం కాలేదు ! వివరించవలె :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అమ్మో ! చిక్కొచ్చి పడిందే ఎలా దాటడం:)
   మూడు లఘువుల్లో మధ్య లఘువును ఇకారం చేస్తే వికారంగా ఉండదుగా :) ఆత్మీయమైపోదూ అని :)

   Delete

 9. @భరద్వాజ్ గారికి !

  త్రీ చీర్స్ టు మాలిక ది గ్రేట్ :)

  ధన్యవాదః !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 10. @శ్రీనివాస్ గారు!

  మాలిక మళ్ళీ వచ్చేసింది గదా అని వెనుకాడ బోయేరు :) ఉగాది మాట ఉగాది మాటే !
  జిలేబి

  ReplyDelete