Saturday, July 30, 2016

సదనపు విషయముల పైన చతురత జేర్చన్ ! 
 
 
సుధయొప్పె సుధా కుండలి
క!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
పదముల బేర్చెను; జగణము
సదనపు విషయముల పైన చతురత జేర్చెన్


చీర్స్
జిలేబి

159 comments: 1. నరకము యెందు గలదనుచు
  పరిపరి విధముల జిలేబి పరిశోధించెన్ !
  అరరే ! కనులయెదుట కద
  లు రక్కసి యిదే, మనుజుని లూటీ స్థలమే !

  ---+++---

  పర్వతముల మధ్య రగిలె
  సర్వములను భోక్త జేయు సలసల అగ్నీ !
  పర్వము వోలె కనబడెను
  అర్వాచీనపు నెగళ్ల అందము గూడన్ !

  జిలేబి

  ReplyDelete


 2. అందాల యెడారి నడుమ
  వింతల గొల్పుచు నిలచెను వేడుక గన మా
  నందమగు తామరవలెన్
  కొంతయు కాంక్రీటులేక క్రొంగొత్తగనౌ !

  జిలేబి

  ReplyDelete


 3. ఖాండవ దహనము వోలెన్
  అండకొనుచు కా లిఫోర్నియా రాష్ట్రములన్
  యెండిన యడవులు దండిగ
  మండగ కలిగించె నష్టమా దేశమునన్

  జిలేబి

  ReplyDelete
 4. నీలి రంగులో, అంతంత పరిమాణంలో అయితే ఈ ఖతి బాగానే వుంటుంది. కానీ, మీరు కవితలు వ్రాసే పరిమాణంలో, నల్లరంగులో అయితే అంత స్పష్టంగా వుండదు. అక్షరాలను నీలిరంగులోకి మార్చి, పరిమాణం కొంత పెంచితే ఈ ఖతిని అంగీకరించవచ్చేమో, ప్రయత్నించండి.
  ....శ్రీనివాసుడు

  ReplyDelete
  Replies

  1. సిరి లేని వాసా

   అంకోపరి యందు ఫాంటు సాయిజు ని పెంచి చూడవలె :)


   జిలేబి

   Delete
  2. అంత శ్రమ ఏల జిలేబీ మాతా! తమరే ఖతిని నీలిరంగుకు మార్చి, అక్షర పరిమాణమును పెంచినచో మాకీ కడగండ్లు తొలగును కదా?
   చదువుటకు నయనమ్ములు బహు చీకాకు పడుచున్నవి.

   Delete
  3. @ శ్రీనివాసుడు gaaru,

   యు.జి. ఎంతో క్లిష్టమైన దానిని అతి సులువుగా అర్థమయ్యేటట్లు చెపితే,
   రాణి శివశంకర శర్మ ఎమిటండి ప్రతిదానిని ఇంత క్లిష్టతరం చేస్తూ రాస్తాడు.

   సారంగలో రాసిన
   "తండ్రి లేని దేవుడు లేని అనాథ లోకం!"

   ఈయన గురించి ఎమైనా వివరాలు తెలిస్తే చెప్పండి. అసలికి ఈయన ఎమి చెప్పాలనుకొంటాడు, ఈ విశ్లేషణలకి ఎమైనా అర్థం ఉందా?

   Delete


 5. నిజమును పలుకగ వలదో
  యి! జనులకు వలయు జిలేబి యింపగు పలుకుల్
  రుజుమాటల నాడగ చ
  ట్టు జబ్బలనుబట్టి వెనుక టుప్పని బేల్చెన్ :)

  జిలేబి

  ReplyDelete


 6. కొబ్బరి చిప్పల బూచీ
  లబ్బురముగ గాంచెనోయి లచ్చిందేవీ
  యిబ్బడి ముబ్బడి గాగని
  దబ్బున గింగిరులు తిరుగ దమ్ములు బోయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 7. ఒకరినొకరు హత్తుకొనుచు
  సకలము మరిచిరి జిలేబి చల్లని వేళన్ !
  వికల మనస్కుల యెద సా
  వకాశముల నెరపు మేని వాచక మిదియే !

  జిలేబి

  ReplyDelete


 8. గార్దభ క్షీరానికి గిరాకీ బాగా ఉందని పాటల పాడి పాలను పిండు తున్నారని ఓ మాటు టపాలో కష్టే ఫలే మాచన వారు రాసారు ; ఆ నేపధ్యం లో

  బానల కొలదిగ పాలను
  వీనుల విందయిన పాట వినగా నిత్తున్
  మానక జిలేబి రమ్మా
  గానము సేయంగనొప్పు గాడిదలకడన్

  జిలేబి

  ReplyDelete


 9. నాలుగు వాక్యముల టపా
  మా లావగు ఖాళి లైన్లు మాష్టారు గనన్
  మేలుగ చదువన కష్టము
  జాలము నందున జిలేబి, సరిజేయమనెన్ !

  జిలేబి

  ReplyDelete


 10. చేనేత చీర లందము
  తానే యంబాసిడరనె తాజా జవుళీ
  రాణి గద స్మృతి యిరానీ !
  ఈనాటికి నిచ్చెనోయి యీ ట్వీటుయిటన్ !

  జిలేబి

  ReplyDelete


 11. హోదా ప్యాకేజీ లా !
  మాదా కవళము జిలేబి మాదారి యిదే !
  వాదోపవాదముల జో
  లే దోబూచ పలుకులకు లెక్కలు తేలన్

  జిలేబి

  ReplyDelete


 12. అన్న మునకు జనులు అలమటించిరి దేశ
  మునను ప్రభువు జెప్పె మురిపెముగను
  జనులకు వలయునది జవసత్వము గనుక
  సున్న మున్నఁ జాలు నన్నమేల!

  జిలేబి

  ReplyDelete


 13. బాటిళ్ల బిస్లరీలన
  పూటుగ కల్లోయ్ జిలేబి పూర్తిగ కథలన్
  వేటుల జూపున్ జూడూ
  ఘాటగు కథనములు వచ్చు గబగబ నేడే !

  జిలేబి

  ReplyDelete


 14. అయినను పోవలె హస్తిన
  పయి పంచెను జాపి బిలువ ప్రముఖుల లెల్లన్
  అయినను జరిపెద పుష్కర
  ము యిచట మేలుగ జిలేబి ముందుకు బోవన్

  జిలేబి

  ReplyDelete


 15. ఓహోహో చిలకమ్మా
  ఆహాహా పంచదార అందాలమ్మో
  బాహాట కొంటె గుట్టుల
  లాహిరి జూడన్ జిలేబి లైకులు జేర్చెన్ !

  జిలేబి

  ReplyDelete


 16. వారెవ్వా ! చీనా బ
  స్సుర్రోయ్ ! మాజికు జిలేబి సూపరు జూడన్
  బర్రని గాడీ లన్మీ
  డుర్రని బాయెను కమాలు డుంటక బండీ !

  జిలేబి

  ReplyDelete


 17. హనుమంతరావు గారివి
  అనుదినపు హరాజికాల అల్లరి పలుకుల్
  గనుడీ తరగని బ్లాగున్
  వినువీధిన హాస్యజల్లు వీచిక గానన్ !

  జిలేబి

  ReplyDelete


 18. టీవాలా లెక్క మరో
  టీ ! వాహ్ క్యాబాత్ ! జియెస్టి ! టీమది మోడీ
  గా వా రెల్లరి విజయము !
  యావత్తిక మేకినిండియా వేగమునన్

  జిలేబి

  ReplyDelete


 19. ఔరా జిలేబి చతురత !
  మారా మారీగ పద్య మాలను బేర్చెన్ !
  హోరా హోరీ లందున
  దారము లేకుండ పుష్ప దామము లల్లెన్ !

  జిలేబి

  ReplyDelete


 20. రైల్వే కాంట్రాక్టర్లట!
  హల్వా తింటూ జిలేబి అందల మెక్కెన్
  కల్వపు ధాటికి సబ్సిడి
  నిల్వల తీరుల తెలుపును నిక్కము నేడే !

  జిలేబి

  ReplyDelete


 21. నా మాటగ హోదానిడు,
  ఈమా పుష్కరపు వేడి యీరము గానన్ !
  దామోదర దాస్ మోడీ
  నామాలిడకమునుపిత్తు నమనము మేలౌ !

  జిలేబి డిల్లీ లో మోడీ తో :)

  జిలేబి

  ReplyDelete


 22. మానాన్నే నాకొక దా
  వానలమగు మొదటి శత్రువనియను కొంటిన్
  నా నడతలు మారంగన్
  తానయ్యె గదా జిలేబి తాజూబ్ తండ్రీ !

  జిలేబి

  ReplyDelete


 23. కోతి నిజాయతి గానగ
  ఆ తరుచరములు జిలేబి ఆహ్లాదముగన్
  మా తరు జూలంబులు మే
  లౌ తమకము వీడి చెప్పె లౌక్యము గాంచన్ !

  జిలేబి

  ReplyDelete


 24. చిటపట చిటపట చిరు జ
  ల్లు టపటప కురిసె చెలువ కలువలు విరిసెనూ !
  పిటపిట లాడిన వయసున
  వటువును దోచెను జిలేబి వలపుల రాణీ !

  జిలేబి

  ReplyDelete


 25. బెత్తాము మాస్టరింకను
  పత్తా కానంగ రాలె, పద్యంబులు ని
  స్సత్తువగ వేచె నోయీ,
  మెత్తటి కందము జిలేబి మేలుకొలుపులౌ :)

  జిలేబి

  ReplyDelete


 26. గురుడా కన్యా రాశిన్
  పరుగుల జేరగ జిలేబి ఫలితము మేలౌ
  తరుగును టెర్రరిజములున్
  పెరుగును శాంతి సుఖములును భేషుగ సుమ్మీ

  జిలేబి

  ReplyDelete


 27. కందకు లేని దురద లీ
  చిందుల రాయుళ్లకేల చెప్పు జిలేబీ ?
  డెందము నింపెడు మాచన
  సుందర సొబగగు టపాల సొమ్మందరిదీ  జిలేబి

  ReplyDelete


 28. రాధా అందించు పెదవి
  మాధుర్యంబు లొలకించ మానస వీధిన్
  నాధుని నీదరి జేర్చుచు
  నాదామృత సారమరయ నాకము గానన్‌ !

  జిలేబి

  ReplyDelete

 29. మార్వాడీ లెక్కలు యే
  లార్వాచీనంబు తల్లి లాలన యొజ్జా !
  సర్వాంగ భూషిత మయపు
  పర్వపు దినమందు యేల పయిసల బేరాల్ :)

  జిలేబి

  ReplyDelete


 30. మాలిక మళ్లీ బిగుసు కొ
  నే! లింగము గారు చూడనే లేదాయే !
  మా లుకలుకల నిక యెవరు
  వాలు కనుల జూడు జాల వలయము నందున్ :)


  జిలేబి

  ReplyDelete


 31. అకటా వికటపు దురదా!
  నిగర్వుల మనుచు జిలేబి నిన్నిట్లనుటా ?
  అకటా కన్యా రాశిన్
  నికటమగు గురుడు యనంగ నిదియా ఫలితం :)

  జిలేబి

  ReplyDelete

 32. శోధిని వేగమును మన వ
  రూధిని మేల్గాంచె నోయి రూపసి మేలౌ
  చోధన శక్తియు గూడన్
  మీ దైనందిన స్రవంతి మెచ్చితి మోయీ !

  జిలేబి

  ReplyDelete

 33. భారత కాలపు కథలను
  నారాధించుచు జిలేబి నవనవ సుజనా
  సారాంశములను మరువకు
  కారా గారపు స్రవంతి కనకన గనదోయ్ !

  జిలేబి

  ReplyDelete

 34. ఇతరులను నా స్వరూపము
  గ తెలువక తలచిన నేమి గలుగును సుమ్మీ !
  కుతకుత లుడుకుచు రాముని
  వెతుకుచు సాటి మనుజులని వెరచుట మేలౌ ?

  జిలేబి

  ReplyDelete
 35. సిరిలేని వాసా

  మీ యూ ట్యూబ్ లింకు కి ఇచ్చట స్థలము

  అంకో పరినొక వైపుగ
  అంగట దోసెను జిలేబి వార్చగ సిరులే
  చెంగట రెట్టింపయ్యెను
  చెంగున కందపు సుగంధ చేవయు గూడన్


  జిలేబి

  ReplyDelete

 36. ఓయీ హరిబాబూ నీ
  వూ యీ శ్యామన్న వారి ఉబ్బసములకున్
  సాయము బట్టితి వా ! హా
  మాయ యెవరిని విడిచెనుగ మానిని గనవే !

  జిలేబి

  ReplyDelete


 37. తన భర్త ధర్మ రాజా
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ
  మనగన్ పాంచా లిగనెన్
  తన భాగ్యంబుగను సర్వదా శ్రీకృష్ణున్

  జిలేబి

  ReplyDelete


 38. పొగిడిన బెడిదము, బెడిదము
  తెగిడిన, సరసపు పలుకులు తెరమరు గగుచున్
  బిగిసెను కరములు చకచక
  భగభగ కనకన జిలేబి భగణపు గతియా !

  జిలేబి

  ReplyDelete


 39. ఆరు లక్షల వీక్షణ లందు పంచు
  కొనుచు తన యనుభవముల కోట గట్టె
  గదర తెలుగు పంచదశ లోకమున మేలు
  గాను సెహభేషు భండారు గట్టి గాను


  జిలేబి

  ReplyDelete


 40. చెప్పడము నాకు ధర్మము
  అప్పడమువలె నలుగుదుము టప్పున మీరున్
  గొప్పలకు బోక సఖుడా
  చప్పున వైదొలగుబోస చక్కగ వినుమా

  జిలేబి

  ReplyDelete


 41. చేపల బజారు గనరే !
  దాపున వచ్చిన జిలేబి దాష్టీకములున్
  గోపకుమారుడలక గనె
  మాపటికి ఠికాణ బందు మానిని వినవే !

  జిలేబి

  ReplyDelete


 42. బ్లాగులు వేదిక కావోయ్
  మాకు, యిక టపాల మూట మాగట్టిగ రా
  మా కట్టెద మోయీ, చా
  లీ కష్టే ఫలము, విధి బలీయము గాదే !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. పేగులు లాగుట కాదోయ్ / చీకులు కాల్చుట కాదోయ్ / మోకులు లాగుట కాదోయ్
   తమరిట, ఇక టపాల మూటల మా గుట్టుగా రా(య),
   బట్టగ ఖేదమోయీ, చా
   లీ నష్టే కిలుము, ఇది జిలేబీయము గాదే !

   లోల...
   :)))

   Delete


 43. బ్లాగుకు ప్రత్యామ్నాయం
  బే కావలె సాహితీ కుబేరుని వినతీ !
  మీ కనిపించిన సలహా
  మాకు తెలియ జేయమనెను మాటల రేడూ !

  జిలేబి

  ReplyDelete


 44. శృంఖలము లందు చిక్కెను
  పంఖా లేకయు తెలుంగు బ్లాగులు గదవే !
  పుంఖానుపుంఖములుగా
  శంఖము లూదిన గురువులు చట్టని చనిరే !

  జిలేబి

  ReplyDelete


 45. ప్లాస్టిక్కు వలన చిక్కకు
  బెస్టుగ వాటిని విడువుము బెటరోయ్ లైఫూ !
  ఘోస్టులగుదుము మనము ఆ
  బీస్టుల జోలెను గొనంగ భీకరముగనన్ !

  జిలేబి

  ReplyDelete

 46. తెలిసిన భూతము మేలోయ్
  తెలియని మాయా ప్రపంచ తీరుల కన్నన్
  కలకాల సాహితీ సుమ
  ములను పరిమళింప కేలు మోడ్చెద రామా

  జిలేబి

  ReplyDelete


 47. లార్డులబకు దాసుల వా
  రార్డరులను ఖాతరేల రమణీ జెయ్లే ?
  బార్డరు దాటిన పిచ్చో
  ళ్లార్డర్లకు విలువనివ్వ లాడూ మేమే :)

  జిలేబి

  ReplyDelete


 48. పాడేరయ్యా రామా
  నేడే మా శ్యామలీయ నెంజిల బోవన్
  గూడెను శోభయు శుభములు
  చూడగ మేలౌ జిలేబి శుభదిన మిదియే !

  జిలేబి

  ReplyDelete


 49. కొలువు తీర్చి లక్కాకుల గురువు నమర
  పలుకు లందలి పదములు పదనిసలన
  నడచె నిచట తేట తెలుగు నాట్య రాణి
  పద్దెపు కుసుమములనిట పంచి బెట్టి!

  జిలేబి

  ReplyDelete


 50. గ్రహసంచారములు గదా
  అహరహమూ మన గమనపు హద్దుల గనునోయ్
  విహరించి బట్టిరి గదా
  మహాద్భుత కధల జిలేబి మన్నిక గూడన్!

  జిలేబి

  ReplyDelete


 51. లార్డులబకు దాసుల వా
  రార్డరులను ఖాతరేల రమణీ జెయ్లే ?
  బార్డరు దాటిన పిచ్చో
  ళ్లార్డర్లకు విలువనివ్వ లాడూ మేమే :)

  జిలేబి

  ReplyDelete


 52. జ్యోతిష శాస్త్రము సత్యము
  కాదన గలవా జిలేబి గానుము వార్తల్
  వేదన సౌఖ్యము భువినా
  క్రోద‌న లెల్లన్ మిహిరుని కొంకర సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete

 53. హరిబాబని యొక బ్లాగరు
  వరుసగ కామింటులాడ వడివడి గానన్
  పరుగిడి వచ్చెను సుమ్మీ
  పరులకు హితమును గరుపుచు పాడుపని గనన్

  జిలేబి జర భద్రమ్ము సుమ్మీ :)

  ReplyDelete

 54. హమ్మయ్య బతికి పోయా :)

  జిలేబి

  ReplyDelete


 55. అదిగో భువి కంపించెను!
  నిదిగో యోగీశ్వరులిట నిక్కము గనిరీ !
  విధి రాతల తీరును మా
  ర్చ దమ్మెవరికి గలదోయి రాశీ ఫలమౌ !

  జిలేబి

  ReplyDelete


 56. స్పాముల హరిబాబితడూ
  రామా శ్యామునికి బంటు రావడి జేయన్
  భామా మణి బాలాగున
  కోమాళి వలెన్ కమింటు గోడుల జొచ్చెన్ :)

  జిలేబి

  ReplyDelete

 57. పిలిచెను గదరా కృష్ణుని
  అలిగిన వేళన గురుండు అద్దరి బన్నా !
  తొలగెను మానస నసలూ
  వెలసెను గుండెన కదంబ వీచికలున్నూ !

  జిలేబి

  ReplyDelete


 58. రామా శ్యాముని మీదకు
  మా మనసును జేర్చితిమిర, మానస చోరుం
  డా మురళీ కృష్ణుని లీ
  లా మాధుర్యపు పసందు లాహిరిని గనన్ !

  జిలేబి

  ReplyDelete


 59. చెలువారాధ్యుడనెనురా
  కలకలములను చెలరేపు కామింటొచ్చెన్
  లలనా, శ్యామల రావూ
  మిలమిల మెరిసే సమాస మిదియే మగునో ?

  జిలేబి

  ReplyDelete

 60. తెలుగునకు సంస్కృతంబును
  నలవోకగ కలుపరాదు నమ్ము జిలేబీ !
  కలకాలము భాష నిలువ
  నిలలో నూతన వరవడి నిక్కము వలయున్

  జిలేబి

  ReplyDelete 61. స్పాముల రేడోయ్ హరిబా
  బూ! ముచ్చు పనుల జిలేబి బూచోడివలెన్
  తా మూలనక్కి జేయున్
  కోమాళి మనుజుల తోడు కోమలి కేలన్ :)

  జిలేబి

  ReplyDelete


 62. గేదెల వోలెన్ తరిమిరి
  పేదలకు ఋణముల నివ్వ పెద్దలు మేలౌ !
  బాధగ నమ్ముడు బోయిన
  గేదెయు పూజారివార్ని గెంతుచు కుమ్మెన్ :)

  జిలేబి

  ReplyDelete


 63. పూరించెను సారథి శం
  ఖారావము వడవడ వణికారెల్లరటన్
  గారెను రక్తము యేరుగ
  పారె, పసందో ? సమరస భారత మెపుడో ?

  జిలేబి

  ReplyDelete


 64. ముప్పది రెండుకు రెండుగ
  నొప్పిన కందము జిలేబి నొకపరి గనుమా
  అబ్బురమగు పదబంధము
  అప్పటి కవుల గణితంబు అద్భుతము గదా !

  జిలేబి

  ReplyDelete


 65. అరుబది నాల్గు కళలవలె
  అరుబది నాల్గనగ మాత్ర లా కందంబూ !
  పరిపరి విధముగ పదముల
  సరితూకంబు గణితంబు చక్కగ కలిసెన్!

  జిలేబి

  ReplyDelete


 66. నిండగు చంద్రుని‌ఫోటో
  మెండగు వ్యాసము పసందు మేలిమి గద! పూ
  చెండుల వేళన గుండ్రని
  గండర గండడని రమణి గబగబ బిలిచెన్ !

  జిలేబి

  ReplyDelete

 67. బెల్జియము నగర మందున
  గుల్జారుల బరచిరోయి ఘుమ్మను వేళన్!
  దిల్జోయీ నయ్యెగదా
  అల్జడి వలదిక జిలేబి ఆనందమిదే !

  జిలేబి

  ReplyDelete


 68. రాకేందు శశి వదనయై
  తా గోముగ మాటలాడి తరుణియు నివ్వన్
  జాగారము జేయు పతికి
  కాకర కాయల రసమ్ము కడు మధురమగున్

  జిలేబి

  ReplyDelete

 69. బామ్మా బామ్మా రావే
  బొమ్మల పెండ్లిన జిలేబి వోలెన్ రావే
  కొమ్మా రావే రావే
  రెమ్మా రావే కచేరి రేబగలికనూ !

  జిలేబి

  ReplyDelete

 70. నీ బలము నీకు తెలియదు
  కాబోలనుకుని జిలేబి కాస్తా లాగిం
  చా బో ! కుదేలు మనకుం
  డా బోలే నా యుసురులు సంద్రా లమ్మో !

  జిలేబి

  ReplyDelete


 71. టీ కప్పు లో త్సునామీ !
  మాకు తిరుపతయ్య గుండు మళ్ళీ కనిపి
  స్తో కథని గుర్తు జేస్తోం
  దీ! కన రారే పవనుడి ధీమా ! జైహింద్ !

  http://varudhini.blogspot.com/2011/02/blog-post_08.html


  జిలేబి

  ReplyDelete


 72. అయిదొందల పోస్టులతో
  మయికపు పద్మార్పితముల మల్లిక గూర్చెన్ !
  మయిజారు చిత్ర రమణిన్
  సయిగల మేనిన్ గనంగ సయ్యంటిమిగా !

  జిలేబి

  ReplyDelete


 73. అమరికగ చిత్ర పించను
  నమర్చ నటుల పదహారు నంబరు దేశం
  బు,మనది, గనంగ ఔరా
  మెమొరాండము నివ్వ వలయు మేలిమి గానన్ !

  జిలేబి

  ReplyDelete

 74. అక్కడ పప్పూ పవనుం
  డిక్కడ మోడీ జిలేబి డీడీ డాండాం !
  లెక్కలు తేలుస్తామోయ్
  డొక్కలు చీల్చెదము మేము డుండుం డాండాం

  జిలేబి

  ReplyDelete


 75. రాహువు సూర్యుడు చంద్రుడు
  బాహాటము సింహ రాశి భాగం బయ్యెన్
  రాహువు గతినా చంద్రుడు
  ఓహో రేపే ఖగోళ పోకడ దాటున్ !

  జిలేబి

  ReplyDelete


 76. ఇస్తే ఇవ్వండీ మా
  దోస్తీ మాదే జిలేబి దోబూచులనన్
  కుస్తీ వలదోయ్ మోడీ !
  మస్తీ మనకందరికిక మాటలు మళ్ళీ !

  జిలేబి

  ReplyDelete


 77. బ్లాగు నందున యేమిటి బలుక వలెను
  మేము చెప్పెదము నటులే మీరు రాయ
  తగును హరిహరీ ! లేకున్న తన్ను లిత్తు
  ము నరుడా హెచ్చరిక విను ముచ్చట గను :)

  జిలేబి

  ReplyDelete


 78. బంధముగ నేది తలచెన్ ?
  బంధములకు తానెటులు కబంధము గానన్ ?
  బంధముగ నేమి జేసెన్ ?
  జందెమ్మును, విడిచి, యజ్వ జన్నము జేసెన్

  జిలేబి

  ReplyDelete


 79. భంభం బోలే శంఖము
  అంభోదర మయ్యెనోయి అద్భుత గానం !
  శంభో శివ శంభోయన
  అంభస్సారము జిలేబి ఆనంద మదిన్ !

  జిలేబి

  ReplyDelete


 80. ఎవ్వడు తానై యుండెను ?
  ఎవ్వడు తననే తలచెను ? ఎవ్వడు ఎవరిన్
  కవ్వముగా చిలికెను తా
  సవ్వడి జేయక హృదయపు సంకేతముగా !

  జిలేబి

  ReplyDelete


 81. యిందు గలదందు లేదని
  సందేహము వలదు చూపు సారించిన మే
  రంతా , సందుల, సినిమా
  లందుల గలదోయ్ లలామ లావణ్యవతీ :)

  జిలేబి

  ReplyDelete


 82. ప్రాణముల నిచ్చు వాడును,
  ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ,
  ప్రాణస్యప్రాణంబౌ
  ప్రాణము నాదని జిలేబి పరిణితి గనవే !

  జిలేబి

  ReplyDelete


 83. కలడనునతడు కనబడ గమనము గను
  కన్ను లన్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను
  కన్ను లందు కనబడుచు కలలను గన
  బడుచు తృటికాల మందున బడయ వచ్చు !

  జిలేబి

  ReplyDelete


 84. తలపైన భారమును మో
  సె లలితబాల చదువ వలసిన సమయమునన్ !
  విలవిల లాడిన చిన్నా
  రుల యీ నాటి కథలివ్వి రూపము లివ్వీ !

  జిలేబి

  ReplyDelete


 85. యిచ్చిరి సెయింటు హుడ్డును
  మెచ్చుచు వాటికను వారు మేలౌ థెరిసా !
  వచ్చును కలకత్తాకున్
  హెచ్చుగ పేరూ ప్రతిష్ట హే మమతా బేన్ !


  జిలేబి

  ReplyDelete


 86. ఊర కున్నను లేకున్న నుండు నోయి
  నాద మయమగు మన మోక్ష నాధు డచట!
  వేదన బడుచు జీవన వేదమును మ
  రువకు గురుని పాదములందు రుజువు గాను !

  జిలేబి

  ReplyDelete


 87. సుల్తాను శర్మ యనుచున్
  బోల్తా కొట్టించె నోయి, పోరడి పేరూ
  చల్తా ఫిర్తా నామూ
  మిల్తా జుల్తా సునా సుమీ లగ్తా హై :)

  జిలేబి

  ReplyDelete


 88. ఔరా సెక్యూలరు శా
  స్త్రీ ! రేతిరిపగలనక కరకర కమింటెన్
  పారా హుషారు హోరుగ
  జోరుగ జేసెను గదోయి సుల్తానిచటన్ :)

  జిలేబి

  ReplyDelete


 89. సింధూ , గోపీ చందూ
  చందము గాంచిరి జిలేబి చక్క నొలంపి
  క్సందున! కొండకు చని రా
  నందము గాన పెరుమాళ్ళ నందున జూడన్ !

  జిలేబి

  ReplyDelete

 90. సీమాంధ్ర ఆత్మ గౌరవ
  మే మా లక్ష్యము జిలేబి మేలు కొనెనుగా!
  జాము పొడిచెనూ పవనుడి
  లో మా పవరు, సిరియూ, చలో జనసేనా !

  జిలేబి

  ReplyDelete

 91. కలకత్తా కని దేవత
  వెలసెను మదరు థెరిసా !కవీశ్వర జత ప
  ల్కుల, నామావళి, స్తోత్రం
  బులనగ మన జనులనోట పూజల గొనునూ !

  జిలేబి

  ReplyDelete

 92. సాయం కాలంబా రా
  యే !యమ్మ జిలేబి నిదురయే బోవు సుమీ !
  ఓ యన్నానిమసూ యిక
  యీ యమ్మ నిదురయు లేక యెన్నాళ్లుండున్ :)

  జిలేబి

  ReplyDelete

 93. రామేచ్చ ! యెలా జరగా
  లో మనకందరికి రాసె లోకేశుడటన్ !
  రామాయని జపముల నే
  నీమము గా జేతు వందనీయుని గానన్ !

  జిలేబి

  ReplyDelete


 94. వలబోజా నాటి టపా
  వల వేసిగనెను భళిభళి వంటా వార్పూ !
  అల నాటి కిక్కు లీనా
  టి లలామ పలుకుల వంట టెక్కులు వేరౌ :)

  జిలేబి

  ReplyDelete


 95. హరిబాబు టపాలిక రా
  యరటా! అహహా ! జిలేబి యమ్మయొకతియే
  కరవాలము బట్టి టపా
  ల రగడ జేయును గదోయి లబ్జుగ యిచటన్ :)

  జిలేబి

  ReplyDelete


 96. నాలాటి యర్భకులు యీ
  బాలాగున రాసుకుంటు బాగా ఉంటే
  మీలా టుద్దండులిట ట
  పాలకి స్వస్తి పలుకుచు గబగబ విడుచుటా !

  జిలేబి

  ReplyDelete

 97. మాయింట వినాయకుడికి
  సాయముగా పందిరినట చక్కగ వేయన్
  ఖాయముగ శోభ వచ్చెను
  గా ! యాహూ ! వీరి చిత్ర గరిమను గనుడూ

  జిలేబి

  ReplyDelete


 98. వ్యాఖ్యలను వేయ రాదని
  విఖ్యాతము గావలదని విదురుని వోలెన్
  ప్రఖ్యాతము గావలద
  న్నా ఖ్యాతిగనౌ టపాకు నా జోహార్లూ !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఒకప్పుడు జిలేబి వ్యాఖ్యకోసం అందరూ ఎదురు తెన్నులు చూసేవారంటే అనుమానమా? తంపులు పెట్టేస్తోంటే తలుపులు మూసుకుంటున్నారు, మీరు మనసులు మూసుకున్నారు. నేటికీ జిలేబి అంటే అందరికి అభిమానమే, తంపులు లేకుంటే! :) రండి తలుపులు తీస్తాం :) :)

   Delete

  2. కామెంట్ మాడరేషన్ ఎందుకుపెట్టాల్సివచ్చిందో చెప్పగలరా? మీకిష్టమైతేనే ఈ కామెంట్ ప్రచురించండి, ఎవరూ మిమ్మల్ని కాదనలేదు, మీరే మనసు మూసుకున్నారు, ఇప్పుడు తలుపులూ మూసుకున్నారని తెలిసింది. :)మనసులు, తలుపులు మూసుకోకండి, మందిలో కలవండి.

   Delete
  3. శర్మ గారు,

   నెనర్లు !

   శోధిని ప్రొడక్షన్ టెస్టింగ్ జరుగు తోందండీ ! అందుకని కామెంట్ మాడరేషన్ :)

   చీర్స్
   జిలేబి

   Delete

  4. శర్మ గారు,

   నెనర్లు రండి తలుపులు తీస్తాం అన్నారు ; రిక్వెస్ట్ పంపించా మళ్ళీ మీకు

   చీర్స్
   జిలేబి

   Delete
  5. ఏదీ? మీ ప్రొఫైల్ రాలా మెయిల్లో. మీఊరు పేరు వగైరా! అవి పంపండి అప్పుడు నేనే పంపుతా ఆహ్వానం

   Delete
  6. "తాడి చెట్టెందుకు ఎక్కేవురా?" అంటే "దూడగడ్డికోసం" అన్నాడట అలాలేదూ

   Delete


  7. స్వామీ రిక్వెస్టిచ్చా
   యేమీ రాలే జిలేబి యెట్లా యిత్తున్ :)
   భామా యే వూరూ ? పే
   రేమిటి ? ఓయీ లలామ రెష్యూమ్ తెలుపూ :)

   జిలేబి

   Delete

  8. రిక్వెస్ట్ ఇవ్వమంటారు ; ఇస్తే నో రిప్లై :) ఎన్నదా చేసేది స్వాములూ :)

   రిక్వెస్ట్ చేసిన విధంబెట్టిదన -

   వర్డు ప్రెస్స్ లో లాగిన్ అయి మీ బ్లాగుని క్లిక్ చేసితిని

   ఆ పై వర్డుప్రెస్స్ ఓయీ జిలేబి యిది ప్రైవేటు బ్లాగు ; నీకు తాళము వలయునన్న రిక్వెస్ట్ ఓనర్ అను బొత్తాము ను నొక్కమనెను

   నొక్కగా అది చెప్పెను - ఓయీ జిలేబి నీ రిక్వెస్టును కస్టే ప్లే వారికి పంపించితి వారు నీకు కీ వార్చెదరు అనెను


   యిట్లు
   భవధీశాలి
   జిలేబి

   Delete


 99. మనసు రమణుని గన రమణి
  తనువా నరసింహమును జతగన తపించెన్
  కనుదోయి సదా నవ మో
  హన రాముని నిలుప సీత హాయిని బొందెన్ !

  జిలేబి

  ReplyDelete


 100. లాకేత్వమ్మూ దాక్కొ
  మ్మూ! కేక గదా జిలేబి ముద్దుగ నాన్న
  మ్మా కాలపు కథలనగన్
  మాకూ బామ్మ గురుతొచ్చె మధురపు రోజుల్

  జిలేబి

  ReplyDelete


 101. అబ్బో, భోళా శంకరు !
  అబ్బాయేమో దయామయ జిలేబి సుమీ !
  పబ్బపు రోజున పిల్లలు
  సుబ్బరముగ జోకులెయ్య చూచుచు నవ్వూ !

  జిలేబి

  ReplyDelete

 102. హా ! మెక్సికోన గ్రహణము
  తామెచ్చెను బో జిలేబి తరమగు ఫోటో !
  ఆ మాచన వారి టపా
  లో మా బాగు గలదోయి లోచన పథమూ !

  జిలేబి

  ReplyDelete

 103. విజ్ఞుడనో కానో , చిం
  తా జ్ఞాన మయమగు కాంతి తామర చెలినో !
  ఆజ్ఞాపన నీదై రా
  మా, జ్ఞానము బడయమేలు మాణీకముగా !

  జిలేబి

  ReplyDelete


 104. చల్లగ బుడతడు పుట్టెను
  తల్లికి, మీసములు మొలిచెఁ దండ్రికి, లేవే
  లల్లీ నీ తమ్ముడితడు!
  అల్లీ బిల్లీ యనంగ ఆడుకొనంగన్ !

  జిలేబి

  ReplyDelete

 105. మా కలకత్తా దేవత
  మీకట్లా యేలనోయి మింగుడు పడదూ :)
  బాకా ఊదగ దండిగ
  కాకా బట్టగ జిలేబి కాగల రోయీ :)

  జిలేబి

  ReplyDelete


 106. లస్సీ దొంగను పట్టగ
  బస్సను ఆర్నెల్లనాటి భాగోతంబుల్
  బుస్సని బయటకు రాగన్
  తుస్సనె ఝుంకారపు సడి తుమ్మెద నచటన్

  జిలేబి

  ReplyDelete

 107. ప్రైవేటు వనపు పువ్వులు
  తావియు తగ్గుచు జిలేబి తంకవము గనున్ !
  ఆ విడి మొక్కల దెంత హ
  డావిడి ఆ రిక్తపూల డాంబికమదియే !

  జిలేబి

  ReplyDelete


 108. కమ్మగ చెప్పిన కవనము
  తెమ్మర వోలెను పదములు తేటగ విరియన్,
  వామ్మో జిలేబి ఆహా
  రమ్ము, జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  జిలేబి

  ReplyDelete


 109. పదహారు ఫలంబుల నో
  ము దక్షతగ నాచరించి ముదమును గనుమా !
  కదలిక వచ్చును మగడికి,
  ముదితుడి పలుకుల జిలేబి ముద్దులు గనునూ !

  జిలేబి

  ReplyDelete

 110. మూడు పువ్వు లార ! ముద్డగు ఆరు కా
  యలుగ మీరు గలరు ! అదిరెను గద !
  చెట్లకి మనుషులకి చేవ నీయని పూల
  కాయల యుపయోగ కార్య మేమి :)

  జిలేబి

  ReplyDelete

 111. గట్టిగ బట్టుచు పాదము
  యెట్టి విధంబైననేమి యీశుని గానన్
  ఉట్టికెగురుము జిలేబీ !
  పట్టిన పట్టు విడువకు సపదిగను నతనిన్ !

  జిలేబి

  ReplyDelete

 112. రుజువౌ తున్నవి జోస్యా
  లు!జనుల జీవనము లందు లుంగారాలన్ !
  సజయిది గదవే వారికి
  నిజ యోగీశ్వరుల మాట నిక్కము వినుమా !

  జిలేబి

  ReplyDelete

 113. మెట్ట వేదాంతములకివి మేటి రోజు
  లాయె ! రాముని పాదములగన నెవరు
  గలరు ! రామయని పలుక గగన కుసుమ
  ములను గానవచ్చు నిమిషమున జిలేబి !

  జిలేబి

  ReplyDelete


 114. ఆ రామపాదముల పెను
  మారు తడివి తడివి మేని మాయను విడుమా !
  ఆరామ మతడు విను, మన
  సారా గనుమా జిలేబి సంపత్తుగనన్ !

  జిలేబి

  ReplyDelete


 115. సర్వమతంబుల సారము
  పర్వదిన మనంగ గంటి బండి పొలయకన్ !
  గర్వమణిగెను జిలేబీ
  సర్వము కృష్ణార్పణమట చక్కగ తెలిసెన్ :)

  జిలేబి

  ReplyDelete


 116. యే రాగ తాళములు తెలి
  వే రాలేదాయె మాకు ! వేల్పని మనసా
  రా రాముని నమ్ముచు నే
  నారామముగా పలికిన నా పలుకులివీ !

  జిలేబి

  ReplyDelete


 117. లూటీ గదా జిలేబీ !
  సూటిగ తెలిపిరట సదరు సూదికథలనూ !
  కోటల వెనుకను దాగిరి
  మూటల కొలది మన దస్కముల నొక్కుచునూ !

  జిలేబి

  ReplyDelete


 118. లక్షల లెక్ఖన వచ్చిరి
  వీక్షకు లిక్కడ జిలేబి విధిగా కామిం
  తాక్షతలు వేసె లాయరు
  కక్షల కార్పణ్య లోక కథలను చదువన్ !

  జిలేబి

  ReplyDelete


 119. నాలుగు రోజుల వైరా
  గ్యాలను వదిలి హరిబాబు ఘంటా రవమై
  బోలెడు సనాతనపు ధ
  ర్మాల టపాల మొహరించి రావడి జేయున్ :)

  జిలేబి

  ReplyDelete


 120. మస్తుగ వస్తుంది జబ
  ర్దస్తుగ డబ్బులు జిలేబి రయ్యన వాటా
  బిస్తరు పరిచెన్ స్విస్సుల
  కుస్తీ లెక్ఖలను నమ్మి కోకను వదిలెన్ :)

  జిలేబి

  ReplyDelete


 121. హరితో జగడంబేలా
  హరియించు నిను హరిబాబు హరి సరి యనవే
  హరినామామృతము విడువ
  గరళము తప్పదు జిలేబి కాదన మాకే :)

  జిలేబి

  ReplyDelete


 122. ఆ మాట చెప్పడానికి
  ఈ మాచన కలమునందు యీరము మేలౌ
  పామర జనులకు తెలియన్
  కోమల మయమగు జిలేబి కోరెను సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 123. బిస్మిల్లాహిర్రహ్మా
  న్నస్మిన్నభివాదయే యనంగన్ రామా
  తస్మాత్మమయేవాత్మా
  విస్మయ లోకాన్ననంగ విభుడును వేరౌ ?

  జిలేబి

  ReplyDelete


 124. నెమ్మది గా చస్తున్నా !
  అమ్మణ్ణీ నీ చిరునగువా కత్తివలెన్
  కమ్మని మాటల సూదులు !
  రమ్మని చంపెను జిలేబి రక్కసి యగుచున్

  జిలేబి

  ReplyDelete


 125. రాముడు వలదంటాడు త
  నేమో! దేవుడిని వేడ నెంజిలి ద్రోలున్
  రాముని పాటలు మేలౌ
  గోముగ తడుమును జిలేబి గోలమరేలన్ :)

  జిలేబి

  ReplyDelete

 126. తరముల అంతర ముల నం
  దు రమణి మారెను జిలేబి దూరా లెన్నో
  చరవాణి వోలె చట్టున
  చురుకమ్మా లతికవోలె చుక్కల కెగిరెన్ !

  జిలేబి

  ReplyDelete


 127. ప్రకృతి దరహాస ముల తా
  సుకృతిగ సత్యము జిలేబి సుందర మీ లో
  క కృతిన్ గావించగ శివ
  ము ! కృతజ్ఞతలివి శివోహము ! శివోహముగా !

  జిలేబి

  ReplyDelete
 128. జిలేబి గారు, దయచేసి మీరు పద్యాలను ఆపండి. నాలాంటి సామాన్యులకి అవి అర్థం కావు. పండితులకి కూడ పెద్దగా నచ్చినట్టు లేవు.

  ఈ పద్యాల గొడవలో మీకే సొంతమైన పదాల విరుపులతో కూడిన కామెంట్లని మిస్సవుతున్నాము.

  ReplyDelete
 129. జిలేబి గారు, దయచేసి మీరు పద్యాలను ఆపండి. నాలాంటి సామాన్యులకి అవి అర్థం కావు. పండితులకి కూడ పెద్దగా నచ్చినట్టు లేవు.

  ఈ పద్యాల గొడవలో మీకే సొంతమైన పదాల విరుపులతో కూడిన కామెంట్లని మిస్సవుతున్నాము.

  ReplyDelete

 130. పక్షులమరె కన్బొమ్మగ
  పక్షియమరె పెదవినగవు పరమాత్మునిగా !
  హా! క్షణమిదే జిలేబి ని
  రీక్షణ వలదోయి మేటి రింఛోళి గనన్ !

  జిలేబి

  ReplyDelete


 131. శతమానంబుగ పాటల
  వితరణ జేసెను జిలేబి విదురుడు గనవే
  సతతము నాతడు పిలిచెను
  జతగన లక్ష్మయ్య యవనిజ సమేత విభున్ !

  జిలేబి

  ReplyDelete


 132. బిట్కా యిన్బ్లాకు చెయిను
  మట్కా లందును జిలేబి మరిమరి గలదోయ్
  జట్కా బండి కరెన్సీ
  వీడ్కో లివియే మరిమరి వేగము గానన్ :)  జిలేబి

  ReplyDelete


 133. ఓయీ సతోషి నకమో
  తో యీ క్రిప్టోకరెన్సి తోమాల గనన్
  కాయిను బిట్లను తెచ్చితి
  వోయి యనానిమసు గద నవోదయ లక్ష్మీ !

  ಜ಼ಿಲೆಬಿ

  ReplyDelete

 134. నీ పేరేమీ ? వయసే
  మీ? ప్లేసెక్కడ ? జిలేబి, మీదే మాదీ,
  సాపేక్ష హోము మేకరు
  మా ప్లేసో పంచదశపు మాయా లోకమ్ !

  జిలేబి

  ReplyDelete


 135. మోడీ భజనల జేయుము
  వేడిగ వాడిగ జిలేబి వేయించుచు టీ
  తోడుగ నాస్వా దించుచు
  జోరుగ కామింటుమోయి జోకుల రామా :)

  జిలేబి

  ReplyDelete


 136. సరసపు పలుకుల సుందరి
  విరసము వలదే జిలేబి విడివడ నేలన్
  దరిరమ్మా ప్రియసఖి, నా
  కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ :)


  జిలేబి

  ReplyDelete


 137. అమ్మాయి ! కులాసా యే
  నమ్మా ! బ్లాగుకు ప్రయివసి నాడితి నమ్మా!
  బొమ్మాళీల కలకలం
  బమ్మా ! తప్పితిని బాగు బలి గాకుండన్ :)

  జిలేబి

  ReplyDelete


 138. ఇదియే మేలని నీవం
  టి దినకరుని నాడినాను డిండిమ యనుచున్
  చెదరని మనంబు తోడుగ
  నదురక బెదురక కుదురుగ నమనము జేతున్

  జిలేబి

  ReplyDelete


 139. నా నుంచే మా శిస్తు
  న్నా నా యీమెయిలు వలదు నాకా పనుల
  న్నా నచ్చదోయి! వినుమ
  మ్మా నా మాటను జిలేబి మంచిగ చెబ్తా :)

  జిలేబి

  ReplyDelete


 140. బాగుంది ! చిన్న మాట సు
  మా! కోరితి కీర్తనలను మరికొన్నియిటన్
  మాకందరికీ తెలుపుము
  మా కొండలరాయుడన్నమయ్య పలుకులన్

  జిలేబి

  ReplyDelete


 141. ఆఖరి పేరా యిప్పుడు
  లేఖరి జేర్చెను జిలేబి లెస్సగ గనుమా !
  వైఖరి మారెను జనులకు
  ఆ ఖరకరుడచట తెలిపె అద్దరి బన్నా!

  జిలేబి

  ReplyDelete

 142. బైబిలు నేనూ చదివా !
  గాభర వలదోయ్ జిలేబి గట్లన్నీ గు
  న్నై భళి ! మోరీ తో ట్యూ
  స్డే బుక్కును చదువు మోయి సేంపల్ గానన్ !

  జిలేబి

  ReplyDelete


 143. పైనుండిస్తాంబుల్ విం
  తైనన గరమౌ జిలేబి తైజస మనగన్
  వాణిజ్యకేంద్రముగనూ
  ఈ నగరమ్మీస్టువెస్టు లీడేర్చుసుమీ !

  జిలేబి

  ReplyDelete


 144. తప్పక ప్రయత్నమును మది
  యొప్పగ జేతును జిలేబి యోగము గానన్ !
  గొప్పలకు బోయి నితరుల
  మెప్పుల బడయుటకు గాదు మేఘజ్యోతిస్!

  జిలేబి

  ReplyDelete


 145. మంత్రా లను సెల్ఫోనుడు
  తంత్రమయముగా చదువుచు తా మనిషయ్యెన్ !
  యంత్రముగా మారెను బో
  మంత్రములను మరిచి నరుడు మాయా నగరిన్

  జిలేబి

  ReplyDelete


 146. నీయయి‌డీ తో రాయీ !
  దాయని బిలుచును జిలేబి దాపరి కాలే
  లా యన్నానిమసూ! దా
  నీ యంతగ నీవు బయట నిక్కము‌ తెలియన్ :)

  జిలేబి

  ReplyDelete


 147. మా కంది శంకరార్యుల
  దా కామింటాంగ్ల భాష తారస బడెనూ ?
  లేక యిదిమరియెవరి దై
  నా కామింటా ! జిలేబి ఆశ్చర్యంబౌ!

  జిలేబి

  ReplyDelete