Friday, June 10, 2016

మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)

మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)


ఈ మధ్య వరస బట్టి మన సో కాల్డ్ అహ్మద్ చౌదరి (!?) బ్లాగు లు సాక్ష్యం + కసక్ writes మా మాలిక లో టాప్ లైన్ లో ఉంటా వుంటే ( ఈ రోజు కూడా ఉంది :) మిగిలిన లేటెస్ట్ అప్డేట్ అయిన ఏ బ్లాగు అయినా స్క్రోల్లింగ్ లో దాని క్రిందే ఉండే లా కని పిస్తుంది !

వార్నీ ఏమి మాయ జేసినాడు అహ్మదు అని రెండు మూడు రోజులు వరసబెట్టి గమనిస్తే అర్థమయి పోనాది :)

అబ్బోడు ఓ టపా కొట్ట గానే అది మాలిక లో స్క్రోల్లింగ్ వచ్చేసాక దాన్ని మళ్ళీ అప్డేట్ మోడ్ లో ఫ్యూచర్ డేట్ లో అప్డేట్ చెయ్యటం మొదలెట్టేడు !

హద్దరి బన్నా ! ఇదన్న మాట బగ్గు మాలిక లో అనుకుని సరే పోన్లే మనమూ ఓ రాయి వేసి  చూద్దామని నా టపా నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం అన్న టపా లాస్ట్ శని వారం పెట్టింది మళ్ళీ అప్డేట్ మోడ్ లో బెట్టి ఫ్యూచర్ డేట్ అంటే ఇవ్వాల్టి తారీకుకి (ఇది తారీకే :) తారీఫు కాదు జేకే ! ) అప్డేట్ చేసి గమనిస్తా ఉంటె ఆ టపా స్క్రోల్లింగ్ లో మాలిక లో ఇవ్వాల్టి దాకా టాప్ లైన్ లో నాట్య మాడింది :)

హన్నా ! మా లక్కు పేట రౌడీ నిదుర లే ! అని ఓ సూచనా ప్రాయం గా కామెంటు కందం కూడా ఒక్కటి ఇచ్చుకున్నా !

ప్చ్ ! అన్న రౌడీ చూసారో లేదో తెలీదు !

సో ఈ టపా !
మీ టపా మాలిక్ లో స్క్రోల్ టాపర్ చెయ్యా లనుకుంటున్నా రా ! అయితే వెంట నే పై చెప్పిన విధం లో ప్రొసీడ్ అయి పోండీ !


నారదాయ నమః !

చీర్స్
జిలేబి

10 comments:

  1. నిజంగా మీకు మెంటలే.మనువు బ్లాగును చూసే నాకు తెలిసింది. అయినా తప్పేముంది.మీరు కూడా ఆ రూట్ లో ఉన్నారు కదా? కాస్త వెటకారపు కామెంట్లు మానివేయండి దయచేసి.

    ReplyDelete
  2. రండి K S చౌదరి !

    ! రండి స్వాగతం !

    సుస్వాగతం !


    మెంటలు జిలేబి తంటా !
    మంటలు కామెంటులోయి మండెను జూడన్ !
    వెంటన వచ్చెను అహ్మదు
    తుంటరి తనమువలదోయి తూచ్ తూచ్ బోవే !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మాలికలో ఆ సౌలభ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పేముందే జిలేబీ!ముందుగా ఈ ప్రయోగం మనువు గారు చేసిండు.అది చూసి చౌదరి,ఇంకా మరికొందరు చేసింద్రే జిలేబమ్మా!ఇప్పుడు నీ దిక్కుమాలిన బ్లాగు అదే పని మీద ఉందిగా!:):):):):):):):)ఇవ్వన్నీ నీ పట్ల నవరసాలూ నిండిన నవ్వులే జిలేబీ! అయినా జిలేబీ పాచి పోయింది.నాకు వద్దు.దయచేసి మిగత బ్లాగ్ మహాశయులారా జిలేబీని దూరంగా నెట్టేయండి.తింటే (చదివితే) ప్రమాదం.:)

      Delete


    2. రండి రండి అర్వింద్ భాయ్

      ఇక మిగిలింది అభిలాష్ షేక్ :)


      వచ్చిండరవిందుడు రా
      గిచ్చిండు గదా జిలేబి గిలగిల లాడెన్ :)
      కచ్చపు మాటలు మనకే
      లొచ్చెను పదవె వగలాడి లొల్లీ వలదే


      జిలేబి

      Delete
  3. ఏదో ఒకటి తెలుసుకోవాలన్న మీ అభిలాష స్పూర్తిదాయకం ! టాప్ లైన్ లో ఉంటే టపా టపా చదివేస్తామా ఏవిటీ ?

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారు :)

      జీ హా !

      చీర్స్
      జిలేబి

      Delete
  4. మాలిక వారూ మేలుకోండి!
    ఆ లోపాన్ని గమనించి ఉపయోగించుకుంటున్న వారు ఎంత ప్రశంసనీయులో, వీరి తెలివిని పసిగట్టిన జిలేబీ గారూ ప్రశంసనీయులే!
    చీర్స్

    ReplyDelete
  5. హ హ గత మూడు నాలుగు రోజులుగా మీ టపానేగా హై లెట్ !
    ఇది వరకూ దీన్ని నేను గమనించా ! నా పోస్టులు కొన్ని పాతవి ..డేట్ మార్చకుండా ఏదన్నా లోపం కనపడినప్పుడు, సరి చేసి అప్‌డేట్ కొట్టినా మాలికలో ఫ్రెష్ టపాల్లా కంపడేవి. దానితో అలా పాత టపాలు ఏవన్నా ఎడిట్ చేస్తె.. పనిలో పనిగా.. చివరగా.. రీసెంటుగా ర్ ఆసిన టపాలను కూడా అప్ డేట్ కొట్టేవాన్ని.. దానితో పాతవి పోయి.. రీసెంటుగా అప్‌డేట్ కొట్టిన కొత్త టపాలే .. మాలికలో కనిపంచేవి. (మాలికలో రీసెంటుగా వేసిన మొదటి రెండు టపాలు మాత్రమే కనిపిస్తాయి).

    మాలిక వారికి ఈ విషయం తెలుసు కానీ, అది బహుషా అది కేవలం మరో ముఖ్యమైన ఫంక్షనాలిటీ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అయ్యుంటుంది. అందుకే వారు కూడా వదిలేశారు దాన్ని !! ఇది వరకు కూడలిలో ఇలా వచ్చేది కాదు !

    ReplyDelete
  6. మనువు, అహ్మద్ చౌదరిలు బ్లాగులకు పట్టిన చీడలు. వాళ్ళు అంత శ్రమించి రాసిన చెత్తను చదవకుండా చచ్చిపోతే మనకిక పుట్టగతులుండవేమోనన్న ఆత్రుత వాళ్ళ భాషలో కనబడుతుంది. వీళ్ళిద్దరికీ చెత్త లాజిక్కులు, sex, మతం, judgementality అనేవి ట్రేడు మార్కులు. ఇదిగాక ఇలాంటి చెత్తపనులు. మానవాళిని ఉధ్ధరించే రాతలు ఏం రాస్తున్నారని వీళ్ళు ప్రతిరోజూ కనబడేలా update చేసుకుంటున్నారు? అసలు మాలికవాళ్ళు ఇలాంటి చెత్త బ్యాచిని list చెయ్యడమే తప్పు.

    ReplyDelete
  7. Zilebi garu,

    Great Job - in finding the glitch :)

    ~Lalitha

    ReplyDelete