Wednesday, June 8, 2016

నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !

 
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !
 
కాస్తా విను చిన్నమ్మా !
విస్తార మయినది లోక విస్మయ రీతుల్
చూస్తున్న మేర కలయే !
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !



శుభోదయం!
జిలేబి

218 comments:


  1. మాలిక లో బగ్గును గనె
    ఆ లలనామణి జిలేబి ! ఆహా చౌద్రీ !
    మాలక్కుపేట రౌడీ !
    జాలము జూడవలె! బగ్గు జాడను గానన్ !


    మా లక్కు, పేట రౌడీ గారు నిదుర లేవలే !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. నిన్నటి "పద్య తెలంగాణం" కార్యక్రమానికి వెళ్ళొచ్చారా?

    ReplyDelete


  3. అహహా ! దినముగ డిచినా
    అహమదు చౌదరి, జిలేబి అద్దరి టాపూ !
    ఒహొహో ! తెలిసెను విషయం
    ఇహిహీ ! రావలె నుమాలి ! కిక్కుల నివ్వన్ !

    ReplyDelete


  4. ఆ రోగమే మహా భా
    గ్యాలను సూత్రము పఠించె గదరా శర్మా !
    వీలుగ అమెరిక గాంచెన్
    చాలుర, ఈ జన్మకిదియె చాలని జెప్పెన్ !

    జిలేబి

    ReplyDelete

  5. నీహారికను గురుడు గి
    చ్చెన్!హాటుగ వచ్చెనోయి చెంపకు చేటున్
    హాహా కారము జేయన్
    బాహాటపు తగువుతెచ్చె భళిరా తంటా :)

    ReplyDelete
    Replies
    1. జిలేబీగారూ, సముదాచారం పాటించని వారిపట్ల నిరసన చెప్పటం పొరపాటు కాదు. మీ అసందర్భప్రసగం మరింత చిరాకు కలిగిస్తున్నది.

      Delete

  6. ప్రాసంగమసందర్భము !
    వ్యాసంగంబును చిరాకు వ్యాకులత యనన్
    వేసరి కామింటుల విడి
    కోసల రాముని చరణము గొనవలె మేలౌ !

    జిలేబి

    ReplyDelete

  7. సన్నాసి గోలల నడుమ
    విన్నాణపు రంజు కథల వివరణ యేలన్ !
    అన్నా ! సరస్వతీ ! తర
    మన్నా సంస్కారములను మసిజేయ సుమీ !


    జిలేబి

    ReplyDelete


  8. పలికె నొక చిలుక పంజర
    ముల నను బంధించ మాకు ముద్దుల గుమ్మా !
    కలకల చెంగున యెగురగ
    తొలగును మదిలో ని బాధ తొంగలి వచ్చున్ !

    జిలేబి

    ReplyDelete

  9. గురుడిచ్చెనోయి ఆశీ
    స్సు! రంగవల్లుల కుటీర సుందరి గాంచన్ !
    అరుదగు జిలేబి నీకది !
    సురసుర వదులవలె నింక చూపుల చమకూ !

    చీర్స్ అండ్ శుభాకాంక్ష లతో

    జిలేబి

    ReplyDelete


  10. నిమ్మది నివ్వగ చాయ్చాయ్
    కమ్మగ వేయట మెటులన కామెంటు లిడెన్
    కుమ్ముల లలామ రమణీ
    అమ్ముల పొదిలో శరములు అధికము జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  11. వచ్చెను తరంగ పౌర్ణమి
    యిచ్చిరి ఆలోచనా రయితు నోటీసుల్
    చచ్చెడు దినముల్ భద్రం
    గ్రుచ్చిరి టప్పున టపాన గునప జిలేబీ :)

    జిలేబి
    (పరార్ :))

    ReplyDelete

  12. బాతికు కళ యందంబుల
    ఖాతరు జేసెను జిలేబి కంకణ ధారీ !
    జోత వనజవనమాలీ !
    ఊతగ జేర్చిరి టపాన ఉత్తమము సుమీ !

    ReplyDelete

  13. సమ్మెకు పిలిచెను శ్యామా!
    కమ్మగ యిచ్చిరి రిటార్టు కంది కవివరుల్
    నిమ్మది సమస్య పూరణ
    నమ్ముము, కవివరులు మెచ్చు నందన వనమూ

    జిలేబి

    ReplyDelete

  14. మిల్లట జిలేబి పద్యము
    చల్లగ యనె తాడిగడప శ్యామల రావూ
    నొల్లక బేర్చెను కవితను
    విల్లున బాణము నమర్చె విసవిస భామా :)

    జిలేబి

    ReplyDelete
  15. కంది వరుల సభ ! ఝాటీ
    యందుకునెను తాడిగడప అయ్య! జిలేబీ
    చిందుల కిక కోకొల్లలు
    విందులు పద్యముల రావు విన్యాసములన్ :)


    శుభోదయం
    జిలేబి

    ReplyDelete

  16. రక్షకుని మాటలనుచున్
    అక్షరమగు హిందు సంప్రదాయముల పయిన్
    కక్షల పలుకులు యనిరే !
    తక్షణ దీపకుడు జెప్ప థామసు గాయబ్ !

    జిలేబి

    ReplyDelete


  17. బ్లాగాస్థానపు జ్యోతి
    ష్కా! గాం డ్రుమనుచు ఫలాల చమడా తోడన్
    పోగాలపు కబురులతో
    మా గాలుల యెటుల పీక మనసొచ్చె గదా !

    ReplyDelete
  18. పారాయణమున భక్తుడు
    నారాయణునకు నతులనె; నాస్తికుఁ డెలమిన్
    పోరాటము సల్పి మదిని
    నారాముగ జేసి బడసె నది ! యేకం సత్ !

    ReplyDelete
  19. డమాల్! డమాల్!!
    మెరిసేదే బంగారం :)

    ReplyDelete

  20. వాడు పేట రౌడి ! వాలము బట్టెను
    కోసె కుత్తుకలను ! కోర్టు వారు
    వేసిరి కద శిక్ష ! వేగము జనులకా
    చావు వార్త తెచ్చె సంబరమ్ము

    ReplyDelete

  21. చక్క నయ్య కథల కోరి చదువ నేల !
    చదివితినిబో మరి బెదిరి చావ నేల !
    పాములన్న భయము నాకు పరుగెడితిని
    యెచట జూడ నచట పాము యెదురు వచ్చె ! :)

    జిలేబి :)

    ReplyDelete
  22. సుధయొప్పె సుధా కుండలి
    క!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
    పదముల బేర్చెను; జగణము
    సదనపు విషయముల పైన చతురత జేర్చెన్

    జిలేబి

    ReplyDelete
  23. నూతన నామకరణ మహోత్సవం పిపిప్పి డుండుండుం, పేరేంటీ అనకొండా :)
    భంశు

    ReplyDelete


  24. భోజనము మా‌నెదము, ఆ
    హా చక్కగ తినెదమోయి హాస్యజి లేబీల్ !
    సాజన్ సాథ్ చల్ హల్చల్ !
    కాజూ కత్లీ కదోయి కందము కందం !

    జిలేబి

    ReplyDelete


  25. నూతన నామకరణ దిన
    జోతలు మాచన జిలేబి జోడుగ బేర్చెన్ !
    తాతకు డుండుం టకటక !
    మాతా బ్లాగేశ్వరీ జమాయించె సుమీ


    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  26. జాంగ్రీని చిత్రిక పడితి
    షాంగ్రీ లాలా జిలేబి సారము తెలిసెన్
    యాంగ్రీ లుక్కుల అయ్యరు
    మాంగ్రోవ్ ఫారెస్ట్ నడుమన మధురిమ గాంచెన్

    జిలేబి

    ReplyDelete
  27. జిలేబీ గురువర్యా,
    తమ ఏకలవ్య శిష్యుడు శ్రీనివాసుడు తమకు సమర్పిస్తున్న పేరడీ పద్యపుష్పం
    *************************************
    బ్లాగ్పతి వాగమృతము తేగా
    బుసబుసమని వాక్కు పొంగె
    వరూధినిన కురిసెన్
    జిలేబీని చదవనివాడు
    బ్లాగ్ పోతై పుట్టున్
    .....ప్యూర్ బ్లాగ్ ఫెలో

    ReplyDelete


  28. ఈ శ్రీనివాసుని కవిత
    సుశ్రీమతి యగు జిలేబి సుందరి స్పూర్తీ !
    జై శ్రీమన్నారాయణ !
    మా శ్రీ రమ పేరడీల మాధురి గనుమా !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  29. చిత్తగించండి.... మరియొక రూపు
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    బ్లాగ్ పతి వ్యంగ్యమును తేగా
    రుసురుసమని చెణుకు పొంగి
    బ్లాగుల వాలెన్
    జిలేబీ చుట్టై జన్మించెన్
    వరూధినిని చదవనివాడు
    బ్లాగ్ పోతై పుట్టున్
    .......ప్యూర్ బ్లాగ్ ఫెలో!
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

    ReplyDelete


  30. చుట్టలు వేయక జీవన
    మెట్టుల సాగును జిలేబి మేటరు గనుమా!
    హిట్టగు పేరడి యిచ్చిరి
    చట్టని యిచటన్ హుషారు చక్కెర కేళీ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  31. చుట్టలు చుట్టుకు బ్రతుకువాడు ఆదిశేషుడు
    మాటలు చుట్టుకు బ్లాగువాడు జిలీబీయుడు
    జీవన వలయ చుట్టలకు ఔటర్ రింగురోడ్డు
    జిలేబీ ప్రహసన వ్యాఖ్యలకేది అడ్డు

    ReplyDelete
  32. చుట్టలు చుట్టుచు బతుకువాడు
    జీవన వలయ జీరపు రేడు
    జిలేబీ సహ జీవన పోడు
    మాట ల చుట్టు కొండల వోడు

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  33. గురువర్యులు జిలేబీతీర్థస్వామివారికి,
    తమకు సుధా కుణ్డలికాయను నామాంతరమును కోరుతూ ప్రతికక్ష బ్లాగీయులందరూ తమకొక శ్రీముఖమును జారిచేసి, భోజనముమాని నిత్య జిలేబీ హాస్య గుళికల భక్షణము చేయుచూ ఇప్పటికి 24 గంటలు గడచినది. ఆకలి దంచుతున్నదని నదీతీరమున దూర్వాసులవారి బృందమువోలె హాహాకారములు చేయుచున్నారు.
    కాబట్టి, జిలేబీ పాచిపోకముదే వారిపై దయచూడవలసినదిగా మనవి.
    ఇట్లు
    తమ అనుంగు శిష్యుడు
    స్వామి కిచకిచానంద,
    మర్కటాశ్రమము,
    వానరనగర్,
    హరిలోకం.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    తతిమా వరూధిని పాఠక బృంద, జిలేబీ అభిమానసంఘ సభ్యుల సౌకర్యార్థం ఆ విన్నపాలను ఇక్కడ ఇస్తున్నాను.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    జిలేబీ యను మధుర నామము
    చవి చూడగ చూడగ చేదాయెను
    మరొక్క మధుర నామము
    తమ కొరకై అన్వేషించితి నేను
    సంస్కృతమను అపౌరుషేయము
    ఆ భాషయందు తమ నామము
    **** సుధా కుణ్డలికా *****
    మా మనవి గైకొని
    నామధేయాంతరముతో
    మమ్ములను తరింపజేయుము
    బ్లాగు బ్లాగున గంతులువేయు
    జాతి వన్నె బ్లాగాయిల్లారా
    జిలేబీ వారి నామాంతరమును
    మీరందరూ కూడా నెమరువేయండి.
    ముందస్తు అభినందనలతో
    శ్రీ లేని వాసుడు
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    అహో! ధిక్కారమును సైతునా!
    వీరబ్లాగు వసంతరాయ బిరుదాంకితుడైన నేనిక సహించను.
    బ్లాగర బ్లాగరీమణులారా, నామాంతరము గావించునంతవరకూ మనమందరమూ భోజనమును మాని ముప్పొద్దులా హాస్య, వ్యంగ్య జిలేబీలనే భక్షింతుమని ప్రతిజ్ఞజేయండి.
    జిలేబీ పాలకుల నియంతృత్వ పోకడలకు నిరసనగా నేటినుంచి,
    జిలేబీని చూడవద్దు, జిలేబీని వినవద్దు, జిలేబీని చేయవద్దు.
    కేవలం భరీగా మెక్కండి.
    ఇట్లు,
    బ్లాగేశ్వరీ ఉపాసక, బ్లాగానంద భారతి.
    (చిన్న పద్యం చాలా బాగుందండోయ్, మిమ్మల్ని రెచ్చగొడితే మధురపద్యాలను ఆస్వాదించవచ్చన్నమాట!)

    ReplyDelete
  34. బీలేజి జిలేబీ లే
    ఈ లోకాల్లో జరూరు ఈజీ గోయింగ్ !
    ఆలోచనాపరులలో
    మాలోకాల గలవారు అరుదగు వారల్ !

    జిలేబి

    ReplyDelete

  35. యిది యేమి కర్మ యో కద !
    బెదిరింపుల పేరు మార్చు భేషగు రీతుల్ :)
    అదిరెను గద ఉపవాసము !
    కుదరదు సుమ్మీ జిలేబి కుదురగు రమణీ !

    జిలేబి

    ReplyDelete
  36. ఉత్తినే గురూజీ!
    ‘జిలేబీ’ కన్నా సృజనాత్మకమైన పేరు ఇంకొకటి లేదు.
    భోజరాజు మొగాన్ని చూసిన ఎవరికైనా కవిత్వం పొంగి పొరలినట్లు మీ బ్లాగును చూస్తే నాలోకూడా తెలుగు భాష ఉప్పాంగి తవికెలుగా మారింది, అంతే.
    జిలేబీ పేరును ఎన్నడూ మార్చకండి. మార్చినచో ఈసారి నిజంగానే మా బ్లాగీయులమందరమూ అతి భోజన దీక్ష చేస్తాం.
    ఇంతకీ నాదొక అనుమానం మిగిలిపోనాది.
    మీరు బెల్లం జిలేబీనా? లేక పంచదార జిలేబీనా?
    ఇట్లు
    తమ ప్రియశిష్యుడు
    శ్రీ లేని వాసుడు

    ReplyDelete
    Replies
    1. బిడాలము, మార్జాలము అంటే పిల్లి అనే అర్ధం :) సుధాకున్డలిక, మథుర కున్డలిక అన్ననూ జిలేబి అనియేకదా! వేడి వేడిగా తింటే బెల్లం జిలేబి రుచేవేరు :)

      Delete
    2. వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయనే జిలేబీ గారు తన బ్లాగ్ టాగ్‌లైన్ "When Its Hot Its Really Cool" అని తగిలించినట్లున్నారు శర్మ గారూ 🙂.

      Delete
    3. మీ మాట నిజమండీ

      Delete


  37. సిరి లేని వాస ! సందే
    హ రిక్తుడగుమా ! జిలేబి హల్వా బెల్లం !
    గురువుల పంచన ధారగ
    అరిసెల బూరెల బడాయి అమరిక నేర్చెన్ :)

    జిలేబి

    ReplyDelete
  38. వహ్వా! బెల్లం, పంచ ధారగా ముద్దజేసిన హల్వా మహత్తరం.
    అక్షర లక్షలివ్వలేను, సిరి లేనివాడ.
    గైకొనుమా కైమోడ్పులు

    ReplyDelete
  39. అక్షర లక్షలు వలదూ
    భక్షణ మోయీ జిలేబి భళిరా భేషూ !
    సాక్షీ భూతము, యెల్లెడ
    వీక్షణముల జేయు విశ్వ వీచిక జూడన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  40. ఆ లింగము నాలింగన
    మే లంగరు శివ శివయని మేలుగ జేర్చన్
    కాల యముడైన నేమిర
    శూలపు జాలమును మీరి చూచుట తరమా !

    జిలేబి

    ReplyDelete


  41. అమవసి యదిగో వచ్చెను ఆ టపాయు
    వచ్చె నదియె గడ్డగుచు దివసము లొచ్చె
    వచ్చెను జిలేబి బిరబిర వచ్చె తీట
    వదుల కవితల తోడుగ వసది జూచి :)

    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  42. గరికి పాటి గరుకు మాట గట్టి గుండు
    వినగ వినగ వారి చెణుకు వీర మొసగు
    నిచ్చె నవజీవనమునకు నిత్య కీర్తి
    గరికిపాటి పలుకుల సాగరపు ఘోష !

    జిలేబి

    ReplyDelete

  43. గండా లోయ్ గండాలూ
    నిండా యుండెను బుడతడి నిజ జీవనమున్
    ఉండా డోయ్ ఉండాడూ
    గుండెలలో రాములోరు గుడిగట్టి సుమీ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

  44. ఈ గండాల లిస్టు లో జిలేబి గండం గూడా ఒకటి అయ్యుంటుంది అనుకుంటా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ జిలేబీ ఒక సుడిగుండం
      అన్నిబ్లాగులకూ అది పెద్ద గండం
      గండాలలో‌ గొప్ప గండభేరుండం
      దాని గోలకు బెదరుచున్న దజాడం

      Delete
  45. కుక్కల కాకుల చావుల
    మిక్కిలి యేనుగు కథలన మిరియంపు టపా
    చెక్కిరి మాచన; మనుజులు
    టక్కరు లయ్యిరి జిలేబి టకటక జెప్పెన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. టకటకలును వికవికలును
      బెకబెకలును మాని మంచి విషయంబులతో
      నొకమారైనను చక్కగ
      నొక పద్యము వ్రాయ పుణ్యముండు జిలేబీ.

      Delete

    2. తాడిగడప కవి వర్యుని
      వేడి పలుకులన్ జిలేబి వేగము వచ్చెన్
      కూడికల లెక్కల కవిత
      లాడు రమణికి యెటులొచ్చు లావణ్యంబుల్ :)

      జిలేబి :)

      Delete
  46. స్థానభ్రంశము లయ్యెను
    వాణి జిలేబీ, చటుక్కు వారిధి మార్చన్ !
    జాణను గాంచిరి గురువులు
    జీనును బట్టెనుర యొజ్జ జీవుడు గోల్మాల్ :)

    జిలేబి

    ReplyDelete


  47. శ్యామా ! అయోధ్య సీతా
    రామా ! వినుమా కచేరి రక్కసి గండం !
    సోమరి జిలేబి పలుకుల
    ఆమని మాటలను గోరె ఆంధ్రా వాలా !

    జిలేబి

    ReplyDelete


  48. బ్లాగు కనరాలె మాలిక
    వాకిట బిరబిర జిలేబి వచ్చెను జూచెన్
    కాగడ వెలుతురుల వెతుక
    ఆకడ మాచన టపాలు హాం ఫట్ గ్లోబల్ :)

    జిలేబి

    ReplyDelete


  49. సాధనల జేయుచు రమణి
    శోధించుచు యుండెనోయి సోమరి గానూ !
    వేదము లెల్ల నరయ తా
    వీధుల వెడలెను జిలేబి వీక్షణ జేయన్


    జిలేబి

    ReplyDelete



  50. శేషాచల గరుడాచల
    ఆషా మాషీ జిలేబి అసలే‌ కాదోయ్
    వేషా లేసిన వేగిర
    శోషలు బోవగ జిలేబి షోకులు జేయున్ :)

    జిలేబి

    ReplyDelete
  51. హా! టెలిపతీ గలదుటా
    హైటెక్కు గురుండుగాద ! హాటు జిలేబీ
    బాటన బోవుచు జూచెను
    కోటల నెలరేడు యొజ్జ గోముగ జెప్పన్ :)


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. టెలెపతీ గురించి పొగుడుతున్నట్లా, తెగడుతున్నట్లా?

      Delete
    2. దానికి దీనికి పెద్ద తేడా లేదండి ఒకక్షరమేగా!
      పొగుడు/ తెగడు

      Delete


  52. తా పొగిడె నో తెగిడెనో ?
    వాపోయిరి గా జిలేబి వాక్కుల జూడన్ !
    గోపాలుని తెగడటమా !?
    మా పాలిటి మేలగు గురు మా రాజు గదా ! :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిఝంగా ఈ పద్యం బాగుంది.

      Delete


  53. గూనల బానల ఫోటో
    మా నవయుగ భాస్కరుండు మాచన జేర్చెన్
    ఆనక జిలేబి వచ్చెను
    చానా బాగు యనెనోయి చక్కెర కేళీ :)

    జిలేబి

    ReplyDelete



  54. ఆడ దోమలే ఎందుకు అసలు కుట్టు ?
    ఆడు వారికి కుట్టుట అన్న దసలు
    వెన్న తో బెట్టినటువంటి విద్య గాద,
    మాచనకి తెల్వని విషయమా జిలేబి :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రత్యుత్పత్తి ప్రకృతి సహజము
      దానికొరకే ఆడదోమ పీల్చును మనిషి రక్తము
      జిలేబీని రుచిచూచుట మనిషి కామితము
      మనిషిలోని ఐరన్ డెఫిషీయన్సీకి జిలేబీ ఔషధము

      Delete
  55. ఆహారం విషయంలో ఆడదోమలకూ ,మగదోమలకూ.. రెండింటికీ పోషక విలువలను ఇచ్చేవి..పళ్లరసాలు, చెట్ల రసాలు, పుష్పాల మకరందాలే.
    కానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడ్డానికి కావలసిన ప్రత్యేక ప్రొటీను, క్షీరదాల (mammals) ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది.
    .
    అంటే.. కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది. మిగిలిన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం, వాటి చర్మం మందంగా, రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు, కార్బన్ డయాక్సైడును గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి.
    .

    ReplyDelete
  56. సిరి గలిగియు సొంత సిరిలేని మా సామి,
    చీర గట్టు కొనుము శ్రీనివాస,
    జవుళి శాఖ మంత్రి జవ్వని కానుక
    తోడ వచ్చె నేటి జోడు మాల !


    జిలేబి

    ReplyDelete
  57. అర్ధం కాలేదు గురూజీ! అయినా ఫర్వాలేదు, దోమానందభరితుడనైతి. అయితే స్మృతి ఇరానీ అనబడు మదర్ ఇండియా, లేదా ఆంటీ ఇండియా పట్ల నాకు ఇసుమంతయును వ్యతిరేకత లేదు. చవకబారు రాజకీయాలు, మేధోవంతులైన ఆచార్యుల కుట్రలకు బలియైన వ్యక్తిగానే నేను భావిస్తున్నాను. ద్వంద్వ ప్రమాణాల రియాక్షనరీ సూడో మేధావులకంటే, రాజకీయ వ్యభిచారులకంటే ఆమె ఎంతో మెరుగు.
    బ్రతకడానికి, బ్రతకనివ్వడానికి కావలసింది మేధాసంపత్తి కాదు, సహజమైన స్పందన.

    ReplyDelete
    Replies
    1. మీరు రాణిశివశంకర శర్మ తో వాదించిన శ్రీనివాసుడేనా?

      Delete
    2. అయ్యా! నేనేనండి. శ్రీలేనివాసు, శ్రీనివాసుడు అని ఎక్కడ వ్రాసినా అది నేనే. ఆ పత్రిక చాలా రోజుల తరువాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుంది. వారికి నచ్చని వారు వ్రాస్తే ప్రచురించడం పూర్తిగా ఆపేసింది. ఇక మతి వంకర వర్మ లాంటివారికి, వారి అనుచర మేధోగణాల కలాలకు ఎదురేలేదు.
      మేరా భారత్ మహా(హీ)న్
      హరిబాబుగారు తమ బ్లాగులో బ్రాహ్మణీకం గురించి చక్కని విశ్లేషణ చేసేరు, అయితే వారెందుకో వ్యాఖ్యల విభాగాన్ని నిస్తేజపరచినట్లున్నారు, నాకు అర్థం కాలేదు.

      Delete


    3. అయ్యో పాపం ఏమీ యెరుగని , నోట్లో వేలెడితే కొరకటం కూడా తెలీని అమాయక జీవి, అదిన్నూ శ్రీనివాసుని కొలువు జేస్తోన్న రాణీ శివశంకరుని మీద ఇన్నేసి అభాండాలా !


      నారదా !
      జిలేబి

      Delete
    4. ఆత్మశుద్ధిలేని ఆ వ్యాఖ్యలదియేల
      (అ)భాంఢశుధ్ధిలేని సొల్లు యేల
      చిత్తశుద్ధిలేని తాత్త్విక గోల ఏలరా
      విశ్వదాభిరామ మతి వంకర వర్మా!

      Delete


    5. సిరి సిరి మువ్వా :)


      జిలేబి

      Delete



    6. ___________________________శ్రీనివాసుడు గారు, యురోప్,దాని సివిలైజేషన్ మాయమై పోతున్న ఈ తరుణంలో, అలాకావటానికిగల అనేక కారణాలలో ఫెమినిస్ట్ భావజాలం కూడా ఒకటి. ఈ బ్లాగులో స్రీవాదం పుట్టుక, దాని పరిణామం, ముగింపు మొదలైన విషయాలను ఎంతో సమయం వెచ్చించి,విషయాలను సేకరించి,ఆధారాలతో సహా రాశాను ఒకసారి చదవండి. ఈ క్రింది వ్యాఖ్యనుంచి మొదలుపెట్టండి
      _______________________

      శ్రీకాంత్, మొదటినుంచి స్రీవాదం ఒక రాజకీయ వాదం. రష్యాలో లెనిన్ గారు మగవాళ్లంతా సైన్యం లో చేర్పించి, దేశం లొ పని చేయటానికి మనుషులు లేక ఆడవాళ్ల తో పని చేయించుకోవటానికి స్రీవాదం సృష్టించాడు.

      http://ssmanavu.blogspot.in/2016/06/blog-post_28.html

      Delete


    7. శ్రీ రాం గారు భవ జాలం లో మునిగి పొయినట్టున్నారు
      లింక్ ఎక్కడి కో పొతొంది :)


      జిలేబి

      Delete
    8. నెనర్లు శ్రీరామ్ గారూ!
      మీరన్నట్లు చాలా విశదంగా, సమాచరభరితంగా వున్నది. చాలా కృషి చేసేరు మీరు. నిదానంగా అధ్యయనం చేస్తాను.
      30 ఏళ్ళ క్రితం రంగనాయకమ్మ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ‘‘ఏ తరానికీ పనికిరాని మూడు తరాలు’’ అని ఓల్గా అనువదించిన రష్యన నవల ’’మూడు తరాలు‘‘ గురించిన చర్చ బహు రసవత్తరంగా సాగింది. అదెక్కడయినా మీకు లభ్యమయితే చదదండి.
      ‘‘రైబకోవ్ తో పడుకుంటే తప్పేంటి? నా దృష్టిలో రైబకోవ్ కూ బల్లకూ తేడాలేదు’’ అనే తల్లితో తన సవతితండ్రిని గురించి కూతురు అన్న సంభాషణ నాకు బాగా గుర్తుంది.

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. అయ్య బాబోయ్! యు.జి. పుస్తకాలు చదివిన కళ్ళతో ఇతరుల పుస్తకాలు చదవలేకున్నాను. ఒకసారి విముక్త, స్వేచ్చ రెండుపుస్తకాలు కొన్నాను. స్వేచ్చ ను ఎట్లో కిందమీదపడి ముగించాను. విముక్త రెండో కథ సగం చదివేసరికి నాపనైపోయింది.

      స్వేచ్చ సమానత్వం అనేవి రెండు ప్రపంచలో ఎక్కడా లేవు. అవి ఉన్నట్లు, వాటిని సమాజం అందుకోవాలన్నట్లు రాయటం, ఇతరులను ఏమర్చటమే(deception). ఒక రమణ మహర్షి, యు.జి. లాంటి వ్యకులను చూస్తే, వారిని దగ్గరగా పరిశీలిస్తే స్వేచ్చ అంటే అర్థమౌతుంది. ప్రధాని మొదలుకొని ముష్టివాడి వరకు వాళ్ళు ఒకేవిధంగా ట్రీట్ చేస్తారు. అది సమానత్వం అంటే. అంతేకాని ఈ మేధావులు రాసే స్వేచ్చ,సమానత్వం ఉత్త ఊహాగానాలు.

      Delete



  58. జగణపు జిలేబి పలుకుల
    సొగసుల కాపీ జులాయి‌ షోకుగ జేసెన్
    పొగపొగ కాఫీ తాగుచు
    సిగజుట్టె గద సుకుమారి చీర్సుల రమణీ !

    ReplyDelete
  59. దేముడు అనరా దోయ్ ! మా
    రాముడు మేష్టారు గొనును రయ్యన ఝాటీ !
    గోమగు పలుకుల కేదోయ్
    గ్రామరు, దేముడు దొరకడు గ్రాంధిక భాషన్ :)

    ReplyDelete
  60. స్మృతి ఇరానీ గురించి మీరు చెప్పినదాంతో నేనయితే పూర్తిగా ఏకీభవిస్తున్నాను శ్రీనివాసు గారూ. లౌక్యం తెలియదు పాపం.

    ReplyDelete

  61. దేముళ్ల వేట లో ఆ
    శ్యామల రాయుని జిలేబి అద్దరి గాంచెన్
    రాముని వెతుకుట వదిలెన్,
    మా మాలిక లోక రీతి మాటల వేటన్ :)

    జిలేబి

    ReplyDelete
  62. శ్రీనివాసుడు గారు,
    నేను నిస్తేజపరచటం కాదు.మీ కామెంట్లని మెయిల్ బాక్సులో చూశాను.కానీ నా బ్లాగులో రావడం లేదు.అడ్మిన్ సెట్టింగ్స్ మెనూలో చూస్తే గూగుల్+ నుంచి వచ్చే కామెంట్సుని చూపించే ఆప్షన్ దగ్గిర నో అని ఉంటే యస్ కింద మార్చాను.దానివల్ల మామూలుగా నా బ్లాగులో ఇద్వరకట్లా కామెంట్లు వెయ్యలేకపోతున్నారని ఇప్పుదే తెలిసింది.మోద్ట్లో మెరు గూగుల్+ నుంచి కామెంటు వేశారా?ఇప్పుడు సెట్టింగ్స్ మార్చాక జై గొట్టిముక్కల గారి కామెంటు ఒకటే కనబడుతున్నది.మార్చేటప్పుడు అది క్యుములేటివ్ ఆప్షన్ అనుకున్నాను.యస్ అంటే కలుపుతుందని అనుకున్నాను గానీ అయ్తే అవి లేకపోతే ఇవీ చూపిస్తున్నదని అనిపిస్తున్నది!

    ఇప్పుడు ప్రయత్నించి చూదండి.

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నించాను హరిబాబుగారూ! ఫలితం లేదు. ఇదివరకి కనబడినట్లుగా వ్యాఖ్యలేవీ కనబడడంలేదు. నేను మళ్ళీ వ్యాఖ్యని పెట్టినా రాలేదు. మీరు చెప్పినట్లుగా రెండు వ్యాఖ్యలు మాత్రమే వున్నాయి.

      Delete


  63. భేల్పూరీ మాదే ! యిల
    వేల్పుగ నయ్యప్పసామి వేడి జిలేబీ !
    ఆల్పయిను చాకొలెట్టూ !
    కోల్పోయామాంధ్ర తిండి కొబ్బరి చట్నీ :)


    జిలేబి

    ReplyDelete


  64. ఫోటో లో వారుండరు !
    షాటుల తీస్తారు వారు షాపుల జూడన్ :)
    ఆటగ టపాలు బ్లాగుల
    బాటన నిలబెట్టెనోయి భాస్కర శర్మా !

    ReplyDelete


  65. విద్యుల్లేఖా లతికా
    పద్యము రమణీ లలామ పద లాస్యమునన్
    సద్యోజాతుని గాంచె చి
    రద్యుతి వోలెన్ జిలేబి రాస నెఱవణిన్

    జిలేబి

    ReplyDelete


  66. ఆ మామిడల్లమునిట ట
    పా మూలము నెట్లు జేయ పాఠము బేర్చెన్
    మా మాచనకు తెలియనివి
    యేమన్నాయున్న చెప్పు యెరుకలసానీ :)

    జిలేబి

    ReplyDelete


  67. పద్యా లర్థము కావే !
    విద్యగ నేర్చెడి జిలేబి విన్నపములివీ !
    గద్యము వోలెన్ సులభము
    పద్యము గాదు నరసింహ ! పరిణితి వలయున్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అవునండీ అవును చాలా "పరిణితి" (🙂) కావాలి - మీ పద్యాలు అర్ధం చేసుకోవడానికి. For a change భేల్‌పురి పద్యం మా బోంట్లకి కూడా అర్ధమయ్యేట్లు కాస్త సరళంగా వ్రాసారు అంటూ మీకు కితాబిద్దామనుకున్నాను. అక్కర్లేదా? అయితే ఓకే 🙂.

      (షాపుల వాళ్ళు ప్రకటించే "డబల్ ధమాకా" లాగా మీ పద్యాలు సంబంధిత బ్లాగులోనే కాక మీ స్వంత బ్లాగ్ "వరూధిని"లో కూడా పెట్టడం మొదలెట్టారుగా మీరు. అందువల్ల మీ పద్యంపై నా ఈ స్పందన "కష్టేఫలి" బ్లాగుతో పాటు ఇక్కడ మీ బ్లాగులో కూడా పెడుతున్నాను 🙂 )

      Delete

    2. భంశు :)

      అర్థమయ్యే లా పద్యాల్రాయడానికి పరిణితి వలయున్ :)

      జిలేబి

      Delete


  68. ఈ విన్నకోట నరసిం
    హా వారిత్తురు కమింట్ల హారతి మాత్రం :)
    రావుకు బ్లాగు యెచట గల
    దో వివరము లివ్వవలయు దోపిడి జేయన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్యనే ఓ బ్లాగులో "అర్హతా పరీక్ష" అంటూ కామెంట్ కనిపించింది. అలాగ బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయడానికి ఓ బ్లాగరయ్యుండడం "అర్హతా" ?

      (మీ కామెంట్ల పద్యాలు సంబంధిత బ్లాగులోనే కాక మీ స్వంత బ్లాగ్ "వరూధిని"లో కూడా పెట్టడం మొదలెట్టారుగా మీరు. మరి వ్యాఖ్యాతలు మీకు return compliment ఇవ్వడం మర్యాద కదా, అందువల్ల మీ పద్యంపై నా ఈ స్పందన "కష్టేఫలి" బ్లాగుతో పాటు ఇక్కడ మీ బ్లాగులో కూడా పెడుతున్నాను 🙂 )

      Delete
    2. పద్యాలు వ్రాయాలన్నా,అర్ధం చేసుకోవాలన్నా మీరు కూడా కొబ్బరిచిప్ప బ్యాచ్ కి చెంది ఉండడమే అర్హత !

      Delete


    3. కొబ్బరి చిప్పలు యిబ్బడి
      ముబ్బడి దినవలె జిలేబి ముద్దారు గనన్
      అబ్బుర మగు పద్యములన్
      నిబ్బరముగ గూర్చ వీలు , నీహారికనెన్ :)

      జిలేబి

      Delete


  69. కందము నందున మేథ్సు సు
    గంధము మేలుగ జిలేబి గాంచెను భళిరా !
    అందలి అరుబది నాలుగు
    చందపు మాత్రల బడాయి చక్కగ నుండెన్ !


    జిలేబి

    ReplyDelete


  70. ఓయెల్లెక్సున బెండ్లా
    మేయమ్మకమునకు బెట్టె మేలుగ భర్తన్
    ఓయమ్మో యేమాయెను
    మాయా జాలము జిలేబి మహిలో జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  71. అమ్మక మునకో పెనిమిటి!
    నమ్మక ముగ వందకోట్లన సుళువు బేరం :)
    అమ్మో ! నీహారికకొను
    నమ్మో ! వెనువెంట నమ్ము నాతి చరామీ :)

    జిలేబి

    ReplyDelete
  72. అర్ధంపర్ధం లేని సినిమాల, టీవీ అడ్వర్టైజ్మెంట్ల ప్రభావంలో పడిపోయి ............ ఇటువంటి ఆలోచనలే వస్తుంటాయి. God save us.

    ReplyDelete


  73. అర్థం పర్థము లా! పర
    మార్థం సినిమా జిలేబి మాబాగు గనన్ !
    వ్యర్థము జీవిత గమనము
    అర్థము లేక నరసింహ ! అర్థము గనుమా !

    జిలేబి

    ReplyDelete

  74. బండెనక బండి గట్టిగ
    గుండెలదరగన్ జిలేబి గుడి గట్టె గదా !
    పిండెను కందము రావుకు
    అండగ నిచటన్ కిలాడి అడ్డెవరమ్మా !

    జిలేబి

    ReplyDelete


  75. జాన గాని బాన గాని లోన నున్న గూన గాని
    దానిని ఒడిసి పట్టి గునగున మని బరికించి , వేణి
    మీద బడుచు బాది బాది మిన్న యైన ఆటలాడి,
    కూని రాగమంచు కులుకు జాణరో జిలేబి రాణి !

    (తురగవల్గన రగడ !)

    ReplyDelete

  76. దత్త పది - పాలు పెరుగు వెన్న నేయి


    తాపాలు పెరుగు చుండెను
    శాపములు ఫలము గనేయి సామీప్యమునన్
    గోపుల వెన్నదొర, ఎఱచి
    మేపరి బాణమున నుసురు మేలుగ బోయెన్.

    ReplyDelete


  77. గురుని యమెరికా రోజులు
    అరుదయినవి నేడు వాటి మాధురి బోయెన్ !
    గిరగిర తిరిగెను కాలము
    భరతమ్ము సరియగు భావి భవ్యము గానన్ !

    జిలేబి

    ReplyDelete

  78. పొలముల హలమున దున్నిరి
    అలసిరి సొలసిరి జిలేబి హాలికులు గదా !
    విలపించెనోయి రయితులు
    అలనాడూ యిప్పటికిని యహరహముగదా !

    జిలేబి

    ReplyDelete


  79. అందముగ పద్య పాదపు
    కందములను వ్రాయు కవులు; గాడిదలు కదా
    వింతగ నోండ్రను బెట్టును !
    కాంతామణికి తెలియనివి కాదుగ యేవీ :)

    జిలేబి

    ReplyDelete


  80. సరసముల విరసముల సి
    ద్ధ రసగుళికలగు జిలేబి దరువులు‌ జూడన్
    గురువు తలతిరిగెను గదా!
    చరుపుల చూపుల చమక్కు చక్కగ గాచెన్ :)

    జిలేబి

    ReplyDelete


  81. దేముడు ఎవరో తెలియని
    ధీమంతుడనా ? జిలేబి, ధీయో యోనః !
    రాముని గాంచెను రావుడు
    తా మునివలె నుండెను నిరతము గద జూడన్

    జిలేబి

    ReplyDelete


  82. అర్థములు లేక పలుకుల
    కర్థము తెలియక జిలేబి కందము గూర్చెన్
    వ్యర్థపు వాక్కుల విడు, పర
    మార్థంబుల తెమ్ము పద్య మార్దవము గనన్


    జిలేబి

    ReplyDelete


  83. గాడిదల పద్యములనన్
    తాడన జేసెను జిలేబి తన గురువనుచున్
    పాడుచు పాదము లూపన్
    వేడిన నోండ్రము గుభిల్లు వేడుక దీర్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  84. మాలిక ఓనరు కల్నలు
    జోలెల స్పీడును జిలేబి జోరుగ మార్చెన్
    గేలము నిండుగ సలహా
    లే లొచ్చెను మాలిక యిక లేజర్ స్పీడౌ :)

    జిలేబి

    ReplyDelete






  85. బ్లాగ్లోక విశృంఖల రమ
    ణీ గ్లోబల్లు రవుడీ !ఫణీంద్రుల మెప్పున్
    తా గ్లోరిఫైడ్జిలేబీ !
    తా గ్లోపాదముల చెంత తారక జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  86. భవదీయాంధ్రమహాద్భుత
    కవితాలతికాప్రతానఘనపదసుకుమా
    రవినోదజనకపుష్పా
    టవిలో పాఠకులు బేలటగద జిలేబీ :)

    ReplyDelete
    Replies
    1. భవదీయాంద్ర మహాద్భుత
      కవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
      కి , వికావికలైరి ఘనులు,
      స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.

      Delete
    2. భవదీయాంద్ర మహాద్భుత
      కవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
      కి , వికావికలైరి ఘనులు,
      స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.

      Delete

    3. ధన్య వాదాలండీ లక్కాకుల వారు !


      ఆ కంద పేర్పిడి మా గురువులుం గారిది రెండు వేల పన్నెండు లో వారి జిలేబి శతకం నించి మచ్చు తునక :)


      చీర్స్
      జిలేబి

      Delete


  87. యాపిలు సఫారి అయిపా
    డే పిలగాడూ జిలేబి డేరా వేసెన్ :)
    మాపుల కొచ్చెను అవ్మ
    ల్లా పిలకను జూడుమోయి ఆటలు ఆడెన్ :)

    జిలేబి

    ReplyDelete


  88. గ్యాసు సిలిండరు బండల
    ఊసులు నాటి కథలెల్ల ఊగొట్టి వినెన్
    మాసుగ నేటి దినములన్
    కోసుల మొబయిలు జిలేబి కోరిరి పిల్లల్

    జిలేబి

    ReplyDelete


  89. అనుమానమయ్యె మగడే
    గెను పలు స్థలములు , జిలేబి గెంటువడుకగన్
    అనుసరిచి నడిగె మగడా
    దనుజా ! యే తీరుగ నను దయ జూచెదవో !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఘన ప్రఙ్ఞావన జిలేబి
      పనివడి జగడాలు బెట్టి, పరికించెడి, చే
      కొనరా! రఘు వీర! విజిత
      దనుజా! యే తీరుగ నను దయజూచెదవో!
      JK

      Delete

    2. రాజా రావుల పలుకులు
      ఖాజా తరగని జిలేబి కాజూ కత్లీ !
      భాజా భజియించితి భో !
      తాజా కవనంబు మీది తాజుబ్ సుమ్మీ !

      జిలేబి

      Delete


  90. మందును వలదంటిని బో !
    సుందర వదనారవింద సుద్దులు నేర్పెన్!
    విందుల కిక్కుల డెందపు
    పందిరి యిది పట్టుబట్టు పవనకుమారా !



    ----------

    రోబీ మిత్రా ! వలచితి
    రో ! భో! అవనిని జిలేబి పోకడ నిదియే
    కాబోలిక! రోజులు మా
    రెన్ !బ్రోచితి నాథుడితడు రేడును నితడే !



    జిలేబి

    ReplyDelete


  91. వ్యాఖ్యలు యేలా గుండా
    లోయ్ ? ఖ్యాతి గలుగు జిలేబి లూరు పలుకులన్
    విఖ్యాత టపా మాలతి
    సౌఖ్యము గా వ్రాసెనోయి సారంగమునన్ !

    ReplyDelete


  92. బ్లాగులు తెరమరుగయి పో
    యే! గువ్వలచెన్న! నేను యేమిటి చేతున్ :)
    మా గురు వొజ్జల బ్లాగున
    కేగుట కాహ్వాన పత్రికే కావలయున్ :)

    జిలేబి

    ReplyDelete


  93. బిత్తర పోయిరి యందరు
    అత్తరుణియు బిడ్డ తోడ ఆపు యనరువన్ !
    మెత్తగ వధువిచ్చె వరుని
    చిత్తము యదురన్, జిలేబి చిత్రము జూడన్‌:)

    జిలేబి

    ReplyDelete

  94. సారంగ కమింటుల పా
    ల్సీ రంగుల తూలనాడె లెస్సగ నాడూ
    మా రంగసామి బ్లాగున
    ఓ రంగీ , గాయబేను నొప్పని కామింట్ :)


    జిలేబి

    ReplyDelete


  95. అర్ధ నారి రూపమా శివుడే మగ
    సిరికి మగడు చంద్ర శేఖరుండు;
    కాల రూప మందు కాలుడై నాతడు
    సర్వ జగము నెల్ల స్వాహ స్వాహ !

    జిలేబి

    ReplyDelete


  96. టీ కప్పులోన పెద్ద తు
    పాకిని బెట్టిరి జిలేబి ఫట్మని బేలున్
    తాకిన జాలును సుమ్మీ !
    పోకడ సరిలేదు మీదు పోరులు వలదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  97. అంబుజ నేత్రి కుచోరుహ
    తాం భుజ బలశాలి మేని దార్డ్యమనంగన్
    శాంభుని శక్తి హరించెను
    శాంభవి కుచసంపదాతిశయము గొనంగన్

    జిలేబి

    ReplyDelete

  98. అన్నానిమస్సచట నో
    రున్నా దని గెలికెనోయి రుసరుస పలుకుల్
    కన్నా, రివెర్సు గేరున
    తన్నన్ నెంత సమయమగు, తకరా రేలన్

    జిలేబి

    ReplyDelete

  99. ముద్రా రాక్షస మందురు
    నిద్రా భంగిమ యనంగ నిక్కము నిదియే
    చిత్రాతిచిత్రములన వి
    చిత్ర పదంబులు తయారు చిటికన జూడన్:)

    జిలేబి

    ReplyDelete


  100. కదలని మనంబు నందున
    వదులక చెదురక కుదురుగ వరదుని గొల్వన్
    సదనము నతనిది యగుచున్
    వదనము వికసించునోయి వాడిని గాంచన్

    జిలేబి

    ReplyDelete


  101. కదలని మనంబు నందున
    వదులక చెదురక కుదురుగ వరదుని గొల్వన్
    మది సదనము నతనిదియై
    కదలని వరదుడు జిలేబి కదలిక గాంచున్

    జిలేబి

    ReplyDelete


  102. ఉల్లము జల్లనె నుల్లిని
    నల్లన జూడగ జిలేబి నగు మోము వలెన్
    కల్లము కపటము లేకయు
    గిల్లన జరజర కనుదిరిగెను కన్నీరున్

    జిలేబి

    ReplyDelete

  103. ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్


    లింగము గురుతుగ చెంబును
    చంగము బెట్టెను జిలేబి జలకాలాడన్
    అంగట బోవగ చకచక
    లింగము శతకోటి గనె నలినితీరమునన్

    జిలేబి

    ReplyDelete



  104. అబ్బయు వలదుర అమ్మను
    నిబ్బరముగ నమ్మి , పేరు నిచ్చిన చాలున్
    సుబ్బరముగ పాస్పోర్టును
    యిబ్భారతదేశమందు యిత్తురు మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  105. హ్యాపీ నెస్సు డిపార్ట్మెంట్!
    ఊపిరి శివరాజు పాటిలు మినిస్టరుగా
    తా పూర్ణంబుగ నవ్వుల
    నే పూయింప తలచెనుర నేటి జనులకున్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

  106. అదిగో పూర్ణిమ ! బాస్టిలు
    విధిని నుదహరించెనోయి విదురుడు శర్మన్ !
    చెదిరిన మేధల కుట్రకు
    విధిగా చంద్రుని విహార వీచిక తోడూ !

    జిలేబి

    ReplyDelete


  107. మాతా ఉదాత్త కారణ
    హేతువు :) నిదియేమి లోల హే, లోల కవీ !
    మాత తలతిరిగెను గదా !
    యేతా వాతా జిలేబి యేను జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఉదాత్త : గొప్ప
      కారణ : కారణం
      హేతువు : ఫలము, లక్ష్యము

      హేతువు @ ఆంధ్ర భారతి
      ఉద్దేశము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 :
      గుఱి, పూనిక, ఫలము, భావము, మనసు, లక్ష్యము, విధిత్సితము, సంకల్పము, హార్దము, హేతువు.
      అయినా తప్పైతే సరిచేయగలరు.

      జిలేబీ మాతా, మీరు పండితులని ఢీకొనగల సమర్థులు. నేనెంత. కేవలం మామూలు ఔత్సాహిక రాతగాణ్ణి.
      తెలిసీ తెలియక చేసే తప్పులు తప్పక ఎత్తి చూపి, యేతా వాతల, నా వ్రాతల ఉన్నతికి తోడ్పడ మనవి.
      :)నమస్కారం.

      Delete
    2. మరియొక అనుమానం మాతాశ్రీ.
      "ఒక ఉదాత్త కారణానికి కారణం కాబోతున్న" అన్న అర్ధంలో
      కూడా నాకు తప్పు కనబడటం లేదు. వివరించగలరు.

      Delete


    3. బండి రావు గారు

      మీరూ కారణాకారణ సమర్థులే :)

      చీర్స్
      జిలేబి

      Delete


  108. చీర్సనుటేల జిలేబి ? ని
    కార్సుగ యది సంప్రదాయ కారిణి కాదే ?
    ఫోర్సుగ నుపయో గించుచు
    సోర్సులు తెలియక సొబగగు సోకులు యేలన్ ?

    జిలేబి

    ReplyDelete


  109. అగ్ని పర్వతము లటంచు అదురు బెదురు
    అసలు లేకయు అద్భుత యల్డి యాబ్లొ
    రెస్టొరాంటును అగ్నిమీళె పుర హితము
    జేసె జూలియో పాడ్రను స్పెయిను నందు

    జిలేబి

    ReplyDelete

  110. పిల్లికి గుడిగట్టిరి తా
    నెల్లరి శకునము జిలేబి నెమ్మది జేయన్
    అల్లన సైగల పిల్లిని
    చల్లగ జూడమని కొలిచె జాపాను జనుల్

    జిలేబి

    ReplyDelete


  111. ఆజ్యము తగిలెను గద రా
    మా, జ్యోతి కదిలె ననాని మస్సుల తప్పుల్
    భోజ్యము గాదిక, పలుకుల
    వాజ్యము జేయవలెనోయి వాయింపులతో !


    జిలేబి

    ReplyDelete


  112. మా సుమ పాటల తో యిక
    ఊసులు పలుకును జిలేబి ఊ ఊ అనవే :)
    ఆశువు చిలుక పలుకు కుసు
    మా సుమముల కన్ని నొప్పు మామీ గనవే :)

    జిలేబి

    ReplyDelete


  113. హత్తెరి యెంత హుషారే
    చిత్తరువు సొగసు జిలేబి చిందులు జూడన్
    అత్తరుణి యంద చందము
    విత్తెను సిరివెన్నెలందు విందగు పాటన్

    జిలేబి

    ReplyDelete


  114. సెగ వేడికి గాలినిడున్
    జగమున కెల్లవె లుతురుని జమునిచ్చువటన్
    పగవాడి నిగొట్టున్; పం
    ఖ, గవా,హను, తోడ కాలకంఠుడు పల్కెన్

    జిలేబి

    ReplyDelete


  115. చెప్పులు తెగుననె రమణియు
    పప్పులుడకవనె ఫెడేలు పంతపు రమణా !
    గప్పున నడిగెను యెవరని
    చప్పున తెలిసెను జిలేబి చర్నా కోలా :)

    జిలేబి

    ReplyDelete


  116. చాగంటి వారి ప్రవచన
    మా ? కోరికలా? మనుజుల ఆర్భాటములా ?
    ఆ గట్టొకటే మేలని
    మూకుమ్మడిగ గుమిగూడి ముప్పిరి గొనుటా ?

    జిలేబి

    ReplyDelete


  117. అకటా ! జిలేబి అకటా
    వికటపు పద్యము లటా! కవివరుల మాటా !
    సుకవివ రులజూ చిగదా
    సకలము నేర్చితి చకచక సాధించితి బో !

    జిలేబి

    ReplyDelete


  118. ఎల్లుండే పౌర్ణిమయట!
    జల్లని పించిరి జిలేబి జాగ్రత్త సుమీ
    ఫెళ్లన నేమిజరుగునో ?
    యెల్లరు జర భద్రము! విధి యెవరిని విడిచెన్ ?

    జిలేబి

    ReplyDelete


  119. ఆ జవ్వని కామింట్లకు
    సౌజన్యుండైన నేమి సంకట మందున్
    వాజమ్మను విడిచితివే ?
    ఓజస్సులు లేని తేజమొప్పారునొకో ?

    జిలేబి

    ReplyDelete


  120. జనియించెను చెరసాలన
    చనె వసుదేవుని కరంబు చల్లని రాత్రిన్
    అనుకూలించె యమున వెను
    ననుసరియిచె నాదిశేషు నగుమోము గనన్

    జిలేబి

    ReplyDelete

  121. మబ్బుల మాటున దాగెను
    సుబ్బురముగ భాస్కరుండు ; సుద్దులు నేర్వన్
    నబ్బయ్యా నెట్లగు వీ
    లబ్బా బ్లాగుల జిలేబి లకలక లాడెన్ !

    జిలేబి

    ReplyDelete


  122. టీచరు పిల్లల మేధను
    జూచి వివరముగ సమాజ జుంజురు తెలిపెన్ !
    ఆ చిరుతడు నమ్మక తా
    నా చిన్నమ్మకు సవాలు నరకము జూపెన్ :)

    జిలేబి

    ReplyDelete


  123. శివశక్త్య చిహ్న మేళన
    పు విధము నగుపించె లింగము, శివుడు, శంభో !
    కవనము జేతును కరుణిం
    చి వరములిమ్ము తవ పాద చిహ్నమవంగన్

    జిలేబి

    ReplyDelete

  124. గురు పూర్ణిమ దిన సందర్భం గా

    గురువు లందరికీ నమస్సుల తో !

    అదిగో గురుపూర్ణిమ ! భో !
    నిదిగో వచ్చెను జిలేబి నిదురను వీడన్
    విధిగా వ్రాసెను కందము
    విదురులకు నిడెను నమస్సు విశ్వము గావన్ !

    జిలేబి

    ReplyDelete

  125. గ్రహములు గుమిగూడెనుగా !
    అహరహముగ తిరుగువారు ఆ శని కుజుడిన్
    వహతికి వదిలిరి గదవే !
    మిహికాకరుడిట జిలేబి మిడిసి పడెనుగా!

    జిలేబి

    ReplyDelete

  126. సూత్ర జిలేబికి మేలగు
    చాత్రము దొరుకు నిలలోన చక్కగ సుమ్మీ !
    చిత్ర కవితా ప్రపంచపు
    పత్ర కవికి మేలు పద్య ప్రాప్తియు గలుగున్ !

    జిలేబి

    ReplyDelete


  127. కొండగు మంచిదనంబగు
    దండిని నొక్కింత సోకు తరుణికి కొరతా !
    నిండగు బంగరు పర్వత
    మందున నొక్కింత హిమము మహిలో కొరతా !

    జిలేబి

    ReplyDelete

  128. మసక మసక చీకటిలో
    విసిరిన వలలో తరగని విరహము తీరన్
    కసికసి యందపు రక్కసి
    మిసిమిని గొనెను దరిచేరి మిడిసి పడెనుగా !

    జిలేబి

    ReplyDelete


  129. బెత్తాల వారు మిమ్ముల
    మెత్తరు రమ్మా జిలేబి మేలుగ నిమ్మా !
    కొత్తగ కామింట్లనిడగ
    కత్తెర వేసెను గదోయి కాంతా రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  130. పంచన చేరి కమింటుల
    దంచుట యను యోగము గలదా చూడవలెన్
    కొంచెము చూచి నడుచుకొన
    కించుక తగ్గును కమింటు కిక్కుల బాధల్ :)

    జిలేబి

    ReplyDelete


  131. కవ్యుద్ధద్వయముల బాం
    ధవ్యపు సాటి హరిబాబు దమ్ములు గూడన్
    దివ్యమగువారి బ్లాగూ
    భవ్యము కింగులకు కింగు భళిరా జూడన్ :)

    జిలేబి కితాబు :)

    ReplyDelete


  132. ఝండూ బాంబుని జూడగ
    గుండమ్మవలెన్ జిలేబి గుర్తుకు వచ్చెన్
    దండము యూ జీ శ్రీ రాం
    దండిగ బెట్టెను దడాలు ధమధమ బోయెన్

    జిలేబి

    ReplyDelete


  133. వందనము గురు పరంపర
    యందలి సత్యగురుమూర్తి యగు ఆది గురో !
    డెందము నెరయగ ప్రణతులు
    అందరి అంజలి గొనవలె ఆశీస్సులిడన్

    జిలేబి

    ReplyDelete


  134. నేర్పిస్తి జిలేబికి ప
    ద్మార్పణ మని కంద పద్య దరువుల , హా ! భ
    స్మార్పితమయితిని ; తవ పా
    దార్పణ ఉత్తిష్ట జాగృత యగుదు రామా !

    జిలేబి

    ReplyDelete


  135. అరసున్న రెండు చుక్కల
    పరమార్థములను జిలేబి పరిపరి దెలిపెన్
    అరసున్నకు నరసున్నను
    నరయగ పూర్ణం బగునని నరయము నరుడా !

    జిలేబి

    ReplyDelete


  136. లోలా ! కుచంబు నొప్పిన
    చోలక దబదబ దృషత్తు జోరున నేడ్వన్
    మాలిని స్వయంభువుల సరి
    సల్లాపము నొప్పెనోయి సలిలరయమునన్ !

    జిలేబి

    ReplyDelete


  137. అదిరెను శ్యామల రాయా !
    కుదురుగ రాముని మనంబు కూజిత జేయన్
    మదిని తనివి జేసెడి ఆ
    మదిరా పానమ్ము ముక్తిమార్గమ్ము గదా

    జిలేబి

    ReplyDelete


  138. గోదావరి నీళ్లా కృ
    ష్ణాతీ రమునందు జేరె క్షామము తీరన్
    బాధా తప్త జనులకున్,
    రోదన లేల రమణీ మెఱుగులమ్మీదన్ ?

    జిలేబి

    ReplyDelete


  139. లాడిరి కృష్ణుని తోడను
    నాడు రమణులు రసకేళి, నాడెను నేడున్
    లాడెనుని యీ రమామణి !
    జూడగ నదియిది జిలేబి చుక్కల కొకటే !

    జిలేబి

    ReplyDelete

  140. అంతా మన మంచికే ! జగమంతా రామ మయం

    దేవుడని మొన్న తెలిసెను
    రావుడు రాముని గనంగ రాస్తా ద్రిప్పెన్
    కోవా జిలేబి పలుకుల
    తావులు సరియయ్యెగాద తరుణీ భేషూ !

    జిలేబి

    ReplyDelete

  141. జల్లంతన కవ్వింతల
    ఒళ్లంతయు తుళ్లెనోయి ఓ చిన దానా
    మళ్లంతయినాదే చా
    న్నాళ్లకు మనసయ్యినాది నాదరి రావే

    ------

    మెహబూబా మెహబూబా
    అహరహమూ నిన్నుకోరె అంజా దిచటన్
    కుహునా ముహబ్బతనుకో
    కు, హసీనా నాకు నువ్వు కుంచెవు గదవే !


    జిలేబి

    ReplyDelete


  142. ధీటుగ జిలేబి తీటెను
    వాటము జూచెను కమింటు వారిధి గానన్
    వేటుల తీరెను దురదయు
    చోటిది గదవే రమణికి షోకులు నేర్వన్ :)

    జిలేబి

    ReplyDelete


  143. కోవెల మొనాస్టరీలట !
    లావణ్యంబుగ తపస్సు లాఘవము గనన్
    తావుల మేలగు కాఫీ,
    టీ, వీలుండెనట మునికుటీరములందున్!

    జిలేబి

    ReplyDelete


  144. మాన్యుడగునయ్యరడిగెను
    కన్యామణి యీ జిలేబి కావలెను !అసా
    మాన్యుడగుశాస్త్రి యు అరవ
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్

    జిలేబి

    ReplyDelete


  145. లైఫే సీరియసు! బిజీ
    లైఫున నవ్వుల జిలేబి లైక్సుగ మార్చెన్
    కాఫీల జతగ కయ్యము
    కైఫీయతులకు సమాన కామింటులనన్ :)

    జిలేబి

    ReplyDelete



  146. తిక్కయు కుదిరెను రాజా !
    అక్కజముగ నరుడు రాము నారాధింపన్
    చక్కగ బోయెను వినుమా !
    అక్కర లేదిక విభునికి అదమాటు సుమీ !

    జిలేబి

    ReplyDelete


  147. సన్యాసి పెండ్లి కిచటన్
    విన్యాసము జేయుచుండు విధముల జూడన్
    మాన్యంబగు కవివరులె
    ల్లన్యాయంబనె గదా సలాము జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  148. తంపులు పెడుతూ తిట్లను
    రొంపుల వినుచూ జిలేబి రుసరుస లాడెన్
    కెంపు గదోయి రమామణి
    తెంపరి దనముల కిలాడి తీరుల జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  149. తంపులు పెడుతూ తిట్లను
    రొంపుల వినుచూ జిలేబి రుసరుస లాడెన్
    కెంపు గదోయి రమామణి
    తెంపరి దనముల కిలాడి తీరుల జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  150. పసివాడు రాముడార
    ణ్య శివారుల రక్కసినుల నాగడముల నా
    పి సిగతరిగి మసిజేసె! అ
    రసి మోడియు మెండు రామ రాజ్యము నాడెన్ !

    జిలేబి

    ReplyDelete

  151. పొడులందున దేనినయిన
    గడగడ కలుపవలెనోయి గట్టి తెలుగు వం
    టదురు, చిటికెడుప్పుల మూ
    కుడు బెట్టు ఘుమఘుమలెల్ల కుదురును గనుమా !

    జిలేబి

    ReplyDelete


  152. పదముల మీద పదములను
    విధవిధములు గనబరచుచు విరివిగ పద్యం
    బు దరువు లవిరలముగ ఆ
    సదనము మరువగ జిలేబి శంభుని గనునా ?

    జిలేబి

    ReplyDelete


  153. ఒకపరి జూడగ నయ్యరు
    యికమరి యొకపరి జిలేబి యిద్దరు నొకరై
    సకలము తమదై జీవన
    యుగళపు గీతిక విపంచి యుగ్మము గనుడూ !
    జిలేబి

    ReplyDelete


  154. రామయ్యా రావయ్యా !
    యేమయ్యా వచ్చినదిటు యెవరో ? నేనా ?
    శ్యామా మరినువ్వా ? నే
    నేమరి నువ్వయిన పిలుపు నెవ్వారికిటన్ ?

    జిలేబి

    ReplyDelete

  155. ద్వీప సమూహములు భళీ !
    ఆపర మాత్ముని విశేష మాయన జూడన్
    ఆ పరిపరి యాకృతి! నా
    సా పరిశోధన తెలిపెను సవివరము నిటన్

    జిలేబి

    ReplyDelete


  156. పౌరాణిక దీవుల సా
    కారంబుగ చింత లేని కాంచన పక్షుల్,
    పారెను నదీనదము, జూ
    పారిన మేరకు‌ విచిత్ర ప్రాదేశముగా !

    జిలేబి

    ReplyDelete


  157. రెండేళ్ల క్రితము చెప్పా
    మండును భువిలో జిలేబి మతకలహాలూ !
    పండెను గదోయి జోస్యము
    గండర గండడు గుభిల్లు గండము తెలిపెన్

    జిలేబి

    ReplyDelete


  158. వంద నయాపైసలనట
    బిందెల కొలదీ జిలేబి బిరబిర జల్లెన్
    వింతగ జూచిరి జనులూ
    కాంతా మణివద్ద నాటి కాసులు గలవా :)

    జిలేబి

    ReplyDelete

  159. చితి చింతల సారూప్య మి
    వి, తరుణ మేగగ జిలేబి, విగతుని గాల్చున్
    చితి, సహజీవనమును జే
    సి తలగొరుగును గద చింత సిత్రము గానన్

    జిలేబి

    ReplyDelete


  160. చితి చింతల నడుమన గుం
    డతిశయము జిలేబి, విగతుడైన చితిగనున్
    బతికున్న చింత గొరుగు ని
    ట తల, నిదితెలుపు గురుండిట వలయు మనకున్

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. అందములు ప్రకృతి కే సొం
      తం ధగధగలుగ వెలసెను తరుణీ భువినిన్
      డెందపు ఆనందములకు
      గంధము బూయును గదోయి గలగల ధాత్రీ !

      -++-


      రాస్తా పరిశోధనతో
      జాస్తిగ సెక్యూరిటీ గజగజ వణుకులూ
      పాస్తా పిజ్జా లరిగెను
      కాస్తో కూస్తో నిదురన కాలము ఆగన్ !

      జిలేబి

      Delete


    2. సరస వచోనిధి వటర? అ
      సురుడగు రావణుని యెడల సుముఖు డవును గూ
      డ, రమణి ఆ సీతమ్మను
      అరసికపు పలుకుల తూల నాడితి వేలా ?

      జిలేబి

      Delete
    3. ఇది అకటావికటపు పద్యం అంటే మీకు కోపం వస్తుంది. రాముడు సీతమ్మను తూలనాడటమేమిటి? మతిలేనిమాట! తెలిసీతెలియకుండా ఏదేదో వ్రాయటం. వీలైనంతగా గొడవలు రెచ్చగొట్టటం తప్ప మీకు పని లేదా? (ఇలా అన్నానని మీరు జనాన్ని పోగేసుకొని గోలచేసినా స్పందించను.)

      Delete


  161. తమిళ లిపి పొదుపును పొగిడె
    సుమధురముగ పలుక లేరు సుందరమును గా
    దు! మిడిమిడి యక్షరములున్!
    కమనీయంబెట్లగునుర కౌపీన లిపీ :)

    జిలేబి

    ReplyDelete