Friday, June 10, 2016

మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)

మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)


ఈ మధ్య వరస బట్టి మన సో కాల్డ్ అహ్మద్ చౌదరి (!?) బ్లాగు లు సాక్ష్యం + కసక్ writes మా మాలిక లో టాప్ లైన్ లో ఉంటా వుంటే ( ఈ రోజు కూడా ఉంది :) మిగిలిన లేటెస్ట్ అప్డేట్ అయిన ఏ బ్లాగు అయినా స్క్రోల్లింగ్ లో దాని క్రిందే ఉండే లా కని పిస్తుంది !

వార్నీ ఏమి మాయ జేసినాడు అహ్మదు అని రెండు మూడు రోజులు వరసబెట్టి గమనిస్తే అర్థమయి పోనాది :)

అబ్బోడు ఓ టపా కొట్ట గానే అది మాలిక లో స్క్రోల్లింగ్ వచ్చేసాక దాన్ని మళ్ళీ అప్డేట్ మోడ్ లో ఫ్యూచర్ డేట్ లో అప్డేట్ చెయ్యటం మొదలెట్టేడు !

హద్దరి బన్నా ! ఇదన్న మాట బగ్గు మాలిక లో అనుకుని సరే పోన్లే మనమూ ఓ రాయి వేసి  చూద్దామని నా టపా నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం అన్న టపా లాస్ట్ శని వారం పెట్టింది మళ్ళీ అప్డేట్ మోడ్ లో బెట్టి ఫ్యూచర్ డేట్ అంటే ఇవ్వాల్టి తారీకుకి (ఇది తారీకే :) తారీఫు కాదు జేకే ! ) అప్డేట్ చేసి గమనిస్తా ఉంటె ఆ టపా స్క్రోల్లింగ్ లో మాలిక లో ఇవ్వాల్టి దాకా టాప్ లైన్ లో నాట్య మాడింది :)

హన్నా ! మా లక్కు పేట రౌడీ నిదుర లే ! అని ఓ సూచనా ప్రాయం గా కామెంటు కందం కూడా ఒక్కటి ఇచ్చుకున్నా !

ప్చ్ ! అన్న రౌడీ చూసారో లేదో తెలీదు !

సో ఈ టపా !
మీ టపా మాలిక్ లో స్క్రోల్ టాపర్ చెయ్యా లనుకుంటున్నా రా ! అయితే వెంట నే పై చెప్పిన విధం లో ప్రొసీడ్ అయి పోండీ !


నారదాయ నమః !

చీర్స్
జిలేబి

Wednesday, June 8, 2016

నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !

 
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !
 
కాస్తా విను చిన్నమ్మా !
విస్తార మయినది లోక విస్మయ రీతుల్
చూస్తున్న మేర కలయే !
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !శుభోదయం!
జిలేబి

Thursday, June 2, 2016

జూన్ రెండన 'తారీఫు' !

జూన్ రెండన తారీఫు ! 

 
ధర్మ పక్షము నాడిగా ధర్మ మార్గ
మందు జనులెల్ల నుత్సాహ మతిశయింప
తెలుగు గడ్డకు రెండన తీరు లొచ్చె!
జూను రెండవ తారీకు చుక్క లొచ్చె
!
 
కర్మ మార్గపు దారిన  కాంగిరేసు
పూని విభజింపగ జనుల వునికి తెలిసె
బాగు పడుదురు మునుముందు  భారతీయ
జనుల మాటకు విలువయు జాల కలిగె !
 
చిన్న రాష్ట్రాల  పాలసీ చిగుర తొడిగె
దేశమున కిది మేలు సందేశము యన 
నేడు తెలుగు వారి పలుకు నేర్పు  తెలిసి
భాజపా కూడ  జతగట్టి  భాగ మయ్యె !
 
దుష్ట పార్టీలనిరి వారు తోడుదొంగ
లనిరి తప్పేమియునులేదు రాజకీయ
నాటకము! జన వాహిని నాడి తెలియ
గుండె దిటవు గలిగి తెలంగాణ తెచ్చె!
 
బాట  యిదికాదని జనులు భావ గీతి
గ యిక తప్పొప్పుల సరితూకమును వలదు !
రాష్ట్రమునకు నేడు వలయు రాజ మార్గ
ము! శరవేగము బోవలె ముందు సాగ

యింపుగా వచ్చినది వారి  యిచ్చ ! తెలివి 
గలిగి యాంధ్రుడు మేలగు కాల మిచ్చు
విభవమొప్పార సత్కీర్తి ప్రభలు తోడ
తేజరిల్లవలె  భువిని  దిక్కులదర!

తెలుగు వారి విజయములు దేశమునకు
నాత్మశక్తి యొసంగుచు నవత  నిచ్చు 
కాల గతిలోన మనకెల్ల!   కరుణ జూపు 
ధర్మపరులకు దైవమే దారి చూపు

కాన పునరంకితులు కండు జూను రెండు
నవ తెలంగాణ రాష్ట్రము నాది యనగ
నవ నవోజ్వల దివ్యాంధ్ర నాది యనగ
చెప్పి ఘనదీక్ష బూనుడీ చిత్తములను!
 
తెలుగు తేజమా యీదీక్ష తీసు కొనుము
తెలుగు వీరుడా యీదీక్ష తీసు కొనుము
తెలుగు యామినీ యీదీక్ష తీసు కొనుము
అందరీ దీక్ష గొనవలె  యనె జిలేబి ! 
 
శుభోదయం!
చీర్సు సహిత
సావేజిత
జిలేబి