Friday, April 1, 2016

స్త్రీ స్థాయి తత్వాలు :)


స్త్రీ స్థాయి తత్వాలు :)
 
మగవాణ్ణి నమ్మబోకు వనితా
అగచాట్లను పొందబోకు వనితా
 
బిరుసు గలిగి యుండవే వనితా
అలసి సొలసి నతనేవచ్చు వనితా
 
బూచిజేయు నాతడు వనితా
నమ్మినావ నరకమేను వనితా
 
సన్నాసి కి సుద్దులేల వనితా
సంసారి కి ముద్దులిమ్మ వనితా
 
నమ్మితీవు మగడని వనితా
పదారు వేలవాడే వనితా
 
సూరీడని వెంటబోకు వనితా
సుర్రుసుర్రు నినుగాల్చు వనితా
 
ముద్దు జేసి మోహమను వనితా
వద్దు వాడి భ్రమల బడకు వనితా
 
వగచి వచ్చు వీరువోలె వనితా
వగలు పోవు వాడిపోవ వనితా
 
రంగు జూచి మోసపోకు వనితా
రకతమాంసము తినునతడు వనితా !
 
ఒంపు నీదను యింటజొచ్చు వనితా
చంపు ఆపైన నిను గూడను వనితా
 
మెరమెచ్చున బడితీవా వనితా
మరమత్తు జేయునిన్ను వనితా
 
కొంగు బట్టవచ్చుగాన వనితా
కొండముచ్చు నాతడే వనితా
 
పసిడి మేను పట్టిజూడ వనితా
పరమ చేటును జేయును వనితా
 
సిగ్గు వీడి సరసమేల వనితా
ఒగ్గు వగల జిక్కబోకు వనితా
 
మగాడంటే నరకమేను వనితా
గాదిలోన సుఖము లేదు వనితా
 
ఓరజూపు మీటునిన్ను వనితా
కోడెత్రాచు నాతడే వనితా
 
మగవాడి మాటలెపుడు వనితా
అబద్దాల మూటలేను వనితా
 
మగవాణ్ణి దరిజేర్చకు వనితా
మైలు దూరానబెట్టు వనితా
 
జిలేబి మాటలన్నీ వనితా
జిగేలు మనుమూటలే వనితా !


చీర్స్
జిలేబి
(పరార్!)

12 comments:

  1. మహబాగా చెప్పారు..ఆడవాళ్లందరిని కలిపి అనడం ఏమీ బాగాలేదు కదా మరి..అందరు ఆడవాళ్లూ చెడ్డ వాళ్లు కారు.అందరు మగవాళ్లూ మంచివాళ్లూ కారు..ఇద్దరిలోనూ మంచివాళ్లున్నారు,చెడ్డవాళ్లున్నారు..ఎవ్వరినీ నమ్మకుండా ప్రశాంతమైన మనుగడ లేదు.అలాగని గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.

    ReplyDelete
  2. దీన్ని బట్టి మగవాళ్ళు, స్త్రీలూ ఇద్దరూ ఇద్దరే అని "అర్ధం" అయిందండి.:) కాబట్టి నా పార్టీ మూడవ దానికి. అర్ధనారీశ్వర తత్వానికి జేజేలు.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. జిలేబి మాటలన్నీ వనితా
    జిగేలు మునుగుమాటలే వనితా !

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. "ఇంతకీ అయ్యర్ వాళ్ ఈ మధ్య ఒక పద్యం వ్రాసా ! చదివి వినిపించ మంటా రా !

    అయ్య బాబోయ్ ! జిలేబి ! ఎన్నై విట్టుడు ! ఎనక్కు వేండామ్ ఉన్ పద్యం !

    అయ్యర్ వాళ్ మళ్ళీ గోముగా మరో మారు పిలిచా !

    ఇదిగో జిలేబి నీకు పనీ పాటా లేదు ! అట్లా గాదు గా నా కైతే !

    వంటా వార్పూ నా మెడ కి అంట గట్టావ్ ! ఆఫీస్ పనంటూ !

    అయ్యర్ వాళ్ అయం వెరీ వెరీ బిజీ ! మరో కప్పు కాఫీ బట్రాండి ! హుకూం జారీ చేసా !

    హుసూరు మని హుజూర్ అని అయ్యర్ గారు మళ్ళీ వంట గది ముఖం పట్టేరు" ... జిలేబీ.


    ఈ స్థాయి ఫత్వాలు జారీ చేస్తూ ...
    ఇంట్లో అయ్యర్ వాళ్ తో అంత భాగ్యాన్ననుభావిస్తూ మిగిలిన వనితలకు ఆ మహాద్భాగ్యాన్ని దూరం చేద్దామనే దురుద్దేశ్యం తో ...
    స్త్రీ స్థాయి తత్వాలు రిలీజ్ చేయడం చూస్తుంటే ... జై రాధే మా ...

    ReplyDelete
  7. ఏప్రిల్ ౧ నాడైనా...నిజం చెప్పండి..మీరు ఇన్నేళ్లు గా అందరినీ 'ఈరోజు వారిని ' చేస్తున్నారు..మీరు జిలేబుడని :)

    సుందరం

    ReplyDelete
  8. ఏప్రిల్ ౧ నాడైనా...నిజం చెప్పండి..మీరు ఇన్నేళ్లు గా అందరినీ 'ఈరోజు వారిని ' చేస్తున్నారు..మీరు జిలేబుడని :)

    సుందరం

    ReplyDelete
  9. చుశారుగా వాళ్ల కామెంట్లు మరింకేం చెప్పక్కర్లేదు కదా

    ReplyDelete
  10. పేరడీ చక్కగా ఉంది. ఇంతకీ అక్కడ 'ఆవిడ' ఇక్కడ 'ఈయన' ఎవరంటారు?

    ReplyDelete
  11. మగవాళ్ళూ చెప్పగలరు. మచ్చుకి ఇవి చూడండి.
    ------------------
    By all means marry. If you get a good wife, you'll be happy. If you get a bad one, you'll become a philosopher.
    - Socrates
    ------------------
    I had some words with my wife, and she had some paragraphs ��with me.
    - Bill Clinton
    ------------------
    Doctor to male patient : How is your headache?
    Male patient : She is fine.
    ------------------

    ఇటువంటి జ్ఞాన గుళికలు మరిన్ని కావాలనుకుంటే ఈ క్రింది లింక్ చూడండి.
    http://www.desijokes.co.in/2015/07/some-global-opinions-on-marriages.html

    ఇవి వాట్సప్ లోను, ఫేస్‌బుక్ లోనూ కూడా చక్కర్లు కొడుతున్నాయని విన్నాను (నేను రెండింటిలోనూ లేను).

    కాబట్టి మగవారిని మరీ ఆడిపోసుకోకండి, తమలపాకుతో తానొకటంటే తలుపుచెక్కతో నే రెండంటి సామెత లాగా తయారవుతుంది :)

    After marriage, husband and wife become two sides of a coin; they just can't face each other, but still they stay together అన్నాడట Al Gore.
    :) :)

    ReplyDelete