Friday, April 8, 2016

ఉగాది జిలేబీయం !

ఉగాది జిలేబీయం !
 
న్నది ఒక్క భూమి
గానము చేతము రండి
దినము ప్రతిదినము
జిగజిగ లాడు నది వోలె
లేమిని పారద్రోలి
బీరపు నడకన
యందరి జీవనము
శుభస్కరము
గానన్ !
 
అందరికీ
దుర్ముఖి నామ సంవత్సర
శుభాకాంక్షలతో
జిలేబి
 
వినుమ! జిలేబీ ! తొలగును 
జనగణ బాధాకరము! వసంతము వచ్చెన్,
మన యధినాయకులు తెలివి
గొని యెల్లర మేలుగూర్చగోరిన మేలౌ !
 
ఇదిగో వచ్చెను దుర్ముఖి !
ఇదియెల్లరికిని శుభముల నిచ్చును జూడన్!
పదవే యుగాది ముగ్గులు
విధముల వాకిట జిలేబి విరివిగ వేయన్ !
 

5 comments:

  1. మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. Ugadi Shubhaakaankshalandee. Jilebi gaarante Dr Anantha laxmi garaa?!

    ReplyDelete
  3. తీపి బదులు 'జిలేబి' దట్టించి, భళిర
    భళి! 'ఉగాదిజిలేబీయ' పచ్చడి తిన
    బెట్టినారె!, 'చతురులు', తీపి పడదు మరి
    మాకు , పండితులకు బెట్టి మహిమ గనుడు .

    ReplyDelete
  4. అయ్యర్ సమేత జిలేబి గారికి ఉగాది శుభాకాంక్షలు �� _/\_

    ReplyDelete
  5. టక్కు టమార విద్యల వల్లి
    చక్కగా చక్ చక్కున పద్యాల నల్లి
    మక్కువగ చిక్కుల బెట్టునీ తల్లి
    ముక్కుల బట్టి బ్లాగుల కెల్లెళ్లి

    ఉగాది శుభాకాంక్షలు,
    మీకూ, అయ్యరు గారికి...
    ___/\___ ...

    ReplyDelete